CSS Drop Down Menu

Wednesday, January 13, 2016

"334" సంవత్సరాల జైలు శిక్ష పడిన నిందితుడెవరో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆన్‌లైన్ దాడులకు సంబంధించి అనేక వార్తలను ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. ఇంటర్నెట్ వేదికగా సాగుతోన్న ఆన్‌లైన్ దాడుల్లో భాగంగా హ్యాకర్లు, తాము లక్ష్యంగా చేసుకున్న కంప్యూటర్‌లలోకి వైరస్ జొప్పంచి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. తరువాత , ఆ కంప్యూటర్‌లలోని విలువైన సమాచారాన్ని దొంగిలించి తమకు అనుకూలంగా వాడుకుంటారు.
మోసపూరిత ప్రకటనలతో భారీ హ్యాకింగ్‌కు పాల్పిడిన ఓ హ్యాకర్‌కు న్యాయస్థానం ఏకంగా 334 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.టర్కీకి చెందిన Onur Kopcak (26) , మరో 11 మంది హ్యాకర్లతో కలిసి మోసపూరిత ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడినట్లు కోర్టు నిర్థారించింది.
ఈ కరుడుగట్టిన హ్యాకర్ బ్యాంకింగ్ ఇన్స్‌స్టిట్యూషన్స్ మాదిరిగా ఇంటర్‌ఫేస్‌ను రూపొందించించి అనేక కార్డ్ హోల్డర్‌లను మోసం చేసినట్లు న్యాయస్థానం నిర్థారించింది. ఈ నేరం క్రింద ఇతగాడికి 2013లోనే 199 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇతగాడి ఉచ్చులో చిక్కి నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తుండటంతో కేసును మరోసారి పున: సమీక్షించన న్యాయస్థానం ప్రధాన నిందితుడైన Onur Kopcakకు ఏకంగా 334 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది.

0 comments:

Post a Comment