CSS Drop Down Menu

Thursday, January 28, 2016

పాము కరిస్తే బతకడం కష్టం ! అటువంటిది 160 పాములు కరిస్తే ?

పాములు చూస్తే భయంతో మనుషులు పరుగు తీస్తారు. విషపూరిత పాము కరిస్తే బతకలేమని మనుషులు భయపడటం సహజం. అయితే అమెరికాలోని ఓ శాస్త్రవేత్త గత 16 సంవత్సరాల నుంచి 160 పాములచేత కరిపించుకున్నాడు. అతనే టిమ్ ఫ్రిదే (37). ఇన్ని పాములు కరిచినా అతను బతికాడు. ప్రపంచంలోనే అతి విషపూరితమైన బ్లాక్ మంబా, టైపస్ లాంటి పాములు కరిచినా టిమ్ ఫ్రిదే బతికి బట్టకట్టగలిగాడు. అతనిని చూసిన సాటి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యానికి గురౌతున్నారు.


అనేక పాముల చేత అతనే కరిపించుకున్నాడు. పాముల విష ప్రభావాన్ని పరిశోధించేందుకు, అతని శరీరం విషాన్ని తట్టుకునేందుకు వీలుగా ఇలా చేశాడు. ప్రస్తుతం టిమ్ కు ఏ పాము కరిచినా ఏమీ కావడం లేదు. 2011లో ఒకే సారి రెండు కోబ్రా పాముల చేత కరిపించుకున్న టిమ్ కోమాలోకి వెళ్లిపోయాడు. మృత్యువుతో పోరాటం చేసి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం విషపూరిత పాములను నుంచి మనుషుల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ తయారు చేసే పనిలో టిమ్ బిజీగా ఉన్నాడు.

0 comments:

Post a Comment