CSS Drop Down Menu

Saturday, October 31, 2015

గుండె పోటుకు బై బై చెప్పడానికి సులువైన మార్గం ?

రోజూ 3 అరటిపండ్లతో గుండె పోటుకు బై బై చెప్పేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పరిశోధనల్లోనూ తేలిపోయింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
 
కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని తాజా పరిశోధన తేల్చింది.

Friday, October 30, 2015

"ఏపీ కేబినెేట్" లోకి "నారా లోకేష్" ?

 చినబాబు క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైమొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కీలక భూమిక పోషిస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్, ఇక మీదట ఏపీ కేబినెేట్ లో చేరి తన సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు. లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖలు అప్పగిస్తే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింత తోడ్పాటు వస్తుందని టీడీపీ నేతలు చంద్రబాబుమీద వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ ను ప్రభుత్వంలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  
తెలంగాణ సీఎం కేసీఆర్, తన తనయుడు కేటీఆర్ ను ప్రభుత్వంలోకి తీసుకుని కీలక శాఖలు అప్పగించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే అనేక కీలక పరిశ్రమలు ఏపీకి రావడంలో లోకేష్ పాత్ర ఉంది. అతని వ్యక్తిగత పరిచయాలు, ఎన్నారైలతో గల సంబంధాలు, లోకేష్ ఆలోచనా విధానం ఆంధ్రప్రదేశ్ కు ఎంతో అవసరమని టీడీపీ నేతలు అంటున్నారు.
  లోకేష్ ను కేబినెేట్ లోకి తీసుకుంటే ప్రొటోకాల్ ఇబ్బందులు కూడా తలెత్తవని వారు చెబుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని లోకేష్ కు ఐటీ, ఇండస్ట్రీస్ వంటి శాఖలిచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని వారు చంద్రబాబును కోరుతున్నారు.  రాజధాని నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్న ప్రస్తుత తరుణంలో లోకేష్ సేవలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని వారు వాదిస్తున్నారు. 

Thursday, October 29, 2015

ఆహారం తీసుకున్న తర్వాత ఏ "నీళ్ళు" తాగొచ్చు ?

ఆహారం తీసుకున్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమయ్యేందుకు కొన్ని ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత 15 లేదా 20 నిమిషాలకు తర్వాత నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా గుండెకు ఎంతో మంచిది. గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తికి బ్రేక్ వేయవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. చైనీయులు, జపనీస్ ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్ ట్రీ లేదా గోరువెచ్చని నీటిని తీసుకుంటున్నారు. 
 
గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఆహారం తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు ఆరోగ్యానికి కీడు చేసే కొలెస్ట్రాల్‌ను నిరోధించగలుగుతుంది. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని సూప్ కూడా తీసుకోవచ్చు. అయితే ఫ్రిజ్ వాటర్ మాత్రం తీసుకోకూడదు. 
 
కానీ చల్లని నీరు తాగితే ఆరోగ్యానికి కీడు చేసే వ్యాధులు ఏర్పడుతాయి. గుండెపోటు, క్యాన్సర్ వంటి రోగాలు ఫ్రిజ్ వాటర్ తీసుకోవడంతో ఏర్పడతాయి. ఇంకా అజీర్ణం, కొలెస్ట్రాల్ పెరగడం వంటివి జరుగుతాయి. ఫ్రిజ్ వాటర్‌ను వాడుతూ ఉంటే గుండె, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గోరు వెచ్చని నీరే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నమాట.
 

Wednesday, October 28, 2015

26 వ తేదీ "డేంజర్" డేటా ?

వార్షిక క్యాలెండర్‌లో 26వ తేదీని డేంజర్ డేట్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో సంభవించిన అనేక ఉత్పాతాలకు ఈ తేదీకి లింకు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే 26వ తేదీని అత్యంత ప్రమాదకర తేదీగా పరిగణిస్తున్నారు. 1700 సంవత్సరంలో జనవరి 26వ తేదీన ఉత్తర అమెరికాలో సంభవించిన భూకంపం మొదలుకుని నిన్నటికినిన్న అక్టోబర్ 26వ తేదీన హిందూకుష్ పర్వత ప్రాంతాల కేంద్రంగా వచ్చిన భూకంపం వరకు 26వ తేదీన సంభవించినవే కావడం గమనార్హం. ఈ ఉత్పాతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. 
 
1700 సంవత్సరంలో జనవరి 26న నార్త్ అమెరికాలో భూకంపం, 1883లో ఆగస్టు 26న అగ్నిపర్వతం బద్దలు, 1926 జూన్ 26న లో రోడ్స్ భూకంపం సంభవించింది. అంతేనా.. 1939 డిసెంబరులో టర్కీ భారీ భూకంపం, 1976 జూలైలో చైనా భూకంపం, 2003 డిసెంబరులో ఇరాన్ భూకంపం, 2010లో జూన్‌లో తాసిక్, జలైలో తైవాన్ భూకంపాలతో పాటు.. మెంట్వా సునామీ సైతం 26వ తేదీనే వచ్చాయి. 
 
వీటితోపాటు ముంబై నగరంపై ఉగ్రదాడి (26/11), 2001లో గుజరాత్ భూకంపం, 2004 వచ్చిన సునామీ, నేపాల్‌లో 10 వేల మందిని పొట్టన బెట్టుకున్న భూకంపం (ఏప్రిల్ 26వ తేదీ), నిన్న ఆప్ఘన్, పాకిస్థాన్‌లలో తీవ్ర ప్రాణనష్టం కలిగించిన పెనుభూకంపం కూడా 26వ తేదీనే వచ్చింది. దీంతో ప్రపంచ చరిత్రలో 26వ తేదీకి, ఉత్పాతాలకూ సంబంధముందన్న వాదన మరింతగా బలపడినట్లయింది. వీటితో పాటు మరికొన్ని ఉత్పాతాలు. 
 
1. జనవరి 26, 1531 : పోర్చుగల్ లిస్బన్‌లో భూకంపంలో 30 వేల మంది మృత్యువాత
2. జనవరి 26, 1700 : పసిఫిక్‌లో భూకంపం. 
3. జూలై 26, 1805 : నేపాల్‌, ఇటలీ, కలబ్రియాలో భూకంపం. 26 వేల మంది మరణం. 
4. ఆగస్టు 26, 1883 : అగ్నిపర్వతం బద్ధలు. మృతులు 36 వేల మంది. 
5. డిసెంబర్ 26, 1861 : గ్రీస్‌లో భూకంపం. 
6. మార్చి 26, 1872 : యూఎస్‌ఏలోని ఓవెన్స్ వ్యాలీలో భూకంపం. 
7. ఆగస్టు 26, 1896 : లాండ్, ఐలాండ్, స్కైడ్‌లలో భూకంపం. 
8. నవంబర్ 26, 1902 : బొహెమియా (ఇపుడు రిపబ్లిక్ ఆఫ్ కొరున)లో భూకంపం. 
9. నవంబర్ 26, 1930 : ఇజులో భూకంపం. 
10. సెప్టెంబర్ 26, 1932 : గ్రీస్, ఐరిస్సోస్‌లలో భూకంపం. 
11. డిసెంబబర్ 26, 1932 : చైనాలోని కన్సులో భారీ భూకంపం, 70 మంది మృత్యువాత. 
12. అక్టోబర్ 26, 1935 : కొలంబియాలో భూకంపం. 
13. డిసెంబర్, 1939, టర్కీలోని ఇర్జిన్‌కాన్‌లో భూకంపం, 41 వేల మంది మృత్యువాత. 
14. నవంబర్ 26, 1943 : టర్కీలోని టోయ లడిక్‌లో భూకంపం. 
15. డిసెంబర్ 26, 1949 : జపాన్‌లోని ఇమైచ్చిలో భూకంపం. 
16. మే 26, 1957 : టర్కీలోని బోలు అబాంట్‌లో భూకంపం. 
17. మార్చి 26, 1963 : జపాన్‌లో వకాస్ బేలో భూకంపం. 
18. జూలై 26, 1963 : యుగోస్లేవియాలో భూకంపం, వెయ్యి మంది మృతి. 
19. మే 26, 1964 : శాండ్‌విచ్ దీవుల్లో భూకంపం. 
20. జూలై 26, 1967 : టర్కీ, పులుమూరులో భూకంపం. 
21. సెప్టెంబర్ 26, 1970 : కొలంబియాలో బహియా సొలానోలో భూకంపం. 
22. జూలై 26, 1971 : సాల్మాన్ దీవుల్లో భూకంపం. 
23. ఏప్రిల్ 26, 1972 : టర్కీ ఎజైన్‌లో భూకంపం.
24. మే 26, 1975 : నార్త్ అంట్లాటిక్‌లో భూకంపం. 
26. మార్చి 26, 1977: టర్కీలోని పలులో భూకంపం. 
26. డిసెంబర్ 26, 1979 : ఇంగ్లండ్‌లోని కర్లీస్లీలో భూకంపం. 
27. ఏప్రిల్ 26, 1981 : యుఎస్ఏలోని వెస్ట్‌మోర్లాండ్‌లో భూకంపం. 
28. మే 26, 1983 : జపాన్‌లోని చుబు, నిహోంకైలో భూకంపం. 
29. జనవరి 26, 1985 : అర్జెంటీనా, మెండోజాలో భూకంపం. 
30. జనవరి 26, 1986 : యుఎస్ఏలోని ట్రెస్ పినోస్‌లో భూకంపం. 
31. ఏప్రిల్ 26, 1992 : యూఎస్ఏ, కాలిఫోర్నియా, కేప్ మెండోనికాలో భూకంపం. 
32. అక్టోబర్ 26, 1997 : ఇటలీలో భూకంపం. 
33. డిసెంబబర్ 26, 2004 : సుమత్రా దీవుల్లో సునామి. 
34. మే 26, 2006 : జకర్తాలో భూకంపం. 
35. జూన్ 26, 2010 : టాసిక్‌లో భూకంపం. 
36. అక్టోబర్ 26, 2010 : మెంత్వానిలో సునామీ. 

Tuesday, October 27, 2015

బరువు తగ్గాలంటే?పండ్ల రసాల్లో "పంచదార" వేసుకోకండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే తాజా పండ్ల రసాలను తీసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ పండ్ల రసాల్లో పంచదారను ఎక్కువగా చేర్చుకోకూడదంటున్నారు. ఫ్రెష్ జ్యూస్‌లను సేవించేటప్పుడు పంచదార, ఐస్ ముక్కల్ని పక్కనబెట్టేయాలని వారు సూచిస్తున్నారు. ఐస్ క్యూబ్స్ వాడటం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్లతో పాటు జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయని.. అందుచేత బరువు తగ్గాలనుకునేవారు ఐస్ క్యూబ్స్, పంచదారను మితంగా తీసుకోవడం మంచిది. 
 
సాధారణంగా బరువు తగ్గటానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. నిజానికి బరువు తగ్గేందుకు లేదా పెరగకుండా ఉండేందుకు ఘన పదార్థాలు తినడం మానేసి ద్రవ పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. ద్రవ పదార్థాలు అనగానే చాలా మంది మనస్సు పండ్ల రసాలపైకి పోతుంది. పండ్ల రసాలు ఆరోగ్యం శక్తి రెండూ ఇస్తాయన్నది నమ్మకం. అయితే, పూర్తిగా పండ్ల రసాల మీద ఆధారపడే వారు బరువు తగ్గి తీరుతారనే గ్యారెంటీ లేదు. పండ్ల రసాలకు తోడుగా ఆ వ్యక్తి వంశపారంపర్య లక్షణం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 
 
పండ్లలో తక్కువ క్యాలరీల శక్తి ఉండటం వాస్తవమే అయినా బరువు పెరిగే జన్యు లక్షణం లేనివారికి మాత్రం ద్రవపదార్థాలతో కూడిన ఆహారంతో మేలు కలుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. 


Monday, October 26, 2015

శంకుస్థాపనకు ఎన్టీఆర్ ను దూరంపెట్టేసారు?

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండడానికి కారణం ఆయనకు  అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక అందకపోవడమే. ఇది జూనియర్ ఎన్టీఆర్‌‌‌‌‌‌కు, టీడీపీ పార్టీ మధ్య అంతరం మరింత పంచేలా కనిపిస్తోంది. అంతేకాకుడా, చంద్రబాబే ఉద్దేశ్యపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కనబెట్టేశారనే ప్రచారం జోరుగాసాగుతున్న ఈ తరుణంలో ఇపుడు ఆహ్వాన పత్రికను కూడా పంపించక పోవడం దీన్ని రుజువు చేసేలా కనిపిస్తోంది. 
 
నిజానికి హీరో పవన్ కళ్యాణ్ దగ్గరకు ఏపీ మంత్రులు కొందరు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రం అందజేస్తే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు మంత్రులు కాదు కదా ప్రత్యేక దూతలు కూడా వెళ్ళలేదు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాల్లో అటు హరికృష్ణ గానీ, ఇటు జూనియర్ గానీ చురుకుగా పాలు పంచుకోవడం లేదు. సినిమాల్లో బిజీగా ఉంటున్నాననే నెపం మీద జూనియర్ సైతం పార్టీని పట్టించుకోవడం మానేశాడు.
 
బాబు తన కొడుకు లోకేష్‌‌కు పార్టీ వ్యవహారాల్లో ప్రాధన్యత ఇస్తూ తన వారసుడిగా పరోక్షంగా పెద్ద పీట వేస్తుండటాన్ని జూనియర్ పసిగట్టేశాడు. దాంతో ఇక సినిమాలే అతని లోకమైపోయింది. చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ కూడా జూనియర్‌‌తో అంటీ ముట్టనట్టు ఉండటంతో ఈ ఫ్యామిలీ దాదాపు ఎవరికి వారే అన్నట్టు మారిపోయింది. 


Saturday, October 24, 2015

అత్యాచారం" దెబ్బతో "కురచ దుస్తులు" మానేసా !

కలర్స్ ఛానల్ ప్రసారం చేసే రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 6 వీక్షించిన వారికి సప్నాభవ్‌నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మగాళ్లను అనుకరించే డ్రెస్ కోడ్, ఒంటి నిండా టాటూలతో కాస్త చిత్రంగా కనిపించే ఆమె ఫెమినిస్ట్‌గా పేరు కొట్టేశారు. హెయిర్ స్టైలిస్ట్‌గా మారిన సప్నాభవ్‌నానిని ఆమె గతమే ఫెమినిస్టుగా మార్చేసిందని చెప్పుకొచ్చింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్ బుక్ పేజ్‌లో ఆమె తన గత అనుభవాల వాస్తవాల్ని వెల్లడించారు. 
 
24 ఏట  తాను సామూహిక అత్యాచారానికి గురైనట్లు చెప్పింది. అప్పటి నుంచి రెడ్ లిప్ స్టిక్, కురచ దుస్తులు వేసుకోకుండా వదిలేశానని వెల్లడించింది. సామూహిక అత్యాచారానికి గురైతే ఆ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో, ఎంత మానసిక సంఘర్షణకు గురవుతారో చెప్పడం సాధ్యం కాదని సప్నాభవ్‌నాని తెలిపింది.
 
తాను వయసులో ఉండగా ముంబైలో బైక్ నడిపేదాన్నని, సిగరెట్లు, బీరు తాగేదాన్నని సప్నాభవ్‌నాని చెప్పుకొచ్చింది. అందరూ వింతగా చూసేసరికి షికాగో వెళ్లి సెటిలయ్యానని చెప్పింది. క్రిస్మస్ సందర్భంగా ఒకరోజు అర్ధరాత్రి ఓ బార్‌కు వెళ్లానని, బార్ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్న తన మెడపై తుపాకి పెట్టి నలుగురు మాస్టర్ బేట్ చేయమన్నారని, ఆ తరువాత జరిగినది అంతా ఊహించుకోవచ్చని తెలిపింది. 
 
ఈ ఘటన తనను చాలా కాలం వెంటాడిందని సప్నా తెలిపింది. అప్పటి నుంచి రెడ్ లిప్ స్టిక్, కురచ దుస్తులు వదిలేశానని చెప్పింది. ఈ విషాదాన్ని ప్రపంచానికి చెప్పేందుకు 20 ఏళ్లు పట్టిందని సప్నా తెలిపింది. ఇప్పుడు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉందని సప్నా పేర్కొంది. అందుకే చెప్పానంది. 

Friday, October 23, 2015

" అందం"గా ఉంటే " ఫ్రీమీల్స్" ?

అందంగా ఉన్నోళ్లకు ఆ హోటల్లో  ఫ్రీమీల్స్ ఆఫర్ చేస్తారట. ఆ ఆఫర్ ఒక్కసారే కాదు.. భవిష్యత్తులోనూ కంటిన్యూ చేస్తామని ఆ హోటల్ మేనేజర్ అంటున్నారు. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే..? అమెరికాలోని వాషింగ్టన్‌లో. అసలు సంగతి ఏంటంటే.. వాషింగ్టన్‌లోని ఓ హోటల్లో కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్ పెట్టారు. ఉదయం హోటల్ తెరిచినప్పటి నుంచి వచ్చే మొదటి 50 మందికి మీల్స్ టోకెన్లు ఫ్రీగా ఇస్తారట. 
 
అంటే ముందుగా వచ్చిన 50 మందిలో అందంగా ఉన్నవారికే ఆ ఆఫర్ ఇస్తారట. అందంగా ఉన్నవారిని బేరీజు వేయడానికి ఆ హోటల్‌లో బ్యూటీ ఐడెంటిఫికేషన్ ఏరియాను కూడా ఏర్పాటు చేసినట్లు ఆ హోటల్ మేనేజర్ చెప్తున్నారు. 
 
ఈ బ్యూటీ ఐడెంటిఫికేషన్ ఏరియాలో ముక్కు, కన్ను, పెదాలు, ముఖాకృతి అన్నీ పరిశీలిస్తారు. అన్నీ వాళ్లు అనుకున్నట్టు ఉంటేనే టోకెన్ ఇస్తారు. అయితే ఎత్తుగా ఉన్నోళ్లను మాత్రం అందంగా ఉన్నవారిగానే పరిగణిస్తారట. ఈ ఆఫర్‌ ద్వారా ఆ హోటల్‌కు కస్టమర్ల తాకిడి విపరీతంగా ఉందని హోటల్ మేనేజర్ అంటున్నారు.

Thursday, October 22, 2015

దుర్గాదేవి వాహనం పులా ? సింహమా ?

పురాణాల ప్రకారం దుర్గామాత సింహవాహినిగా చదువుకున్నాము. కాని ఏ గుడిలో చూసినా, ఏ ఫోటోలో చూసినా  పులివాహినిగానే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శిల్పకారులు, చిత్రకారుల పొరపాటా ? లేక ఏమైనా కారణం ఉన్నదా ? అన్నవిషయం విజ్ఞులైన బ్లాగర్ మహాశయులకు గాని తెలిస్తే నాకున్న  సందేహాన్ని తీరుస్తారని కోరుతూ, చివరిగా మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. 


Tuesday, October 20, 2015

ఆహారంలో "స్వీట్స్" ఎప్పుడు తినాలి ?

స్వీట్స్‌ను ఆహారానికి ముందు తీసుకోవాలి. అయితే ఆహారం తీసుకున్న తర్వాత చివరిగా స్వీట్స్ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకునేందుకు ముందుగా ఆకలి కారణంగా పొట్టలో గ్యాస్ అధికంగా వ్యాపిస్తుంది. అలాంటి సమయంలో స్వీట్స్ తీసుకోవడం ద్వారా ఆ గ్యాస్ ప్రభావం మెల్లగా తగ్గిపోతుంది.

ముఖ్యంగా పండ్లు తీసుకోవడానికి ముందు స్వీట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారం జీర్ణమైన తర్వాత పొట్టలో నిల్వ ఉండే వ్యర్థాలతో ఏర్పడే వ్యాధుల సంఖ్య అధికమైపోతున్నాయని, స్వీట్స్‌ను తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  


Monday, October 19, 2015

"చిన్న" హీరో "పెద్ద" మనసు !

ఎన్నో చిత్రాల‌తో ఎన్నో ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించిన క‌మెడియ‌న్ ఐర‌న్‌లెగ్ శాస్త్రి మ‌ర‌ణం త‌రువాత త‌న ఫ్యామిలి ఆర్థింకంగా ఎన్నో ఇబ్బందుల‌కి గుర‌వుతున్న విష‌యం తెలిసిందే. హృద‌య‌కాలేయం చిత్రంతో బ‌ర్నింగ్‌స్టార్‌‌గా ఎదిగిన సంపూర్ణేష్ బాబు మీడియా ద్వారా తెలుసుకుని, ఐర‌న్‌లెగ్ శాస్త్రి ఫ్యామిలీకి త‌న వంతు సాయం చేశారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. గురువుగారు ఐర‌న్‌లెగ్ శాస్త్రి తెలుగు ప్రేక్ష‌కుల్ని ఏవిధంగా న‌వ్వించారో అంద‌రికీ తెలుసు. ఆయ‌న హాస్య‌ానికి విలువ క‌ట్ట‌లేము. అలాంటి ఆయ‌న ఫ్యామిలీ ఇప్ప‌డు ఆర్ధికంగా ఇబ్బందిప‌డుతుంద‌నే విష‌యం మీడియా ద్వారా విని ఆయ‌న కుమారుడు ప్ర‌సాద్ ఫోన్ నెంబరు కనుక్కుని నాకు తోచిన సాయం 25,000 రూపాయిల చెక్‌ని  అందించాను. ఇలానే మ‌న ప‌రిశ్ర‌మ‌లోనివారంతా త‌మ‌కు తోచిన విధంగా వారి ఫ్యామిలీని ఆదుకోవాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు
 
ఐర‌న్‌లెగ్ శాస్త్రి కుమారుడు ప్ర‌సాద్ మాట్లాడుతూ.. సంపూర్నేష్ బాబు గారు మా ఫ్యామిలీ పరిస్థితి తెలుసుకుని మాకు స‌హాయాన్ని అందించినందుకు వారికి ధ‌న్య‌వాదాలు. నాన్న గారి మ‌ర‌ణం త‌రువాత మా ఫ్యామిలీ ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. నిత్య‌ావ‌స‌ర వ‌స్తువుల‌కు కూడా ఇబ్బంది ప‌డుతున్నాము. ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు కూడా మా ఫ్యామిలీని ఆదుకుంటార‌ని ఆశిస్తున్నాం.. అని అన్నారు.

Saturday, October 17, 2015

"గ్యాంగ్ రేప్" ఫై వివాదాస్పద కామెంట్ చేసిన హోంమంత్రి!

రేప్ లు.. గ్యాంగ్ రేప్ లకు సరికొత్త భాష్యం చెబుతున్నారు మన నేతలు. వీరి భాష, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. అసలు నలుగురు ఒకేసారి రేప్ ఎలా చేస్తారని ఇటీవల సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రశ్నిస్తే, ఇప్పుడు కర్ణాటక హోంమంత్రి కేజే జార్జి మరో వివాదాస్పద కామెంట్ చేశాడు. ఇద్దరు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదంటూ సామూహిక అత్యాచారానికి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. ఇద్దరే మగాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని, కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ప్రశ్నించారు.
22ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని డ్రైవర్, క్లీనర్ కత్తితో బెదిరించి కదులుతున్న వ్యాన్ లో అత్యాచారం చేసిన ఘటనపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానమిచ్చారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఆ యువతి డ్యూటీ ముగించుకుని తన పీజీ హోం కు వెళ్లేందుకు బస్సుకోసం చూస్తుండగా, వచ్చిన దుండగులు ఆమెను వ్యాను లోకి ఎక్కించుకుని రోడ్లపై తిప్పుతూ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కాగా, మంత్రి మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి స్పందించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ లలితా కుమార మంగళం మండిపడ్డారు. పెద్దఎత్తున విమర్శలు రావడంతో కేజే జార్జి చివరికి క్షమాపణ చెప్పారు.    

Friday, October 16, 2015

" ఆక్రోట్" తీసుకోవడం ద్వారా "మధుమేహానికి" చెక్ పెట్టవచ్చు !

జీడిపప్పు వద్దు ఆక్రోటే ముద్దంటున్నారు న్యూట్రీషన్లు. ఆక్రోట్ తీసుకోవడం ద్వారా మధుమేహానికి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేవాళ్లు జీడిపప్పు వంటి వాటి జోలికి వెళ్లకుండా.. బాదం, పిస్తా వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్ తీసుకునే అలవాటున్నవారు.. ఇకపై వాల్ నట్స్ అనే ఆక్రోటును కూడా డైట్ లిస్టులో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
ఎందుకంటే..? వారానికి రెండు మూడుసార్లు ఆక్రోటు తినే వారికి మధుమేహం సోకే అవకాశాలు తగ్గుతాయని బోస్టన్ పరిశోధనల ద్వారా వెల్లడైంది. దాదాపు లక్షన్నర మంది నర్సుల మీద పరిశోధనలు చేస్తే.. మధుమేహం ఫేజ్‌2కు వెళ్లే ప్రమాదం 24 శాతం తగ్గినట్టు గుర్తించారట. మగవాళ్లమీద కూడా ఆక్రోటు ప్రభావం ఇలాగే ఉంటుందని వారంటున్నారు.

Thursday, October 15, 2015

"8 గంటల" పాటు పని చేసే ఉద్యోగులకు "గుండెపోటు" తప్పదట?

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో 8 గంటల డ్యూటీ అవర్స్ అమలవుతోంది. అయితే, ఈ డ్యూటీ అవర్స్ అమలవుతున్న దేశాల్లోని ఉద్యోగుల్లో 33 శాతం గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు స్వీడన్ పరిశోధకులు తేల్చారు. ఇదే విషయాన్ని స్వీడన్ ప్రభుత్వానికి తెలియజేయడంతో ఆ ప్రభుత్వం డ్యూటీ అవర్స్‌ను 6 గంటలకు కుదించింది. 
 
తక్కువ పనిసమయం ఉంటే ఉద్యోగులతో పని పర్‌ఫెక్ట్‌గా చేయించడంతో పాటు వాళ్ల ఆరోగ్యాలను కూడా కాపాడినట్టవుతుందని స్వీడన్ అధ్యయనకారులు తేల్చారు. స్వీడన్‌లో ఆరు లక్షల మంది ఉద్యోగులపై, వాళ్ల పనితీరుపై సర్వే చేసిన అధ్యయనకారులు.. పనితో పాటు ఎక్కువ సమయాన్ని కుటుంబానికీ, వ్యాయామానికీ కేటాయించడం ద్వారా వారికి అప్పజెప్పిన పనిని ఖచ్చితత్వంతో చేస్తున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. 
 
తక్కువ టైమ్ ఉంటేనే సోషల్‌మీడియాను కూడా తక్కువ వాడుతున్నారని వెల్లడించారు. అందుకే అక్కడి ప్రభుత్వం ఆరుగంటలు పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల మహిళలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇల్లు, పిల్లలు వంటి బాధ్యతలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలుగుతారు. అందుకే అక్కడి మహిళ ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 


Wednesday, October 14, 2015

"జేమ్స్ బాండ్' గా "నటించడం కంటే చచ్చిపోవడం బెటర్" ?

ప్రపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కించుకోవాలంటే మామూలు విషయం కాదు. నటనతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్నీ పర్ ఫెక్టుగా పండించగలగాలి. అంతకంటే ముఖ్యంగా  ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసే విధంగా తెరపై సాహస విన్యాసాలు పండించగలగాలి. ఇవన్నీ చేయడానికి తెర వెనక ఎంత కష్టం, శ్రమ దాగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే మూడు సార్లు జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరోగా నటించిన డేనియల్ క్రెగ్ త్వరలో రాబోతున్న బాండ్ మూవీ ‘స్పెక్టర్' సినిమాలో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత తాను మరోసారి జేమ్స్ బాండ్ పాత్ర చేయనుగాక చేయను అంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డేనియర్ క్రెగ్ మాట్లాడుతూ ‘మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా' అని వ్యాఖ్యానించారు.

Tuesday, October 13, 2015

"గుడ్డు" కంటే "వేరుశనగే" బెస్ట్ !

శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ధరలో వుండే కోడిగుడ్డును ఆరగిస్తుంటారు. అయితే, గుడ్డుకంటే రెండున్నర రెట్లు అధిక శక్తినిచ్చేది వేరుశెనగ అని చెపుతున్నారు. ఇందులో గుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయట. ఒక కిలో మాంసంలో లభించే మాంసకృత్తులు.. అదే మోతాదు మాంసకృత్తులు వేరుశెనగలో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. 
 
అలాగే, వేరుశెనగలో ప్రొటీన్, ఫాస్పరస్, థైమీన్, నియాసిన్‌తో పాటు శక్తినిచ్చే మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయ. అలాగే, ఏ, బి, బి, సి, ఇతో కలిపి వెుత్తం 13 రకాల విటమిన్లూ ఇంకా ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌ వంటి 26 రకాల కీలక ఖనిజాలూ ఇందులో లభిస్తాయట. వేరుశెనగ విత్తనాల్లో గుండెకు మేలు చేసే వోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వుల శాతమే ఎక్కువ. 
 
ఇందులోని ప్రోటీన్‌శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా ఉంటాయని చెపుతున్నారు.
  
అలాగే, నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపితింటే ఐరన్‌తోపాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయట. తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పురాసి తింటే చిగుళ్లు గట్టిపడి దంతాల్ని సంరక్షిస్తాయి. అయితే, కొంతమందికి వేరుశెనగ పల్లీలు ఆరగించడం వల్ల అలెర్జీ రావొచ్చు. అలాంటి వీటికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.

Monday, October 12, 2015

నెటిజన్స్ తస్మాత్ జాగ్రత్త!

ప్రియాంక చోప్రా డేంజరస్ హీరోయినా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు ఇంటర్నెట్ ఎక్స్‌పర్ట్స్. పొరపాటున ఇంటర్నెట్‌లో ఈమె పేరుతో సెర్చ్ చేస్తే బుక్కైపోయినట్టేనని ఇంటెల్ సెక్యూరిటీ సంస్థ తాజా నివేదిక. సైబర్‌ నేరగాళ్లు బాలీవుడ్‌ నటీనటుల వ్యవహారాలకు సంబంధించిన గాసిప్స్‌నే వినియోగదారులకు ఎరగా వేస్తున్నారట. ఇందులో ప్రియాంకా చోప్రానే టాప్‌ ప్లేస్‌లో వుందట. ఈమె బారినపడి చాలామంది నెట్ యూజర్స్ బుక్కైనట్టు సమాచారం.
 ప్రియాంక పేరుతో సెర్చ్ చేసినప్పుడు చాలా వెబ్ పేజీలు ఓపెన్ అవుతున్నాయని, వాటిలో వైరస్‌లు వుంటాయంటూ తేల్చింది. వాటిని డౌన్‌లోడ్ చేయగానే హ్యాకర్లు మన కంప్యూటర్‌లో చేరి, నెటిజన్స్‌కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు దొంగిలిస్తున్నారని నిపుణులు తేల్చారు. ఇలాంటి విషయాలు డౌన్‌లోడ్ చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు. గతేడాది అలియాభట్‌కు సంబంధించిన వీడియోలు, వ్యవహారాలను చూసేందుకు క్లిక్‌ చేసిన నెటిజన్స్.. హ్యాకర్స్ బారినపడగా, ఈ ఏడాది ఆ స్థానంలోకి ప్రియాంకా వచ్చేసింది. ఇక శ్రద్ధాకపూర్‌ సెకండ్ ప్లేస్‌కి వెళ్లింది. నెటిజన్స్ తస్మాత్ జాగ్రత్త!

Saturday, October 10, 2015

నితిన్ ని "నోరుమూసుకో"మన్న హీరోయిన్ ?

నితిన్‌పై సమంత గుర్రుగా ఉంటుందట. త్రివిక్రమ్ సినిమా అ.. ఆ..తో కమిట్ అయ్యాక నితిన్ అల్లరి పేరిట ఓవరాక్షన్ చేస్తుండటంతో సమంత ఓపిక నశించిందట. ఒక స్టేజ్‌లో నోరుమూసుకోమని కసురుకుందట. ఇక చేసేది లేక నితిన్ స్టాపైపోయాడట. హీరో, హీరోయిన్స్ మధ్య ఎంత వరకూ చనువుంటే అంత బాగుంటుందనే విషయాన్ని సమంత నితిన్‌కు చెప్పిందట.  
 
ఇకపోతే.. సమంత, నితిన్ కాంబినేషన్‌లో త్రివిక్రమ్ డైరక్టర్‌గా ఓ మూవీ రాబోతోంది. ఈ మూవీలో నితిన్‌ని సరికొత్తగా చూపేందుకు త్రివిక్రమ్ సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి త్రివిక్రమ్, మరో పెద్ద హీరో కాంబినేషన్ అయితే.. త్రివిక్రమ్ గురించి మీడియా గొప్పగా చెప్పేది. కానీ ఇఫ్పుడు త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్ కావడంతో తివిక్రమ్ గురించి మీడియా చిన్నచూపు చూపిస్తోంది. దీనికి కారణంగా త్రివిక్రమ్‌కి పెద్ద హీరోల కాల్షీట్స్ దొరక్కపోవడమే. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా హీరోయిన్ సమంతతో నితిన్ వెరీ క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడట. సమంతని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడట. ఏదో సందర్భం కాకపోయినా... తనతో ఏదోకటి మాట్లాడే ప్రయత్నాలు చేయడంతో కోపం వచ్చిన సమంతకి నితిన్‌ని నోరుమూసుకో అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాకుండా నితిన్‌ని చాలావరకూ లిమిట్స్‌లో పెట్టేందుకు సమంత ముందస్తు జాగ్రత్తలో ఉంటుందట. లేదంటే నితిన్ చేసే అల్లరిని భరించడం సమంతకి కష్టంగా ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

Friday, October 9, 2015

ఫోటో చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో పురుషులు చెప్పేస్తారట?

సాధారణంగా ఒక అమ్మాయిని ప్రత్యక్షంగా చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో కొంతమంది చెప్పగలరు. అయితే, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పలువురు మగాళ్లు అమ్మాయి ఫోటో చూసి ఆ అమ్మాయి లక్షణాలు, గుణగణాలు ఖచ్చితంగా చెపుతారట. అమ్మాయి ఫోటో చూసి ఆమె ఎలాంటిది? నమ్మకస్తురాలా? కాదా? అనే విషయాలు చెప్పగలిగే సామర్థ్యం పురుషుల్లో సహజసిద్ధంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. 
 
ఈ పరిశోధనలో భాగంగా కొంత మంది పురుషులను తీసుకుని, రెండు భాగాలుగా విభజించారు. వారికి కొందరు అమ్మాయిల ఫోటోలు చూపించారు. రెండు విభాగాల్లోని పురుషులు ఇంచుమించు ఒకేలా స్పందించారు. అంతకుముందే ఆ అమ్మాయిలు ఎలాంటి వారో తెలుసుకున్న పరిశోధకులు, పురుషులు కూడా అలాంటి సమాధానాలే చెప్పడంతో ఒకింత ఆశ్చర్యపోయి, పురుషుల్లో సమజసిద్ధంగా ఆ లక్షణం వచ్చేస్తుందని చివరికి పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. 


Thursday, October 8, 2015

"డేటింగ్ కోర్సు"ను ప్రవేశపెట్టిన చైనా యూనివర్శిటీ !

నేటి యువత మద్యం, డేటింగ్ మత్తులో తూలుతోంది. కానీ చైనాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం ఏకంగా డేటింగ్‌ కోర్సును ప్రారంభించింది. ఇందులో డేటింగ్‌ ఏవిధంగా చేయాలో ప్రాక్టికల్‌ రూపంలో మెళకువలు బోధిస్తారు. ఈ యూనివర్శిటీ పేరు తియాంజిన్ యూనివర్శిటీ. చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. 
 
ఈ కోర్సులో డేటింగ్‌తో పాటు మేకింగ్ ఫ్రెండ్స్ అనే కోర్సు కూడా ఉంది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయని యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. ఈ కోర్సులో 32 గంటల పాటు క్లాసులు ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసే విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహిస్తారు. 
 
రెండు దఫాలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు డేటింగ్‌కు అర్హత సాధించినట్టే. అబ్బాయిలు, అమ్మాయిల్లో ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారికి ఎక్కువ మార్కులు వస్తాయని కోర్సు డైరెక్టర్ కాంగ్ ఇంగ్ తెలిపారు.
 


Wednesday, October 7, 2015

ముఖంపై ముడతలు పడకుండా కాపాడే "దిండ్లు"

సాధారణంగా స్త్రీపురుషులు మరింత అందంగా కనిపించేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఇందుకోసం వారంతా పూయని క్రీములుండవు. చేయని ఫేషియల్స్ ఉండవు. వెళ్లని బ్యూటీపార్లర్ ఉండదు. ఇదంతా పగటిపూట మాత్రమే. రాత్రి పడకపై పడుకోగానే వారు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. మళ్లీ మరుసటి రోజు అందం కోసం తిప్పలు పడాల్సిందే. 
 
ఇలాంటివారి కోసం పరిశోధకులు సరికొత్త పిల్లోను కనిపెట్టారు. దాని పేరు ఇల్లుమినేజ్ స్కిన్ రీజువినేటింగ్ పిల్లోకేస్. ఇది ముఖంపై ముడతలు పడకుండా ఉండేలా చేస్తుందట. ఈ మెత్తను కాపర్‌తో తయారు చేశారు. ఇందులోని కాపర్ చర్మాన్ని తాజాగా ఉంచడంలో సాయపడుతుంది.
 
అలాగే, కొలాజిన్, ఎలాస్టిన్‌లు కూడా కలిపారట. ఇవి వయసు మీద పడినా, చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. ఈ పిల్లో తయారీకి వాడిన కూప్రన్ దారాల్లో కాపర్ ఆక్సైడ్ మిశ్రమం వాడారు. ఇవి చర్మం తాజాదనాన్ని కాపాడుతాయి. ఇంతకీ ఈ దిండు ధర కేవలం ఐదు వేలు మాత్రమే. కాగా, ఒక స్త్రీ తన జీవితకాలంలో అందం కోసం అక్షరాలా రూ.24 లక్షలు ఖర్చు చేస్తుందట. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. 


Tuesday, October 6, 2015

విటమిన్ "సి" ఉండే పండ్లను తినండి ! ఒంట్లో " కొవ్వు 30 శాతం" కరిగించుకోండి !!

వ్యాయామం చేయడంతో పోలిస్తే విటమిన్ సి శరీరానికి సరిపడా తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు 30 శాతం అదనంగా కరుగుతుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన నిపుణులు చెపుతున్నారు. కనుక నిమ్మజాతి పండ్లను ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
 
విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం, అధిక రక్తపోటు సమస్యలు వచ్చే తీవ్రత చాలావరకూ తగ్గుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ పోషకాల వల్ల రక్త కణాల పనితీరు మెరుగుపడుతుంది. దీనితో శరీరంలో రక్తసరఫరా సజావుగా సాగి సమస్యలు తగ్గుతాయి.
 
అలాగే కాలుష్యం, ఒత్తిడి, సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ మొదలవుతాయి. విటమిన్ సి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. దాంతో అందంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.

Monday, October 5, 2015

"ఐఫోన్" కొనివ్వలేదని ఒంటిపై ఉన్న దుస్తులన్నీ విప్పేసింది !

కొత్తగా వచ్చిన ఐఫోన్ 6ఎస్ కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా కొనుగోలుదారులు పోటీపడుతున్నారు. చైనాలో ఐఫోన్‌కు నానాటికీ క్రేజ్ పెరిగిపోతూనే ఉంది. అయితే ఓ యువతి తనకు ఐఫోన్ కొనివ్వలేదనే కారణంతో ఆమె ప్రియుడికి చుక్కలు చూపించింది. తనకు ఐఫోన్ 6ఎస్ కొనివ్వలేదనే కారణంగా ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. అంతేగాక, ఆగ్రహంతో ఊగిపోతూ.. ఎంతో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో. ఒంటిపై ఉన్న దుస్తులన్నీ విప్పేసింది. నగ్నంగానే అతనితో ఘర్షణ పడింది. చైనాలోని నంజింగ్ ప్రాంతానికి చెందిన ఆ యువతి చేసిన బీభత్సానికి ఆమె ప్రియుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు ఐఫోన్ 6ఎస్ కొనివ్వలేదని తన ప్రియుడితో పెద్ద గొడవ చేసిందీ యువతి.
ఎంత గొడవ చేసినా కొనిచ్చేందుకు అంగీకరించకపోవడంతో చైనాలోనే రద్దీగా ఉండే ఆ మార్కెట్ ప్రాంతంలో మొత్తం బట్టలు విప్పేసి నగ్నంగా అతనితో వాగ్వాగానికి దిగింది. దీంతో బిత్తరపోయిన ప్రియుడు అక్కడ్నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయినా అతడ్ని వదలకుండా ఆమె ఐఫోన్ కోసం అతనితో పోరాటం కొనసాగించింది. కాగా, ఈ మొత్తం వ్యవహారాన్ని చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. అయితే ఐఫోన్ కోసం ఇలాంటి ఘటనలో చైనాలో చాలా చోటు చేసుకుంటున్నాయి. చైనాకు చెందిన ఇద్దరు యువకులు ఐఫోన్ కోసం ఏకంగా తమ కిడ్నీలనే అమ్మేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. చైనాలోని ఓ ఆస్పత్రి ‘వీర్యం దానం చేసి ఐఫోన్ పట్టుకెళ్లండి' అంటూ ఓ గొప్ప ఆఫర్‌ను కూడా ప్రకటించేసింది.


Saturday, October 3, 2015

ఆ ఊరిలో ఇప్పటికి "చిరు రికార్డ్" బ్రేక్ చేయని సినిమాలు !

మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌తో రాణించిన హీరో. ఈ హీరో నటించిన 149 చిత్రాల్లో అనేక రికార్డులు ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితం నిర్మించిన ఈ చిత్రాలు నేటికీ బద్ధలు కాలేక పోతున్నాయి. అలాంటి చిత్రాల్లో హీరో మెగాస్టార్ నటించాడన్నమాట.
 
అయితే, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా ప్రతినాయకుడిగా వచ్చిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. సరికొత్త చరిత్రను లిఖించింది. చిత్ర కలెక్షన్లలో రూ.100 కోట్లను సులభంగా అధికమించి.. ఏకంగా రూ.600 కోట్ల మేరకు వసూలు చేసినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. ఇన్ని రికార్డును తిరగరాసిన ఈ చిత్రం.. మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన రికార్డ్‌ను మాత్రం బద్దలకొట్టలేక పోయింది. అదీ కూడా ఓ చిన్న ఊరిలో... వివరాల్లోకి వెళ్తే... 
 
నిజానికి ఇప్పటివరకూ ఇండస్ట్రీ హిట్‌గా ఉన్న మగధీర, పోకిరి, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు మెగా‌స్టార్ రికార్డ్‌ను టచ్ చేయలేక పోయినా... బాహుబలి కలెక్షన్ల ప్రభంజనం చూస్తే ఖచ్చితంగా ఈ చిత్రం చిరంజీవి రికార్డును తిరగరాస్తుందని అందరూ భావంచారు. కానీ బాహుబలి సైతం చిరు రికార్డు దరిదాపుల్లోకి రాలేక పోయింది. 
 
ఇంతకీ మెగాస్టార్ రికార్డ్ టచ్ చేయని ఊరు ఏమిటో తెలుసా... తూర్పుగోదావరి జిల్లాలోని తుని పట్నం. తునిలో 13 సంవత్సరాల క్రితం.. ఇంద్ర సృష్టించిన కలెక్షన్ల రికార్డును ఇప్పటివరకూ ఏ హీరో కూడా టచ్ చేయలేక పోయారు.. పోతున్నారు కూడా. తునిలో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇంద్ర రూ.17.56 లక్షలు వసూలు చేసింది. ఇప్పటివరకూ ఈ కలెక్షన్‌ను ఏ సినిమా క్రాస్ చెయ్యలేదు. బాహుబలి కూడా టచ్ చేయలేదు. 
 
ఈ చిత్రం వసూలు రూ.14 లక్షల వద్దే ఆగిపోయింది. 13 ఏళ్ళ క్రితం సినిమా టికెట్ ధరకు ఇప్పటి టికెట్ ధరకు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ.. గత రికార్డును చేరుకోలేక పోవడం గమనార్హం. దీంతో మెగాస్టార్ పవర్ ఏమిటో మరో సారి తేటతెల్లమయింది. స్క్రీన్‌పై మెరిసి ఎనిమిదేళ్లయినా.. ఆయన కోసం అభిమానులు అంతగా ఎదురుచూస్తున్నారంటే... మెగాస్టార్ క్రేజ్ ఏమిటో అర్థమవుతుంది.

Friday, October 2, 2015

"కంప్యూటర్ గేమ్స్ ఆడే అమ్మాయిలు" బరవు పెరిగిపోతారట!

భౌతిక శ్రమ లేకుండా అలా కూర్చున్నచోటే కూర్చుని చేసే కంప్యూటర్ పనుల్లో ఎలా అయితే ఉద్యోగులు లావుగా మారిపోతారో అలాగే ఇపుడు ఆటలాడే అమ్మయిలు కూడా బరువు పెరుగుతారని పరిశోధనలో తేలింది. ముఖ్యమంగా ఇంట్లో అమ్మాయిలకు చాలా ఖాళీ సమయం ఉంటుంది. అప్పుడు కనుక అమ్మాయిలు గంటల తరబడి కంప్యూటర్ గేమ్స్ ఆడితే బరవు పెరగడం ఖాయమట. ఈ విషయాన్ని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
 
గంటపాటు కంప్యూటర్ గేమ్స్ ఆడితే చాలు... బరువుల్లో తేడాలు వచ్చేస్తాయని తేలిందట. 2500 మంది అమ్మాయిలపైన అదికూడా 20 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారిపైన ఈ పరిశోధన చేసినప్పుడు ఈ ఫలితాలు వచ్చాయి. మారిన ఆధునిక జీవనశైలిలో ఫోన్, కంప్యూటర్ భాగమైపోయాయి. దాంతో అమ్మాయిలు వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో వారి బాడీ మాస్ ఇండెక్స్‌పై ప్రభావం చూపుతోందనీ, గేమ్స్ ఆడేవారు వాటి జోలికి వెళ్లని వారికంటే అదనంగా 3.7 కేజీల బరువు పెరిగిపోతారని తేలిందని చెపుతున్నారు. విచిత్రం ఏమిటంటే... మగవారిలో మాత్రం ఇలాంటి తేడా వారికి కనిపించలేదట.
 

Thursday, October 1, 2015

రోజూ " బీట్‌రూట్ రసం" తీసుకొంటే ?

బీట్‌రూట్‌తో అధిక ఒత్తిడికి గుడ్‌బై చెప్పవచ్చు. విపరీతమైన పనివేళలతో సతమతమవుతూ అధిక ఒత్తిడికి గురయ్యేవారు, రోజుకు రెండు కప్పుల బీట్‌రూట్ రసం గనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు.
 
బీట్‌రూట్‌లో విటమిన్ ఏ, బీ, సీ, క్యాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, ఫోలిక్ ఆమ్లం, బీటా కెరోటిన్, పీచు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ దుంపలో సహజ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఆంథోసైనడిన్లు పుష్కలంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి బీట్‌రూట్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసి, శరీరంలో రక్త శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి.
 
అదేవిధంగా బీట్‌రూట్‌లో లభించే పీచు పదార్థాలు రక్త కణాలపై ఉండే అధిక కొవ్వును తొలగించి, మలబద్ధకం సమస్యను అదుపులో ఉంచేందుకు సహాయకారిగా పనిచేస్తాయి. ఈ దుంపలో బిటైన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నిల్వ ఉండే చెడు కొవ్వును కరిగించి, గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. అలాగే మూత్ర పిండాలు, కాలేయంలో పేరుకున్న మలినాలను తొలగించి, వాటి పనితీరును మెరుగుపరచటంలో బిటైన్ సమర్థవంతగా పనిచేస్తుంది.
 
ఇంకా ఊపిరితిత్తులు, చర్మ సంబంధ క్యాన్సర్లకు కారణమైన నైట్రోసమైన్లను బీట్‌రూట్‌లోని పోషకాలు ప్రభావవంతంగా ఎదుర్కొంటాయి. ఇందులో లభించే సహజ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. ప్రతిరోజూ వ్యాయామం, ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు పరగడుపునే ఒక గ్లాసు బీట్‌రూట్ రసం తీసుకోవాలి. ఈ రసంలో ఇనుము, క్యాల్షియం, సీ విటమిన్లు శరీరానికి శక్తినందిస్తాయి. దాంతో శరీరం అలసిపోకుండా ఉత్సాహంగా ఉంటుంది.