CSS Drop Down Menu

Saturday, May 30, 2015

ఆఫీసులో సెల్ ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు?

సెల్ ఫోన్ అనేది ప్రస్తుతం కనీస అవసర వస్తువుగా మారిపోయింది. సెల్ ఫోన్‌ని నలుగురిలో వున్నప్పుడు ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆఫీసులో సెల్ ఫోన్‌ను ఉపయోగించేందుకు ఓ పద్ధతి ఉంది. ఆఫీసులో సిబ్బంది సెల్‌ఫోన్స్ వరుసగా మోగుతుంటే ఆఫీసులో అందరి పని పాడవుతుంది. కాబట్టి ఆఫీసులో ఉన్నప్పుడు సెల్ ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవడం మంచిది. 
 
ఆఫీసులో పనిచేసేటప్పుడు సెల్ ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చినా నెమ్మదిగా మాట్లాడాలే కాని బిగ్గరగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాలనుకోకూడదు. ఆఫీసులో నలుగురితో సమావేశంలో వున్నప్పుడు సెల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయాలి. సమావేశం మధ్యలో కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. ఆఫీసు టాయిలెట్స్‌లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడే పద్ధతి అస్సలు మంచిది కాదు. కొన్ని ముఖ్యమైన కాల్స్ వచ్చినా వారికి క్షమించండి.. మళ్ళీ చేస్తా.. అని చెప్పి పెట్టేయడం అలవాటు చేసుకోవాలి. 


Friday, May 29, 2015

"బార్ కోడ్" చూసి మీరు కొనే వస్తువులు ఏ దేశానివో ? తెలుసుకోండి.

మీరు కొనే వస్తువులు మంచివా లేక నకిలీవా అని తెలుసుకోవడం చాలా అవసరం..
మీరు కొనే వస్తువులు ఏ దేశానివో తెలుసుకుని కొనడానికి ఉపయోగపడే బార్ కోడ్స్ ఇవి ప్రతి ఒక్కరూ నోట్ చేసుకుని మోసపోకుండా మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోండి.



00-13: USA & Canada
30-37: France
40-44: Germany
45: Japan (also 49)
46: Russian Federation
471: Taiwan
474: Estonia
475: Latvia
477: Lithuania
479: Sri Lanka
480: Philippines
482: Ukraine
484: Moldova
485: Armenia
486: Georgia
487: Kazakhstan
489: Hong Kong
49: Japan (JAN-13)
50: United Kingdom
520: Greece
528: Lebanon
529: Cyprus
531: Macedonia
535: Malta
539: Ireland
54: Belgium & Luxembourg
560: Portugal
569: Iceland
57: Denmark
590: Poland
594: Romania
599: Hungary
600 & 601: South Africa
609: Mauritius
611: Morocco
613: Algeria
619: Tunisia
622: Egypt
625: Jordan
626: Iran
64: Finland
690-692: China
70: Norway
729: Israel
73: Sweden
740: Guatemala
741: El Salvador
742: Honduras
743: Nicaragua
744: Costa Rica
746: Dominican Republic
750: Mexico
759: Venezuela
76: Switzerland
770: Colombia
773: Uruguay
775: Peru
777: Bolivia
779: Argentina
780: Chile
784: Paraguay
785: Peru
786: Ecuador
789: Brazil
80 – 83: Italy
84: Spain
850: Cuba
858: Slovakia
859: Czech Republic
860: Yugoslavia
869: Turkey
87: Netherlands
880: South Korea
885: Thailand
888: Singapore
890: India
893: Vietnam
899: Indonesia
90 & 91: Austria
93: Australia
94: New Zealand
955: Malaysia



Thursday, May 28, 2015

"టాప్ లెస్" గా ఛార్మి ?

ఛార్మి అందాల ఆరబోత విషయంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ‘మహా మహా’ అంటూ కుర్రకారుని ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు ఇప్పటికే హీరోయిన్ గా తన నటనతో….డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన వాయిస్ తో అందరిని ఆకట్టుకుంటుంది. పాత్ర డిమాండ్ మేరకు ఎటువంటి సాహసానికి అయిన ఛార్మి సై  అంటుంది. ప్రేమ ఒక మైకం సినిమాలో ఛార్మి కాల్ గర్ల్ గా నటించింది. ఇప్పుడు తను నటిస్తూ, సహనిర్మాతగా వ్యవహరిస్తున్నచిత్రం జ్యోతిలక్ష్మిలో సినిమాలో సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తున్నది. ఈ విషయం తాజా విడుదలైన తీజర్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో ఛార్మి టాప్ లెస్ గా కనిపిస్తుంది అనే టాక్ టాలీవుడ్ పరిశ్రమలో వినిపిస్తుంది.


Wednesday, May 27, 2015

పవన్ గడ్డం ఎందుకు పెంచారో తెలుసా..?

ప్రముఖ టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గడ్డం ఎందుకు పెంచారో తెలుసా..? తెలియకపోతే ఈ స్టోరీ చదవండి. ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ గడ్డం పెంచుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సినీ వర్గాల్లోనే కాకుండా, రాజకీయ వర్గాల్లో కూడా ఈ గడ్డం గురించి ఆసక్తి నెలకొంది. కనీసం ట్రిమ్ కూడా చేయించుకోకుండా ఆయన గడ్డాన్ని పెంచుతున్నారు. 
 
గబ్బర్ సింగ్-2 సినిమా కోసం గడ్డం పెంచుతున్నారా? అన్న అనుమానం చాలామందిలో ఉంది. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ స్వామిజీ సలహా మేరకే పవన్ కల్యాణ్ గడ్డం పెంచుకుంటూ ఉన్నారని తెలిసింది.
 
టాలీవుడ్‌ కథనం ప్రకారం, విశ్వంజీ అనే స్వామీజీ ఇచ్చిన సలహా మేరకే పవన్ కల్యాణ్ గడ్డం పెంచుతున్నారట. 42 రోజుల దీక్షను పవన్ చేపట్టినట్టు సమాచారం. పవన్ అత్యంత సన్నిహితుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... విశ్వంజీ భక్తుడు. 'అత్తారింటికి దారేది' సినిమా సమయంలో విశ్వంజీ హోమం కూడా నిర్వహించారట.

విశ్వంజీ సలహాతోనే పవన్ దీక్ష చేపట్టారట. అయితే, ఈ దీక్ష సినిమాల కోసమా? రాజకీయాల కోసమా? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి పవన్ కల్యాణ్ ఏదో సాధించేయాలనే పట్టుదలతో ఉన్నారట.. అది సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ అనేది ఇంకా తేలాల్సి ఉంది. 

" బామ్మ" కొట్టిన బంపర్ లాటరీ బహుమతి ఎంతో తెలుసా ?

అదృష్టం ఏ రూపంలోనైనా వచ్చి తలుపు తట్టవచ్చు. అలాంటి అదృష్టమే 84 బామ్మ గ్లోరియా మెక్ కెన్జీని వరించింది. ఈ క్రమంలో కెన్జీ.. అతిపెద్ద 'లొట్టో' లాటరీ విజేతగా నిలిపింది. 590.5 మిలియన్ డాలర్ల (సుమారు 3,750 కోట్లు) బహుమతిని కెన్జీని సొంతం చేసుకుంది. 
 
వాస్తవానికి ఆమెకొన్న లాటరీ టిక్కెట్ మరెవరికో దక్కాల్సింది. కానీ, వయసు మీద పడిన ఆమెను లాటరీ టిక్కెట్లమ్మే షాపు వద్ద చూసిన ఓ వ్యక్తి ముందు ఆమెను టిక్కెట్ తీసుకోమని తాను వెనక్కు జరిగాడు. అదే ఆమె అదృష్టం.
 
ఇదిలావుండగా, పన్నులన్నీ పోను ఆమె బ్యాంకు ఖాతాలోకి 278 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1766 కోట్లు) జమ అవుతాయట. ఇది కూడా చిన్న మొత్తం ఏమీ కాదు. ఈ డబ్బులో కొంత భాగాన్ని తన స్వగ్రామంలోని పాఠశాలకు సాయంగా ఇస్తానని గ్లోరియా అంటోంది.

Tuesday, May 26, 2015

నైజీరియా రెస్టారెంట్‌లో "మనిషి మాంసం"

నైజీరియాలోని ఓ రెస్టారెంట్‌లో మనిషి మాంసాన్ని ఓ వంటకంగా చేసి వడ్డిస్తున్నారు. దీనికి బిల్లుగా 700 నైరాల (రూ.220) చొప్పున బిల్లు కూడా వేశారు. ఇంత మొత్తంలో బిల్లు ఎందుకు వేశారంటూ అతిథి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఆ హోటల్ సిబ్బందితో పాటు రెస్టారెంట్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
నైజీరియాలోని అనంబ్ర ప్రాంతంలోని ఓ హోటల్ లో మనిషి మాంసంతో వంటకాలు చేసి వడ్డిస్తున్నారంటూ సమాచారం అందడంతో ఆ హోటల్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అకస్మాత్తుగా పోలీసులు దాడి చేయడంతో అక్కడ కనిపించిన వాస్తవిక దృశ్యాలకు పోలీసులు ఆశ్చర్యపోయారు. గదిలో ప్లాస్టిక్‌ బ్యాగుల్లో పెట్టిన రెండు మనిషి తలలను కనుగొన్నారు. అవి తాజావి అనడానికి గుర్తుగా వాటి నుంచి రక్తం కారుతోందని పోలీసులు వెల్లడించారు. 
 
తాము వెళ్లేటప్పటికి ఆ హోటల్‌ సిబ్బంది మనిషి మాంసం కోస్తుండటాన్ని చూసి నిర్ఘాంత పోయామని పోలీసులు చెప్పారు. దీంతో ఆ హోటల్ సిబ్బందిని అరెస్ట్ చేసి ఆ హోటల్‌ను సీజ్ చేసినట్టు చెప్పారు. ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఒక మత గురుకు తనకు ఒకసారి 700 నైరాల(రూ.220) బిల్లు వేశారని.. ఎందుకంత బిల్లు అయ్యిందని హోటల్ సిబ్బందిని అడిగితే... మీరు తిన్నది మనిషి మాసం దీని ఖరీదు ఇంతే... అని చెప్పారు. 


Monday, May 25, 2015

జగన్‌ను అభినందించిన రామోజీరావు ?

మంచు మనోజ్-ప్రణతిల పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపారవేత్తలు చాలామంది హాజరయ్యారు. ఐతే ఈ పెళ్లి వేడుకలో ఇద్దరు వ్యక్తులు నవ్వుతూ కుశలప్రశ్నలు వేసుకుంటూ సరదాగా ఉండటం చూసిన వారందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరయా అంటే... ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి. 
 
మంచు మనోజ్ పెళ్లికి వీరిద్దరు కూడా హాజరయ్యారు. పెళ్లికి వచ్చిన రామోజీరావును చూసి జగన్ మోహన్ రెడ్డి నమస్కరిస్తూ పలుకరింపుగా నవ్వారు. కుర్చీలో కూర్చున్న రామోజీరావు పైకి లేచి ప్రతినమస్కారం చేశారు. ఆ తర్వాత ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. 
 
బిజినెస్ ఎలా సాగుతోందని జగన్ మోహన్ రెడ్డి రామోజీరావును ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు. ఆ తర్వాత రామోజీరావు ఇటీవల జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలను ఉద్దేశిస్తూ... ఎండలో చాలా కష్టపడుతున్నావ్ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు.


Saturday, May 23, 2015

పెట్రోల్ పై ప్రభుత్వ మాయాజాలం

ఏ ప్రభుత్వం వచ్చినా పెట్రోల్ ధరలు పెరగడం ఖాయమైపోయింది. మోదీ అయినా.. మన్మోహన్ అయినా.. ఒకటే పెట్రోల్ ధరలు పెంచి జనాన్ని బాదేయడం.. దానికి క్రూడ్ ఆయిల్ ధరలను సాకు చూపడం మామూలై పోయింది. ఇది నిజమా...? పెట్రోల్ ధరలు ఎలా పెంచుతున్నారు? ఓ లెక్క లేదా..? ఎలా పడితే అలా పెంచేస్తున్నారా..! క్రూడ్ ఆయిల్ ధరలు కహానీలేనా..!! ప్రభుత్వం చెప్పే లెక్కలకు పెంచే ధరలకు సంబంధం లేదా..! చూద్దాం రండీ.
 
ఏ ప్రభుత్వం ఉన్నా జనాన్ని బాదడమే.. ఒక్కసారి చూద్దాం. 2007-08 మధ్యకాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఒక బేరల్ క్రూడాయిల్ ధర రూ. 141.71 నుంచి $. 147.02 మధ్య ఉంది. అప్పుడు మనదేశంలో ఒక లీటరు పెట్రొల్ రూ. 70 రూపాయిలు లోపే. ప్రస్తుతం క్రూడాయిల్ ధర $.64. కానీ పెట్రోల్ ధర మాత్రం రూ. 75. వాస్తవంగా తగ్గాల్సిన ధరలు పెరిగాయి.
 
ఆ లెక్కల ప్రకారం చూస్తే కనీసం రూ. 40 ఉండాలి. కానీ ఎందుకు రూ. 75 ఉంది. ఇది ప్రభుత్వ పెద్దల మాయ. జనం నుంచి పెద్దగా ఆదాయం వచ్చేది ఒక పెట్రోల్, డీజల్ నుంచి మాత్రమే. అందుకే మన ప్రభుత్వ పెద్ద వినియోగదారులపై వాయింపుడు మొదలు పెట్టారు. మన దేశంలో ధరలు మనకన్నా వెనుకబడిన పాకిస్తాన్,బంగ్లాదేశ్,నేపాల్ తదితర దేశాలలో చాలా తక్కువగా ఉన్నాయి. 
 
గతంలో అంతర్జాతీయ మర్కెట్లో భారీ తేడాలు వస్తే బ్యాలన్స్ చేయడానికి ఆయిల్ పూల్ అకౌంట్ ఉండేది దాన్ని గతంలో వాజ్ పేయి ప్రభుత్వం రద్దు చేసింది ప్రభుత్వ జోక్యం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ లో మరో సమస్య రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి బాగలేదని బాబు గారు అదనంగా పన్నులు విధించారు. పలితం మన రాష్ట్రంలో ధరలు మరీ ఎక్కువ.

Friday, May 22, 2015

"కెమెరా ఉమెన్" అయితే "నగ్నం"గా నటించేందుకు సిద్ధం.

ఇటీవల చాలా మంది హీరోయిన్లు నగ్నంగా చేసేందుకు సిద్దంగానే ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం షూటింగ్ చేేసే వారు కెమెరా మెన్లుగా కాకుండా, కెమెరా ఉమెన్ అయితే కంఫర్ట్‌గా ఉంటుందని అంటున్నారు. దాంతో దర్శకనిర్మాతలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల నటి రాధిక ఆప్టే, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నటించిన ఓ లఘు చిత్రం కోసం నగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. 
 
ఆ లఘు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి మగవారికి అవకాశం కల్పించలేదట అనురాగ్ కశ్యప్. రాధికా ఆప్టేతో న్యూడ్ సీన్స్ తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అనురాగ్ కశ్యప్ వివరించాడు. అయితే ఆ వీడియోని ప్రపంచమంతా చూసేసింది కదా…అన్నవారు లేకపోలేదు. 
 
ఇక కొత్త సినిమా 'త్రిబుల్ ఎక్స్' కోసం ఏకంగా లేడీ సినిమాటోగ్రాఫర్‌ని పెట్టుకుంది ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్. కికో అనే సినిమాటోగ్రాఫర్‌ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. దర్శకుడు కెన్ ఘోష్ ఈ సినిమా గురించి చెబుతూ, ఎరోటిక్ సీన్స్ విషయంలో మహిళా నటులు సౌకర్యం కోసమే ఈ ఏర్పాట్లు అని వివరణ ఇచ్చాడు. 
 
ఈ విషయం తెలిసిన వాళ్లు మాత్రం.. నగ్నంగా నటించే సమయంలో ఉన్న అభ్యంతరం, ఆ వీడియోని అందరూ చూసేటప్పుడు ఆయా నటీనటులకు లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమని అంటున్నారు. ఇందుకు సదరు హీరోయిన్లు మాత్రం నేరుగా చిత్రీకరణ చూడడం వేరు, వెండితెరపై సినిమా రూపంలో చూడడం వేరని తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక మీదట కెమెరా ఉమెన్‌లకు అవకాశాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.



Thursday, May 21, 2015

"కిరాణా దుకాణాల్లో బీర్"

బీర్ బాబులకు త్వరలో చల్లని శుభవార్త! ఇకపై బీర్‌ని కొనుక్కునేందుకు మద్యం షాపులకు వెళ్లనక్కర్లేదు.. కిరాణా దుకాణాల్లో హాయిగా తీసుకోవచ్చు.. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ మేరకు ఆలిండియా బ్రేవర్స్ అసోసియేషన్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
ఈ రోజుల్లో వేగంగా అమ్ముడయ్యే వస్తువుల్లో బీరు కూడా ఒకటి. ఏ కాలంలోనైనా దీనికి డిమాండ్ అలాగే వుంటోంది. వేసవి వస్తే సేల్స్ అధికంగా పెరుగుతాయి. బీర్ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకున్న బ్రేవర్ అసోసియేషన్, అందుకు అనుగుణంగా నిబంధనలు మార్చాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. బీరును మద్యంలా చూడడమే తప్పంటోంది ఆ కంపెనీ! మిగతా బాటిల్స్‌లో 42 శాతం వరకు ఆల్కహాలు ఉంటే, బీరులో కేవలం ఐదు నుంచి ఎనిమిది శాతం వుంటుందని అంటోంది. ఈ నేపథ్యంలో బీరుని వినియోగ వస్తువుగా మార్చితే వాటి అమ్మకాల వృద్ధి రేటు కూడా పెరుగుతుందని ఆలిండియా బ్రేవర్స్‌ అసోసియేషన్‌ ఎఐబిఎ డైరెక్టర్‌ జనరల్‌ సోబన్‌ రాయ్‌ అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు బీరుపై 50 నుంచి 85 శాతం పన్నుల భారం మోపగా, గోవా, పాండిచ్చేరి 50శాతం వుంది. దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు బీరుని తయారు చేస్తున్నాయి. ఈ ఇండస్ర్టీ వృద్ధి ఆరుశాతం వుండగా, పన్నులు, ఇతర ఆంక్షలు తొలిగిస్తే మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. 

Wednesday, May 20, 2015

"ఆమరణ నిరాహార దీక్ష" చేపట్టనున్న " పవన్" ?

ఏపీ కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమయ్యే భూములని సేకరించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంభిస్తున్న భూ సమీకరణ విధానానికి వ్యతిరేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ హోదాలో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం విధానాలని నిరసిస్తూ మే 23వ తేదీ నుంచి ఆయన దీక్షకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా మీడియాలో కొన్ని వార్తలొస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లయితే ఏకంగా ఆయన ఆమరణ నిరాహార దీక్షకే రెడీ అవుతున్నారంటూ వార్తా కథనాల్ని ప్రచురించాయి. చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణ విధానాన్ని మార్చుకోకపోతే తన వైపు నుంచి ఉద్యమం తప్పదనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ పంపించినట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి. 
అయితే వాస్తవానికి ఈ విషయంలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏపీ ప్రభుత్వం తీరుపట్ల తన అభిప్రాయం ఏంటో, అవలంభించాలనుకుంటున్న విధానం ఎటువంటిదో స్పష్టంచేయలేదు. కనీసం తాను దీక్షకు దిగడానికి సిద్ధపడినట్లు వస్తున్న వార్తలపైనైనా పవన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో పవన్ దీక్ష చేస్తున్నాడని వస్తున్న ప్రచారాన్ని నమ్మాలా లేక పవన్ అధికారిక ప్రకటన కోసం వేచిచూడాలా అని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై పవన్ ఏమని స్పందిస్తారోనని ఆయన అభిమాన సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

Saturday, May 16, 2015

"ఏడవడానికి" ఓ హోటల్ ?

ఏం తనివితీరా ఏడ్వడానికి కూడా లేదా..  ఏడ్వను కూడా ఏడ్వనివ్వరా... ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా అనే వాదించే వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి ఇక ఆ దిగులు లేదు. జపాన్ కు చెందిన ఓ హోటల్ ఈ సౌకర్యాన్ని విలాసవంతంగా అందిస్తోంది. ఏడ్వడంలో కూడా విలాసం ఉంటుందా.. అది కాదండీ బాబు కన్నీళ్ళు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్లు వంటి సౌకర్యాలు బోలెడు. వివరాలిలా ఉన్నాయి. 
 
వెక్కివెక్కి ఏడవడానికి ఓ హోటల్.. మీ మనసులో బాధంతా తీరిపోయేలా బోరుమనడానికో హోటల్. నిజం.. జపాన్‌లోని టోక్యోలో ఉన్న మిత్సుయ్ గార్డెన్ హోటల్ ఇలాంటి సదుపాయాన్నే కల్పిస్తోంది. అదీ మహిళలకు మాత్రమే సుమండీ. దీని కోసం ఆ హోటల్ ప్రత్యేకమైన గదులను కేటాయించింది.
 
ఇందులో ఏడుపొస్తే.. తుడుచుకోవడానికి ఖరీదైన టిష్యూలతోపాటు మనసును కదిలించేసి.. కన్నీళ్లు తెప్పించేసే సినిమాల డీవీడీలు ఉంటాయట. ఇక మీ ఇష్టమన్నమాట. కావాల్సినంత సేపు కన్నీరు పెట్టొచ్చు. ఈ ప్రత్యేక సదుపాయాన్ని పొందాలంటే రోజుకు రూ.5300 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకేం ఏడ్వాలంటే జపాన్ దారి పట్టండి. 

Friday, May 15, 2015

అక్కడ "నగ్నం"గా పరీక్ష రాయాల్సిందే ?

వారు ఎంతటి వారైనా సరే.. ఆ కోర్సు పూర్తవ్వాలంటే ఆ ప్రొఫెసర్ చెప్పిన పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్ష రాయాలంటే దుస్తులు విప్పేయాల్సిందే. నగ్నంగా పరీక్ష రాయకపోతే ఫెయిల్ కావడం ఖాయం. ఇదేదో తమాషాకు చెప్పే మాట కాదు. నిజం తెలుసుకోవాలంటే అమెరికాకు చెందిన కాలిఫోర్నియాలోని శాండియాగో యూనివర్శిటీకి వెళ్ళాల్సిందే. 
 
ప్రస్తుతం ఈ యూఎస్‌లో ఈ విషయం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ స్టూడెంట్ నగ్నంగా పరీక్ష రాయడానికి కారణమేంటి? ఇది కోర్సులో భాగమా? లేక ఆ ప్రొఫెసర్‌కు పిచ్చా అంటూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజువల్ ఆర్ట్‌కు సంబంధించి రెండేళ్ల కోర్సును కాలిఫోర్నియాలోని శాండియాగో యూనివర్శిటీ నిర్వహిస్తోంది. 
 
ఈ కోర్సును ప్రొఫెసర్ రికార్డో డోమింజ్ భోదిస్తుంటాడు. విద్యార్థులు పాస్ కావాలంటే చివరి పరీక్షకు నగ్నంగా రాయాలి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఒక విద్యార్థిని తల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. స్థానిక ఓ టీవీ ఛెనల్‌కు వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రొఫెసర్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడు. తాను దశాబ్దంగా ఇలాగే చేస్తున్నానని, ఇప్పుడు ఎందుకు వివాదం అవుతుందని ప్రొఫెసర్ రికార్డో ప్రశ్నిస్తున్నాడు. 
 
నగ్న ప్రదర్శన ఇవ్వడానికి అనేక మార్గాలున్నాయని చెప్పారు. చాలా కాన్వాసుల మీద నగ్న చిత్రాలు ఉంటాయని చెపుతున్నారు. నిజంగా చూసినవి కాకపోతే ఆర్టు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆ పరీక్షను అలా రాయకపోతే వారే నష్టపోతారని వాదిస్తున్నారు. విజువల్ ఆర్ట్స్‌ కోర్సుకు ఇది అవసరమని కుండబద్దలు కొట్డేశాడు. ఈ తతంగం బయటకు వచ్చిన తర్వాత యూనివర్శిటీ అధికారులు మాత్రం ఈ కోర్సు పూర్తి కావడానికి నగ్నంగా పరీక్ష రాయనవసరం లేదని ప్రకటించారు.. ఈ ప్రొఫెసర్ వాదన సరైందా..? కాదా అనే అంశంపై ఇప్పుడు యూఎస్‌లో  తీవ్ర చర్చ జరుగుతోంది.

Thursday, May 14, 2015

ఫోనే "తాళం"లా పనిచేస్తే ?


Wednesday, May 13, 2015

" మరకత లింగాన్ని పూజిస్తే అన్నీ శుభాలే" !

స్ఫటిక లింగానికి అభిషేకం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అయితే మరకతలింగం అమూల్యం. మరి అలాంటి మహిమాన్వితమైన లింగాన్ని దర్శించుకోవాలంటే.. ఎలా.. అభిషేకం చేయాలంటే ఎలా అని కదూ.. అయితే చదవండి. భక్తులకు మరకతలింగం తమిళనాడులోని వేదారణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉంది. మరకతలింగాన్నీ, శాస్త్రోక్తంగా పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
అలాగే మరకత లింగం గల ఆలయాలు తమిళనాడులో తిరువారూర్‌లోని త్యాగరాజ ఆలయం, సుందరేశ్వరర్ ఆలయం ఇంకా వేదారణ్యంలోని మరైక్కాదనార్ ఆలయంలోనూ ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. అలాగే చెన్నైకి 37 కిలోమీటర్లు, కోల్ కతా హైవేస్‌లో శిరువాపురి అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి వాహనమైన నెమలి మరకతంతో తయారైంది. అందుకే ఈ ఆలయానికి చేరుకుని వేడుకుంటే మొక్కుబడులు తప్పకుండా నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

Tuesday, May 12, 2015

"అలీ పై ఝాన్సీ సెటైర్లు"


సినిమా సెలబ్రేటీలందరినీ తన బూతు జోక్స్ తో ఆటపట్టించే అలీ ఈమధ్య కాలంలో మీడియాలో తెగ సందండి చేస్తున్నాడు. యాంకర్ సుమ అలీ బూతు జోక్స్ ని తట్టుకోలేక ఏకంగా సుమ అలీకి వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ వార్తలని అలీ ఖండించడమే కాకుండా తనకు వార్నింగ్ ఇచ్చే వ్యక్తులు ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు అని అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఇక నిన్న రాత్రి జరిగిన కిక్ 2 ఆడియో వేడుకలో యాంకర్ ఝాన్సీ అలీని దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

నిన్న జరిగిన ‘కిక్ 2’ ఆడియో వేడుకలో ఝాన్సీ కొద్ది సేపు ప్యాంటు, షర్టు వేసుకుని ఆపై కోటు కూడ వేసుకుని అలీ లా డ్రస్ చేసుకుని కొంత సేపు నాపేరు బాలీ అని అంటూ నేను ఏమి మాట్లాడినా బూతు అంటున్నారు. అందుకే నా నోటి చుట్టూ ప్లాస్టర్ వేసుకున్నాను అని కామెంట్లు చేస్తూ అలీ బాడీ లాంగ్వేజ్ ని అనుసరిస్తూ అలీ పై సెటైర్లు వేసింది.ఈ సెటైర్లు ‘కిక్ 2’ ఆడియో వేడుకకు వచ్చిన అతిధులకు అభిమానులకు కొద్ది సేపు మంచి కిక్ ను ఇచ్చాయి.

అయితే సమంత దగ్గర నుంచి అందర్నీ టార్గెట్ చేస్తూ వస్తున్న అలీ దృష్టికి ఝాన్సీ వేసిన సెటైర్లు వెళితే అలీ రివర్స్ పంచ్ లు ఎలా ఉంటాయో అనే మాటలు ఆ ఆడియో ఫంక్షన్ లో వినిపించాయి. అయితే ఝాన్సీ ప్రజెంట్ చేసిన ఈ స్కిట్ యధాలాపంగా చేసిందా లేక నిజంగానే అలీని టార్గెట్ చేసుకుంటూ చేసిందా అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా నిన్న జరిగిన ‘కిక్ 2’ ఆడియో వేడుకలో ఝాన్సీ బాలీ లుక్ టాక్ ఆఫ్ ది ఈవెంట్ గా మారింది..
                              

Monday, May 11, 2015

"మగాడిని రేప్ చేసిన ఆడవాళ్ళు" !

ప్రపంచంలోని చాలా దేశాల మహిళలు ఒక మార్గంలో నడుస్తుంటే దక్షిణాఫ్రికాలోని కొందరు మహిళలు మరో మార్గంలో నడుస్తున్నారు. ‘మమ్మల్ని మీరు రేప్ చేయడం ఏంటి? మేమే మిమ్మల్ని రేప్ చేస్తా’మంటూ పురుషులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన సంఘటనలో ముగ్గురు యువతులు ఓ పురుషుడిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గాటెంగ్ నగరంలో మహిళలు తుపాకీతో బెదిరించి 33 ఏళ్ల యువకుడిని బీఎండబ్ల్యూ కారులో తీసుకెళ్లారు. ఆ యువకుడిని 500 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లారు. నిర్మానుష ప్రాంతంలో కారును ఆపి అతని చేత బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ముగ్గురు యువతులు అతనిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అతడిని కారులోంచి తోసేసి వెళ్లిపోయారు. 
 
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాటెంగ్ నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

Friday, May 8, 2015

" ఒక్క రూపాయే" కదా ! అని వదిలేస్తే ?

ఒక్క రూపాయే కదా.. చిల్లర ఎందుకులే .. అని వదిలేస్తే.. వామ్మో.. ఇంకేమైనా ఉందా! లెక్కలేస్తే.. సగటుమనిషి బొక్కబోర్లా పడడం ఖాయం... ఆ లెక్కన.. ఒక్కసారి లెక్కలేద్దాం..! ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొంటే. చిల్లర ఒక్క రూపాయి లేదంటే.. సర్లెమ్మని గమ్మున తిరిగొచ్చేస్తాం. ఎవరం రూపాయికోసం పాకులాడం. అయితే ఇలా ఓ మార్కెట్‌కు రోజూ 500 మంది వెళ్తారనుకుందాం. అలా అంతా.. ఒక్క రూపాయి వదిలేసుకుంటూ పోతే.. అది రోజుకు 500 రూపాయలవుతుంది.

సంవత్సరానికి 365 రోజులు. సంవత్సరానికి 50రోజులు సెలవుల క్రింద తీసివేద్దాం.  ఈ 500 X 315...ఎంతయింది..? రూ.1,57,500.. అయితే దేశంలో ఓ బ్రాండ్ సూపర్‌బజార్లు 1500 ఉన్నాయి. రూ.1,57,500 X 1500.. ఇది మొత్తం రూ. 23,62,50,000 అయింది. అంటే సంవత్సరానికి 23. 62 కోట్లన్నమాట. ఇంకా ఘోరమేమిటంటే ఇది పన్ను కిందికి రాదు. ఏ సరుకు మీదైనా ప్రైస్ ట్యాగ్ రూ. 49, రూ. 99, రూ. 999 అని ఉంటుంది. అంటే దీని మతలబు ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా ?

Thursday, May 7, 2015

" శృంగారం ఫై ఎక్కువ మక్కువ చూపించే దేశాలేంటో" తెలుసా ?

మనం పుట్టింది  అందుకే? అనుకునే వారు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. శృంగారం లేని ఈ జీవితం వృధా అనుకునే వారూ ఎక్కువే. ఏ ఏ దేశాలు శృంగారంపై ఎంతెంత ఆసక్తిని కనబరుచుతున్నాయో తెలుసుకోవాలనుకునే ఓ చిన్న ఆలోచన వచ్చింది ఓ కండోమ్స్ తయారీ సంస్థకు. అక్కడ సెక్సు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారనే అంశాలపై ఆ సంస్థ పరిశోధన చేసింది. దీని ఆధారంగా గ్రేడింగ్ కూడా ఇచ్చేసింది. లైంగిక ఇష్టాలపై ఆసక్తి కనబరిచే దేశాల జాబితాను తయారు చేశారు. వాటిలో మనం ఎక్కడున్నాం.? ఏ దేశం మొదటి స్థానంలో ఉంది. రండి.. తెలుసుకుందాం. 
 
కండోమ్స్ తయారీ సంస్థ ఆన్‌లైన్‌లో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. అన్నింటిలోనూ ముందుండే విచ్చలవిడి శృంగారానికి వంతపాడే ఫ్రాన్స్, అమెరికా, యూకెలు టాప్-10లో లేవు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మోస్ట్ రొమాంటిక్ కంట్రీ  అయిన ఫ్రాన్స్‌‌కు టాప్-10లో లేనేలేదు. 
 
సాధారణంగా శృంగారం అంటే అది నాలుగు గోడల మధ్యన మాత్రమే జరిగేదని, బహిరంగంగా మాట్లాడుకోవడానికి కూడా వీలు లేని అంశమని భావించే మన దేశం ఏ స్థానంలో ఉందో తెలుసా... ? ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ నిలవగా, తర్వాత స్థానాల్లో స్పెయిన్, ఇటలీ, బ్రెజిల్, గ్రీస్, నెదర్లాండ్స్, మెక్సికో, భారత్ (8వ స్థానం), ఆస్ర్టేలియా, నైజీరియాలు వున్నాయి. 
 
11వ ప్లేస్‌లో జర్మనీ, 12లో చైనాలు నిలిచాయి. సెక్స్ అనేది ఆరోగ్యపరంగా మంచిదేనని, భాగస్వాముల మధ్య ఒకరిపై మరొకరికి విశ్వాసం పెరగడానికి దోహదం చేస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఆయుష్షుపరంగా లైంగిక తృప్తి తగ్గవచ్చని, ఐతే, మానసికంగా, శారీరకంగా వున్నప్పుడు దీనికి పరిమితి అంటూ ఏమీ వుండదని తేలింది.  

Wednesday, May 6, 2015

'' కమల్ కాళ్లపై పడిన ఖుష్బూ'' ?

కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ ఉత్తమ విలన్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హీరో కమల్, డైరెక్టర్ రమేష్ అరవింద్‌లు ఇద్దరూ కలిసి కోలీవుడ్‌లో తమ మిత్రులకు ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూ ఏర్పాటు చేశారు. ఈ ప్రివ్యూ చూసిన నటి ఖుష్బు.. హీరో కమల్‌ని పొగడ్తల్లో ముంచెత్తింది. విజువల్స్, డైలాగ్స్ అన్ని అదుర్స్ అంటూ యూనిట్‌ని అభినందించింది. మూవీని గొప్పగా డైరెక్ట్ చేయడంలో రమేష్ అరవింద్ సక్సెస్ అయ్యాడంటూ ఆయనకూ ఓ కితాబిచ్చిన ఖుష్బు సినిమాలో కమల్ పర్‌ఫార్మెన్స్ సూపర్బ్ అంటూ ఇదే ప్రెస్‌మీట్‌లో కమల్ పాదాలు తాకి ఆయన ఆశీర్వాదం తీసుకుందట. ఇంకేం... ఖుష్బు చేసిన ఈ ఒక్క పనితో 'ఉత్తమ విలన్'కి కావాల్సినంత ప్రచారం వచ్చిపడింది. ఇప్పుడు కోలీవుడ్‌లో ఎవరి నోట విన్నా... '' కమల్ కాళ్లపై పడిన ఖుష్బూ'' అనే టాపికే వినిపిస్తోంది. 

Tuesday, May 5, 2015

" హేట్సాఫ్ మహేష్ బాబు"

ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ ది చాల విభిన్నమైన మనస్తత్వం.. సినిమాల్లో తప్ప ఆయన బయట పెద్దగా కనిపించరు. తన సినిమా ఫంక్షన్లకే తప్ప.. ఇతరుల కార్యక్రమాలకి కూడా పెద్దగా వెళ్లరు. ఎవరితో నూ క్లోజ్ రిలేషన్ షిప్ మెయిన్ టెయిన్ చేయని మహేష్.. మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని అంతా అనుకుంటారు. కాని తాజాగా మహేష్ చేసిన పని తెలిస్తే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.
అమెరికాలో త్వరలో జరిగే తానా సభలకు అటెండయ్యేందుకు మహేష్ కోటిన్నర అడిగాడని ఇటీవల  ప్రచారం జరిగింది. ఏదో క్రేజ్ కోసం పిలిస్తే మరీ అంత డిమాండ్ చేయడం సరికాదని అంతా బ్యాడ్ గా ఫీలయ్యారు కూడా. కాని మహేష్ ఆ డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.తానా వారు ఇచ్చిన ఆ డబ్బుని  ప్రిన్స్ నేరుగా పేద పిల్లల సాయం చేసే సంస్థ’ హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్’ కి గుప్తదానం చేసినట్టుగా తెలిసింది.వేల రూపాయలు సాయం చేస్తేనే  చాలా ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో మహేష్ ఇంత పెద్ద మొత్తంలో దానం చేసి కూడా బయటకు చెప్పుకోలేదు.
తానా సభకు అంత డిమాండ్ చేయడం  సరికాదంటూ ఇటీవల ఓ  పార్టీలో కొందరు మహేష్ పై  బ్యాడ్ గా మాట్లాడుకుంటుండగా.. అక్కడే ఉన్న ఆయన సన్నిహితులు వారిని వారించి అసలు విషయం చెప్పారట.. అలా మహేష్ గుప్తదానం చేసిన మ్యాటర్ కాస్త వెలుగులోకి వచ్చింది. ఏ యాడ్ చేసి ఎంత సంపాదిద్దామా అని ఆలోచించే స్టార్లున్న రోజుల్లో.. మహేష్ ఏ మాత్రం ఆలోచించకుండా కోటిన్నర రూపాయలను దానం చేయడం  నిజంగా అభినందనీయం.


Monday, May 4, 2015

సహజీవనం" తప్పు కాదంటున్న" తాప్సీ !

ఇటీవల ఆడ - మగ సహజీవనానికి సినిమా పరిశ్రమలో మద్దతు పెరిగినట్టుంది.సహజీవనం గురించి తాప్సీ మాట్లాడుతూ 'వైవాహిక జీవితం బాగుంటే ఓకే. ఒకవేళ భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే, విడిపోవడానికి నానా ఇబ్బందులు పడాలి. విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగాలి. అదే పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే, విడిపోవాలని అనుకున్నప్పుడు ఎంచక్కా విడిపోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉండవు. ఏ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు' అని అంటున్నది తాప్సీ. 

Saturday, May 2, 2015

వేసవిలో పుచ్చకాయ తింటే ?


పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ఇందులో 92 శాతం నీరే. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్ - ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచుపదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. 
 
వీటివల్ల ఆందోళన, చికాకు తగ్గి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి. పొటాషియం శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపు చేస్తుంది. పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకో పీన్ కెరటినాయిడ్ క్యాన్సర్లు, గుండెజబ్బులు, కంటి లోపల పొర క్షీణించడం వంటి వాటిని రాకుండా నిరోధిస్తుంది. 
 
పుచ్చకాయలో అధిక మొత్తాల్లో ఉండే పొటాషియం మూత్రవ్యవస్థను సాఫీగా సాగేలా చేస్తుంది. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీనిని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు. 
 
కామెర్లు, పైత్యపు వికారాలు, తలనొప్పి, నోరు తడారిపోవటం, ఇన్ఫెక్షన్లు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు పుచ్చకాయ రసానికి సమాన భాగం మజ్జిగ కలిపి తగినంత ఉప్పు చేర్చి తీసుకోవాలి.

Friday, May 1, 2015

పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు ?


మన దేశంలో అతి తక్కువ కాలంలోనే పెళ్లి వ్యవస్థ మాయమైపోతుందని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా "365 డేస్" సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న పూరి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆధునిక సమాజంలో తల్లిదండ్రుల కంటే కూడా స్నేహ బంధమే విలువైనదని అన్నారు. అందువలనే తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహితుల లాగే మెలుగుతున్నారని గుర్తుచేశారు.
 
దీన్ని బట్టి చూస్తే భారత దేశంలో అతి కొద్ది కాలంలోనే పెళ్లి అనే పదం వినపడదని విశ్వాసం వ్యక్తంచేశారు. మనకు ఇష్టమైన స్నేహితులను మనం పెళ్లి చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. జమైకా, స్పెయిన్ లా తయారవుతుందో లేదో తెలియదు కానీ భారత్‌లో పెళ్లిళ్లు ఉండవని పూరీ తెలిపారు.