CSS Drop Down Menu

Friday, February 27, 2015

"నెంబర్స్" చేసే "వండర్స్"


"ప్రపంచం"లోనే "నెంబర్1" నగరంగా నిలిచిన "ఢిల్లీ"?

ప్రపంచంలోనే మిగతా అన్ని నగరాలను దాటి ఢిల్లీ నెంబర్ 1 నగరంగా నిలిచింది. అయితే ఏ విభాగంలో తెలుసుకుంటే తలదించుకోవడం ఖాయం. కాలుష్యం విషయంలో. వాయు కాలుష్య, ప్రజారోగ్య శాఖ ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఢిల్లీలో సగటున సెకనుకు 10 మైక్రోమీటర్ల సాంధ్రతతో గాలి కలుషితమవుతోందని, దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం అధికమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ సర్వే వివరాల ప్రకారం, మొత్తం కాలుష్యంలో ఢిల్లీ (పిఎం 10), జార్ఖండ్ (సల్ఫర్ డయాక్సైడ్), పశ్చిమబెంగాల్ (నైట్రోజన్ డయాక్సైడ్) తొలి స్థానాల్లో ఉన్నాయి. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని వివరించింది. మొత్తం 170 దేశాల్లో కాలుష్యాన్ని పరీక్షించగా, చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లను భారత్ వెనక్కు నెట్టింది.
 



Thursday, February 26, 2015

"ఆమ్లెట్" లో "కోడి" ?


Wednesday, February 25, 2015

పళ్లు, కూరగాయలతో కొలెస్ట్రాల్‌కు చెక్ ?

ఆధునిక జీవశైలిలో మార్పుల వల్ల, నిత్యం వ్యాయామం చేయడం కుదరని పని, దీంతో శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. దానికి తోడు ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఫ్యాట్‌ను తగ్గించడానికి ఎంతైనా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తక్కువ క్యాలరీ ఉండే ఆహారం తీసుకోవాలి.
 
పళ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కూరగాయలను ఉడకబెట్టి తింటే బరువు బాగా తగ్గుతారు. తాజా పళ్లు తిన్నా కూడా బరువు తగ్గుతారు. సలాడ్‌లు కూడా మంచివే. వాటిల్లో రుచి కోసం మిరియాల పొడి, ఉప్పు చల్లుకుని తినొచ్చు. సలాడ్‌లను స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. పళ్లు, కూరగాయల్లో సొల్యుబుల్, నాన్ సొల్యుబుల్ పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 

Monday, February 23, 2015

"అరటిపండు" తినడానికే కాదు ?





Friday, February 20, 2015

"సెక్స్ కోరికలు" అణుచుకోవడం ఎలా? "హీరోయిన్" సలహా !

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వయసులో ఉన్నపుడు సెక్స్ కోరికలు ఉండటం సహజమే. ముఖ్యంగా యువతలో కోరికలు తారా స్థాయిలో ఉంటాయి. అలాంటపుడు సెక్స్ గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు. అయితే అతిగా ఆలోచిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు. సెక్స్ కోరికలు ఎక్కువైనపుడు ఏం చేయాలనేదానిపై బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. యువతరంలో సెక్స్ కోరికలు ఉండటం సహజమే. నాకు అలాంటి కోరికలు ఉంటాయి. యోగా, మెడిటేషన్ లాంటి వాటి ద్వారా నేను నా కోరికలను కంట్రోల్ లో ఉంచుకుంటున్నాను. మరీ ఎక్కువైనపుడు చన్నీటితో స్నానం చేస్తే సరిపోతుంది' అంటూ సలహా ఇస్తోంది.


Thursday, February 19, 2015

"బిక్షగాళ్ళ" అవతారం ఎత్తనున్న డిస్ట్రిబ్యూటర్లు ?

ఒకప్పుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు కామధేనువు. పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆయన సినిమాలంటే వారికి భయమేస్తుంది. 'లింగా' సినిమానే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఆ చిత్రాన్ని రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మించారు.
 
కాగా, లింగ సినిమా అన్నిచోట్ల ఆడలేదు. ఆడిన థియేటర్లలో జనాలులేక కలెక్షన్లురాక పెట్టిన పెట్టుబడి తిరిగిరాక డిస్ట్రిబ్యూటర్లు ఆమధ్య రజనీకాంత్‌, నిర్మాతలను అడిగారు. అందుకు పదిశాతం మాత్రమే తిరిగి ఇస్తానని నిర్మాత ప్రకటించడంతో సోమవారంనాడు డిస్ట్రిబ్యూటర్లంతా ఓ వింత నిర్ణయాన్ని తీసుకున్నారట. 
 
రజనీకాంత్‌, నిర్మాత ఇంటిముందు భిక్షాటన చేయాలనేది ప్లాన్‌. అంతేకాకుండా థియేటర్లలో ఒక చిప్ప పెట్టి... అందులో మాకు దానం చేయండని. ప్రేక్షకులను అడిగే కాన్సెప్ట్‌. ఇలాంటి చిత్రమైన కోరికకు నిర్మాత ఎలా రియాక్ట్‌ అవుతాడో త్వరలో తేలనుంది.

Wednesday, February 18, 2015

యూత్‌ను చెడగొడుతున్న నిర్మాత ?


బాలీవుడ్‌లో యూత్‌ చిత్రాల పేరుతో బూతు చిత్రాలు తీసే నిర్మాతగా ఏక్తాకపూర్‌ పేరుపొందింది. కథల్నికూడా వివాదాస్పద అంశాలతో ముడిపెడుతుంది డర్టీపిక్చర్స్‌, రాగిణి ఎం.ఎం.ఎస్‌. పేరుతో సినిమాలు తీసింది.

ఇప్పుడు మరో కోణం తెరపై తేనుంది.ట్రిబుల్‌ ఎక్స్‌ అనే పేరుతో టైటిల్‌లోను మార్కెట్లోకి తెచ్చింది. గోష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం మార్చిలో తెరకెక్కనుంది. కామసూత్రాల పేరుతో రూపొందే ఈ చిత్రంకోసం పెట్టిన టైటిల్‌ ట్విట్టర్‌లో పెట్టింది.


ఇప్పటికే దీనికి విపరీతమైన స్పందన వచ్చింది. మరి ట్రిబుల్‌ ఎక్స్‌ అంటే అర్థం ఏమిటో త్వరలో చెబుతానని అంటోంది. మరి ఈ చిత్రానికి సెన్సార్‌ నుంచి ఎటువంటి అభ్యంతరం వస్తుందో చూడాలి.

Tuesday, February 17, 2015

"నోరుజారిన" నాగార్జున ?

ఫ్యాన్స్‌ చేసే చిత్రమైన పనుల్లో హీరోలు ఏదోదే మాట్లాడుతుంటారు. అభిమానులే దేవుళ్లు అంటూ తెగ పొగిడేస్తుంటారు. ఇలా చాలామంది అన్నవారే. కానీ వారు శ్రుతిమించిన అల్లరితో కంట్రోల్‌ చేయడానికి ఏమీ చేయలేక వెంటనే నోరు జారిన సంఘటనలు పలు సందర్భాల్లో వున్నాయి. అందులో తాజాగా నాగార్జున కూడా చేరిపోయారు. తన కొడుకు అఖిల్‌ను పరిచయం చేసే క్రమంలో ఫ్యాన్స్‌ ఎక్కువగా సందడి చేయడంతో తను మాట్లాడేది విన్పించడంలేదనీ వెంటనే... మీరు  నోరు మూసుకుంటే నేను మాట్లాడతా' అంటూ వ్యాఖ్యానించారు. 
 
దీంతో ఒక్కసారిగా సైలెంట్‌ అయిన ఫ్యాన్స్‌... నాగ్‌ ఇలా అన్నాడేమిటి? అని కొందరు ఆశ్చర్యపోయారు. తర్వాత మాట్లాడుతూ.. పలు విషయాలు చెప్పాడు. అయితే స్టేజీపై వున్న ఓ ప్రముఖుడు .. నాగ్‌ మాట్లాడింది గుర్తు చేశారు. వెంటనే.. మళ్ళీ వారిని స్తుతిస్తూ మాట్లాడి.. హుషారుపర్చారు.. అదీ విషయం.

Friday, February 13, 2015

"కూతురిని వ్యభిచారంలోకి" దించేందుకు ప్రయత్నిస్తున్న "నటి"

సినిమా వెండితెరపై ఛాన్సులు వచ్చినన్నాళ్లూ వెలిగిపోయిన కొందరు తారలు, ఆ ఛాన్సులు కనుమరుగవగానే పక్కదారి పడుతున్నారు. ముఖ్యంగా నటీమణలు కొందరు వ్యభిచారం వృత్తిని స్వీకరించడం, పోలీసులకు పట్టుబడటం జరుగుతూ ఉంటోంది. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. 
 
చెన్నైలోని వడపళనిలో కన్న కూతురిని వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న తమిళ నటి రాజేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నటి తన కుమార్తెను వ్యభిచారం రొంపిలో దించేందుకు ఓ నక్షత్ర హోటల్ కు తీసుకెళ్లింది. ఐతే పోలీసులు పక్కా సమాచారంతో ఆ హోటల్ పై దాడి చేసి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
 
14 ఏళ్లున్న తన కుమార్తెను నటి రాజేశ్వరి వ్యభిచారంలో దించేందుకు మరో వ్యక్తితో కలిసి ప్రయత్నం చేసింది. ఐతే పోలీసులు ఆమెతోపాటు సహకరిస్తున్న ఆ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. కాగా రాజేశ్వరి కెరీర్ తొలినాళ్లలో మంచి ఆఫర్లు వచ్చాయనీ, కానీ ఆ తర్వాత ఆఫర్లు మందగించడంతో జీవితం గడవడం కష్టమైపోయిందంటున్నారు. అందువల్లనే ఈ దారిని ఎంచుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
 

"పగిలిన" పూలకుండీలతో... ?

కవితకు కాదేది అనర్హం అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ,కుక్కపిల్ల అన్నారు శ్రీశ్రీ.
అదేవిధంగా సృజనాత్మకత ఉండాలేగాని పగిలిన పూలకుండీలను కూడా
కళాత్మకంగా ఉపయోగించుకోవచ్చునని నిరూపించినవి ఈ చిత్రాలు.
                                   















Thursday, February 12, 2015

వాట్ ఎ నైస్ క్రియేటివిటి



Wednesday, February 11, 2015

సీ. ఎన్టీఆర్ "జీరో" ? జూ.ఎన్టీఆర్ "హీరో" !

రామ్‌గోపాల్‌ వర్మ రోజూ ఏదో విషయంలో వుంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూనే వుంటాడు. ఖాళీగా వున్నాడేమో ప్రతి సినిమాపైనా, హీరోలపై కామెంట్లు చేస్తునే వున్నాడు.

రామ్ గోపాల్ వర్మ తాజాగా టెంపర్ ట్వీట్‌తో వార్తల్లోకెక్కాడు. ఒకర్ని పొగడాలంటే ఇంకొకర్ని తిట్టాలనే టైప్‌లో తనకు తోచింది చేసుకుంటూపోయే రామ్ గోపాల్ వర్మ ఈసారి ఏకంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ని సీన్‌లోకి లాగాడు. 
 
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా టెంపర్ పైన హైప్ క్రియేట్ చేద్దామనుకున్నాడో ఏమో కాని తన తలతిక్క ట్వీట్‌లతో పిచ్చెక్కించాడు. మొన్న పవన్ కల్యాణ్, నిన్న చిరంజీవి 150వ సినిమాపై వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్న ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌పై పడ్డాడు. 
 
నేను పెద్ద ఎన్టీఆర్‌కి గొప్ప అభిమానిని, జూనియర్ నాకు నచ్చేవాడు కాదు. కానీ టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన చూశాక సీన్ మారింది. 
 
టెంపర్ చూశాక ఏమనిపిస్తుందంటే.. ఎన్టీఆర్ మళ్లీ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఒక వేళ జూనియర్, సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందు పుట్టి ఉంటే ఆయన కన్నా చాలా పెద్ద స్టార్ అయ్యుండేవాడు.
 
నేను థియేటర్‌కి చాలా తక్కువగా వెళ్తుంటా, నేను భ్రమరాంభ థియేటర్‌లో ఈ నెల 13న టెంపర్ సినిమాకు వెళ్తున్నా. నిజంగా ఆత్మలుంటే భ్రమరాంభ థియేటర్‌లో ఈ నెల 13న సీనియర్ ఎన్టీఆర్ ఈ ఆత్మ ఈ సినిమా చూడటానికి రావాలి రాలేదంటే ఆయన తారక్‌ను చూసి అసూయ పడుతున్నట్లే లెక్క. నిజాయితీగా చెబుతున్నా.. జూనియర్ ఎన్టీఆర్‌తో పోలీస్తే సీనియర్ ఎన్టీఆర్ పెద్ద జీరో అని నామనసుకు అనిపిస్తుంది. 
 
అడవి రాముడు 17 సార్లు చూశా.. టెంపర్ 27సార్లు చూడాలనిపిస్తుంది. టెంపర్ తరువాత ఎన్టీఆర్ వంశం జూనియర్ ఎన్టీఆర్‌కు ముందు జూనియర్ ఎన్టీఆర్‌కు తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేనే ఆయనకు అతి పెద్ద అభిమానిని. తారక్‌ను టెంపర్ సినిమాలో చూశాక ఉద్వేగం ఆపుకోలేక ఇలా మాట్లాడుతున్నా అని ముగించాడు. అయితే, ఇదంతా ఎన్‌టిఆర్‌ కోసం ఖర్చీఫ్‌ వేస్తున్నాడంటూ ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి. 
 
ఇటీవల అస్సలు వర్మ సినిమాలు చూసి జనాలు థియేటర్లకు రావాలంటే భయపడుతున్నారు. ఐస్‌క్రీమ్‌-2 అంటూ తీశాడు. కానీ బిజినెస్‌ కాక ఆగిపోయింది. రాజశేఖర్‌తో పట్టపగలు తీశాడు. ఐతే అది ఎంతవరకు వచ్చిందో తెలియడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్‌టిఆర్‌పై కన్ను పడింది. దాంతో తన కెరీర్‌లో ఆయనతో సినిమా తీస్తే ఒక దారికి వస్తుందని ఫిలింనగర్‌లో కథనాలు వినిపిస్తున్నాయి.


Friday, February 6, 2015

"సినిమా తెచ్చిన మార్పు "

రాజేంద్ర ప్రసాద్ మరో వైవిధ్యమైన పాత్రలో ‘దాగుడుమూతల దండాకోర్' లో తెరమీదకు రానున్నాడు. ఇందులో ఈయనదే ప్రధాన పాత్ర. ఊరి పెద్ద. ఈయనతో సరిసమాన ప్రాధాన్యత గల పాత్ర చిన్నారి సారా(నాన్నలో నటించింది)ది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథాంశం శైవం అనే తమిళ సినిమా నుంచి తీసుకున్నారు. శైవంలో నాజర్ చేసిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్ చేస్తున్నాడు.
 కథ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ ది చాలా పెద్ద కుటుంబం. ముగ్గురుకుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరూ సెలవులకు తప్పనిసరిగా తమ సొంతూరు చేరుకుంటారు. అక్కడ తమ దేవతను దర్శించుకునే ఆచారాన్ని వారు పాటిస్తారు. కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినప్పుడు దేవతకు కోడిపుంజును బలి ఇచ్చే ఆచారం ఆ ఊర్లో ఉంటుంది. అయితే రాజేంద్రప్రసాద్ మనవరాలు సారాకు కోడిపుంజును బలి చంపడం అనే కార్యక్రమం నచ్చదు. కోడిపుంజును బలి ఇచ్చే తంతు జరపడానికి వారు సిద్ధపడుతుండగా దాన్ని ఆ పిల్ల దాచిపెట్టడం, దానికోసం కుటుంబమంతా గాలించడం... సినిమాలో ఎక్కువ భాగం ఇదే నడుస్తుంది.
 ఆ పాపకు ఆ పుంజంటే ప్రాణం... అమాయకంగా తను ఆ పుంజుకోసం పడే తపనే చివరి ట్విస్ట్. ఈ సినిమా చూసి తమిళనాడులోని కొన్ని గ్రామాలు పుంజును బలివ్వడం అనే ఆచారాన్ని వదిలిపెట్టేశారట. అంతే కాదు కొన్ని గ్రామాల్లో కోళ్లు తినడం మానేశారట. ఈ సినిమా ఇంతలా ప్రభావితం చేసిందంటే.... ఎంత హార్ట్ టచింగ్ గా ఈ సినిమాను తీసుంటారో, ఇట్టే అర్థమై పోతుంది... మరి తెలుగు సినిమా ప్రేక్షకులను ఈ సినిమా ఎంతలా ఆకట్టుకోగలదో వేచి చూడాల్సిందే.

Thursday, February 5, 2015

విద్యాలయంలో దొరికిన "నగదు బంగారం" ?

ఏ పుస్తకాలో... విద్యార్థుల రికార్డులో ఉండాల్సిన లాకర్లలో బంగారు కడ్డీలు.. కోటి రూపాయల నగదు బయట పడ్డాయి. దీన్ని చూసిన ప్రిన్సిపల్  అక్కడున్నఅధికారులందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటని విస్తుబోయారు. పాఠశాలలోనా.. అందునా ప్రభుత్వ పాఠశాలలోనా.. ఇక్కడకు ఇది ఎలా వచ్చిందనే అంశాన్ని కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు. ఇంతకీ ఈ సంఘన ఎక్కడ జరిగింది? వివరాలు కావాలంటే అహ్మదాబాద్ వెళ్లాల్సిందే. 

 
గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ నగరం, చంద్రఖేదలోని ఓఎన్ జీసీ క్యాంపస్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో వాడకంలో లేని లాకర్లు ఉన్నాయి. వాటన్నింటిని శుభ్రం చేసే పనిలో పడ్డారు ప్రిన్సిపల్ లవదేశ్ కుమార్. చాలా కాలంగా వాడకంలోని 20 లాకర్లను గుర్తించారు. అన్నింటిని శుభ్రం చేశారు. అయితే వీటిలో 5 లాకర్లకు తాళాలు లేవు. దీంతో వాటిని బద్దలు కొట్టాలని సిబ్బందిని ఆదేశించారు. 
 
అందులోని రెండు లాకర్ల నుంచి బ్యాగులు బయటపడ్డాయి. అదేంటో చూద్దామనుకున్న సిబ్బంది వాటిని తెరచి ఆశ్చర్య పోయారు. వాటిలోంచి 100 గ్రాముల బరువున్న 21 బంగారపు కడ్డీలు బయటపడ్డాయి. అలాగే కోటి రూపాయల నగదు కూడా బయట పడింది. దీంతో పిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ లాకర్లు ఎవరు వినియోగించారన్న సమాచారం దొరకలేదు. ఆదాయపన్ను శాఖ అధికారులు పన్నుఎగవేత కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Wednesday, February 4, 2015

" సర్పంచ్" పదవి" కోసం రూ."2 కోట్ల ఉద్యోగాన్ని" వదిలేశాడు ?


సర్పంచ్ పదవి కోసం రూ.2 కోట్ల ఉద్యోగాన్ని వదిలేశాడా? నమ్మసఖ్యంగా లేదు అనుకుంటున్నారు కదూ.. నిజమేనండి.
                        
 

                                           రాజస్థాన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం విద్యావంతులైన యువతలో కదలికను తీసుకొస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ దిగే అభ్యర్థులకు ప్రభుత్వం కనీస విద్యార్హత ఉండాలనే నియమము తీసుకురావడంతో విద్యావంతులు సైతం సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఇందులో విచిత్రమేమిటంటే..? విదేశంలో ఉద్యోగం, కోట్లలో జీతం తీసుకుంటున్న ఓ యువకుడు కూడా సర్పంచ్ పదవికి పోటీ పడేందుకు సిద్ధపడ్డాడు. ఆ యువకుడే ఆస్ట్రేలియాలోని గోల్ట్ కోస్ట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న హనుమాన్ చౌదరి (27). అతని వార్షిక జీతం రూ. 2కోట్లు కావడం గమనార్హం.
 
పంచాయతీ సభ్యులుగా పోటీకి ఎనిమిదో తరగతి, సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే పదోతరగతి పాస్ కావాలన్న ప్రభుత్వ నిబంధనతో గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతం మంది పోటీకి అనర్హులయ్యారు. దీనిపై జోక్యానికి రాష్ట్ర హైకోర్టు కూడా నిరాకరించింది.
 
ఈ నేపథ్యంలో నాగౌర్ గ్రామానికి చెందిన తన తండ్రి భురారాం పిలుపుతో ఆస్ట్రేలియా నుంచి గ్రామానికి వచ్చిన హనుమాన్ చౌదరి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆరువేల ఓట్లతో భారీ విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న హనుమాన్ చౌదరి తన గ్రామంలో కుల రాజకీయాల సంగతి అవగాహన ఉందన్నారు. తన సోదరుడి సహకారం వల్లే తాను పోటీ చేస్తున్నాని చెప్పారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను పోటీలో దిగుతున్నట్లు తెలిపారు.