CSS Drop Down Menu

Thursday, January 29, 2015

"అలీ ఔదార్యం"


 హాస్యనటుడు అలీ ఔదార్యాన్ని ప్రదర్శించారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేనిస్థితిలో వృద్దాప్యంలో ఉన్న ఆమెపై కేసును వెనక్కి తీసుకున్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో పాల్గొని ఆ వృద్ధురాలిపై కేసు ఉపసంహరించుకున్నారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిపై సాంబశివరావు దంపతులు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.90 లక్షల రుణం తీసుకున్నారు. ఈ సంగతి చెప్పకుండానే ఇంటిని విక్రయించారు. బ్యాంకు అధికారుల ద్వారా ఆలస్యంగా ఆ విషయాన్ని తెలుసుకున్న అలీ... 2006లో వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో చీటింగ్ కేసు నమోదైంది.

ప్రస్తతం నాంపల్లి నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తుది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయమూర్తి ఎస్.ఎస్.శ్రీదేవి... శకుంతల దయనీయ పరిస్థితిని అలీకి వివరించారు. దీంతో కేసును ఉపసంహరించుకునేందుకు ఆయన ముందుకొచ్చారు.

లోక్ అదాలత్ లో నిందితుల నుంచి తమకు రావాల్సిన డబ్బు తీసుకొని కక్షిదారులు రాజీ అవుతుండగా..అలీ మాత్రం తనకు రావల్సిన డబ్బును వదులుకొని పెద్ద మనసుతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించిన అలీని న్యాయమూర్తులు అభినందించారు.

Wednesday, January 28, 2015

"ఒకే కుటుంబం"లో "ఏడు పద్మ" అవార్డులు


బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ మూడోసారి పద్మ పురస్కారం అందుకోబోతున్నారు. దేశ రెండో అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్' ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆయనకు ప్రకటించింది. దీంతో ఆయన పురస్కారాల్లో మూడో పద్మ అవార్డు చేరినట్టైంది. బిగ్ బి 1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అందుకున్నారు.
తాజాగా ప్రకటించిన పద్మవిభూషణ్ తో కలిపి బచ్చన్ కుటుంబం 7 పద్మ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బిగ్ బి స్వయంగా తెలిపారు. తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్నారని గుర్తు చేశారు. తన భార్య జయాబచ్చన్ పద్మశ్రీ, తన కోడలు ఐశ్వర్యరాయ్ పద్మశ్రీ దక్కించుకున్నారని వెల్లడించారు. 

Tuesday, January 27, 2015

"మగతోడు"లేకుంటే "వందేళ్ళు" బతకొచ్చు.. ?


వందేళ్లు బతకాలనుకునే ఆడవాళ్లు పురుషులతో శృంగారానికి దూరంగా ఉండాలని ఓ బ్రిటన్ బామ్మ సలహా ఇస్తున్నారు. పురుషులకు దూరంగా ఉంటే సుధీర్ఘ కాలం జీవించవచ్చని పేర్కొంటున్నారు. బ్రిటన్‌కు చెందిన 109ఏళ్ల బ్రహ్మచారిణి జెస్సీ గల్లాన్... సుదీర్ఘకాలం జీవించాలనుకుంటే పురుషులకు (శృంగారానికి) దూరంగా ఉండాలని మహిళలకు హితబోధ చేస్తున్నారు.
తాను సుదీర్ఘకాలం ఆరోగ్యంతో ఉండటానికి కారణం పురుషులకు దూరంగా ఉండటం, గంజీ తాగడమేనని ఆమె సీక్రెట్‌ను వెల్లడించారు. స్కాట్లాండ్‌లోని అబెర్డీన్‌లో జెస్సీ జనవరి 2న తన 109వ జన్మదినాన్ని జరుపుకున్నారు. అంతేకాకుండా ఎక్కువకాలం బతకాలనుకునే వాళ్లు గంజి తాగాలని సూచించారు.
 ప్రతి రోజు ఉదయం వ్యాయామంతోపాటు, వెచ్చని గంజి తాగుతానని, పెళ్లి గురించి ఎన్నడూ ఆలోచించలేదని ఆమె అన్నారు. పేదరికంతో పుట్టిన జెస్సీ 13 ఏళ్లేకే ఇంటి నుంచి బయటకు వచ్చి పాలు సరఫరా చేస్తూ జీవితం గడిపారు.

Monday, January 26, 2015

"పూరి" చెంప పగలగొడతా ?


తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీ, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు తప్పుదోవపట్టేలా తన సినిమాల ద్వారా చెడు సందేశాలిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ తన కంటపడితే ఆయన చెంప పగలగొడుతానని అన్నారు. స్ర్తీలు, గురువులని అవమానించేరీతిలో సినిమాలు తీస్తున్న ఆయన తన తీరు మార్చుకోవాలని దేశపతి హితవు పలికారు.
 ప్రజలకు మేలు కలిగే విధంగా సందేశాలిచ్చే సినిమాలు తీస్తే వర్కౌట్ కాదని వ్యాఖ్యానించిన పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం ఎటువంటిదో గ్రహించాల్సిన అవసరం వుందని దేశపతి అభిప్రాయపడ్డారు. మెదక్ జిల్లాలో ఓ కాలేజీలో జరిగిన సెమినార్ కార్యక్రమంలో ఆయన ఈ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు.

Friday, January 23, 2015

" పాత్రలు కడిగే స్థాయి" నుంచి "కేంద్రమంత్రి" అయిన మహిళ ?


వృత్తిపరంగా కూలీని గౌరవించినప్పుడే ‘మేకిన్ ఇండియా' కల సాకారమవుతుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల విద్యామంత్రుల సదస్సులో మాట్లాడిన ఆమె, ముంబైకి వచ్చినప్పుడు పడిన కష్టాలను ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. తాను 15 ఏళ్ల కిందట ముంబైలో అడుగు పెట్టినప్పుడు ఓ హోటల్‌లో పాత్రలు కడిగానని, ఈ విషయం చెప్పేందుకు తానేమీ సిగ్గుపడడం లేదని మంత్రి తెలియజేశారు. వృత్తి ఏదైనా గౌరవం చూపాల్సిందేనని ఆమె కుండబద్దలు కొట్టారు.

"సూర్యుడి" తో "సిత్రాలు"














Thursday, January 22, 2015

Wednesday, January 21, 2015

"జుట్టుతో అద్భుతాలు"










Tuesday, January 20, 2015

ఒకే బంతిలో ఏడు పరుగులు?

సాధారణంగా క్రికెట్ క్రీడలో ఒక బంతికి ఆరు పరుగులు మాత్రమే. అయితే వెస్టిండీస్ ఓపెనర్ బ్రాత్ వైట్ ఏడు పరుగులు  సాధించి రికార్డు సృష్టించాడు. కేప్ టౌన్‌లో జరిగిన  టెస్టు మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేస్తుండగా, వెస్టిండీస్ బ్యాటింగ్ చేపట్టింది.

సౌత్ ఆఫ్రికా బౌలర్ల బంతులను విండీస్ ఓపెనర్లు ఎదుర్కోలేకపోయారు. ఆ స్థితిలో మూడో ఓవర్‌లో ఫిలాండర్ వేసిన రెండవ బంతిని వైట్ స్వేర్ డ్రైవ్ చేశాడు. దీంతో బ్యాట్స్‌మెన్‌లు ఇద్దరూ కలిసి వేగంగా మూడు పరుగులు తీశారు. అయితే బంతిని పట్టుకున్న ఫిల్డర్ వికెట్‌ కొట్టాలని ట్రై చేయగా, బంతి వికెట్లకు తగలకుండా బౌండరీకి చేరింది.

ఈ కారణంగా వైట్ తీసిన మూడు పరుగులు, బౌండరీతో వచ్చిన నాలుగు పరుగులు కలిగి మొత్తం ఏడు పరుగులు బ్రాత్ వైట్ ఖాతాలో చేరాయి. తద్వారా ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ పొందని రికార్డును వైట్ సాధించాడు.

"పువ్వుల్లో ఆకారాలు"