CSS Drop Down Menu

Monday, December 7, 2015

కలాం ఆస్తుల జప్తుకు ఆదేశాలు ! బీఎస్ఎన్ఎల్ నిర్వాకం ?

దేశం గర్వించదగిన శాస్ర్తవేత్త, మాజీ రాష్ర్టపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం గురించి అందరికీ తెల్సిందే! ఆయన మరణించి దాదాపు నాలుగునెలలు అవుతోంది. యావత్తు వరల్డ్  ఆయన్ని గుర్తించినా, ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మాత్రం గుర్తించలేదు.
 తనకు బకాయిపడ్డ స్వల్ప మొత్తాన్ని చెల్లించాలంటూ కలాంకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు బకాయి చెల్లించని పక్షంలో కలాంకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కూడా తన దిగువస్థాయి సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసేసింది. ఇంతకీ మాజీ రాష్ర్టపతి పడిన బకాయి ఎంతో తెలుసా? కేవలం రూ.1029 మాత్రమే(phone no 2724800).
 ఐదేళ్ల కిందట అంటే 2010లో తిరువనంతపురం టూర్‌లో భాగంగా కేరళ రాజ్‌భవన్‌లో రెండురోజులు బస చేశారు. ఈ సందర్భానికి సంబంధించింది ఈ బిల్లు. నోటీసు మాత్రం నవంబర్ 18, 2015లో జారీ అయ్యింది. అంటే కలాం మరణించిన నాలుగు నెలలు అవుతోంది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ జారీ చేసిన నోటీసు విషయం తెలుసుకున్న కేరళ రాజ్‌భవన్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఆ బిల్లును తాము చెల్లిస్తామంటూ రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. 

1 comment:

  1. దీనిని బట్టి మన ప్రభుత్వ సంస్థలు ఇంత గొప్పగా పని చేస్తున్నాయన్నమాట! ఏది ఏమైనా మనుషులను తీసేసి మర మనుషులను పెడితేనే పనులన్నీ నిజాయితీగా జరుగుతాయి కొంతవరకైనా?
    kscwritesinfo.blogspot.com

    ReplyDelete