CSS Drop Down Menu

Friday, December 4, 2015

త్వరలో నోరూరించే "టెస్ట్‌ట్యూబ్ చికెన్"

లెక్కకు మించి పెరిగిపోతున్న జనాభా నాన్‌వెజ్ రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక ల్యాబ్ ఫుడ్డే దిక్కంటున్నాయి పరిశోధనలు.. నాన్‌వెజ్‌కు రోజూ పెరిగిపోతున్న డిమాండ్‌ను తట్టుకోవాలంటే  టెస్ట్‌ట్యూబ్ రెసీపీలే తప్పనిసరి అని తేల్చారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.. దాని తర్వాత టెస్ట్ ట్యూబ్  హాంబర్గర్స్ కూడా  వరల్డ్ మార్కెట్‌లో ఆదరణ పొందాయి. ఇవ్వన్నీ సరే.. త్వరలో లేబొరేటరీ నుంచి మరో అద్బుతాన్ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు సైంటిస్టులు.. ఇదే కనుక సక్సెస్ అయితే.. కొక్కొరోకో మంటూ తిరిగే  కోడిని టేస్ట్‌ఫుల్‌గా వండిలొట్టలేసుకు తినేందుకు పౌల్ర్టీల దగ్గర, చికెన్‌షాపుల దగ్గర వెయిట్ చేసేబాధ కూడా తగ్గుతుందంటున్నారు. రానున్న మరికొద్ది మాసాల కాలంలోనే ల్యాబ్ చికెన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

టెల్అవివ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ గిఫెన్ అనే బయోఇంజనీర్ సంవత్సరం నుంచి ల్యాబ్‌లో చికెన్ తయారుచేయడంపై ప్రయోగాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ కల్చర్డ్ మీట్ కల ఫలిస్తుందన్న నమ్మకం ఉందనీ టెస్ట్‌ట్యూబ్ చికెన్ రెసిపీ సెల్స్ పెంపకం సక్సెస్ అయితే ముందురోజుల్లో కబేళాల్లో జంతువుల కోత అవసరమే ఉండదంటున్నారు సైంటిస్ట్‌లు.ఈ సంవత్సరం చివరికల్లా  చికెన్ సెల్స్  కల్చర్ పూర్తి అవుతుందని,  చికెన్ కున్న అత్యధిక డిమాండ్‌ను  ల్యాబ్‌చికెన్ తీరుస్తుందనీ అంటున్నారు.  2050  సంవత్సరంనాటికి  పెరిగే 9బిలియన్ల జనాభా నాన్‌వెజ్ ఫుడ్  డిమాండ్.. కల్చర్ మీట్, ల్యాబ్ చికెన్ తోతీరుతుందని  పరిశోధకులు చెబుతున్నారు. పైగా కల్చర్ మీట్  తయారీలో అతితక్కువ గ్రీన్హౌజ్ గ్యాస్ విడుదలవుతుందనీ, నీటి వినియోగం కూడా  82 నుంచి 96శాతం తక్కువగా ఉంటుందనీ, లైవ్ స్టాక్ కోసం భూమి పెద్దగా అవసరం ఉండదనీ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీఆఫ్ ఆమ్‌స్టర్డామ్ పరిశోధనలు చెబతున్నాయి.

0 comments:

Post a Comment