CSS Drop Down Menu

Friday, October 2, 2015

"కంప్యూటర్ గేమ్స్ ఆడే అమ్మాయిలు" బరవు పెరిగిపోతారట!

భౌతిక శ్రమ లేకుండా అలా కూర్చున్నచోటే కూర్చుని చేసే కంప్యూటర్ పనుల్లో ఎలా అయితే ఉద్యోగులు లావుగా మారిపోతారో అలాగే ఇపుడు ఆటలాడే అమ్మయిలు కూడా బరువు పెరుగుతారని పరిశోధనలో తేలింది. ముఖ్యమంగా ఇంట్లో అమ్మాయిలకు చాలా ఖాళీ సమయం ఉంటుంది. అప్పుడు కనుక అమ్మాయిలు గంటల తరబడి కంప్యూటర్ గేమ్స్ ఆడితే బరవు పెరగడం ఖాయమట. ఈ విషయాన్ని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
 
గంటపాటు కంప్యూటర్ గేమ్స్ ఆడితే చాలు... బరువుల్లో తేడాలు వచ్చేస్తాయని తేలిందట. 2500 మంది అమ్మాయిలపైన అదికూడా 20 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారిపైన ఈ పరిశోధన చేసినప్పుడు ఈ ఫలితాలు వచ్చాయి. మారిన ఆధునిక జీవనశైలిలో ఫోన్, కంప్యూటర్ భాగమైపోయాయి. దాంతో అమ్మాయిలు వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో వారి బాడీ మాస్ ఇండెక్స్‌పై ప్రభావం చూపుతోందనీ, గేమ్స్ ఆడేవారు వాటి జోలికి వెళ్లని వారికంటే అదనంగా 3.7 కేజీల బరువు పెరిగిపోతారని తేలిందని చెపుతున్నారు. విచిత్రం ఏమిటంటే... మగవారిలో మాత్రం ఇలాంటి తేడా వారికి కనిపించలేదట.
 

0 comments:

Post a Comment