CSS Drop Down Menu

Saturday, October 17, 2015

"గ్యాంగ్ రేప్" ఫై వివాదాస్పద కామెంట్ చేసిన హోంమంత్రి!

రేప్ లు.. గ్యాంగ్ రేప్ లకు సరికొత్త భాష్యం చెబుతున్నారు మన నేతలు. వీరి భాష, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. అసలు నలుగురు ఒకేసారి రేప్ ఎలా చేస్తారని ఇటీవల సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రశ్నిస్తే, ఇప్పుడు కర్ణాటక హోంమంత్రి కేజే జార్జి మరో వివాదాస్పద కామెంట్ చేశాడు. ఇద్దరు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదంటూ సామూహిక అత్యాచారానికి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. ఇద్దరే మగాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని, కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ప్రశ్నించారు.
22ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని డ్రైవర్, క్లీనర్ కత్తితో బెదిరించి కదులుతున్న వ్యాన్ లో అత్యాచారం చేసిన ఘటనపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానమిచ్చారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఆ యువతి డ్యూటీ ముగించుకుని తన పీజీ హోం కు వెళ్లేందుకు బస్సుకోసం చూస్తుండగా, వచ్చిన దుండగులు ఆమెను వ్యాను లోకి ఎక్కించుకుని రోడ్లపై తిప్పుతూ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కాగా, మంత్రి మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి స్పందించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ లలితా కుమార మంగళం మండిపడ్డారు. పెద్దఎత్తున విమర్శలు రావడంతో కేజే జార్జి చివరికి క్షమాపణ చెప్పారు.    

0 comments:

Post a Comment