CSS Drop Down Menu

Saturday, August 8, 2015

"స్మార్ట్‌ఫోన్‌" వినియోగదారులూ బహుపరాక్ !

టెలికాం విప్లవం పుణ్యమాని ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ కనిపిస్తోంది. అయితే, ఆ ఫోన్ పని చేయాలంటే మాత్రం విధిగా బ్యాటరీ ఉండాల్సిందే. మారుతున్న టెక్నాలజీతో పాటు.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇపుడు స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. అయితే, ఈ ఫోన్లలో వినియోగించే బ్యాటరీలు నిగూఢ శత్రువుల్లా పని చేస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
ఇంటర్నెట్‌ వినియోగించే సమయంలో... ఫోన్లు చేసేటపుడు ప్రైవసీ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ గూఢచారి బ్యాటరీ ముందు ఆ పప్పులేవీ ఉడకవని సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్ని ప్రైవసీలు పెట్టుకున్నా స్మార్ట్‌ఫోన్‌ వాడే వ్యక్తి వివరాలన్నీ ఆ బ్యాటరీ ద్వారా ట్రాప్ చేయవచ్చని తేలింది. హెచ్‌టీఎంఎల్‌5లోని ఓ సాఫ్ట్‌వేర్‌.. ఈ బ్యాటరీ ద్వారా మొబైల్ వినియోగదారుని వివరాలను పసిగట్టేస్తుందట. 
 
నిజానికి ఈ సాఫ్ట్‌వేర్ వెబ్‌లోని కొన్ని సైట్లను ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఇదే సాఫ్ట్‌వేర్ ద్వారా వినియోగదారుడి ఫోన్లో ఉన్న బ్యాటరీ నిడివి గురించి పలు వెబ్‌సైట్లకు సమాచారం ఇస్తుందట. ఆ సమాచారంతోనే వినియోగదారుడు నెట్‌ వాడుతున్నప్పుడు ఫోన్‌ వివరాలు, వినియోగదారుడి వివరాలను గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్‌ చేసేస్తారట. 
 
ఇంటర్నెట్‌ వాడే ఓ వినియోగదారుడి వివరాలను తెలుసుకునేందుకు సాధారణంగా వీపీఎన్‌, ప్రైవేట్‌ బ్రౌజింగ్‌లు చాలు. అయితే ఇప్పుడు దానికి అదనంగా బ్యాటరీ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు తోడయ్యాయి. ‘ద లీకింగ్‌ బ్యాటరీ: ఎ ప్రైవసీ అనాలసిస్‌ ఆఫ్‌ ద హెచ్‌టీఎంఎల్‌5 బ్యాటరీ స్టేటస్‌ ఏపీఐ’ అనే అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 


0 comments:

Post a Comment