CSS Drop Down Menu

Thursday, August 27, 2015

"సుఖాల"నే కాదు ! "జబ్బుల్ని" కూడా ఇచ్చే "డబ్బు" ?

ఇది నిజంగా షాకింగ్ న్యూసే. కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొస్తాయంటే నమ్మబుద్దికాదు కానీ, ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ డజన్లకొద్దీ కరెన్సీ నోట్లను అంటిపెట్టుకుని ఉంటాయట. రూ. 10, రూ. 20, రూ. 100 కరెన్సీ నోట్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు ఢిల్లీకి చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. ఈ కరెన్సీ నోట్ల కారణంగా సుమారు 78 వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ గుర్తించింది. 
 
వీటిలో చాలామటుకు ఫంగై, బ్యాక్టీరియా కారక రూపంలో నోట్లను అంటిపెట్టుకుని ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. వీటి ఫలితంగా డీసెంట్రీ, ట్యుబర్కులోసిస్, అల్సర్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదని చెపుతున్నారు. ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొచ్చే వాహకాలుగా కూడా పనిచేసే అవకాశం ఉందని చెపుతున్నారు. 

0 comments:

Post a Comment