CSS Drop Down Menu

Tuesday, August 18, 2015

కొడుకుతో " ఫైన్ " కట్టించిన మంత్రి!

శివసేన పార్టీకి చెందిన మహారాష్ట్ర రవాణా శాఖామంత్రి దివాకర్ రావోతే ఇతర రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు. గతంలో ఓసారి.. హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళుతున్న పోలీసు కానిస్టేబుల్‌తో ఫైన్ కట్టించి వార్తలెక్కాడు. ఇపుడు తన తనయుడు పోలీసులతో వాదనలకు దిగినందుకు రూ.వెయ్యి ఫైన్ కట్టాలంటూ ఆదేశించి ఆదర్శంగా నిలిచారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే దివాకర్ రావోతే తనయుడు ఉన్మేశ్ రావోతేను డ్రంకన్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు నిలువరించారు. అతడిని ప్రశ్నించగా, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారితో వాదనకు దిగాడు. దీంతో అతన్ని పోలీసులు అతన్ని వదిలివేశారు. అయితే, ఈ విషయం మరుసటి రోజు ఉదయం మంత్రి చెవికి చేరింది. వెంటనే ఆయన తన కుమారుడిని మందలించి, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు రూ.1000 ఫైన్ కట్టాలంటూ స్పష్టం చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ "పోలీసులు వారి విధి వారు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తుంటారు, కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తుంటారు. నేను మంత్రినైనా గానీ, ఇలాంటి విషయాల్లో నా కుమారుడికీ మినహాయింపు ఇచ్చేదిలేదని నిరూపించాను" అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అమలు చేసే నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు.
 


1 comment:


  1. అందరు మంత్రులూ ,ప్రజాప్రతినిధులూ అలా నిజాయితీగా,నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తే ఎంత బాగుంటుంది?

    ReplyDelete