CSS Drop Down Menu

Wednesday, August 12, 2015

"పేదోడి పెద్దమనసు"

చదువులేదు, ధనవంతుడు కాదు.. అయినా బుద్ధిలో మాత్రం కోటీశ్వరుడే. అతనే రాజస్థాన్‌‌లోని జైపూర్‌‌కు చెందిన రిక్షావాలా మహ్మద్ అబిద్ ఖురేషీ. రోడ్డు మీద తనకు దొరికిన నోట్ల కట్టలను పోగొట్టుకున్న వ్యక్తికి ఇవ్వాలని తపించాడు. రెండో ఆలోచన లేకుండా అందుకోసం మూడు గంటల పాటు డబ్బు దొరికిన చోటే వేచి చూశాడు. ఎంతకీ ఆ వ్యక్తి రాక పోవడంతో ఆ రూ. 1.17లక్షలను అచ్చంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి సదరు వ్యక్తికి ఇవ్వాలని కోరాడు. కాళ్ల పట్టీలకోసం కాళ్లే నరుక్కుపోయిన దుష్టులున్న ప్రస్తుత సమాజంలో బీదవాడైన ఖురేషీ నిజంగా హీరోనే.  'నిజాయితీ' అనేది మనిషి యొక్క చదువో లేదా స్టేటస్ ని బట్టో ఉండదనేదానికి ఉదాహరణే ఈ ఘటన. 



26 ఏళ్ల మహ్మద్ అబిద్ ఖురేషీ జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిక్షా నడుపుతాడు. అతనికి భార్య అమీనా, పసిపాప ఉంది.  రోజుకు రూ. 200 వందల నుంచి రూ. 300 వరకూ సంపాదిస్తాడు. రోజూ లాగే ఒక షాపులో సరుకు దింపి తిరిగి వస్తున్న క్రమంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ సర్కిల్ దగ్గర ప్లాస్టిగ్ బ్యాగ్ కనిపించింది. అందులో లక్షా 17వేల రూపాయలు ఉన్నాయి. ఎంత సేపు వెయిట్ చేసినా బ్యాగ్ యజమాని రాకపోవడంతో ఇంటికి వెళ్లి భార్య అమీనా కు విషయం చెప్పాడు.  దీంతో భార్యాభర్తలిద్దరూ కలిసి స్థానిక సోషల్ వర్కర్ సబీర్ ఖురేషీ సాయంతో పోలీస్ కమీషనర్ ఆఫీస్ కు వెళ్లి క్యాష్ బ్యాగ్ అందజేశాడు. అబిద్ ఖురేషీ ని అభినందించిన  కమిషనర్ జంగా శ్రీనివాసరావు అబిద్ నిజాయితీ అందరికీ ఆదర్శం కావాలన్నారు. స్వాతంత్యదినోత్సవంగా మహ్మద్ అబిద్ ఖురేషీని సన్మానిస్తామని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. 

3 comments:

  1. I salute people like Qureshi.He is exceptional.

    ReplyDelete
  2. డాక్టర్ గారు (కమనీయం గారు) చెప్పినది నిజం. ఖురేషీ లాంటి వ్యక్తులు అరుదు.

    ReplyDelete