CSS Drop Down Menu

Wednesday, July 8, 2015

భోజనం తర్వాత "స్వీట్ బీడా" వేసుకోవచ్చా?

స్వీట్ సోంపు, సోంపు, మిఠాయి, బీడాతో కలగలిపిన బీడాను తీసుకోవడం అంటేనే చాలామంది భయపడతారు. భోజనానికి తర్వాత బీడా తీసుకోవడం మంచిదా? కాదా ? అనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. అలాంటి డౌట్ మీకూ ఉంటే ఈ స్టోరీ చదవండి. సాధారణంగా తీసుకునే ఆహారాన్ని బట్టే బీడా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శాకాహారం లేదా మాంసాహారం మోతాదుకు మించితే బీడా వేసుకోవచ్చు. 
 
ఆహారం తీసుకున్నాక కడుపులో ఏర్పడే ఆమ్లాలను నిరోధించాలంటే.. అరటిపండు, పాలు, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ తీసుకోవడం మంచిది. పండ్లను కూడా తీసుకోవచ్చు. విందు భోజనాలు హాజరైతే మాత్రం తప్పకుండా బీడా తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే మాంసాహారం తీసుకుంటే తమలపాకును నమిలితే సరిపోతుంది. దాంతో పాటు వక్క, సున్నం ఉపయోగిస్తే పేగు క్యాన్సర్ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్ వెజ్ ఫుల్‌గా లాగించేశాక స్వీట్ బీడా తీసుకోవడం ఉత్తమం. వీటిలో సోంపు, జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 
 
అయితే ఆహారం తీసుకున్నాక కాఫీ, టీలు తీసుకోవడం మంచిదికాదు. జల్జీరా, సోడా, లెమన్ జ్యూస్ కూడా జీర్ణానికి ఉపకరిస్తాయి. ఏది ఏమైనా ఆహారాన్నిమాత్రం మితంగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


0 comments:

Post a Comment