CSS Drop Down Menu

Thursday, July 2, 2015

డయాబెటిస్‌ను దూరం చేసుకోవాలంటే ? కోడిగుడ్డు తినాల్సిందే !

సాధారణంగా రక్తపోటు, టైప్2 డయాబెటిస్, గుండెపోటు వంటి రోగాలు వేధిస్తుంటాయి. అలాంటి వాటిలో టైప్ 2 డయాబెటిస్‌ను దూరం చేసుకోవాలంటే.. కోడిగుడ్డు తినాల్సిందేనని పరిశోధనలో తేలింది. డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. వ్యాయామం, పౌష్టికాహారం వంటి సక్రమంగా లేకుంటే డయాబెటిస్‌ చిక్కులు తప్పవని పరిశోధనలో వెల్లడైంది.
 
అలాగే అధిక కొవ్వు చేరడం ద్వారా శరీరంలోని గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. తద్వారా గుండెపోటు ఏర్పడుతుందని పరిశోధనలు తేల్చాయి. ఈ నేపథ్యంలో కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ తగ్గుతుందని కొత్త పరిశోధనలో తేలింది. కోడిగుడ్డులోని కొవ్వు శరీరంలోని గ్లూకోజ్ స్థాయి క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చునని ఫిన్లాండ్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
ఈ పరిశోధన 432 మందిపై జరిగింది. ఇందులో వారానికి ఒక కోడిగుడ్డు తీసుకునే వారికంటే వారానికి నాలుగు కోడిగుడ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా టైప్ 2 మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు.
 

0 comments:

Post a Comment