CSS Drop Down Menu

Friday, July 31, 2015

పాము కాటు సెల్ఫీ‌కి కోటి హాంఫట్ !

వెర్రి వేయి విధాలు..  పిచ్చి ముదిరి తలకు రోకలి చుట్టుకోవడం అంటే ఇలాగేనేమో! స్మార్ట్ ఫోన్స్ హవా స్టార్ట్ అయ్యాక సెల్ఫీల  పిచ్చి ప్రపంచవ్యాప్తంగా ముదిరిపోయింది. ఒబామా, నరేంద్రమోదీ వంటి నేతలు సైతం సెల్ఫీ‌లకు అతీతులం కాదని నిరూపించారు. కానీ ప్రముఖులు ఎప్పుడైనా అరుదుగా ఇవి సోషల్ నెట్‌వర్క్స్‌లో పోస్ట్ చేస్తారు. కుర్రకారు లేదా సోషల్ నెట్‌వర్క్స్ మానియా ఉన్నవాళ్ళు రోజూ కనీసం ఐదారు సెల్ఫీలు తీయకుండా నిద్రపోరని ఓ రిపోర్ట్ చెబుతోంది. 
ఇక అసలు సెల్ఫీ‌కి వస్తే.. అమెరికా- శాండియాగోలో ఓ ప్రబుద్ధుడు కోబ్రా‌తో సెల్ఫీ దిగి దాదాపు కోటి రూపాయలు హాస్పిటల్ బిల్ కట్టడానికి రెడీ అయ్యాడు. ఇంకానయం రెండు ఆసుపత్రిల్లో చేరి ఏదోవిధంగా బతికి బయటపడ్డాను అంతేచాలని సంబరపడుతున్నాడట. చేతిమీద కోబ్రా కాటుకు రంగు మారిన చేయి ఫోటో ఇది! 


 హాస్పిటల్ బిల్  ఫోటో ట్విట్టర్‌లో పెట్టి మరీ ముచ్చట తీర్చుకున్నాడు. 


అదీ సంగతి.  సెల్ఫీ కోసం సాహసాలు చేస్తే  ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయి.. యూత్ తస్మాత్ జాగ్రత్త!

Thursday, July 30, 2015

ఆ తప్పు ఖరీదు 95,700 కోట్లు ?

ఒక తప్పు సాధారణ మహిళను అత్యంత ధనికురాలిగా చేసింది. కానీ ఈ  నడమంత్రపు సిరి ఆనందం కొద్దిసేపు మాత్రమే దక్కింది.  తన అకౌంట్  అప్‌డేట్ చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లిన మహిళ తన ఖాతాలో 95,700 కోట్ల రూపాయలుండటంతో ఆనందంతో పొంగిపోయింది. ముందు ఒకింత షాక్‌కు గురైన ఆ మహిళ ఈ సంగతి బ్యాంక్ సిబ్బందికి తెలియజేయడంతో నాలుక్కరుచుకున్న బ్యాంకు అధికారులు సర్వర్ ప్రాబ్లెమ్ వల్ల ఈ పొరబాటు జరిగిందంటూ సర్దుకున్నారు.
 ఆసక్తి కలిగించే ఈ కథనం వివరాల్లోకి వెళితే.. ఊర్మిళ యాదవ్ అనే మహిళ నెలకు 3,000 రూపాయల ఆదాయం  సంపాదించుకునే సాధారణ మహిళ. తన సొమ్మును 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' కాన్పూర్  బ్రాంచ్‌లోని సేవింగ్స్ అకౌంట్‌లో దాచుకుంది. అయితే ఆదివారం తన సేవింగ్స్ అక్కౌంట్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లింది. సేవింగ్స్ ఖాతాలో 95,700 కోట్ల రూపాయలు తన పేరిట జమ అయినట్టు చూసి ముందు బిత్తర పోయింది. తరువాత ఆనంద పడింది. కాసేపటి తరువాత తేరుకుని ఇదే విషయాన్ని బ్యాంక్ సిబ్బందికి తెలియచేసింది. దీంతో ఖంగారు పడ్డ సిబ్బంది ఎస్‌బిఐ అధికారులకు తెలియజేయడంతో వాళ్ళు  అప్రమత్తమయ్యారు. సాంకేతికలోపమే ఈ పొరబాటుకు కారణమనీ, బ్యాంక్ మెయిన్ సర్వర్ ముంబైలో ఉండటంతో సాధ్యమైనంత త్వరలో దీనిని క్రమబద్దీకరిస్తామని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

Wednesday, July 29, 2015

చంద్రబాబుకు ‘ఆగష్టు’ బెడద ?

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ఈసారి వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది. మరో రెండువారాల్లో ఆగస్టు 15 వచ్చేస్తోంది. ఈసారి ఏపీ ప్రభుత్వం వేడుకలను ఎక్కడ నిర్వహించనుందన్న ప్రశ్న మళ్లీ మొదలైంది. ఇప్పటివరకు పూర్తిస్థాయి రాజధాని లేకపోవడంతో వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్నదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఐతే, విశాఖలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈసారి కూడా రాయలసీమకే ఆ ఛాన్స్ ఇవ్వాలని అక్కడి నేతలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 
రాష్ర్ట విభజన తర్వాత తొలిసారి పంద్రాగస్టు వేడుకలు కర్నూలులో జరిగాయి. దీంతో ఈసారి ఉత్తరాంధ్రలోని విశాఖలో ఐతే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇంతలోనే సొంతపార్టీలోని కొంతమంది నేతలు దీనికి అడ్డుపుల్ల వేస్తున్నట్లు సమాచారం. మళ్లీ సీమలోనే వేడుకలు జరపాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. దీంతో ఈ అంశం మరోసారి వివాదం అయ్యేలా కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో కొద్దిరోజుల్లో తేలిపోనుంది. 
 

Saturday, July 25, 2015

ఉదయభానుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన చిరు, బాలయ్య ?

టేజిపైన ఉన్న హీరోలను వర్థమాన హీరోలు అనుకుందేమోగానీ యాంకర్ ఉదయభాను, అందరినీ వేసినట్లుగానే వారికీ ప్రశ్నలు వేసింది. ఇంతకీ ఆ వివరాలు ఏమిటంటే... టీవీ9, టీఎస్సార్ అవార్డు ఫంక్షనుకు యాంకర్ గా ఉదయభాను వ్యవహరించింది. ఈ అవార్డులను ఆయా విజేతలకు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ చెరో పక్క నిలబడి బహూకరించారు. ఉదయభాను అలా మాట్లాడుతూ ఉండగా చిరంజీవి స్టేజి పైకి వచ్చారు. ఆయన మైకు అందుకున్నారు. 

అంతలోనే ఉదయభాను మైకు పట్టుకుని నవ్వుతూ, సార్ మీ 150వ సినిమా ఎప్పుడో చెప్పండి అంటూ పుసుక్కున అనేసింది. ఆయన కోపాన్ని అదిమిపట్టుకున్నారో ఏమోగానీ, ఇది సందర్భం కాదని కాస్త గుడ్లురిమి చూశారు. అంతే హాట్ యాంకర్ సైలెంట్ అయింది. 
 
మళ్లీ ఇంతలోనే బాలయ్య మైకులో మాట్లాడుతున్నారు. ఆయన ఏదో చెప్పబోతుంటే... అదేమిటంటే అనుకుంటూ మధ్యలోనే దూరేసింది. మళ్లీ బాలయ్య కాస్త పెద్దగానే నేను చెపుతాగా ఆగు అని అన్నారు. అంతే, మారుమాట్లడకుండా సైలెంట్ కొద్దిసేపు సైలెంట్ మెయింటైన్ చేసింది. అదీ సంగతి. సీనియర్ హీరోలతో పెట్టుకుంటే ఇంతేమరి.
 


Friday, July 24, 2015

"పాలు కలపని" టీ తాగితే ?

పాలు కలపని తేనీరు అంటే బ్లాక్ టీ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో తేలింది. బ్లాక్ టీ సేవించే వారిలో డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు చాలామటుకు తక్కువని అధ్యయనంలో వెల్లడైంది. డైలీ టైమ్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 50 దేశాల్లో అత్యధిక ప్రజలు పాలు కలపని బ్లాక్ టీని సేవిస్తున్నారు. ఈ దేశాల్లో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య ఇతర దేశాలకంటే తక్కువేనని అధ్యయనం తేల్చింది. 
 
ఇంకా బ్లాక్ టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓ వరప్రసాదమని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. ఐర్లాండ్‌లో ఏడాది ఒక వ్యక్తి రెండు కిలోల బ్లాక్ టీ సేవిస్తున్నట్లు అధ్యయనం తేల్చింది. దీనికి తర్వాతి స్థానాల్లో బ్రిటన్, టర్కీలు సొంతం చేసుకున్నాయి. ఈ దేశాల్లో టైప్- 2 డయాబెటిస్ సోకిన వారి సంఖ్య చాలా తక్కువ అని తెలియవచ్చింది.
 


Wednesday, July 22, 2015

రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంపర్ ఆఫర్ ?

రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పంటి కింద రాయిలా తయారయ్యారు. పదునైన విమర్శలు.. ఇరుకున పెట్టే అంశాలతో కేసీఆర్ ను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉండేవాడు. ఇది వారికి చాలా ఇబ్బందికర అంశంగానే తయారయ్యింది. అందుకే ఆయనను అలా ఓటుకు నోటు కేసులో ఇరికించేశారు. అదే వేరే విషయం కానీ, అప్పట్లో కూడా ఆయనకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట.. ఈ విషయం రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పారు. ఏమిటా బంపర్ ఆఫర్..? ఎవరిచ్చారు..? 
 
ఆయా నేతల స్థాయిని బట్టి వారికి సరితూగే నేతలను టీఆర్ఎస్ రంగంలోకి దించి బేరసారాలు ఆడుతుందిట. రేవంత్‌కు ఈ తరహా ఆఫర్ చేసేందుకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు స్వయంగా రంగంలోకి దిగారట. భవిష్యత్తుపై భరోసా.. పార్టీలో స్థానం.. మంత్రివర్గంలో స్థానం.. ఇలాంటి ఎన్నో ఆఫర్లు ఆయన ముందుకు వచ్చాయి. కానీ వీటన్నింటికి మించిన ఆఫర్ ఒకటి హరీశ్ రావు చేశారట.
 
ఆ ఆఫర్ ఏమిటి, తాను హరీశ్ రావుకు ఏం చెప్పానన్న విషయాలను వెల్లడించేందుకు మాత్రం రేవంత్ రెడ్డి నిరాకరించారు. ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించేందుకు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అవకాశం దొరికినప్పుడు తప్పనిసరిగా ఈ విషయాలను బహిర్గతం చేస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. 
 


Tuesday, July 21, 2015

ఈ దేశాలకు వెళ్ళాలంటే "వీసా" అక్కర్లేదు !


ప్రపంచంలో కొన్ని దేశాలకు భారతీయులు వీసా లేకుండానే వెళ్ళవచ్చునట.. ఇటీవల ఆయా దేశాలకు సంబంధించి ఎలాంటి ప్రయాణ సంబంధ మార్పులు లేవన్న విషయాన్ని ప్రజలు సంబంధిత ఎంబసీ లేదా దౌత్య కార్యాలయాన్నిగానీ సంప్రదించి నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. వీసా అవసరం లేని దేశాలు, ఆయా ప్రాంతాలు..

హాంకాంగ్ (14 రోజులవరకు వీసా అవసరం లేదు)
కేప్ వెర్డే
కొమొరోస్ దీవులు,
డిజిబౌటి
ఇథియోపియా
మడగాస్కర్ (30 రోజులవరకు చెల్లుబాటు)
సెయింట్ లూసియా (ఆరు వారాలవరకు)
సమోవా (60 రోజులవరకు)
జోర్డాన్ (రెండు వారాలవరకు)
కెన్యా (మూడు నెలలవరకు)
ఇండోనీసియా (30 రోజులవరకు)
లావోస్ (30 రోజులవరకు)
సిషేల్లస్ (నెల రోజులవరకు)
పలవూ (30 రోజులు)
డొమినికా
ఈక్వెడార్
ఎల్ సాల్వడార్
ఫిజీ,
హైతీ
మైక్రొనీసియా
నేపాల్
భూటాన్
గ్రెనడా
మారిషస్
రీయూనియన్
సెయింట్ విన్సెంట్
బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్
మాంట్ సెరాట్

Monday, July 20, 2015

పురుషుల్లో "సెక్స్ కోరికలు పెంచే మెంతులు"

 మనిషి జీవితంలో అత్యంత సుఖమైనది స్త్రీ, పురుషుల సంయోగం. నేటి ఆధునిక యుగంలో పెరిగిన పోటీతో ఉదయం మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరకలు, పరుగులే. ఈ కారణంగా స్త్రీ, పురుషుల్లో సెక్స్ కోరికలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీంతో పురుషుల్లో పలువురు సెక్స్ కోరికలను పెంచుకునేందుకు మెడికల్ షాపుల్లో దొరికే మాత్రలపై ఆధారపడుతుంటారు. అయితే మనం నిత్యం తీసుకునే ఆహారంతోనే సెక్స్ వాంఛను పెంచుకోవచ్చు.

భారత దేశ సాంప్రదాయ వంటకాల్లో ఉపయోగించే వస్తువులలో అతి ముఖ్యమైనవి మెంతులు. అందువలనే మన పూర్వికులు మన ఆహార పదార్థాల్లో మెంతులకు ముఖ్యత్వం ఇచ్చి ఉన్నారు. మెంతులను ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటూ వస్తే పురుషులకు సెక్స్ కోరికలు పెరుగుతాయి. మెంతులు పురుషుల సెక్స్ హార్మోన్‌లను రెచ్చగొట్టేందుకు సహకరిస్తాయి. మెంతుల్లో ఉన్న సపోనిన్ అనే పదార్థం పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరన్‌ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ విషయం తాజాగా జరిపిన అధ్యయనం ద్వారా మరోసారి రుజువైంది. ఇందుకోసం పరిశోధకులు ఇటీవల  25 ఏళ్ల వయస్సు నుంచి 55 ఏళ్ల వయస్సులోపు గల 60 మంది పురుషులను పరిశోధించారు. వారికి రోజుకు రెండు సార్లు వంతున మెంతులు, మెంతుల రసం ఇచ్చారు. ఆరు వారాల తర్వాత వారికి సెక్స్ కోరికలు అత్యధికంగా పెరిగినట్లు గుర్తించారు.

అదే సమయంలో మెంతులు తినని కొందరిని పరిశోధించగా వారికి సెక్స్ కోరికలు తక్కువగానే ఉన్నట్టు తెలిసింది. దీంతో మెంతులను సెక్స్ ప్రియులకు వరప్రసాదంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఇక బయట మెడికల్ షాపుల్లో అడ్డమైన మందులను కొని, డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని వృధా చేసుకోకుండా, ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో మెంతులు చేర్చుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.


Saturday, July 18, 2015

మరీ ఇంత బరితెగింపా ? ఓ చైనా జంట నిర్వాకం !

చైనాలో ఉన్న ఒక రెస్టారెంట్‌లో ఓ జంట అందరి ముందూ అంతా విప్పేసి బహిరంగంగా సెక్స్ చేసుకున్నారు. హోటల్‌కు వచ్చిన ఇతర కస్టమర్లు ఆ దృశ్యాన్ని చూసి బెంబేలెత్తారు. వివరాల్లోకి వెళితే... చైనా వెబ్‌సైట్‌లో తాజాగా ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో చైనాలో ఉన్న ఒక రెస్టారెంట్‌‌కు ఒక జంట వచ్చింది. వారు వీఐపీలు తింటున్న డైనింగ్ హాల్‌కు వెళ్లారు.
 
అక్కడ అద్దాలతో చేసిన క్యాబిన్‌లు ఉన్నాయి. దీంతో లోపల ఏమి జరిగినా బయట అందరికి స్పష్టంగా తెలియకపోయినప్పటికీ 80 శాతం బాగానే కనిపిస్తుంది. అంటువంటి క్యాబిన్‌లో చొరబడిన ఓ యువ జంట అక్కడ బహిరంగంగా అంతా విప్పేసి సెక్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఇతర టేబుళ్లలో భోజనం చేస్తున్న వారంతా అవాక్కయ్యారు.
 
ఆ సమయంలో వారు ఇచ్చిన ఆర్డర్‌ను తీసుకు వచ్చిన బ్యారెర్‌ను కూడా వారు పట్టించుకోకుండా శృంగారంలో మునిగిపోయారు. వారి ఊపుకు అక్కడ ఇతర క్యాబిన్‌లు కూడా ఊగిపోవడంతో కొందరు కస్టమర్లు అక్కడి నుంచి వెళ్లి పోతే, మరికొందరు మాత్రం వారి శృంగార క్రీడను తిలకిస్తూ నిలిచిపోయారు. వారిలో కొందరు ఆ దృశ్యాలను తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. ఇప్పుడా వీడియో దృశ్యాలు అక్కడ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి.


Friday, July 17, 2015

షుగర్ పేషంట్లు కాఫీ తాగేయవచ్చు?

కాఫీ తాగాలని ఉంది. కానీ షుగర్ పేషంటు.. తాగుదామంటే ఎక్కడ షుగర్ ఎక్కువ అవుతుందోననే భయం.. అలాగే స్థూలకాయం వచ్చేస్తుందేమోనని ఆందోళన. ఇక ఒబెసిటీ ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన పని లేదు. కాఫీ తాగేవచ్చు... పరిశోధకులు ఈ మాట చెబుతున్నారు.. అదెలా..?
 
మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక రుగ్మతలపై ఎలాంటి ప్రభావం చూపదని యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హాగన్‌ పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులుండి, కాఫీ తాగే అలవాటున్న 93వేల మంది డీఎన్‌ఏపై అధ్యయనాన్ని చేశారు. ప్రధానంగా కాఫీ తాగాలనే కోరిక కలిగించే జన్యువులను నిశితంగా పరీక్షించారు. 
 
మిగతావారి కంటే కాఫీ ఎక్కువగా తాగే వారిలో ఆ కోరికను కలిగించే జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ జన్యువులు మధుమేహం, స్థూలకాయాన్ని కలిగించవని తేలింది.
 


Thursday, July 16, 2015

ఆ బిచ్చగాడి సంపాదన ఎంతో తెలిస్తే "మైండ్ బ్లాకవ్వలసిందే"

అతను బిచ్చగాడే... రోజూ మసీదుల వద్ద కింద కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. కాని, అతని వద్ద ఉన్నసొమ్మెంతో తెలుసా... అక్షరాలా రూ. 10 కోట్లు. ఈ విషయం  తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎక్కడ..? అతను ఎలా సంపాదించాడు..? 

ఒక విదేశీయుడు కువైట్‌లో అడుక్కుంటూ పది కోట్లు సంపాదించాడు. అతడు ఒక మసీదు దగ్గర బిచ్చమెత్తుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో రూ.10కోట్లు దాచుకున్నట్లు బిచ్చగాడు చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. 
 
కువైట్‌, బహ్రెయిన్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ, దుబాయ్‌ వంటి గల్ఫ్‌ దేశాలలో బిచ్చమెత్తడం నేరం. కొందరు విదేశీయులు దీన్నో లాభసాటి వ్యాపారంలా భావిస్తున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. 


Wednesday, July 15, 2015

టీవీ షోలో నగ్నంగా యాంకర్ ?

టీవీ యాంకర్లకు ఉండే ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. వారు కనుక టెలివిజన్ షోల్లో కనబడితే ఎగబడే కుర్రకారు సంఖ్య తక్కేవేమీ ఉండదు. మన దేశంలో సంగతేమోగానీ విదేశాల్లో యాంకర్లకు నటీనటులకుండే క్రేజ్ ఉంటుంది. వారి యాంకరింగ్ యమా కవ్వింపుగా ఉంటుంది. అలా కవ్వింపుల్లో ముందు వరుసలో ఉండే ఓ యాంకర్, మోడల్ కూడా అయిన యువి పల్లరీస్ పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ... అకస్మాత్తుగా బట్టలను విప్పేసింది. 

  లైవ్ షో కావడంతో అది అలా సాగుతూనే ఉంది. ఐతే ఆ షో ఆగకుండా కొద్దిసేపు అలాగే ప్రసారమైపోయింది. దీంతో సదరు సెక్సీ యాంకర్ నగ్నంగా తెరపైకి కనబడేసరికి అక్కడి కుర్రకారు ఆమె తాలూకు వీడియోల కోసం ఎగబడుతున్నారట. అన్నట్లు ఆమధ్య ప్రపంచకప్ గెలిస్తే... టీమ్ ఇండియా ముందు బట్టలు విప్పేసి నగ్నగంగా నిలబడతాననే పూనం పాండే ప్రకటించింది. కానీ ఆ సాహసం తమ ముందు చేయవద్దని పలువురు పేర్కొన్నారు. వారు చెప్పిన మాటకు కట్టుబడి ఉందో ఏమోగానీ దుస్తులను విప్పుతానన్న మాటను పక్కనపెట్టేసింది పూనం పాండే.

Monday, July 13, 2015

"చిన్న నాటి సరదాలు"

నాటి తరం వారి చిన్న నాటి చిలిపి పనులు,ఆటలు నేటి తరం పిల్లలకి తెలియవు. దానికి కారణం వారు లేచిన మొదలు పడుకునే వరకు చదువులు ఒత్తిడి తోనే సరిపోతుంది.
అప్పటి  సరదాలు ఈ క్రింది చూడండి.      

 

Thursday, July 9, 2015

"సాంబార్ రైస్ ఇష్టపడే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటున్న హీరోయిన్" ?

తల్లి సారిక సోయగాన్నీ, తండ్రి కమల్ హాసన్ నటనని వారసత్వంగాపుచ్చుకుని వెండితెరకు వచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్. ఆ ఇద్దరూ తనకు ఆదర్శమే అయినప్పటికీ.. తన రూటే సపరేటు అంటోంది. తనకు సాంబార్ రైస్ అంటే అమితయిష్టమని, దాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటానని లేదంటే పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పింది.
తన పెళ్లి అంశం ప్రస్తావనకు వచ్చినపుడు శృతిహాసన్ తన మనస్సులోని మాటను వెల్లడించింది. నా ప్రపంచం చాలా చిన్నది. నాకు ఉన్న స్నేహితులు తక్కువ. స్నేహితులని ఎందుకన్నానంటే... కొంతమందితోనే మనసు విప్పి మాట్లాడగలను. అలాగే నా అభిరుచులు, ఇష్టాయిష్టాలు కూడా. ఉదాహరణకు నాకు సాంబార్‌ రైస్‌ అంటే చాలా ఇష్టం. ఆ వచ్చే వ్యక్తికి కూడా అలాంటి ఇష్టాలే ఉండాలి. అప్పుడే మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయగలం. లేకపోతే విడిపోవడమే అవుతుంది. ఈ గొడవలన్నీ ఎందుకని... పెళ్ళి మానేస్తే పోలా అనిపిస్తోందన్నారు. 
 
అయితే, నేను పెళ్లి చేసుకోను అనేదానికి, నా తల్లిదండ్రులు విడిపోయి ఉండటానికి ఎలాంటి లింకు లేదన్నారు. నాకు తగ్గవాడు కనిపిస్తే తప్పకుండా చేసుకుంటా. లేకపోతే లేదు అని చెబుతున్నా అంతే! ఒకవేళ చేసుకుంటే మాత్రం ఈ రంగానికి చెందిన వ్యక్తినే చేసుకుంటాను. ఎందుకంటే ఒకరి ప్రొఫెషన్‌ గురించి మరొకరికి మంచి అవగాహన ఉంటుంది. లైఫ్‌ బాగుంటుంది... ఇద్దరం ఎంజాయ్ చేయగలుగుతాం అని ఈ గంధర్వ కన్య నవ్వుతూ చెప్పింది. Wednesday, July 8, 2015

తప్పు రాశారో? ఆ పెన్ను మీపై కయ్ మంటుంది! జాగ్రత్త!!

అంతకంతకూ మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేస్తున్న అద్భుతాలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు ఓ జర్మనీ సంస్థ కొత్తగా ఒక పెన్‌ను తయారు చేసింది. ఇది మామూలు పెన్ను కాదు స్మార్ట్‌పెన్. ఈ స్మార్ట్ పెన్‌తో రాస్తున్నప్పుడు మీరు తెలియకో, పరధ్యానంగానో తప్పులు రాశారనుకోండి.

ఆ తప్పులు అక్షరం లేదా గ్రామర్ తప్పులు కావచ్చు. ఏదైనా సరే తప్పు చేస్తే చాలు ఈ పెన్నుగారికి కోపం వచ్చేస్తుంది. వెంటనే కయ్ మంటూ కంపించిపోతుంది. తప్పు రాస్తున్నారంటూ చేతిని కదిలిస్తుంది. రాస్తున్నుప్పుడు పెన్ను ప్రకంపనలు సృష్టించిందంటే చాలు మనం ఏదో తప్పు రాస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.

తప్పు రాస్తున్నప్పుడు వైబ్రేషన్ ఇచ్చేందుకు వీలుగా ఇందులో సెన్సర్‌లను అమర్చినట్లు ఆ సంస్థ చెప్పింది. ఈ పెన్నుతో రాస్తే చేతి రాత కూడా మెరుగుపడుతుందని, అలాగే తప్పులు కూడా రావని ఆ సంస్థ చెప్పింది.


భోజనం తర్వాత "స్వీట్ బీడా" వేసుకోవచ్చా?

స్వీట్ సోంపు, సోంపు, మిఠాయి, బీడాతో కలగలిపిన బీడాను తీసుకోవడం అంటేనే చాలామంది భయపడతారు. భోజనానికి తర్వాత బీడా తీసుకోవడం మంచిదా? కాదా ? అనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. అలాంటి డౌట్ మీకూ ఉంటే ఈ స్టోరీ చదవండి. సాధారణంగా తీసుకునే ఆహారాన్ని బట్టే బీడా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శాకాహారం లేదా మాంసాహారం మోతాదుకు మించితే బీడా వేసుకోవచ్చు. 
 
ఆహారం తీసుకున్నాక కడుపులో ఏర్పడే ఆమ్లాలను నిరోధించాలంటే.. అరటిపండు, పాలు, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ తీసుకోవడం మంచిది. పండ్లను కూడా తీసుకోవచ్చు. విందు భోజనాలు హాజరైతే మాత్రం తప్పకుండా బీడా తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే మాంసాహారం తీసుకుంటే తమలపాకును నమిలితే సరిపోతుంది. దాంతో పాటు వక్క, సున్నం ఉపయోగిస్తే పేగు క్యాన్సర్ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్ వెజ్ ఫుల్‌గా లాగించేశాక స్వీట్ బీడా తీసుకోవడం ఉత్తమం. వీటిలో సోంపు, జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 
 
అయితే ఆహారం తీసుకున్నాక కాఫీ, టీలు తీసుకోవడం మంచిదికాదు. జల్జీరా, సోడా, లెమన్ జ్యూస్ కూడా జీర్ణానికి ఉపకరిస్తాయి. ఏది ఏమైనా ఆహారాన్నిమాత్రం మితంగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Tuesday, July 7, 2015

"పుట్టిన నెల"ను బట్టి కూడా పిల్లల్లో "వ్యాధులు"

వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు పుట్టుకతో సంక్రమిస్తాయని అందరికీ తెలిసిందే. అయితే పుట్టిన నెలను బట్టి కూడా వ్యాధులు వస్తాయని కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు 28 ఏళ్ల పాటు, కొన్ని లక్షల మందిపై చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియవచ్చాయి. ఈ క్రమంలో జూలై, అక్టోబర్ నెలల్లో పుట్టిన వారికైతే ఆస్తమా వచ్చే అవకాశం ఉందని, మార్చిలో పుట్టిన వారికి గుండె సంబంధిత రోగాలు ఏర్పడుతాయని పరిశోధకులు తేల్చారు. 
 
పుట్టిన నెల ఆధారంగా సుమారు 1700కు పైగా అనారోగ్య సమస్యలు పసి పిల్లలను చుట్టుముట్టే ప్రమాదం ఉందని, వాటిల్లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. అయితే పిల్లల ఆరోగ్య సమస్యల నిర్థారణ సమయంలో ఈ పరిశోధనల్లోని విషయాలు వైద్యులకు ఉపయోగపడతాయని భావిస్తున్నామని.. కానీ పుట్టిన నెలను బట్టి ఇవే వ్యాధులు వస్తాయని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని పరిశోధకులు అంటున్నారు. 
 
ఇంకా న్యూయార్క్ మెడికల్ డేటాబేస్ పరంగా 1.7 మిలియన్ రోగులు పుట్టిన నెల ప్రకారం ఏర్పడిన 55 వ్యాధులతో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. అలాగే మే నెలలో పుట్టిన పిల్లల్లో రోగాలు చాలా తక్కువని, కానీ అక్టోబర్, నవంబర్‌లో పుట్టిన పిల్లల్లో వ్యాధుల సంఖ్య అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. 


Monday, July 6, 2015

"మొసలిని పెళ్లి చేసుకున్నమేయర్"

 
మెక్సికోలోని శాన్ పెడ్రో హుమాలుల నగర్ మేయర్ జోయెల్ మేజన్ వివాహాన్ని ఆయన భార్య దగ్గరుండి మరీ ఘనంగా నిర్వహించింది. హుమాలుల నగరంలో ఓ మూఢనమ్మకం బలంగా ఉంది. ఆ ఊరిపెద్ద మొసలిని వివాహం చేసుకుంటే మత్స్య సంపద పెరుగుతుందని, ఆ నగరం సకల సంపదతో అలరారుతుందని విశ్వాసం.
 
ఈ నగరానికి మేయర్‌గా ఎవరు ఎన్నికైనా మొసలిని వివాహమాడడం సంప్రదాయం. అలా వివాహమాడిన మొసళ్లను నగరంలోని ఓ కొలనులో ఉంచి పెంచుతారు. ఈ విశ్వాసమే మేయర్‌కు మొసలితో పెళ్లి జరిగేలా.. అదీ తన భార్య పక్కనుండి జరిపేలా చేసింది. 
 
మొత్తానికి శాన్ పెడ్రో నగర మేయర్ ఓ మొసలిని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు మొసలికి మరియా ఇసబెల్ అని పేరు పెట్టారు. అనంతరం మొసలి వేలికి ఉంగరం తొడిగి జోయెల్ మేజన్ వివాహ తంతు పూర్తిచేశారు.

Saturday, July 4, 2015

సెల్ఫీ కాఫీ తాగొచ్చు. ఎలాగంటే..?

 
సెల్‌ఫోన్‌లో తీసే సెల్ఫీ ఫోటోలను అచ్చం కాఫీలపై చిత్రీకరించే ఉపకరణాన్ని లండన్లో కనిపెట్టారు. ఈ సెల్ఫీ ఫోటోలతో కూడిన కాఫీని ఇక టేస్ట్ చేయొచ్చు. సెల్ఫీలకు మోజు అంతా ఇంతా కాదనే విషయం అందరికీ తెలిసిందే. సెల్ఫీ ఫోటోల్ని కాఫీల్లో చిత్రీకరించే కొత్త టెక్నాలజీని లండన్లో కనిపెట్టారు. 3 డీ ప్రింటర్ టెక్నాలజీతో కాఫీ మిషన్‌ను తయారు చేసి సెల్ఫీలను కాఫీలపై చిత్రీకరించే విధంగా రూపొందించడం జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.  
                                   
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
సెల్ఫీ లేదా ఫోటో లేదా న్యూస్ వంటివి దీనికోసం రూపొందించబడిన యాప్ ద్వారా కాఫీ షాపు వారికి పంపించాలి. కాఫీ షాపుకు యాప్ ద్వారా పంపిన ఫోటోలు 10 సెకన్లలో మనం పంపిన ఫోటో లేదా సెల్ఫీలతో చిత్రీకరించబడిన కాఫీ టేబుల్‌పై వుంటుందని లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ కాఫీకి యువతరంలో క్రేజ్ పెరిగిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Friday, July 3, 2015

భారత్‌లో "అత్యధిక వేతనం" తీసుకుంటున్నది ఎవరో తెలుసా ?

భారత్‌లో అత్యధిక వేతనం తీసుకుంటున్నది ఎవరు? అంటూ ఠక్కున చెప్పే సమాధానం కార్పోరేట్ సంస్ధల సీఈఓలు. వీళ్లు కాకపోతే, టీమిండియా జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్ అని పేరు వినిపిస్తుంది. కానీ వాస్తవానికి వీరితో పోలిస్తే మన దేశంలో అత్యధిక వేతనాలు తీసుకునే వారు వేరే ఉన్నారంట. వారెవరో తెలుసా? ఐఐటీలో సీటు సాధించాలని కలలుగనే విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చే వారు. నైపుణ్యం ఉండి పాఠ్యాంశాలను క్లుప్తంగా విద్యార్దులకు వివరించగలిగే ఐఐటీ కోచింగ్ స్టాఫ్‌కు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు వేతనాలు ఇస్తున్నారంట. అది కూడా కేవలం మూడు నుంచి నాలుగు నెలల కాలానికి మాత్రమే. రాజస్ధాన్‌లోని కోట ప్రాంతంలో ఐఐటీ సీటు కోరే విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్న వారిలో 15 నుంచి 20 మందికి కోటి రూపాయలకు పైగా వేతనాలు అందుతున్నాయని బన్సల్ క్లాసెస్ మేనేజర్ హరి కిషన్ వెల్లడించారు.
ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, కాన్పూర్, పాట్నాలలో పరిశీలిస్తే వీరి సంఖ్య వందల్లో ఉంటుందని తెలిపారు. సాధారణంగా ఐఐటీ విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చే శిక్షకులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కువ వేతనం ఆఫర్ చేస్తే వారు అక్కడికి వెళ్లిపోతారని హరి కిషన్ తెలిపారు. మనదేశంలో ఐఐటీ శిక్షణ ఇచ్చేవారు రెండు వేల మందికి పైగా ఉంటే అందులో 600 మంది వరకూ ఐఐటీ డిగ్రీలను పూర్తి చేసిన వారే ఉండటం గమనార్హం. వీరిలో 400 మందికి రూ. 60 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకూ వేతనాలు అందుతున్నాయని అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ కన్సల్టెంట్ అశిష్ అరోరా వివరించారు. మరో 50 మంది అంతకు మించే వేతాలను అందుకుంటున్నారు. గడచిన పదేళ్లలో ఐఐటీ విద్యార్ధులకు శిక్షణ ఇస్తోన్న శిక్షకుల వేతనాలు 7 శాతం పెరిగినట్లు కెరీర్ పాయింట్ వ్యవస్ధాపక సీఈఓ ప్రమోద్ మహేశ్వరి తెలిపారు. ఆయా ఇనిస్టిట్యూట్‌లు సంవత్సరానికి మూడు సార్లు టీచర్ల నియామకాలు చేపడతాయని వివరించారు. దేశ వ్యాప్తంగా ఐఐటీ కోచింగ్‌కు రాజస్ధాన్‌లోని కోట పెట్టింది పేరని అన్నారు. మంచి టీచర్ల కొరత ఉందని చెప్పిన ఆమె, కెరీర్ పాయింట్ గతేడాది రూ. 5.82 కోట్లు నికర ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ఈ ఏడాది ఐఐటీ జయింట్ ఎంట్రెన్స్ పరీక్షలకు 1.3 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరంతా కోచింగ్ నిమిత్తం ఇనిస్టిట్యూట్‌లకు వెళితే, ఫీజు రూపంలో కనీసం రూ. లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అదే పేరున్న ఇనిస్టిట్యూట్ అయితే దాదాపు రూ. మూడు లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. 
Thursday, July 2, 2015

డయాబెటిస్‌ను దూరం చేసుకోవాలంటే ? కోడిగుడ్డు తినాల్సిందే !

సాధారణంగా రక్తపోటు, టైప్2 డయాబెటిస్, గుండెపోటు వంటి రోగాలు వేధిస్తుంటాయి. అలాంటి వాటిలో టైప్ 2 డయాబెటిస్‌ను దూరం చేసుకోవాలంటే.. కోడిగుడ్డు తినాల్సిందేనని పరిశోధనలో తేలింది. డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. వ్యాయామం, పౌష్టికాహారం వంటి సక్రమంగా లేకుంటే డయాబెటిస్‌ చిక్కులు తప్పవని పరిశోధనలో వెల్లడైంది.
 
అలాగే అధిక కొవ్వు చేరడం ద్వారా శరీరంలోని గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. తద్వారా గుండెపోటు ఏర్పడుతుందని పరిశోధనలు తేల్చాయి. ఈ నేపథ్యంలో కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ తగ్గుతుందని కొత్త పరిశోధనలో తేలింది. కోడిగుడ్డులోని కొవ్వు శరీరంలోని గ్లూకోజ్ స్థాయి క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చునని ఫిన్లాండ్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
ఈ పరిశోధన 432 మందిపై జరిగింది. ఇందులో వారానికి ఒక కోడిగుడ్డు తీసుకునే వారికంటే వారానికి నాలుగు కోడిగుడ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా టైప్ 2 మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు.
 

Wednesday, July 1, 2015

శ్రీకృష్ణుడు ఎంతకాలం " జీవించాడో" తెలుసా ?

ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడిని చూసేందుకు బ్రహ్మాది దేవతలు వస్తారు. ఓ దేవదేవా మీరు భూలోకంలోకి వచ్చి 125 సంవత్సరాలు అయ్యింది. ఈ అవతారం చాలించి, ద్వాపర యుగాంతంలో వైకుంఠానికి విచ్చేయాల్సిందిగా కోరుతారు. హరి సరేనని వారిని సాగనంపుతారు.

ఆపైన కాలం సమీపించిందని గ్రహించిన శ్రీకృష్ణుడు యాదవులను ద్వారక నుంచి ప్రభాస తీర్థానికి పంపుతాడు. సరిగ్గా ఏడవ రోజున సముద్రుడు ద్వారకను ముంచివేస్తాడు. యదుక్షయం జరుగుతుంది. కలియుగం ఆరంభం అవుతుంది. అని శ్రీకృష్ణుడు ఉద్దవునితో అంటాడు. ఈ క్రమంలో యాదవులు మదిరాపాన మత్తులై ఒకరినొకరు సముద్రపు ఒడ్డున పెరిగి ఉన్న తుంగలో కొట్టుకుని మరణిస్తారు. అటు పిమ్మట బలరామకృష్ణులు వేర్వేరు తోవలలో మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తారు. 
 
శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్లి ఒక నికుంజ పొద చాటున విశ్రమిస్తాడు. ఒక వేటగాడు పొదచాటున ఉన్న ఆ దేవదేవుని చరణ కమలాలను లేడి చెవులుగా భ్రమించి బాణం వేస్తాడు. ఆపైన తను చేసిన తప్పు తెలుసుకుని బోయవాడు నిలువెల్లా వణికిపోతూ శ్రీకృష్ణుని వద్దకు వస్తాడు. అయితే శ్రీకృష్ణుడు అతడిని సముదాయించి, ప్రాణములు వదిలి వైకుంఠ పద ప్రాప్తుడయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ 125 సంవత్సరాల 7 మాసాలు జీవించాడు. క్రీస్తు పూర్వము 3102 నిర్యాణ సంవత్సరము కాగా ఆ రోజే కలియుగము ప్రారంభం కావడం గమనార్హం.