CSS Drop Down Menu

Tuesday, June 9, 2015

అమెరికాలోనే అత్యధిక అపర కుబేరులున్నఆ గ్రామం ప్రత్యేకత ఏమిటో తెలుసా ?

అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక చిన్న ద్వీపం ఉంది. బిస్కేన్ బే పక్కనున్న ఆ దీవి పేరు ఇండియన్ క్రీక్ విలేజ్. విలేజ్ అంటే ఇదేదో చెట్లు, పుట్టలు తప్ప మరే సదుపాయాలు లేని  చిన్న కుగ్రామం అనుకునేరు. అక్కడున్న వారంతా అపర కుబేరులే. కేవలం 35 ఇళ్లు మాత్రమే ఉన్న ఆ గ్రామంలో జనాభా 86 మంది మాత్రమే. బిలియనీర్ బంకర్‌గా ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన ఆ గ్రామంలో నివసించే వారంతా కోటాను కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఆసాములే.
 
అక్కడ ఓ ఇల్లు కొనాలంటే మధ్యస్థంగా రెండున్నర కోట్ల డాలర్లు చెల్లించాల్సిందే. మొత్తం 86 మంది జనాభా కోసం ఆ గ్రామంలో అతి విశాలమైన గోల్ఫ్ కోర్టు కూడా ఉంది. ఆ గ్రామంలోకి ఇతరులను ఎవరిని అనుమతించరు. కట్టుదిట్టమైన ప్రైవేటు పోలీసు వ్యవస్థ 24 గంటలపాటు ఆ గ్రామానికి కాపలా ఉంటోంది. నేలపైనే కాకుండా నీటిపైన బోట్లలో, ఆకాశంలో జెట్ విమానాలతో 24 గంటలపాటు నిఘా కొనసాగిస్తారు. 
 
ఆ ద్వీపంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు నివసిస్తున్నారు. ముఖ్యంగా చమురు, హోటల్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు, సూపర్ మోడళ్లు, క్రీడారంగానికి చెందిన కోచ్‌లు నివసిస్తున్నారు. అమెరికాలోనే అత్యధిక అపర కుబేరులున్న గ్రామంగా ఇండియన్ క్రీక్ విలేజ్ రికార్డుల్లోకి ఎక్కింది.
 

0 comments:

Post a Comment