CSS Drop Down Menu

Thursday, June 4, 2015

"ఆ కారు కొనేంత ధనవంతుడిని కాదన్న రతన్ టాటా" ! ఆ కారెంటో తెలుసా ?

జెనీవా ఆటో షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇటాలియన్ తొలి హైబ్రిడ్ కారు లాఫెరారి టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాను బాగా ఆకట్టుకోవడంతో తనివితీరా ఆస్వాదించారు. అంతేకాకుండా ఈ ఆటో షోలో ఈ కారుని చూసి ఆయన తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఫెరారీ రూపొందించిన తొలి హైబ్రిడ్‌ కారు టెర్రిఫిక్‌గా ఉందన్నారు. మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న ఈ కారుని మీరు కొనుగోలు చేస్తారా అని రతన్ టాటాను అక్కడున్న వారు ప్రశ్నించగా.. ఈ కారును కొనేంత ధనవంతుడిని కానని.... 10 లక్షల యూరోలు (అంత డబ్బు) తన దగ్గర లేదని ఆయన నవ్వూతూ సమాధానం ఇచ్చారు. నాజూకైన కార్బన్-ఫైబర్ బాడీతో తయారైన ఈ లాఫెరారి కారు గంటకు 350 కిలోమీటర్లు మించిన వేగంతో ప్రయాణిస్తుంది. ఫెరారీ కార్లలో అత్యంత వేగంగా పరిగెత్తే ఇదే. ప్రస్తుతం జరుగుతున్న జెనీవా ఆటో షోలో అందర్నీ ఆకట్టుకున్న కార్లలో ఇది ఒకటి. శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ మోటార్లతో రూపొందిన హైపర్-హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఇది. సాధారణంగా ఫెరారి కంపెనీ సూపర్ కార్లను తయారు చేస్తుంది. దీనికి భిన్నంగా ఈ సారి ఈ హైబ్రిడ్ కారును అందిస్తోంది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడం, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా కార్లను తయారు చేయడం వంటి కారణాల వల్ల ఈ హైబ్రిడ్ కారును అందిస్తున్నామని ఫెరారి చైర్మన్ లూకా డి మోంటోజెమొలో చెప్పారు. ఫెరారీ కంపెనీ ఛైర్మన్‌ లూకా డి మోంటోజెమొలో రతన్‌టాటాకు మంచి మిత్రుడు. ఫెరారీ కంపెనీ ఈ కొత్త బ్రాండ్‌ స్పోర్ట్స్‌ కార్లు కేవలం 499 మాత్రమే తయారు చేయనుంది. ఈ కార్లు తయారు చేయకముందే బుకింగ్‌ అయి పోయాయి.

0 comments:

Post a Comment