CSS Drop Down Menu

Friday, May 8, 2015

" ఒక్క రూపాయే" కదా ! అని వదిలేస్తే ?

ఒక్క రూపాయే కదా.. చిల్లర ఎందుకులే .. అని వదిలేస్తే.. వామ్మో.. ఇంకేమైనా ఉందా! లెక్కలేస్తే.. సగటుమనిషి బొక్కబోర్లా పడడం ఖాయం... ఆ లెక్కన.. ఒక్కసారి లెక్కలేద్దాం..! ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొంటే. చిల్లర ఒక్క రూపాయి లేదంటే.. సర్లెమ్మని గమ్మున తిరిగొచ్చేస్తాం. ఎవరం రూపాయికోసం పాకులాడం. అయితే ఇలా ఓ మార్కెట్‌కు రోజూ 500 మంది వెళ్తారనుకుందాం. అలా అంతా.. ఒక్క రూపాయి వదిలేసుకుంటూ పోతే.. అది రోజుకు 500 రూపాయలవుతుంది.

సంవత్సరానికి 365 రోజులు. సంవత్సరానికి 50రోజులు సెలవుల క్రింద తీసివేద్దాం.  ఈ 500 X 315...ఎంతయింది..? రూ.1,57,500.. అయితే దేశంలో ఓ బ్రాండ్ సూపర్‌బజార్లు 1500 ఉన్నాయి. రూ.1,57,500 X 1500.. ఇది మొత్తం రూ. 23,62,50,000 అయింది. అంటే సంవత్సరానికి 23. 62 కోట్లన్నమాట. ఇంకా ఘోరమేమిటంటే ఇది పన్ను కిందికి రాదు. ఏ సరుకు మీదైనా ప్రైస్ ట్యాగ్ రూ. 49, రూ. 99, రూ. 999 అని ఉంటుంది. అంటే దీని మతలబు ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా ?

0 comments:

Post a Comment