CSS Drop Down Menu

Saturday, May 30, 2015

ఆఫీసులో సెల్ ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు?

సెల్ ఫోన్ అనేది ప్రస్తుతం కనీస అవసర వస్తువుగా మారిపోయింది. సెల్ ఫోన్‌ని నలుగురిలో వున్నప్పుడు ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆఫీసులో సెల్ ఫోన్‌ను ఉపయోగించేందుకు ఓ పద్ధతి ఉంది. ఆఫీసులో సిబ్బంది సెల్‌ఫోన్స్ వరుసగా మోగుతుంటే ఆఫీసులో అందరి పని పాడవుతుంది. కాబట్టి ఆఫీసులో ఉన్నప్పుడు సెల్ ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవడం మంచిది. 
 
ఆఫీసులో పనిచేసేటప్పుడు సెల్ ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చినా నెమ్మదిగా మాట్లాడాలే కాని బిగ్గరగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాలనుకోకూడదు. ఆఫీసులో నలుగురితో సమావేశంలో వున్నప్పుడు సెల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయాలి. సమావేశం మధ్యలో కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. ఆఫీసు టాయిలెట్స్‌లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడే పద్ధతి అస్సలు మంచిది కాదు. కొన్ని ముఖ్యమైన కాల్స్ వచ్చినా వారికి క్షమించండి.. మళ్ళీ చేస్తా.. అని చెప్పి పెట్టేయడం అలవాటు చేసుకోవాలి. 


0 comments:

Post a Comment