CSS Drop Down Menu

Tuesday, April 28, 2015

షుగరు వ్యాధిగ్రస్థులకు "దాల్చిన చెక్క"చేసే మేలు


వంటల్లో వాడే దాల్చిన చెక్క రుచిని పెంచడానికి మాత్రమే కాక ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. తద్వారా డయాబెటిస్ (టైప్ 2 డయాబెటిస్) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిది. దాల్చిన చెక్కను పొడిగా చేసి రోజుకు అర టీస్పూన్ తీసుకుంటే గుండెకు హాని చేసే (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 
 
అంతేకాకుండా ప్రాణాంతకమైన ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్) వంటి క్యాన్సర్ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్ధవంతంగా పనిచేస్తుందని అమెరికాలోని మేరీల్యాండ్‌లోని వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు. 
 
ప్రతి రోజూ ఉదయం పరగడుపున అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని, ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి బాగా రంగరించి పెట్టుకుని, వారం రోజుల పాటు తీసుకుంటే ఆర్థరైటిస్ పూర్తిగా నయమవుతుంది. ఇది ఆరోగ్యదాయని మాత్రమే కాదు. ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్‌గా కూడా దాల్చిన చెక్క మేలు చేస్తుంది.

0 comments:

Post a Comment