CSS Drop Down Menu

Saturday, April 4, 2015

"రోజూ 10 ఎండుద్రాక్షలు" తీసుకుంటే ?


ఎండుద్రాక్షలో అనేక పోషకాలు దాగివున్నాయి. ఎండు ద్రాక్షలో విటమిన్స్ చాలా ఉన్నాయి. సుక్రోస్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి12లతో పాటు అమినో ఆసిడ్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. పెరిగే పిల్లలకు ఎండుద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. పిల్లల్లో దేహపుష్టికి రోజూ రాత్రి నిద్రించేందుకు ముందు ఎండుద్రాక్షల్ని పాలలో వేసి మరిగించి ఇస్తే.. పిల్లలు పుష్టిగా పెరగడంతో పాటు జీర్ణసమస్యలను దూరం చేసుకోవచ్చు.  
 
ఇది పిల్లల్లోనే కాదు.. పెద్దల్లోనూ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. రక్తకణాల సంఖ్యను పెంచే ఎండుద్రాక్షల్ని రోజుకు రెండేసి తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండుద్రాక్షల్ని తీసుకోవడం ద్వారా పచ్చకామెర్లు నయమవుతుంది. ఎముకలు బలపడతాయి. గొంతు రాసుకుంటే, నోరు ఎండినట్లైతే పాలు మరిగించి అందులో కాస్త మిరియాల పొడి, ఎండు ద్రాక్షలు వేసి మరిగించి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఒళ్లు నొప్పులు తగ్గాలంటే శొంఠి, జీలకర్ర, ఎండుద్రాక్షల్ని చేర్చి నీటిలో మరిగించి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
గర్భిణీ మహిళలు పాలులో ఎండు ద్రాక్షల్ని చేర్చి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎండుద్రాక్షల్ని పాలల్లో గానీ, అలాగే నమిలి తింటే గుండె పనితీరు మెరుగవుతుంది. రోజూ 10 ఎండుద్రాక్షలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు అస్సలుండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

0 comments:

Post a Comment