CSS Drop Down Menu

Thursday, April 30, 2015

" గోదావరి పుష్కరాల"పై "కేసీఆర్" సెటైర్లు !

గోదావరి, కృష్ణా పుష్కరాలు అని చెబితే తెలంగాణ నుంచి మనం కూడా సన్నాసుల్లా వెళ్లి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దనో, గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి దగ్గరకో వెళ్లి గుండు కొట్టించుకుంటామని కేసీఆర్ సెటైర్లు విసిరారు. 
 
గోదావరి నది వందల కిలోమీటర్లు తెలంగాణలో పయనించి కేవలం 60 కిలో మీటర్ల లోపే ఆంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తుందనీ, అలాంటిది పుష్కరాలు వారు నిర్వహించడమేమిటో తనకు అర్థం కాదన్నారు. వందల కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహించే గోదావరి నది ఒడ్డున బాసర సరస్వతి దేవి ఆలయం, కాళేశ్వరంలో మహేశ్వరుని ఆలయం, మంధనిలో గౌతమేశ్వర స్వామి ఆలయంతోపాటు రాముడు, సరస్వతి దేవాలయాలున్నాయనీ, అక్కడ పుష్కర స్నానం చేసి గుండు కొట్టించుకోవాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా తెలంగాణ నాయీబ్రాహ్మణులకు పని దొరుకుతుందని చెప్పుకొచ్చారు.

Wednesday, April 29, 2015

వర్మ తన భార్యను ఎందుకు వదిలేశాడు?


 '365 డేస్‌' అనే సినిమాను వర్మ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల సందర్భంగా వర్మ మాట్లాడుతూ చాలామంది నా పెళ్లెందుకు పెటాకులయిందని అడుగుతున్నారు. దానికిచ్చే సమాధానం ఒక్కటే... నాకు మంచి భార్య దొరికింది. నా భార్యకు చెడ్డ మొగుడు దొరికాడని మాత్రం చెబుతున్నాను' అని చెప్పారు.

Tuesday, April 28, 2015

షుగరు వ్యాధిగ్రస్థులకు "దాల్చిన చెక్క"చేసే మేలు


వంటల్లో వాడే దాల్చిన చెక్క రుచిని పెంచడానికి మాత్రమే కాక ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. తద్వారా డయాబెటిస్ (టైప్ 2 డయాబెటిస్) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిది. దాల్చిన చెక్కను పొడిగా చేసి రోజుకు అర టీస్పూన్ తీసుకుంటే గుండెకు హాని చేసే (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 
 
అంతేకాకుండా ప్రాణాంతకమైన ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్) వంటి క్యాన్సర్ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్ధవంతంగా పనిచేస్తుందని అమెరికాలోని మేరీల్యాండ్‌లోని వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు. 
 
ప్రతి రోజూ ఉదయం పరగడుపున అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని, ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి బాగా రంగరించి పెట్టుకుని, వారం రోజుల పాటు తీసుకుంటే ఆర్థరైటిస్ పూర్తిగా నయమవుతుంది. ఇది ఆరోగ్యదాయని మాత్రమే కాదు. ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్‌గా కూడా దాల్చిన చెక్క మేలు చేస్తుంది.

Monday, April 27, 2015

"పెళ్లికి ముందే పడక సుఖం పొందానన్న" సినీ నటి సంచలన వ్యాఖ్యలు ?


సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వార్తల్లో కెక్కే క్రేజీ బ్యూటీ రాధిక ఆప్టే మరో సారి వార్తల్లోకెక్కింది. ఈ కాలం అమ్మాయిలు ఎవ్వరూ సతీసావిత్రిలా ఉండటం లేదని, తన స్నేహితులు అంతా పెళ్ళికి ముందే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పిన రాధిక ఆప్టే తాజాగా తన వ్యక్తిగత జీవిత విషయాలను కూడా బయటపెట్టింది. తానూ పెళ్లికి ముందు కొంతకాలం సహజీవనం చేశానని, అతనితో పడక సుఖం కూడా పొందానని కూడా తెలిపింది.
 
ఆ తర్వాత వివాహం చేసుకున్నట్లు మనసులోని మాటని వెల్లడించింది. ఆకలేస్తే అన్నం తిన్నట్లుగా శరీరానికి ఆ మాత్రం ఎంజాయ్మెంట్ అవసరం అని ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటోంది. స్నేహితుల గురించే కాదు తన రహస్యాలని వెల్లడించింది. కాగా గత 2012లో రాధిక ఆప్టే బ్రిటిష్ మ్యుజిషియాన్ బెనడిక్ట్ టైలర్‌ని వివాహం చేసుకుంది. అన్నట్టు బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే నటించిన లయన్ చిత్రం మే ఒకటో తేదిన విడుదల కానుంది.


Saturday, April 25, 2015

" పెరట్లో" దొరికే "దివ్యౌషధం"


"తులసి" ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం. మహాభారత కాలంలో ఘటోత్కచుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి. భారత దేశంలో చాలా మంది తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తారు. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మన పెరట్లో దొరికే దివ్యౌషధం. తులసి ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. సరే.. ఇదంతా తులసి మొక్కకు ఉన్న ప్రాధన్యత ఇక ఇందులో ఉన్న ఔషధ గుణాలేంటో... దీన్ని ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం...!
 
* కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
 
* ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
 
* తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
 
* జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
 
* కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).
 
* తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
 
* తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
 
* తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
 
* తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
 
* తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. 
 
* నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

Friday, April 24, 2015

"శంకర్ దర్శకత్వం"లో "హీరో గా రజనీ విలన్ గా కమల్" ?

శంకర్ దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా రానుందట. అందులో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో అయితే కమల్ హాసన్ విలన్‌గా నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా హల్‌చల్ చేస్తోంది.
 
కోలీవుడ్‌ బిగ్ హీరోలు సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హసన్. వీరిద్దరూ దాదాపు ఒకేసారి సినీ కెరీర్ ప్రారంభించారు. అంతేకాదు తెరపై కూడా ఒకే సారి స్టార్లుగా ఎదిగారు. మొదట్లో ఇద్దరు కలసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ, అనంతరం ఏర్పడిన వ్యక్తిగత ఇమేజ్‌లతో మళ్ళీ కలసి నటించలేదు. గత 36 ఏళ్ల క్రితం వచ్చిన 'నినైత్తాల్ ఇనిక్కుం' సినిమాలో చివరిగా వీరిద్దరూ కలసి నటించారు.
 
అయితే ఆ తర్వాత ఎన్నో సార్లు వీరిద్దరిని కలిపి సినిమా తీయాలను పలువురు దర్శక నిర్మాతలు విఫలయత్నం చేశారు. ఇన్నేళ్ల తర్వాత వారు కలిసి నటించే అవకాశం కనిపిస్తోందనే వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా ఇటీవల లింగ సినిమాతో పడరాని పాట్లు పడిన రజనీకాంత్, తనకు కమర్షియల్ సినిమా చేసిపెట్టమని దర్శకుడు శంకర్‌ని అడిగారట. 
 
వెంటనే ఆయనో కథ వినిపించాడట. అందులో హీరో పాత్రకి సరితూగే విలన్ పాత్ర ఉంది. ఆ విలన్ పాత్రని కమల్ తో చేయిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో కమల్‌ని సంప్రదించారట. ఆయన కూడా ఓకే అన్నాడని సమాచారం. మరి వీరి సన్నాహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

Thursday, April 23, 2015

ఖర్చు లేకుండా దంతాలు "ఆరోగ్యంగా తెల్లగా" మెరిసిపోవాలంటే ?


మనిషికి నవ్వు అందం. ఆ నవ్వుకి పళ్ళవరస అందం. పళ్ళవరస చక్కగా అమరినప్పటికీ, పళ్ళు పసుపు పచ్చ రంగులో ఉంటే నలుగురిలో నవ్వుకోడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి. కనుక మీ దంతాలు ఆరోగ్యంగా తెల్లగా మెరిసిపోవాలంటే తులసి టూత్ పౌడర్‌ను ట్రై చేసి చూడండి.
 
తులసి టూత్ పౌడర్ తయారీ :
తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత, ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్‌చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా, మీ రెగ్యులర్ పేస్ట్‌కు తులసి పౌడర్‌ను జతచేసి, బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా, ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

Wednesday, April 22, 2015

సన్నీ లియోన్ "పెదవులను జుర్రుకున్న" దర్శకుడు ?

చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్‌లదే ప్రధాన పాత్ర అయినప్పటికీ, కథను నడిపించేది మాత్రం దర్శకుడే. చిత్ర దర్శకుడు తాను చిత్రించే సన్నివేశాలు అనుకున్నట్టుగా రావాలంటూ షూటింగ్‌లో లీనమైపోతుంటారు. ఆ సమయంలో తనను తాను మరిచిపోతుంటాడు. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి జరిగింది. 
 
బిటౌన్ ఇండస్ట్రీలో ఓ షూటింగ్ లో హీరోయిన్, డైరెక్టర్ మధ్య జరిగిన రొమాంటిక్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనలో చిత్ర సన్నివేశాన్ని వివరిస్తూ చిత్ర దర్శకుడు హీరోయిన్‌ను గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు. ఎంత సేపటికీ జుర్రుకున్న హీరోయిన్ పెదవులను విడవకపోవడంతో సహ నటీనటులు వారిని అలెర్ట్ చేయడంతో మళ్లీ తిరిగి షూటింగ్‌ లోకానికి వచ్చారట. 
 
మరి ఆ హీరోయిన్ ఎవరు, ఆ దర్శకుడు ఎవరనే వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది కథనాన్ని చదవండి. బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ నటిస్తున్న తాజా సినిమా 'దిల్'. ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు పర్వేష్ దర్శకత్వం బాధ్యతలు వహిస్తున్నాడు. 
 
ప్రేమ కథాంశంతో కొనసాగే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా హైలెట్ అవుతాయట.  అయితే బాంబేలోని అంధేరీ ఓ గెస్ట్ హౌస్ లో షూటింగ్ జరుగుతుండగా హీరో, హీరోయిన్స్ కి సీన్స్ వివరిస్తూ హీరోయిన్‌తో డైరెక్టర్ రిహార్సల్ చేస్తున్నారు. అప్పుడు ఓ రొమాంటిక్ సన్నివేశంలో సన్నీతో దర్శకుడు రిహార్సల్ చేస్తూనే వారు నిజమైన రొమాన్స్ చేయడానికి ఇష్టపడ్డారు. 
 
షూటింగ్ యూనిట్ అంతా అక్కడే ఉన్నారన్న విషయం మరిచిపోయి ఓ నిమిషం ఒకరినొకరు కౌగిలించుకుని, ముద్దుల్లో మునిగిపోయారు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన చిత్ర యూనిట్ వారిద్దరి దగ్గరలో ఉన్న లైట్ మెన్స్ లైట్స్ ని ఆన్ చేయడంతో వారు రోమాన్స్ వదిలి, షూటింగ్ మూడ్ లోకి వచ్చారు. ఈ వార్త సినీ యూనిట్‌లో చర్చనీయాంశంగా మారింది.


Tuesday, April 21, 2015

మల్లెపూలు తలలో ధరించటానికే కాదండోయ్ ?


సువాసనలను గుబాళించే, స్వచ్చమైన ధవళ కాంతులకు మారుపేరైన మల్లెపూలు స్త్రీల సిగలో సహజ ఆభరణాలుగా మాత్రమే బ్రతుకు ముగించుకుంటాయని అనుకోవటం చాలా పొరపాటు. తలలో ధరించటానికి, దేవుని పటాలను అలంకరించటానికి, పెళ్లి వేదికలను ఆకర్షణీయంగా చేయటంలోనూ మల్లెలకు సరితూగేవి లేవు మరి.
 
రోజంతా శారీరక కష్టంతో అలసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపి, మధురాను భూతులను పంచే మల్లెల గుబాళింపుల నడుమ హాయిగా కునుకు పట్టేస్తుంది. ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల ఆహ్లాదంగా వుండడమే కాదు, కళ్లకూ మేలు చేస్తాయి. అలసిన కనురెప్పలపై మల్లెలను కొద్దిసేపు పరిచి వుంచితే చలవ చేస్తాయి. బాగా నిద్రపడుతుంది. పరిమళ భరిత మల్లెపూవుల్ని ఎన్నో సుగంధ సాధనాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
 
సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాలు, అగరు బత్తీల తయారీల్లో మల్లెపూలను ఉపయోగిస్తారు. సెంట్లు, ఫర్‌ఫ్యూమ్‌లలో అయితే మల్లెపూలను విరివిగా ఉపయోగిస్తారు. తలలో చుండ్రు సమస్య అధికంగా వుంటే మెంతులలో కాసిన్ని ఎండు మల్లెపూలు కలిపి నూరి తయారైన… పూతను తలకు పట్టిస్తే మంచిది. జుట్టుకూడా పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. 
 
కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నాననిచ్చి, మరిగే వరకూ కాచి వడగట్టి వాడితే తల సువాసన భరితం కావడమే కాకుండా కేశాలకు మంచి పోషణ అవుతుంది. మాడుకు మేలు చేస్తుంది. మల్లెల్ని సేఫ్‌ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి, కొద్దిగా పచ్చిపాలు కలిపి, నె మ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత ముల్తానా మట్టి, గంధం, తేనె అరస్పూన్‌ చొప్పున కలిపి ప్యాక్‌ వేసుకోవాలి. 
 
మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని పచ్చసొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా, కాంతివతంగా మెరిసిపోతుంది. చర్మానికి అవసరమయ్యే సి విటమిన్‌ మల్లెల్లో విరివిగా వుంటుంది. అందుకే మల్లె తూడులను అన్నంలో కలిపి తినటం కూడా గ్రామీణ జీవితంలో కనపడుతుంది. మల్లెల్లో ఈ మంచి గుణాలు అన్నీ వున్నాయి కనుకే తెల్లని తెలుపులో, సుగంధ పరిమళాలలోమరేపుప్వూ దీనికి సాటిరాదంటే అతిశయోక్తి కాదు. 


Monday, April 20, 2015

"నోరు జారిన అల్లు అర్జున్"


సమంత అందాన్నీ బెంజ్ సర్కిల్ అంటూ పొగిడి నోరు జారిన కమేడియన్ అలీ తరహాలోనే అల్లు అర్జున్ కూడా ఇలియానాపై కామెంట్ చేసి నోరు జారాడు. అలీ సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో సమంత అందాలను వర్ణిస్తే.. అల్లు అర్జున్ మాత్రం ఓ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఇలియానా గురించి కామెంట్ చేశాడు. ఇలియానాతో కలిసి జులాయి సినిమా చేసిన అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి ప్రమోషన్‌లో భాగంగా.. సినీ తారలపై కామెంట్ చేశాడు. 
 
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గోల్డ్, పవన్ కల్యాణ్ యాస్ స్టార్, చెర్రీ యాస్ హార్ట్, సమంత యాస్ స్వీట్, శృతిహాసన్ హాట్.. అలాగే ఇలియానా కూడా హాట్ అని  కామెంట్ చేసి నాలుక కరుచుకున్నాడు. అంతేగాకుండా.. ఇల్లీ బెల్లీ.. నడుము అందంపై కూడా బన్నీ ''పాట్'' అంటూ.. సెక్సీయెస్ట్ రిమార్క్ ఇచ్చేశాడట.

Saturday, April 18, 2015

"12 వేల మంది" తో "కామ క్రీడలు"


జపాన్‌కు చెందిన ఓ ప్రిన్సిపాల్  ఏకంగా 12 వేల మంది తో కామ క్రీడలు కొనసాగించాడు. తనతో సెక్స్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి శృంగారంలో పాల్గొన్నట్టు వెల్లడించాడు. దీంతో ఈ కామ ప్రిన్సిపాల్‌ను టోక్యో నగర పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.
 
ఫిలిప్పీన్స్‌లో ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఈ ప్రబుద్ధుడు 12 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్టు తేలింది. ఈ కామాంధుడి పేరు యుహీ తకషిమా. అతని వయస్సు 64 ఏళ్లు. గత 27 ఏళ్ల కాలంలో తాను మాయమాటలు చెప్పి లక్షా 50 వేల మంది మహిళలతో ఫొటోలు దిగాడు. అంతేగాకుండా తాను సేకరించిన మహిళల ఫొటోలతో 400 ఆల్బమ్స్ కూడా తయారు చేసి భద్రపర్చారు.  
 
వీటిని తన తీపి జ్ఞాపకాలకు గుర్తుగానే ఫొటోలను భద్రపరిచినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. 1988 నుంచి డబ్బులు చెల్లిస్తూ మహిళలతో శృంగారం జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 14 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులైన 12 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు వివరించాడు. తాజాగా 14 యేళ్ల అమ్మాయితో సెక్స్ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో అతన్ని జపాన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. 

Friday, April 17, 2015

"పాలు" తాగితే "డయాబెటిస్" దూరం ?

 
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే పాలు తాగడమే సరైన మార్గం. అయితే కొవ్వులు తక్కువగా ఉండే పాలను మాత్రమే తాగాలి. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్త్రీ పురుషుల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మీద జరిగిన పరిశోధనలో కొవ్వులు తక్కువగా వున్న పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులు తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ దూరమయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. 
 
స్త్రీలు తాగే ప్రతి గ్లాసు పాలకు డయాబెటిస్‌ని దూరం చేసే శక్తి 2శాతం పెరుగుతుంది. ఆహారంలో తీసుకునే కాల్షియం, విటమిన్ డిలకు అతీతంగా పాల ప్రభావం ఉంటుంది. ఇటువంటి పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ ఏర్పడదు. వీటితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం కూడా అవసరం. ఇవి పాటిస్తే డయాబెటిస్‌ను ఈజీగా దూరం చేసుకోవచ్చు.


Thursday, April 16, 2015

"వ్యర్ధాల" నుండి "జలచరాలు"Wednesday, April 15, 2015

ఇకపై "రైళ్లలో హాయిగా నిద్రపోవచ్చు" ?


ఇకపై రైళ్లలో హాయిగా నిద్రపోవచ్చు.. స్టేషన్ దాటిపోయే సమస్యే లేదు! ఎందుకంటే ఐఆర్ సీటీసీ, భారత్ బీపీవో సంస్థలు సంయుక్తంగా సరికొత్త సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నాయి. ఈ సరికొత్త సౌకర్యం ప్రకారం దిగాల్సిన స్టేషన్‌కు సరిగ్గా అరగంట ముందుగా అలారం కాల్ వస్తుంది. ఈ అలారం కాల్ రావడానికి ప్రయాణికులు 139 నెంబర్‌కు డయల్ చేసి అందులో 7 ఆప్షన్ ద్వారా పీఎన్ఆర్ నెంబర్, దిగాల్సిన స్టేషన్ పిన్ కోడ్, స్టేషన్ పేరు తదితర వివరాలు నమోదు చేయాలి. 
 
వాటిని నిక్షిప్తం చేసుకున్న ఐఆర్ సీటీసీ మీరు దిగాల్సిన స్టేషన్ మరో అరగంటలో చేరుకుంటుందనగా, మీకు అలెర్ట్ కాల్ చేస్తుందని, ఒకవేళ ట్రైన్ అరగంట ఆలస్యంగా ప్రయాణిస్తే, అలెర్ట్ కాల్ కూడా అరగంట ఆలస్యంగానే వస్తుందని రైల్వే అధికార ప్రతినిధి నీరజ్ శర్మ వెల్లడించారు. సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) ద్వారా కూడా అలెర్ట్ అందించే సౌలభ్యం ఉందని నీరజ్ చెప్పారు. దీంతో రైళ్లలో దిగే స్టేషన్‌పై టెన్షన్ పడకుండా నిద్రపోవచ్చు. 


Tuesday, April 14, 2015

దుస్తులను ఎంపిక చేసే 'రీమిక్స్' యాప్ !

ఆధునిక ప్రపంచంలో అన్నీ సులభతరమయ్యాయి. ఒక్క చోట ఉండే ఒకే వ్యక్తి ఆన్‌లైన్‌లో అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. అయితే డ్రెస్సింగ్ విషయంలో మాత్రం అలా ఉండదు. మనం సెలెక్ట్ చేసే దుస్తులు మనకు సెట్టవుతాయో లేదో అనే విషయం ఇతరులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.
 
అయితే ప్రస్తుతం ఆ అవసరం కూడా ఆధునిక టెక్నాలజీ తీర్చనుంది. అందుకోసం స్మార్ట్ ఫోన్ యాప్ సేవలందిస్తున్న పాలీవోర్ తాజాగా 'రీమిక్స్' పేరిట సరికొత్త యాప్ విడుదల చేసింది. దీన్ని వాడి యూజర్లు తమకు ఎటువంటి దుస్తులు సెట్టవుతాయి, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న వెరైటీ  డ్రెస్‌లు, తదితర వివరాలను తెలుసుకోవచ్చని పాలీవోర్ తెలిపింది. 
 
ఈ యాప్ లో ట్రెండింగ్, ఫైండ్, మై ఫేవ్స్ అంటూ మూడు సెక్షన్ లు మాత్రమే ఉంటాయని వివరించింది. అంతేకాకుండా ట్రెండింగ్ పేజిలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ చూసుకోవచ్చని, తద్వారా ప్రతి రోజు మార్కెట్‌లో  మారుతుండే డిజైన్ స్టైల్స్ కు అనుగుణంగా దుస్తులను ఎంచుకోవచ్చని తెలిపింది. 
 
ఫైండ్ సెక్షన్ లో నచ్చిన దుస్తులు సమీపంలో ఎక్కడ లభిస్తాయో కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది. నచ్చిన డిజైన్లను మై ఫేవ్స్ లో సేవ్ చేసుకోవచ్చని పాలీవోర్ వివరించింది.Monday, April 13, 2015

"అలీ" కి "సమంత వార్నింగ్"

హాస్య నటుడు అలీ అగ్లీ టాక్స్ ఎంతమాత్రం ఆగడం లేదు. ఆ మధ్య యాంకర్ సుమను స్టేజిపైనే ఇబ్బందిపెట్టిన అలీ, సన్నాఫ్ సత్యమూర్తి సక్సెస్ కార్యక్రమంలో తన అగ్లీ టాక్‌ను మరోసారి బయటపెట్టేశాడు. ఈ చిత్రంలో సమంత గ్లామర్‌ను అలీ తెగ పొగిడేశాడు. సమంత ఓ ఏరియా అందాన్ని బెంజ్ సర్కిల్ అంటూ వ్యాఖ్యానించాడు.
 
సమంత గ్లామర్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ముఖ్యంగా ఆమె బెంజ్ సర్కిల్... అంటూ తన నడుము భాగం నుంచి కింద పిరుదులకు మధ్యన ఉన్నది బెంజ్ సర్కిల్ లా కనబడతుందంటూ వ్యాఖ్యానించాడు. 
 
అలీ వ్యాఖ్యలపై అభిమానులు అసంతృప్తి వ్యక్తంచేయగా, సమంత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమంత ఫోన్ చేసి అలీపై మండిపడిందట. తన గురించి మరోసారి అలా మాట్లాడితే బాగుండదు అంటూ గట్టిగా చెప్పినట్లు టాలీవుడ్ టాక్. కాగా గతంలో పలు ఆడియో వేడుకల్లో కూడా అలీ ఇటుంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఉన్నాయి.

Saturday, April 11, 2015

ఏపీలో ఒక్క ఎమ్మెల్యే 15 కోట్లు పంచారట !


“ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికలలో గెలవడానికి రూ.15 కోట్లు ఖర్చుపెట్టారు.”
ఇది కొత్త విషయమా… అని అనిపిస్తుంది. కానీ, ఇది ఎన్నికల్ కమిషన్ వెల్లడించడం మాత్రం కచ్చితంగా కొత్త విషయమే. ఎమ్మెల్యేలు ఇచ్చే రశీదులు పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ వేసిన నిఘాలో తేలిన లెక్క అట ఇది. ఇంతకీ ఇపుడు ఎందుకు ఈ నిజాన్ని బయట పెట్టారంటే… ఎన్నికలలో సంస్కరణలపై తాజాగా ఒక సదస్సు జరిగింది. ఆ సందర్భంగా అంతర్గత రిపోర్టులను బయటపెట్టారు. మరి తెలిసి ఎందుకు ఊరుకున్నారంటే… నిఘా వేరు, దర్యాప్తు వేరు… పైగా దీన్ని ఒక్క రోజులోనో, ఒక ఏడాదిలోనో కంట్రోల్ చేయలేం. ప్రజలు మారాలి, అభ్యర్థులు మారాలి, అధికారులు మారాలి…అపుడే దీన్ని అరికట్టొచ్చు అని హెచ్ఎస్ బ్రహ్మ వ్యాఖ్యానించారు.
ఇంకో విషయం… ఈ పదిహేను కోట్లు సగటు లెక్క. ఒక్కోదాన్నీ లెక్కేస్తే ఆ కథే వేరుంటుంది.


Friday, April 10, 2015

"ఎవరి చూపు ఎటు వైపు" ?


ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ సైకాలజీ వారు..మీరు నిజంగా ఏం చూస్తారు అనేదానిపై పబ్లిక్ సర్వే నిర్వహించారు. ఓ సింపుల్ ఫోటో చూపించి మగాళ్ళకు, ఆడవారికి నేత్ర పరీక్షలు జరిపిస్తే ఫలితం ‘కెవ్వు కేకే’ అయింది.


 ఓ సెక్సీ లేడీ డోనట్స్‌‌‌తో కూడిన ట్రే పట్టుకున్న ఫోటో అది..ఓ నిముషం పాటు ఈ ఫోటో చూసిన వందశాతం పురుషులు మహిళ వక్ష సౌందర్యంపైనే దృష్టి నిలిపి ఫెయిలయితే..ఆడవారు కేకులు తదితరాలతో కూడిన డోనట్స్‌‌‌నే నిమిషంపాటు చూసి వాళ్ళూ ఫెయిలయ్యారు. ఇంతమాత్రం దానికి పబ్లిక్ సర్వే ఎందుకో..? మగాళ్ళ దృష్టికి, మహిళల దృష్టికి తేడా ఉండదూ..?

Thursday, April 9, 2015

"భర్తలూ పురిటి నొప్పులు" పడొచ్చు ?

నెలలు నిండిన భార్యకు బదులు భర్త నొప్పులు పడితే ఎలా ఉంటుంది..? మీకు తెలియదా..? తెలుసుకోవాలనుందా..? అయితే మా క్లినిక్‌కు రండి! మేం చూపిస్తామంటున్నారు ఈస్ట్రన్ చైనా డాక్టర్లు. పురుటి నొప్పులను అనుభవించాలనుకున్న భర్తలకు వారంలో రెండుసార్లు షాన్డాగ్ ప్రావిన్స్‌లోని ఐమా మెటర్నిటీ ఆసుపత్రి ఈ సౌకర్యం కల్పించింది. ఈ థ్రిల్ అనుభవించేందుకు వంద మందికి పైగా భర్తలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో అసలు కథ ఇక్కడ నుంచి మొదలవుతుంది.

రిజిస్ట్రేషన్ చేయించుకుని, పురిటి నొప్పులు పడాలకున్న భర్తలను రెడీ చేస్తారు. ముందుగా పొత్తి కడుపు దగ్గర ప్యాడ్స్ ఉంచుతారు. ఆ తరువాత  ఎలక్ర్టిక్ షాక్స్ ఇవ్వడం మొదలుపెడతారు. అయిదు నిమిషాలపాటు కొనసాగే ఈ ప్రక్రియలో షాక్ స్కేల్ ఒకటి నుంచి పది వరకు పెంచుకుంటూపోతారు. కొంతమంది లెవెల్ సెవెన్‌లోనే ఓర్చుకోలేక భాదపడుతూ షాక్స్ ఆపేయమని ప్రాధేయపడితే... మరి కొంతమంది అసలు వద్దురా బాబూ అంటూ తప్పించుకున్నారు. ఎంతైనా ఆర్టిఫిషియల్‌గా తెప్పించే నొప్పులు..నేచురల్ నొప్పుల మారిదిగా ఉండవట! కానీ, ఒక్కసారి ఈ నొప్పులు అనుభవించిన భర్తలకు భార్యల‌పై ప్రేమ, జాగ్రత్తలు పెరగడం ఖాయమంటున్నారు డాక్టర్లు.

Wednesday, April 8, 2015

అమేజింగ్ కాలిక్యులేటర్ ట్రిక్ !

కాలిక్యులేటర్ లో ఏమైనా మూడు బటన్లు నొక్కి 100 రప్పించగలరా?
ప్రయత్నించి చూడండి.
గమనిక:- నొక్కిన బటన్ మరలా నొక్క రాదు.
మీకు గనుక రాక పోయినట్లయితే ఈ క్రింది లింక్ ను నొక్కండి. 

Tuesday, April 7, 2015

"గ్రీన్ టీ" లో " షుగర్" వేసుకొంటున్నారా ?

గ్రీన్ టీకి ప్రస్తుతం యమా క్రేజ్. టెక్నాలజీ పేరిట గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటూ.. ఒబిసిటీకి దగ్గరవుతున్న అనేక మంది గ్రీన్ టీని తీసుకుంటున్నారు. గ్రీన్ ప్రస్తుతం అనేక ఫ్లేవర్స్‌లో వస్తున్నాయి. అయితే గ్రీన్ టీని పంచదార కలిపి తీసేసుకోవడంలో ప్రయోజనం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
గ్రీన్ టీని షుగర్ వేసి తీసుకోకూడదు. గ్రీన్ టీ ప్రకాశవంతంగా ఉత్సహాకరంగా మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి, పంచదార్ గ్రీన్ టీకి ఫర్ ఫెక్ట్ ఐడియల్ కాంబినేషన్ కాదు. గ్రీన్ టీకి ఒక మంచి కాంబినేషన్ కొద్దిగా నిమ్మరసం లేదా కొద్దిగా తేనె వేసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఈ కాంబినేషన్‌లో గ్రీన్ టీని తీసుకుంటే ఖచ్చితంగా ఒత్తిడి దూరమవుతుంది. గ్రీన్ టీతో పాటు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఫ్యాట్‌ను కరిగిస్తుంది. క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. డెంటల్ హెల్త్‌ను మెరుగుపరచడంతో పాటు.. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

Monday, April 6, 2015

చిరంజీవి "ఆ సీన్" ? సరిగా చేయలేకపోయారంటున్న నగ్మా


బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో భాగంగా నగ్మా స్పెషల్‌గా హాజరైంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈమె, చిత్రీకరణ సమయంలో నటీనటులు పడిన కొన్ని విషయాల గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. 
 మెగాస్టార్ చిరంజీవి గురించి నిన్నటితరం హీరోయిన్ నగ్మా ఓ విషయం రివీల్ చేసింది. ‘ఘరానా మొగుడు’ సినిమా చిత్రీకరణలో భాగంగా లిప్‌లాక్ సీన్లు చేయడంలో చిరంజీవి చాలా ఇబ్బందిపడ్డారని, సరిగా చేయలేకపోయారని వెల్లడించింది. ఆ సీన్ సరిగా రాకపోవడంతో ఎడిటింగ్‌లో తొలగించారంటూ మనసులోని మాట బయటపెట్టింది. 

Saturday, April 4, 2015

"రోజూ 10 ఎండుద్రాక్షలు" తీసుకుంటే ?


ఎండుద్రాక్షలో అనేక పోషకాలు దాగివున్నాయి. ఎండు ద్రాక్షలో విటమిన్స్ చాలా ఉన్నాయి. సుక్రోస్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి12లతో పాటు అమినో ఆసిడ్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. పెరిగే పిల్లలకు ఎండుద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. పిల్లల్లో దేహపుష్టికి రోజూ రాత్రి నిద్రించేందుకు ముందు ఎండుద్రాక్షల్ని పాలలో వేసి మరిగించి ఇస్తే.. పిల్లలు పుష్టిగా పెరగడంతో పాటు జీర్ణసమస్యలను దూరం చేసుకోవచ్చు.  
 
ఇది పిల్లల్లోనే కాదు.. పెద్దల్లోనూ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. రక్తకణాల సంఖ్యను పెంచే ఎండుద్రాక్షల్ని రోజుకు రెండేసి తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండుద్రాక్షల్ని తీసుకోవడం ద్వారా పచ్చకామెర్లు నయమవుతుంది. ఎముకలు బలపడతాయి. గొంతు రాసుకుంటే, నోరు ఎండినట్లైతే పాలు మరిగించి అందులో కాస్త మిరియాల పొడి, ఎండు ద్రాక్షలు వేసి మరిగించి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఒళ్లు నొప్పులు తగ్గాలంటే శొంఠి, జీలకర్ర, ఎండుద్రాక్షల్ని చేర్చి నీటిలో మరిగించి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
గర్భిణీ మహిళలు పాలులో ఎండు ద్రాక్షల్ని చేర్చి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎండుద్రాక్షల్ని పాలల్లో గానీ, అలాగే నమిలి తింటే గుండె పనితీరు మెరుగవుతుంది. రోజూ 10 ఎండుద్రాక్షలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు అస్సలుండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

Friday, April 3, 2015

సమాధానం తెలిస్తే? పంపండి! కి "జవాబు"

 
 .
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

                                    
Thursday, April 2, 2015

"ఆరోగ్యాన్ని" కాపాడే" స్వీట్ కార్న్"


స్వీట్ కార్న్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్నను రెగ్యులర్‌గా మితంగా తీసుకోవడం ద్వారా తీసుకోవడం వల్ల గుండె రక్తకణాల ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతే కాదు, రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
 
స్వీట్ కార్న్ తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది. స్వీట్ కార్న్‌లో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో శరీరానికి ముఖ్యంగా అవసరమయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి. 
 
స్వీట్ కార్న్‌లోని ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి, కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం హార్ట్ రేట్‌ను నార్మల్‌గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 


Wednesday, April 1, 2015

"రజినీ" తప్పు చేస్తున్నాడంటున్న "కమల్"


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తప్పు చేస్తున్నాడంటూ మరో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పరిశ్రమలో మంచి మిత్రులుగా ఆ ఇద్దరికీ పేరుంది. అటువంటప్పుడు రజినీని తప్పుపట్టాల్సిన అవసరం కమల్‌కి ఏమొచ్చిందనే సందేహం రావచ్చేమో. అయితే అందుకు కారణం వేరే వుంది. 
రజినీ చివరి సినిమా లింగా డిస్ర్టిబ్యూటర్లకు భారీ నష్టాన్ని మిగల్చడం.. రజినీనే నమ్ముకుని భారీ ధరకు 'లింగా' హక్కుల్ని కొన్న తాము ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని డిస్ర్టిబ్యూటర్లు నిరసన తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో డిస్ర్టిబ్యూటర్ల పోరు భరించలేక తాజాగా రజినీ వారికి సొంతంగా కొంత నష్టపరిహారాన్ని చెల్లించాడు. రజినీ తీసుకున్న ఈ  నిర్ణయం కమల్‌కి తప్పుగా అనిపించిందట. నష్టపోయిన డిస్ర్టిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం రజినీకి లేదు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇక హీరోలు సినిమాలు చేసి వెనకేసుకునేదేమీ వుండదని తన మనసులో మాటని బయటపెట్టాడట కమల్.