CSS Drop Down Menu

Tuesday, March 17, 2015

" అమెరికా యాపిల్స్‌‌‌‌ యమ డేంజర్"


యాన్ యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎవే’..అనే నానుడిని మార్చుకోవలసి వస్తోంది. ఇప్పుడు దీన్ని ‘యాన్ యాపిల్ ఎ డే..కీప్స్ నియర్ ఎ డిసీజ్’ అని సవరించుకునే రోజులొచ్చాయి. ఇప్పడు వస్తున్న యాపిల్స్‌‌‌‌లో హానికరమైన లిస్టీరియోసిస్ అనే బ్యాక్టీరియా ఉంటోందట..దీనితోబాటు మరో రకం ప్రమాదకరమైన యాపిల్ కూడా ఉంది. అందువల్లే అమెరికానుంచి ఇలాంటి డేంజరస్ యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశామని మలేసియా ప్రభుత్వం అంటోంది.

ముఖ్యంగా కాలిఫోర్నియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ‘గలా, గ్రానీ స్మిత్’ గ్రీన్ యాపిల్స్ ఇలా మనుషుల ఆరోగ్యానికి చేటు తెచ్చేవిగా ఉన్నాయని అక్కడి వ్యవసాయ శాఖ మంత్రి సబ్రి యాకూబ్ తెలిపారు. వీటిని తినడంవల్ల జ్వరం, తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చునని ఆయన అన్నారు. యూఎస్ యాపిల్స్‌‌ను దిగుమతి చేసుకోవడాన్ని థాయ్‌‌‌ల్యాండ్, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా నిలిపివేశాయి.


0 comments:

Post a Comment