CSS Drop Down Menu

Wednesday, March 25, 2015

"నగ్నంగా నిద్రిస్తే" ఎన్నో లాభాలు ?

రోజంతా శారీరకంగాను, మానశికంగాను అలసిపోయే వారు రాత్రి పూట నిద్రించే సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా, నగ్నంగా నిద్రిస్తే ఎన్నో లాభాలు చేకూరుతాయని స్లీప్ ఫౌండేషన్ తెలుపుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
 
అందులో రాత్రిపూట నగ్నంగా పడుకొని నిద్ర పోవడం వల్ల అదనపు వేడి తగ్గి మరింత గాఢమైన నిద్రలోకి పోతారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మరింత సుఖమైన నిద్ర పడుతుంది. దిగంబర నిద్రతో పురుషులలో వీర్య కణాల వృద్ధి, లైంగిక సామర్థ్యం పెరుగుతాయి. మహిళల్లో యోనిని తాకే బ్యాక్టీరియాలు దూరం అవుతాయి. 
 
సుఖనిద్రలో గ్రోత్ హార్మోనుల ఉత్పత్తి పెరిగి స్ట్రెస్ హార్మోనుల ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా స్థూలకాయానికి దూరం కావచ్చు. శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. మంచి నిద్ర ఒత్తిడిని దూరం చేస్తుంది. అధిక బరువు పెరిగేందుకు గల కారణాలలో ఒత్తిడి కూడా ఒకటి. గ్రోత్ హార్మోనుల వృద్ధి వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గాఢ నిద్ర కారణంగా రక్త కణాలు మరింత శక్తిని పొందుతాయి. 
 
ఇంతేకాకుండా జీవిత భాగస్వామితో కలసి నగ్నంగా నిద్రిస్తే, ఇద్దరి మధ్యా 'ప్రేమ' హార్మోనులు పెరిగి, భౌతిక, మానసిక బంధం దృఢపడుతుంది. ఇది పగటిపూట అనుబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. దీంతోపాటు ఇరువురి శరీరాల్లో ఆక్సీటోసిన్ పెరిగి బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. 
 
నగ్నంగా నిద్రించడం వల్ల మంచి కొవ్వుగా పేరున్న 'బ్రౌన్ ఫ్యాట్' మరింత యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల బరువు పెంచే చెడు కొవ్వు కరుగుతుంది. నగ్నంగా నిద్రించడం వలన ఎన్ని లాభాలున్నాయో చూసారుగా. 

1 comment: