CSS Drop Down Menu

Monday, January 19, 2015

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన!

క్రికెట్’లో అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా కొందరు బ్యాట్స్’మెన్లు భారీస్కోరుతో రికార్డు బద్దలుకొడితే.. బౌలర్లు వికెట్లు తీయడంలో సంచలనం సృష్టిస్తుంటారు. అయితే.. ఈసారి జరిగిన ఘటన మాత్రం అందరినీ అబ్బురపరిచేది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామాన్ని చూసి మైదానంలో వున్న వారందరూ ‘ఔరా’ అంటూ నోళ్లవెల్లబెట్టేసుకున్నారు.

ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భాగంగా మెల్బోర్న్’లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! మొదట బ్యాటింగ్ ఆడుతున్న ఇండియాలో జట్టులో రోహిత్ శర్మ ఓ చమత్కారాన్ని సృష్టించాడు. ఒకే బంతికి నాలుగు పరుగులు తీశాడు. ‘అదేంటి..? అది అందరూ తీసేదే కదా..? ఫోర్ కొట్టి వుంటాడు. అందులో ఆశ్చర్యమేముంది?’ అని అనుకోకండి. మరి.. ఇంకెలా చేసి వుంటాడు..? అనేగా సందేహం!

అదేలా అంటే.. ఆసిస్ బౌలర్ కమ్మిన్స్ వేసిన నాలుగో ఓవర్ ఆరోబంతికి రోహిత్ శర్మ బంతిని బలంగా కొట్టాడు. అనంతరం అతడు రహానేతో కలిసి పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అయితే ఆ బంతి కీపర్ దగ్గరకు చేరుసరికి (అంటే ఫీల్డర్ బంతిని  కీపర్’కి అందించేవరకు) వీరిద్దరు నాలుగు పరుగులు తీసేశారు. దీంతో గ్రౌండ్’లో వున్నవారంత అవాక్కవడం వంతయ్యింది. అందరూ ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా వుండిపోయారు. ఇటువంటి ఘటనలు క్రికెట్ చరిత్రలో జరగడం చాలా అరుదు!

0 comments:

Post a Comment