CSS Drop Down Menu

Friday, October 31, 2014

"3D" టాటూస్.....












Thursday, October 30, 2014

Monday, October 27, 2014

ఏం తెలివిరా ? బాబూ!!











Sunday, October 26, 2014

సంపూనా? మజాకా!!!


సంపూ సామాన్యుడిలా కనబడట్లేదు. హృదయకాలేయం అంటూ అందరినీ ఒక్కసారి ఓ తిప్పుతిప్పిన హీరో సంపూర్ణేష్ బాబు తాజాగా మరో వార్తతో హల్ చల్ చేస్తున్నాడు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంటు తీగలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ భర్తగా సంపూ నటిస్తున్నట్లు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. హృదయకాలేయంతో సిల్వర్ స్క్రీన్ పై మంచి మార్కులు కొట్టేసిన సంపూ ఈ చిత్రంలో సన్నీ పక్కన నటించడం ద్వారా ఏ రేంజ్ కు వెళతాడోనని అనుకుంటున్నారు.
 
కాగా కరెంటు తీగలో నటిస్తున్నందుకు సన్నీ ఏకంగా 75 లక్షల రూపాయలు తీసుకున్నదంటున్నారు. మరి సంపూర్ణేష్ ఎంత అందుకున్నాడన్నది చెప్పలేదు కానీ సన్నీ పక్కన నటిస్తున్నది నిజమే అయితే మనోడు ఎక్కడికో వెళ్లిపోతాడంటున్నారు. ఇకపోతే ఈ కరెంటు తీగను అక్టోబరు నెల 31న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Saturday, October 25, 2014

అఖిల్‌ను "తిట్టిన" నాగ చైతన్య?

 

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న "మన్మథుడు" యువసామ్రాట్ నాగార్జున. ఈయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌. వీరిలో నాగ చైతన్య ఇప్పటికే హీరోగా స్థిరపడ్డారు. అఖిల్ త్వరలోనే వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. 
 
నాగ చైతన్య సినిమాల్లోకి రాకముందు.. రాకముందు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టమట. తన దగ్గర ఉన్న కారుని, బైకులను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడట. ఓసారి చైతు ఇంట్లో లేని సమయంలో అఖిల్ చైతు కారు తీసుకుని ఫ్రెండ్స్‌తో కలిసి జాయ్ రైడింగ్‌కు వెళ్లాడట. 
 
ఆ విషయం వెంటనే చైతన్యకి తెలిసిపోయిందట. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అఖిల్‌కి కాల్ చేసి నా కారు, బైక్ ముట్టుకోడానికి వీల్లేదంటూ గట్టిగానే చైతు తిట్టాడట. ఈ విషయాన్ని అఖిల్ ఇటీవల చైతుకి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశాడు. ఆ విషయాన్ని తానింకా మరచిపోలేకపోతున్నట్టు చెప్పుకొచ్చాడు.

Friday, October 24, 2014

"పాపం రాహుల్"


కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్నటికి నిన్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ విమర్శలు మరింత తీవ్రస్థాయిలో వస్తున్నాయి. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరూ రక్షించలేరని, అందువల్ల ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక శకం మొదలనైట్టేనని అంటున్నారు. ఈ మేరకు పోస్టర్లు కూడా వేసేశారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, రాయ్ బరేలి ప్రాంతంలో ఆ మధ్య వేసిన కొన్ని పోస్టర్లలో సోనియా గాంధీ, ప్రియాంకల ఫొటోలు, వాళ్లకు సంబంధించిన నినాదాలు ఉన్నాయే తప్ప.. ఎక్కడా రాహుల్ గాంధీ ప్రస్తావన గానీ, ఆయన ఫొటో గానీ కనిపించిన పాపాన పోలేదు. దాంతో రాహుల్ శకం ఇంకా ప్రారంభం కావడానికి ముందే అంతం అయిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
 
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకానొక సమయంలో రాహుల్ గాంధీని మంత్రి పదవి చేపట్టాలని పిలిస్తే.. అప్పుడే తనకు అనుభవం చాలదని, తర్వాత చేపడతానని అన్నారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం, ఇంకా మాట్లాడితే, అవకాశాలను చేజిక్కించుకోవడం నాయకత్వ లక్షణం. అది లేకపోవడం వల్లే రాహుల్ శకం ముగిసిందని అంటున్నారు. ఇక ప్రియాంక శకం ఎలా సాగుతుందో.. ఎన్నాళ్లుంటుందో చూడాల్సిందే.

Thursday, October 23, 2014

"నగ్న యోగా"

 
ప్రపంచ వ్యాప్తంగా నగ్న యోగాకు డిమాండ్ పెరిగిపోతోంది. నిజానికి భారత్ యోగాలకు పుట్టినిల్లు. యోగా వల్ల చేకూరే అనేక ప్రయోజనాలు తెలుసుకున్న విదేశీయులు భారత్ వచ్చి మరీ నేర్చుకున్నారు. దీంతో యోగా విశ్వవ్యాప్తమైంది. అయితే, భారతీయ యోగాకు ప్రాశ్చాత్య సంస్కృతిని జోడించి.. సరికొత్త యోగాను కనిపెట్టారు. అదే నగ్న యోగా. తాజాగా వారు సరికొత్త యోగాను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అదే నగ్న యోగా. అంటే, ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా యోగా చేయడమన్నమాట. 
 
ఈ తరహా యోగా తొలుత అమెరికా నగరం న్యూయార్క్‌లో ప్రారంభమైన ఈ నయా యోగా మంత్రం, తాజాగా బ్రిటన్ రాజధాని లండన్‌కూ పాకింది. రెండేళ్ల క్రితం లండన్‌లో ప్రారంభమైన ఈ తరహా యోగా తరగతులకు అక్కడి జనం వెల్లువలా తరలివస్తున్నారట. తాను చేపట్టిన నగ్న యోగాకు తొలి రోజు నుంచే ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో లండన్ వాసులు ఆసక్తి వ్యక్తం చేశారని దీనిని లండన్‌కు పరిచయం చేసిన అన్నెట్టే చెబుతున్నారు. 
 
ఇప్పటికీ నిత్యం తాను నేర్పుతున్న నగ్న యోగా క్లాసులకు హాజరవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. నగ్న యోగా వల్ల ఆత్మాభిమానం పెరగడమే కాక మానసిక ఒత్తిడి దూరమవుతోందట. ఇప్పటికే పాప్ గాయని లేడి గాగా, నగ్న యోగాను ప్రయోగించి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందినట్టు అన్నెట్టే చెపుతున్నాడు.

Wednesday, October 22, 2014

"దీపావళికి బంపర్ బోనస్"

దీపావళి పండుగ అంటే చిన్న పిల్లలకు కొత్త బట్టలు.. బాణాసంచా.. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఇచ్చే బోనస్‌లు. అవీ నెల జీతమో లేక పర్సెంటేజ్ లెక్కనో అందుతుంది. అదే బోనస్ నాలుగు లక్షలు ఇస్తే. అబ్బా ఇంకేముంది కొట్టింది లక్కు అనుకుంటాం. అదే జరిగింది మరి. సూరత్‌లో ఒక వజ్రాల వ్యాపారి తన ఉద్యోగులకు ఏకంగా రూ. 4 లక్షల విలువ చేసే వస్తువులను దీపావళి కానుకగా అందించి హుందాతనాన్ని చాటుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే... సూరత్‌కు చెందిన సేట్ పాల్కి సవ్జీభాయ్ ధోలాకియా. ఈయనకు సూరత్‌లో ఒక వజ్రాల ఎగుమతుల సంస్థ ఉంది. అందులో 6000 మంది ఉద్యోగులున్నారు. వీరు కాక ముంబైలోనూ, ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో కలిపి మరో 3000 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో లక్ష్యాలను సాధించిన 1200 మందికి రూ. 4 లక్షల విలువ చేసే బహుమతి ఇవ్వాలని సవ్జీభాయ్ నిర్ణయించుకున్నారు. అందు కోసం రూ. 50 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. 
 
దీపావళి సందర్భంగా స్వీట్లు.. టపాసులు పంచిపెట్టినట్లు.. 491 మందికి ఫియట్ పుంటో కార్లు.. 200 మందికి 2బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల తొలి చెల్లింపులు... 525 మందికి వారు కోరుకున్న బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చారు. ఇది తాను వారికి ఇస్తున్న బోనస్, ఇన్సెంటివ్ కాదని.. సంస్థ అభివృద్ధి కోసం తపించిన వారి అంకితభావానికి, నైపుణ్యానికి తగిన బహుమతులని సవ్జీభాయ్ పేర్కొన్నారు.

Saturday, October 18, 2014

"బొప్పాయి" తింటే ?


 
బొప్పాయి పండంటే ఇష్టం లేకపోయినా తినాల్సిందే! అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. కొందరు బొప్పాయి అంటేనే విముఖత చూపుతారు. కానీ, ఇందులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా తినేస్తారు. 
 
ధర తక్కువతో కూడిన బొప్పాయిలో ఉండే పీచు పదార్థం హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పీచు పదార్థం పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తగ్గించడంలోనూ సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
అజీర్తితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఇక, ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. హార్ట్ పేషెంట్లు దీన్ని ఎలాంటి అనుమానం లేకుండా స్వీకరించవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 
 
ఇందులో ఉండే బీటా కెరోటిన్ వ్యాధి నిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. క్రమం తప్పకుండా బొప్పాయిని తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుందట. ప్రధానంగా స్త్రీలలో బహిష్టు సమయంలో కనిపించే నొప్పుల నుంచి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Friday, October 17, 2014

"టివి" కన్నా? "పుస్తకమే" మిన్న !

 
ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు.

మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!?

Thursday, October 16, 2014

కామాంధుడికి ప్రజలు వేసిన శిక్ష ?

 దేశంలో కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలకు ఏమాత్రం భయపడక తమ పని తాము చేసుకుపోతున్నారు. అందుకే ప్రజలే కామాంధులకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ కామాంధుడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అతడు పురుషాంగాన్ని కోల్పోయాడు.
 
గంగానగర్లో అక్టోబర్ 10న సురేశ్ కుమార్ అనే ఈ వ్యక్తి ఓ టీనేజ్ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఈ కీచకుడిని పట్టుకున్నారు. అయితే, అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళకుండా ఓ మటన్ షాపుకు తీసుకెళ్ళారు. అక్కడ మాంసం నరికే కత్తితో అతడి పురుషాంగాన్ని కోసి, దాన్ని రోడ్డుపై విసిరేశారు.
 
అతనిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తగిన శాస్తి జరిగిందని మిన్నకుండిపోయారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సురేశ్ కుమార్‌పై దాడి చేసిన వ్యక్తులు, తాము అరెస్టు చేయకముందే, స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరి ప్రజలేం చేస్తారో వేచి చూడాలి.

Wednesday, October 15, 2014

"ఆరోగ్యానికి " డ్రై ఫ్రూట్స్"


డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులోనూ జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్ ఈ నాలుగూ అందరూ తప్పక తినితీరాలి అంటూ పోషకాహార నిపుణులు పదేపదే చెబుతున్నా మనం పెద్దగా పట్టించుకోం. వీలయినప్పుడు తింటాం. లేదంటే లేదు. అవునా! కానీ గుండె ఆరోగ్యంగా వుండాలంటే జీడిపప్పులు రోజూ ఓ నాలుగు అయినా తినాలిట. వీటిలో వుండే ఒలోయిక్ ఆమ్లం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు శరీరానికి అవసరమై. రాగి, మెగ్నీషియమ్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఈ జీడిపప్పుల నుంచి లభిస్తాయిట. కాబట్టి ఏ పనిలో వున్నా ఓ నాలుగు జీడిపప్పులను టక్కున నోట్లో వేసుకోవడం మరచిపోవద్దు.

ఇక బాదం ఎందుకు తినాలో తెలుసా? శరీరంలోని హానికర కొవ్వు నిల్వలని తగ్గిస్తుంది కాబట్టి. వీటిలోని మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి లాంటి ఖనిజ లవణాలు, ఇ విటమిన్ గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయిట. గర్భవతులు రోజూ ఓ రెండు బాదం పప్పులు తింటే వీటిలోని ఫోలెట్, బి విటమిన్లు బొజ్జలోని పాపాయికి బర్త్ డిఫెక్ట్ లేకుండా చూసుకుంటాయి.

 కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, మెనోపాజ్ దశలో వున్నవారు ఎండుద్రాక్షని రోజూ తప్పనిసరిగా తినాలిట. ఎందుకంటే, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరెన్ అనే ఖనిజ లవణం ఎండుద్రాక్షలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే వీటిలో కూడా యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఇక వాల్ నట్స్ తింటే రోగ నిరోధక శక్తి పెరగటమే కాదు. క్యాన్సర్ల వంటివీ దరిచేరవు. అలాగే ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. అధిక రక్తపోటు, హానికారక కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో వుంటాయి. గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటన్నిటికీ కారణం వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా వుండటమే.

Tuesday, October 14, 2014

"నడక" గురించి కొన్ని నిజాలు !!!



* నడక శరీరంలో ఎముకలు, కండరాలకు మెదడుతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. నడకే కదా అని నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కండరాలు తరిగిపోతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే అలవాటు లేనివాళ్ళ శరీరంలో నిత్యం ఉపయోగించగలిగే కీళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఎక్కువశాతం కీళ్ళు బిగుసుకుపోతాయి.

* బరువు తగ్గాలనుకునేవారు నడకకి వెళ్ళేముందు ఏమీ తినకూడదు. ఎందుకంటే, ఓ ముప్ఫై నిమిషాలపాటు నెమ్మదిగా నడవటానికి కావలసిన శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచి 45 శాతం, కొవ్వు నుంచి 65 శాతం విడుదలవుతుంది. అంటే నడుస్తుంటే మరింత శక్తి కావాలన్న సంకేతం అందుకున్న శరీరం కొవ్వు నిల్వల్ని కరిగిస్తుంది అన్నమాట.

* నడక మంచిది అన్నారు కదా అని మొదలుపెడుతూనే వేగంగా నడవకూడదు. మొదట 5 - 10 నిమిషాలపాటు నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే ఏ వ్యాయామానికైనా కాసేపటికీ ముందు నుంచీ శరీరాన్ని సిద్ధం చేయాల్సి వుంటుంది. నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ వెళ్ళాలి. ఎంత వేగంగా నడవాలీ అంటే, నడుస్తూ కూడా మాట్లాడటానికి ఇబ్బంది పడనంత వేగం మంచింది. అలాగే నడక ముగించేటప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రిలాక్సింగ్‌గా నడక ముగించాలి.

* నిజానికి నడకతోపాటు కొన్ని వేరే వ్యాయామాలూ శరీరానికి అవసరం. ఎందుకంటే, నడక కొన్ని కండరాలపై ఎక్కువగానూ, కొన్ని కండరాలపై తక్కువగానూ ఒత్తిడి పడేట్ట చేస్తుంది. అందుకని వారంలో ఐదురోజులు నడిస్తే, రెండు రోజులు మీకు నచ్చిన వ్యాయామాలను చేయండి. ఈత, యోగా, ఏరోబిక్స్, జిమ్ ఇలా...

* రోజూ నడిచే అలవాటు వున్నవారికి గుండె, మెదడుకి సంబంధించిన ఇబ్బందులు 10 నుంచి 20 సంవత్సరాల పాటు వాయిదా పడితీరతాయి అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.

* ఎంతసేపు నడవాలి? దీనికి పరిమితి లేదు. 24 గంటల్లో కనీసం 24 నిమిషాలు అన్నది సూత్రం. కాబట్టి 24 నిమిషాలకు తగ్గకుండా వీలునుబట్టి, ఆరోగ్యాన్నిబట్టి ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. క్యాలరీలు ఖర్చుకావాలని నడిచేవారు మాత్రం ఎంత దూరం నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని నడక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి.

* ఇక ఒకసారి నడవటం మొదలుపెట్టాక 12 వారాలపాటు అయినా కొనసాగించాలి. రెండు రోజులో మూడు రోజులో నడిచి మానేస్తే ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా వుంటాయట.

* చివరిగా ఒక్కమాట... క్రమం తప్పకుండా మూడు నాలుగు నెలలపాటు నడిస్తే ఎండార్ఫిన్లు విడుదలై మనసుకు ఆనందాన్నిస్తాయి. ఇక అప్పుడు మానేద్దామన్నా మానలేరు. కాబట్టి ఒక్క నాలుగు నెలలపాటు ఓపికపట్టి నడిచారంటే ఇక ఆ తర్వాత ఆ నడకే మిమ్మల్ని ముందుకు నడిపించుకుని వెళ్తుంది.

Monday, October 13, 2014

"షుగర్ పేషంట్స్" లో "కాళ్ళ వాపులు" నివారించే చిట్కాలు!!!



మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఎక్కువగా పాదాలలో మరియు కాళ్లలో వాపును ఎదుర్కొంటున్నట్లుగా ఫిర్యాదు చేస్తుంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం, ఒత్తిడి ఫలితంగా పాడైపోయిన రక్త కేశనాళికల అసమాన రక్త ప్రసరణ. పాడైపోయిన కేశనాళికలకు కారణం పెరిఫెరల్ ఎడేమా, అంటే పరిసర కణజాలంలోకి ద్రవాల లీకేజ్ వాపులకు కారణమవుతున్నది. కానీ, పాదాల వాపులకు కారణం అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అందువలన సరైన రోగ నిర్ధారణ ముఖ్యం.
 డయాబెటిక్ రోగులలో గాయాలు త్వరగా నయం కాకపోవటానికి కారణం రక్తప్రసరణ సరిగా లేకపోవటం ఒక కారణం. మిస్టర్ భూషణ్ హెమేడ్, డైయాపెడ్,(బహుళ క్రమశిక్షణా పాదాల వైద్యశాలల యొక్క సముదాయము)ఇలా అంటున్నారు 'పాదాల సమస్యలు మధుమేహ రోగులలో సర్వసాధారణం మరియు అవి అతిత్వరగా తీవ్రతరం అవుతాయి.' ఇవి అంటువ్యాధులు మరియు తీవ్రమైన ఇబ్బందుల ప్రమాదానికి గురిచేసే పాదాల పూతలు మరియు గ్యాంగ్గ్రీన్ వంటి వ్యాధులను పెంచుతాయి. అందువలన ఈ పాదాల వాపులను తేలికగా తీసుకోకూడదు. చాలా సందర్భాలలో, ఈ పాదాల వాపులకు ప్రారంభదశలోనే సాధారణ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఒక గొప్ప సహాయకారిగా ఉంటుంది.
 
క్రమం తప్పకుండా వ్యాయామం:- మిస్టర్ హెమేడ్ 'రెగ్యులర్ వ్యాయామం, పాదాలలో మరియు కాళ్లలో ఎముకల మరియు కీళ్ళ ఆరోగ్యం మెరుగుపడటానికి,కాళ్ళలో రక్త ప్రసరణ మెరుగుపడటానికి మరియు మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉందతానికి సహాయపడుతుంది అని చెపుతున్నారు. కానీ మీరు ముందు ఏ వ్యాయామ కార్యక్రమం ప్రారంభించినా మీ డాక్టర్ ను సంప్రదించండి. కఠినమైన వ్యాయామాలు సాధన చేయవొద్దు, అవి వ్యాయామం ప్రేరిత వాపుకు దారితీస్తాయి.

మీ కాళ్ళు పైకెత్తి పెట్టండి:- ప్రతి రోజు 10-15 నిమిషాలు ఒక మద్దతును లేదా ఒక దిండు ఉపయోగించి (గుండె మట్టానికి) అడుగుల ఎత్తులో ఉంచటం వలన వాపు తగ్గటానికి సహాయపడుతుంది. ఎత్తులో పాదాలు ఉంచతంవలన పరిసర కణజాలం నుంచి వొచ్చే అధిక ద్రవాన్ని అరికట్టబడుతుంది మరియు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

 మేజోళ్ళు మరియు పట్టీలు ఉపయోగించండి:- ఇప్పుడు మధుమేహం పాదాల రక్షణ కోసం సంపీడన ఉత్పత్తులు అనేకం అందుబాటులో ఉన్నాయి. అవి ప్రభావిత ప్రాంతం మీద ఒత్తిడి ఏర్పరచి మరియు ద్రవం నిలుపుదల చేయటానికి సహాయపడుతుంది. పెరిగిన బాహ్య ఒత్తిడి ద్వారా ద్రవం తిరిగి శోషరస వ్యవస్థలో చేరటానికి కారణమవుతుంది మరియు రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. Wu SC మరియు సహచరులు మధుమేహం రోగులు తేలికపాటి కంప్రెషన్ సాక్స్ ఉపయోగించడం ద్వారా వాస్క్యులారిటి వాడకుండా పిక్కలలో మరియు పాదాల వాపు గణనీయంగా తగ్గించవొచ్చు అని అధ్యయనం ద్వారా తెలిపారు.

ఉప్పు తీసుకోవడం తగ్గించండి:- ఆహార మార్పులు వాపులను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు సాధారణంగా తక్కువ ఉప్పు తినాలి మరియు ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వలన రక్తపోటు ఎక్కువ అయి పాదాల వాపు ఎక్కువ అవుతుంది మరియు సోడియం సహజంగా తక్కువగా ఉన్న ఆహారాలు తినాలి.

సౌకర్యవంతమైన బూట్లు వాడండి:- మధుమేహంతో బాధ పడుతున్నవారు బిగుతుగా ఉన్న బూట్లు వాడకూడదు. వీరు కావలసిన పరిమాణం కన్నా ఒక పరిమాణం ఎక్కువ ఉన్న బూట్లు కొనుగోలు చేయటం ఉత్తమం, మీ పాదాల వాపులు ప్రారంభమైనా రక్తప్రసరణ పూర్తిగా తగ్గదు. మధుమేహం కలిగి ఉన్న మహిళలు ఎత్తుమడిమల జోళ్ళు వాడకూడదు. మిస్టర్ భూషణ్ పాదనిపుణుడిని సంప్రదించి మధుమేహం ఉన్న వ్యక్తులు సరిఅయిన పరిమాణం తెలుసుకొని బూట్లు కొనుగోలు చేయమని చెపుతున్నారు.

మీ పాదాలకు మసాజ్ చేయండి:- మసాజ్ వలన మొత్తం పాదంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు వాపుకు సంబందించిన నొప్పి కూడా తగ్గుతుంది.

మీ భంగిమ గురించి జాగ్రత్తగా ఉండండి:- సుదీర్ఘ కాలం కూర్చుని ఉండటం లేదా నించుని ఉండటం చేయవద్దు. ఎందుకంటే తగ్గిన రక్త ప్రసరణ తగ్గి తిమ్మిరికి కారణమవుతుంది. మీ కాళ్ళను ఒకదానిమీద ఒకటి ఉంచటం వలన మీ అంత్య భాగాల రక్త ప్రసరణమీద ప్రభావితం అవుతుంది.











Saturday, October 11, 2014

"వయాగ్రా" అతిగా వాడితే ?


 


వయాగ్రా ఎక్కువ కాలం వాడితే కంటి చూపు దెబ్బతింటుందని పరిశోధనలలో వెల్లడైంది.  శృంగార సమస్యలకు వయాగ్రా పరిష్కారమైనా... కంటికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు అంటున్నారు.

దీని సామర్థ్యంపై, దీని వాడకం వల్ల వచ్చే అనర్థాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. వయాగ్రా వాడితే కంటి చూపు దెబ్బతింటుందని తాజాగా పరిశోధకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అయితే అందరికీ కంటి చూపు దెబ్బతినే అవకాశం లేదని, ఒక రకమైన మ్యూటేషన్ ఉన్నవారికి, రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమ్‌ను సిల్డెనాఫిల్ అడ్డుకుంటుందని పరిశోధకులు తెలిపారు.

వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో ఉపయోగించే వారికి కంటిపరమైన సమస్యలు రావచ్చన్న విషయం గతంలో కూడా నిర్ధారణ అయిందని పరిశోధకులు వెల్లడించారు.

వయాగ్రా ఉపయోగించే వారికి... ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడడం లాంటి సమస్యలు రావచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.

Friday, October 10, 2014

ఏ పాత్రలలో భోజనం చేస్తే? ఏం ఫలితాలు ??



 ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వివిధ పాత్రలలో భుజించేవారికి వివిధ రకాలైన ఫలితాలు చవిచూస్తారు. 

బంగారు పాత్రలలో భోజనం చేసేవారికి సకల దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెపుతోంది.

 వెండి పాత్రలో భోజనం చేసేవారికి నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. పిత్త వ్యాధులు దరిచేరవు. ఐతే కఫ, వాత వ్యాధులు ఉండేవారు ఈ వెండి పాత్రలలో భోజనం చేయకూడదు.
 
 ఇత్తడి పాత్రలలో భోజనం చేయడం వల్ల క్రిములు నశిస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది. కఫ వ్యాధులను ఇది నివారిస్తుంది. శోష, పాండు రోగాలను అరికట్టి శరీరానికి బలాన్ని చేకూర్చుతుంది.
 

Thursday, October 9, 2014

"లైంగిక శక్తి " పెరగాలంటే ?


పచ్చకర్పూరం 5 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు తీసుకుని మూడింటిని మెత్తగా నూరి, దాంట్లో 5 గ్రాముల ఎండుద్రాక్ష వేసి మళ్లీ నూరి ఆ తర్వాత ఆ పేస్టును తీసుకుని వాటిని శనగ గింజంత మాత్రలుగా తయారుచేసుకోవాలి. రోజూ పడుకోబోయే ముందు ఒక్క మాత్రను వేసుకుని పాలు తాగితే వీర్యం వృద్ధి చెందడమే కాకుండా లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.

Wednesday, October 8, 2014

శరీరంలోని అధిక క్యాలరీలను కరిగించాలంటే ?


 మన శరీరంలోని అధిక క్యాలరీలను కరిగించేందుకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మీకు తెలుసా?  మనం రెగ్యులర్‌గా తీసుకొనే ఆహారాల్లో కొన్ని ఆహారాలు క్యాలరీలు కరిగించడానికి, బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. వేగంగా క్యాలరీలను కరిగించే ఆహారాలు ఏంటో చూద్దాం..

గ్రేఫ్ ఫ్రూట్ మెటబాలిజనం వేగవంతం చేయడంతో పాటు ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. ముఖ్యంగా గ్రేఫ్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి, గ్రేప్ ఫ్రూట్‌ను సలాడ్స్‌లో, స్మూతీస్, డ్రింక్స్‌లో చేర్చుకోవచ్చు.

 
అలాగే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది.

 మొక్కజొన్న క్యాలరీలను కరిగిస్తుంది. 

ఇంకా గ్రీన్ టీ, సాల్మన్ ఫిష్, స్పెసీ ఫుడ్స్, అవాకోడో, పరిమితంగా కాఫీ, పనస గింజలను వంటల్లో చేర్చుకోవడం వంటివి చేస్తే క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

 వీటిని తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే.. స్లిమ్‌గా ఫిట్‌గా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Tuesday, October 7, 2014

"శృంగారానికి" కొత్త యాప్ !


 అవసరాలకు తగ్గట్టు యాప్‌లు రూపొందించడంలో పరిశోధకులు విశేషమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శృంగారానికి కొత్త యాప్ కనుగొన్నారు. అమెరికాలో కాలేజ్ యువతను లక్ష్యం చేసుకుని 'గుడ్2గో' పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పరస్పర అంగీకారంతో లైంగికానుభవం పొందాలనుకునేవారు 'గుడ్2గో' యాప్‌ను వినియోగించుకుంటే సేఫ్‌గా ఉంటుందని యాప్ రూపకర్త "లీ ఆన్ అల్మాన్" తెలిపారు.

ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైసెస్‌లలో దీనిని వినియోగించుకోవచ్చని లీ వెల్లడించారు. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గోవాలని భావించే యువత సందేహాలు, భయాలకు ఈ యాప్ సమాధానం లాంటిదన్నారు.

యాప్‌లోకి వెళ్లగానే ఆర్ వి గుడ్2గో అని అడుగుతుందని, యస్ అని సమాధానమిస్తే మీతో మాట్లాడాలనుకుంటోందని, నో అని సమాధానమిస్తే యాప్ సమాచారం నిలిపేస్తుందని చెప్పుకొచ్చారు.

Monday, October 6, 2014

"పెరుగు" తీసుకోండి! "ఆయుష్షు"ను పెంచుకోండి !!



 
 ప్రతిరోజూ పెరుగు తింటే ఆయుర్దాయం పెరుగుతుంది. పులియ బెట్టిన పాల ఉత్పత్తులు ఏవి తిన్నా ఆయుష్షు పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలకు బ్యాక్టీరియాను కలిపినపుడు అవి పాలను పెరుగుగా మార్చుతుంది. దానిని మన పరిభాషలో తోడుకోవడమంటాం. పాలలోని లాక్టోజ్ లాక్సిక్ ఆమ్లంగా ఏర్పడటం వల్ల పెరుగుకు ప్రత్యేక వాసన, రుచి వస్తుంది.

జీర్ణనాళానికి మేలు చేసే బ్యాక్టీరియాల సంఖ్య అవసరం. అయితే మేలుచేసే బ్యాక్టీరియా పెరగాలంటే కీడు చేసే బ్యాక్టీరియా సంఖ్యను తగ్గించాలి. మేలే చేసే బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాబట్టి పెరుగును రోజూ తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం జీవించగలుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Saturday, October 4, 2014

"బీర్" తాగితే "ఎముకలు" గట్టిపడతాయా ?

  
బీర్ తాగితే ఎముకలు గట్టిపడతాయట! ఆశ్చర్యపోకండి. చాలా సంవత్సరాల నుండి డ్రింక్ చేసేవారు బీర్ వారి ఆరోగ్యానికి ప్రమాదకరం అనే అపరాధభావంతో మునిగిపోతున్నారు. అయితే, అధిక మద్యపానం సమస్యలకు దారితీస్తుంది. కానీ మితంగా త్రాగటం అనేది అనేక విధాలుగా మంచిది. తాజా అధ్యయనాల ప్రకారం బీర్‌ను ప్రతి రోజు తీసుకోవటం వలన పురుషులలో మూత్రపిండాల్లో రాళ్ల అభివృద్ధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిసింది.

ముదురు రంగు బీర్‌లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే కరిగే ఫైబర్ ఉంటుంది. బీర్‌లో బి‌12 మరియు ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది బీర్ త్రాగని వారి కంటే త్రాగే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. బీర్‌లో నీటి కంటే మెరుగైన హైడ్రేట్లు ఉన్నాయి. అందువల్ల దీనిని ఆధునిక వినియోగంగా అథ్లెట్ల ఆహారంలో ఒక భాగంగా సిఫార్సు చేయబడింది. బీర్‌లో సిలికాన్ సమృద్దిగా ఉంటుంది. అందువల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Friday, October 3, 2014

"అలసంద" లతో "ఆరోగ్యం" !





 అలసందను అలసందులు, బొబ్బర్లు అని పిలుస్తారు. ఇవి నవధాన్యాలలో ఒక రకం. ఈ అలసందలను తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునో చూద్దాం.. అలసందల్లో తక్కువ క్యాలరీలు, తక్కువ ఫ్యాట్ ఉండటంతో బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. 

అలసందల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజుకో కప్పు తీసుకోవడం ద్వారా ఆకలి వేయదు. పొట్ట నిండినట్లు ఉంటుంది. అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నార్మల్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. వైరస్ ఫీవర్, జలుబు, ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవు. అలాగే బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అలసందలు తగ్గిస్తాయి. తద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. 

జీర్ణక్రియను మెరుగుపరిచే అలసందల్లో అధిక ఫైబర్ కలిగివుండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హానిజరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Thursday, October 2, 2014

పోషక పదార్థాల గని "చెర్రీ రసం"


 


 చెర్రీ రసం... మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులు కలిగిన వారికి ప్రమాదం కావచ్చు కానీ ఇతరులకు అమృతంతో సమానమని బ్రిటన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పావు లీటరు పరిమాణం ఉండే గ్లాసు చెర్రీ రసంలో ఇతర పండ్లు, కూరగాయలలో కంటే 23 రెట్లు అధికంగా పోషక పదార్థాలున్నట్లు నిర్ధారించారు.

బఠాణీలు, టొమోటోలు, తర్భూజ, క్యారెట్లు, అరటిపండ్లతో పోలిస్తే చెర్రీ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఐదు రెట్లు అధికంగా ఉంటాయని వెల్లడైంది. కేన్సర్, గుండెజబ్బులు, వృద్ధాప్యం తదితర సమస్యలకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను ఈ యాంటీ యాక్సిడెంట్లు సమర్థంగా నిరోధించగలవని వారు చెపుతున్నారు.

కూరగాయలు, పండ్లలో ఫ్రీరాడికల్స్ నివారణ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరిశోధనలు జరిపిన పోషకాహార నిపుణుడు డాక్టర్ రాబర్ట్ వెర్క్‌ర్క్ చెర్రీలలో ఈ శక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆయన తన పరిశోధన వివరాలను "న్యూట్రిషనల్ ప్రాక్టీషనర్" పత్రికలో ప్రచురించారు.

అన్నిరకాల చెర్రీ పండ్లలోనూ... యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఒకే రీతిగా ఉండదని, ముఖ్యంగా అమెరికాలో పండే మాంట్‌మరెన్సీ రకం చెర్రీల్లో ఇవి అత్యధికంగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

అందువల్ల షుగర్, అధిక బరువు ఉన్న రోగులను మినహాయిస్తే ప్రతి ఒక్కరూ చెర్రీ పండ్ల రసాన్ని సేవించవచ్చు. వ్యర్థ శీతల పానీయాలను తాగడం కంటే ఇది శరీరానికి అవసరమైన పోషకాలను సులువుగా అందిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు.

Wednesday, October 1, 2014

"ఆహారం" తిన్న వెంటనే "నీళ్ళు" తాగొచ్చా?


 


ఆహారం తీసుకున్న వెంటనే కొందరు ఫుల్‌గా నీరు తాగేస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్న తర్వాత పరిమితంగానే నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకోవడానికి, నీరు తాగడానికి మధ్య కనీసం అరగంటైనా గ్యాప్ ఉండాలి.

ఆహారం తినటానికి కనీసం 40 నిమిషాల ముందు మాత్రమే నీటిని త్రాగాలి. ఆహారం తిన్న తర్వాత నోరు మరియు గొంతును శుభ్రం చేసుకోవటానికి వెచ్చని నీటిని రెండు లేదా మూడు సిప్స్ తీసుకోవచ్చు.

నిజంగా దాహం ఉంటే కనుక, ఉదయం భోజనం తర్వాత సీజనల్ పండ్ల తాజా రసం మరియు లంచ్ తర్వాత మజ్జిగ తీసుకోవచ్చు. రాత్రి భోజనం తర్వాత పాలను తీసుకోవచ్చు. వీటిలో కూడా ఎక్కువగా నీరు కలిగి ఉన్నప్పటికీ, లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి దెబ్బ తీయటానికి బదులుగా జీర్ణక్రియల కోసం శరీరానికి సహాయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.