CSS Drop Down Menu

Thursday, December 4, 2014

"తాళాలు" కనిపించడం లేదా ? ఒక్క "విజిల్" వేయండి చాలు !


ఆఫీసుకు టైమవుతుంటే బండి తాళాలు కనిపించవు. కారు తాళాలు ఎక్కడో వుంటాయి. వెతుకులాటతో చిరాకు, కోపం ఉదయాన్నే మనల్ని ఆవహిస్తాయి. ఇక ఆ చికాకు రోజంతా వెన్నాడుతుంది. ఇవన్నీ సరే హ్యాండ్ బ్యాగ్‌లో వేసిన ఇంటి తాళం చటుక్కున చేతికి అందదు. ఈ తాళాలతో ఇన్ని తిప్పలు. ‘‘ఎంచక్కా సెల్‌కి రింగ్ ఇచ్చి దాని అడ్రస్సు కనుక్కున్నట్టు వీటికీ ఓ ఆప్షన్ ఉంటే బాగుండును’’ అని మనందరం ఎప్పుడో ఒకప్పుడు అనుకునే వుంటాం కదా!



మనలాంటి వారి కోసమే ‘‘విజిల్ కీ ఫైండర్’’ తయారు చేశారుట. ఈసారి తాళాలు కనిపించకపోతే ఒక్క విజిల్ వేయండి చాలు అంటున్నారు దీని తయారీదారులు. మన విజిల్ సౌండ్‌కి ఈ ఫైండర్‌కి వున్న ఎల్ఇడి లైట్ వెలగటంతోపాటు ఓ బీప్ సౌండ్ కూడా వస్తుంది. దాంతో ఎక్కడ దాగున్నా టక్కున పట్టుబడిపోతుంది మన తాళం చెవి.

2 comments:

  1. ఇట్లాంటి బాధలు లేకుండా ఉండ టానికే కాబోలు పూర్వ కాలం లో నడుంకి తాళాలు బిగించి కట్టేసు కునేవారు !!

    జిలేబి

    ReplyDelete
  2. అవునండి! మీరన్నది నిజమే.

    ReplyDelete