CSS Drop Down Menu

Friday, December 19, 2014

జ్ఞాపకశక్తికి "బ్రెయిన్ జిమ్"!!!


ఈమధ్య కాలంలో జ్ఞాపకశక్తికి బ్రెయిన్ జిమ్ చేయాల్సిందేనని నిపుణులు తరచూ చెప్పటం వింటున్నాం. అసలు ఈ బ్రెయిన్ జిమ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి అంటే...

* మన మెదడుని కుడి, ఎడమలుగా విడదీసి కుడి మెదలు, ఎడమ మెదడు అంటారు. ఈ రెండు మెదడులు చురుకుగా వుంటే మంచి జ్ఞాపకశక్తి సొంతమవుతుంది. మరి ఈ రెండు మెదడులు చురుకుగా వుంచటమెలా అంటే, వాటికి పని కల్పించటమే...

* ఎడమచేయి, ఎడమకాలు పనిచేస్తే కుడివైపు మెదడు పనిచేస్తుంది. చురుకుగా వుంటుంది. కుడికాలు, కుడిచేయి పనిచేస్తే ఎడమ మెదడు పనిచేయడం మొదలుపెడుతుంది. సాధారణంగా మనందరం కుడి చేయి, కుడికాలునే ఎక్కువగా కదిలిస్తుంటాం. వాటితోనే పనిచేస్తుంటాం. అలా కాకుండా రెండు చేతులు, కాళ్ళను సమానంగా పనిచేయించ గలిగితే మెదడులోని రెండు భాగాలు చురుకుగా వుంటాయి. కాబట్టి ప్రతిరోజూ రెండు చేతులు, రెండు కాళ్ళను కదిలించేలా వ్యాయామం చేయాలి.

* ఇక పంచేంద్రియాలకు వ్యాయామం ఇవ్వగలిగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చెవులని బ్రెయిన్ క్యాప్స్ అంటారు. వీటికి రోజూ మసాజ్ చేసుకోవాలి. అలాగే కళ్ళు మూసుకుని ఏదైనా పని చేయడం ద్వారా కళ్ళకు వ్యాయామం అయినట్టే. కళ్ళు మూసుకుని వాసనబట్టి వస్తువుని గుర్తుపట్టడం, రుచితో ఆహారాన్ని గుర్తించడం ఇలా చిన్న చిన్న ఛాలెంజెస్‌ని మన పంచేంద్రియాలకు రోజూ ఇస్తూ వెళ్తే వాటికి కావల్సినంత ఎక్సర్‌సైజ్ ఇచ్చినట్టే.

0 comments:

Post a Comment