CSS Drop Down Menu

Friday, November 7, 2014

నిర్మాత‌లను హ‌డ‌లెట్టిస్తున్న బ్ర‌హ్మానందం ?


బ్ర‌హ్మానందం పేరు చెబితే నిర్మాత‌లు హ‌డ‌లిపోతున్నారు. ఆయ‌న సినిమాలో ఉంటేగానీ బండి న‌డ‌వ‌దు. కానీ... ఆయ‌న‌మాత్రం బ‌హు కాస్ట్లీ న‌టుడు. రోజుకి రూ.6 ల‌క్ష‌లు త‌గ్గ‌డు. ఆయ‌న పాత్ర‌ని ఒక‌ట్రెండు రోజుల్లో చుట్టేద్దామ‌నుకొంటే కుద‌ర్దు. రోజుకి రెండు మూడు స‌న్నివేశాల కంటే ఎక్కువ తీయ‌కూడ‌దు. అది ఆయ‌న పెట్టే మ‌రో రూలు. మొత్తానికి సినిమా అంతా బ్ర‌హ్మానంద‌మే క‌నిపించాలంటే నిర్మాత‌ల‌కు క‌ళ్లు బైర్లు క‌మ్మేయాల్సిందే. య‌మ‌లీల విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం య‌మలీల 2. ఇందులో బ్ర‌హ్మానందంది చిత్ర‌గుప్తుడు వేషం. య‌ముడు, చిత్ర‌గుప్తుడు మ‌ధ్య చాలా స‌న్నివేశాలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సినిమా మొత్తం వీళ్లే క‌నిపిస్తారు. క‌నీసం 25 రోజుల నుంచి 30 రోజులు పాటు కాల్షీట్లు స‌మ‌ర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం బ్ర‌హ్మానందం రూ.1 కోటి 30 ల‌క్ష‌ల వ‌ర‌కూ పారితోషికం అందుకొన్నాడ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. వామ్మో... అంత రేటా..?? మ‌న చిత్ర గుప్తుడు అంత కాస్ట్లీ మ‌రి.

3 comments:

  1. హావభావాలు పలకని పలికించలేని చెక్కమొహం నటులు వారసుల మంటూ‌ సింహభాగం నిర్మాణవ్యయం పారితోషికంగా దండుకుంటూ ఉంటే సినిమాని ఒంటిచేత్తో నడిపించగల మరియు తరచు నడిపిస్తున్న బ్రహ్మానందానికి కోటి చిల్లర ఇవ్వటానికి నిర్మాతలకు ఏడుపెందుకూ? నలభై కోట్లబడ్జెట్ అంటూ అందులో హీరోగారికే పన్నెండో పదిహేనో కోట్లు గుమ్మరిస్తారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది కేవలం అనుమానస్పదం మళ్ళీ. నవ్వూ, నటనా, ఇచ్చే‌బ్రహ్మానందానికి కోటి చిల్లర ఏమీ హెచ్చుమొత్తం కాదు. నిజానికి అతడికి అరడజను కోట్లిచ్చినా ఫరవాలేదేమో! హీరోల ముఖాలకే ఒకటి రెండు కోట్లు చాలు. వాళ్ళ బొంద యాక్షన్లూ డిక్షన్లూ వాళ్ళూను.

    ReplyDelete
  2. బ్ర‌హ్మానందం గారు ఎంతలా నవ్విస్తారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ శ్యామలీయం గారు అన్నట్టు హీరో కన్నా బ్ర‌హ్మానందం గారికి ఎక్కువ రెమ్యునరషన్ ఇవ్వాలి అన్న దాంతో నేను ఏకిభవించను. సినిమా వ్యాపారం సినిమా ల కన్నా పెద్ద హీరోలు ఉన్న వాటికే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది అని నా ప్రగాఢ నమ్మకం.

    ReplyDelete
  3. కొంతవరకు శ్యామలీయం గారన్నది నిజమేకదా అనిపిస్తున్నది.

    ReplyDelete