CSS Drop Down Menu

Tuesday, November 18, 2014

"డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు" 'జబర్థస్త్' పై కృష్ణభగవాన్?

 వర్ధమాన హాస్యనటులపై సీనియర్ కమెడియన్ కృష్ణభగవాన్ విరుచుకుపడ్డారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రస్తుతం అంతా చీప్ కమెడియన్స్ వస్తున్నారని కృష్ణ భగవాన్ ఫైర్ అయ్యారు. వీరంతా కామెడీ అనే పదం పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చీప్ కామెడీని నమ్ముకుని వస్తున్న ప్రస్తుత తరం నటులకి అసలు 'కామెడీ టైమింగ్' అంటే ఏమిటో తెలియదని కృష్ణభగవాన్ మండిపడ్డాడు. టీవీలో వచ్చే కామెడీ షోలలో కాస్త పేరు రాగానే, వీరికి సినిమాల్లో ఈజీగా అవకాశాలు వస్తున్నాయని... దీంతో, వీరంతా సూపర్ స్టార్లలా ఫీలయిపోయి సినిమా సెట్స్‌లో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

హాస్యనటులు సినిమాల్లో ఆడవేషాలు వేయడం కొత్త కాదని, అయితే టీవీ షోలలో కమెడియన్లు ఆడ వేషాలు వేసినప్పుడు చాలా వల్గర్‌గా చేస్తున్నారని ఆయన విమర్శించారు. 'జబర్థస్త్' టీవీ షోలో చేసే కమెడియన్స్‌ను ఉద్దేశించే కృష్ణ భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరి కృష్ణభగవాన్ డబుల్ మీనింగ్ కామెడీ సంగతేంటో?

0 comments:

Post a Comment