CSS Drop Down Menu

Saturday, November 29, 2014

కోపాన్నిలోపలే ఉంచుకుంటే ?

కోపం మనుషులకు సహజమే. కానీ కోపంతో ఒత్తిడి తప్పదని, కోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
కోపాన్ని బయటికి వ్యక్తం చేయకుండా లోపలే ఉంచుకుంటే అనారోగ్యం తప్పదు. అలాగే కోపాన్ని కంట్రోల్ చేసేందుకు మార్గాలను అన్వేషించాలి. అధికంగా ఆగ్రహానికి లోనవడం ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. 
 
కోపాన్ని నియంత్రించుకోవాలంటే.. 
* యోగా చేయండి.. యోగాలో భాగంగో లోతైన శ్వాసను తీసుకోండి. తద్వారా అధిక ఆక్సిజన్‌తో కోపం తగ్గి మెదడును క్లియర్ చేస్తుంది. 
 
* కోపానికి గల కారణాలను తెలుసుకుని వాటికి దూరంగా ఉండండి.  
* భాగస్వాముల మధ్య జగడాలొస్తే.. ఎడామడా తిట్టేయకుండా ప్రత్యక్షంగా చెప్పేయండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

'గబ్బర్ సింగ్-2 "కధారచయిత" పవన్ కళ్యాణ్'!


’గబ్బర్ సింగ్’తో అభిమానులను అలరించిన పవన్ ఇప్పుడు సొంతకథతో రెట్టింపు వినోదాలను అందించేందుకు రెడీ అయ్యాడు. అవునూ.. త్వరలోనే గబ్బర్ సింగ్2 పట్టాలెక్కనుంది. పవర్ ఫుల్ కామెడీ ట్రాక్ తో పవన్ కథని సిద్ధం చేశాడు. ’పవర్’ ఫేం 'బాబీ' దర్శకత్వం వహించనున్నాడు. పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్ నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైనర్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. శరత్ మరార్ నిర్మాత. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. పవన్ సరసన అనీషా ఆంబ్రోస్ జతకట్టనుంది. ఎంతో మంది అందగెత్తెలు పవన్ పక్కన నటించేందుకు వేయికళ్లతో ఎదురు చూస్తున్నా.. ఆ అవకాశం అనీషాకు దక్కడం విశేషం. చిత్ర బృందం మరో క్లారిటీని కూడా ఇచ్చింది. ఈ చిత్రం గబ్బర్ సింగ్ కు సిక్వీల్ కాదట. అసలు ఏ చిత్రానికి సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ కాదని స్పష్టం చేశారు. అన్నట్టు.. గబ్బర్ సింగ్ అంతాక్షరి గ్యాంగ్ మరోసారి హంగామా చేయనుంది. ఈ చిత్రానికి ఆర్ట్ ఆనంద సాయి, సంగీతం దేవీశ్రీ ప్రసాద్.


Friday, November 28, 2014

"పాము" ఆత్మహత్య?


ఓ పాము తనకు తానే ఆత్మహత్య చేసుకుంది! తన మెడను తానే కొరుక్కుని చనిపోయింది. ప్రముఖ పత్రిక ది డెయిలీ మెయిల్ ప్రకారం... ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని కెయిన్స్‌లో జరిగింది. ఓ మహిళ తమ ఇంటి డోర్ స్టెప్స్ పైన ఓ పామును చూసింది. 1.5 మీటర్ల పొడనున్న గోదుమ రంగు పామును ఆమె చూసింది.

దీంతో ఆమె మట్ హాగన్ అనే పాములు పట్టే వాడికి సమాచారం అందించింది. అతను అక్కడకు వచ్చాడు. దానిని పట్టుకుందామనుకున్నాడు. కాని, అంతలోనే ఆ పాము తన మెడను తానే కరచుకొని మృతి చెందింది.

ఆ సమయంలో తాను దానిని సరిగా చూడకపోయి ఉంటానని అనుకున్నానని, దానిని తాను పట్టుకొని చూశానని, అప్పటికి అది తన మెడను గట్టిగా నోట కరుచుకొని ఉందని పాములు పట్టే వ్యక్తి మన్ హాగన్ చెప్పారు.

తనకు ప్రాణాపాయం ఉందని అనుకుంటే పాములు సాధారణంగా కరిచి అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని, కాని ఏ పాము తనంతట తాను చనిపోతుందని చూడలేదని చెప్పారు. అయితే, అది ఏదైనా తీవ్ర బాధతో ఉండవచ్చునని, దీంతో తనకు తానే చనిపోవచ్చునని అభిప్రాయపడ్డారు. కాగా, పాములు పగ పడతాయనే విషయం మనం వింటున్నాం. కానీ ఈ పాము తనకు తానే చనిపోవడం గమనార్హం.ప్రభుదేవా "విలనా" ?


కొరియోగ్రఫర్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు ప్రభుదేవా. తనదైన డ్యాన్నింగ్ ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. నృత్యం నుంచి.. నటన వైపు అడుగులేశాడు. పలు సినిమాల్లో నటించాడు. అటు.. నుంచి దర్శకుడిగా మారాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రభు సినిమాలన్నీ వందకోట్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. డైరెక్షన్ చేస్తూనే.. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు విలనీజం చూపించడానికి రెడీ అయిపోయాడు ప్రభుదేవ. ఆయన రీల్ లైవ్ లోనూ.. రియల్ కొరియాగ్రాఫర్ గా నటించిన చిత్రం ’ఎబిసిడి’. ఈ సినిమా సీక్వెల్ ‘ఎబిసిడి 2′ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. రెమో డిసౌజా దర్శకడు. వరుణ్ ధావన్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా పూర్తి నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించనున్నాడు. మరీ.. ప్రభుదేవా విలనీజం ఏ రేంజ్ లో వుండబోతుందో వేచి చూడాలిల్. అన్నట్టు.. తెలుగులోనూ ‘ఎబిసిడి2′ రానుంది.
 


Thursday, November 27, 2014

తెలుగులో "అత్యధిక పారితోషికం" తీసుకొంటున్న దర్శకుడు ?

 టాలీవుడ్ దర్శకులంతా తమ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేశారు. ఇలా పెంచిన వారిలో ప్రముఖ దర్శకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, శ్రీను వైట్ల, తదితరులు ఉన్నారు. వీరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ దర్శక రచయిత టాలీవుడ్‌కు 2002లో రాగా, ఇప్పటి వరకు కేవలం 6 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఏడో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. అయినప్పటికీ.. ఈ క్రియేటివ్ డైరక్టర్ ఒక చిత్రం దర్శకత్వం వహించేందుకు తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా రూ.16 కోట్లు. అత్తారింటికి దారేది చిత్రానికి రూ.7 కోట్లు తీసుకున్న ఈ దర్శకుడు అల్లు అర్జున్ చిత్రానికి దర్శకత్వం చేసేందుకు రూ.16 కోట్లు పుచ్చుకుంటున్నాడట. ఇదే టాలీవుడ్ దర్శకులు తీసుకునే అత్యధిక రెమ్యునరేషన్. అలాగే వివి వినాయక్ కూడా రెట్టింపు చేశాడట. అల్లుడు శీను చిత్రానికి వినాయక్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.9 కోట్లు. అదేవిధంగా శ్రీనువైట్ల కూడా మహేష్ బాబు ఆగడు చిత్రానికి రెట్టింపు చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.

"పెరిగిపోతున్న విడాకులకు" కారణం "వాట్స్ యాప్" ?

 
అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీ ఫలితంగా దంపతుల మధ్య సఖ్యత చెడిపోతోంది. ఫలితంగా వేరుపడే (విడాకులు) జంటల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మొబైల్ టెక్నాలజీలో వచ్చిన విప్లవం కారణంగా వాట్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నిరంతరం మెసేజ్‌‍లు పంపుకోవచ్చు. ఇలా చేసే వారు ఇబ్బందుల్లో పడుతున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
ఇటీవలి కాలంలో మంచి ఆదరణ చూరగొన్న వాట్స్ యాప్ మెసెంజర్ వేదిక, వివాహితులు విడాకులు తీసుకునేందుకు కారణమవుతుందని 'ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మాట్రిమోనియల్స్' అధ్యక్షుడు గియాన్ ఎట్టోర్ గస్సానీ తెలిపాడు. 
 
ఈ మేరకు లండన్ టైమ్స్ పత్రికతో మాట్లాడిన అతను, "వాట్స్ యాప్ ద్వారా మెసేజ్‌లు చేస్తూ జీవిత భాగస్వాములను మార్చుకుంటున్నట్టు 40 శాతం విడాకుల కేసుల్లో తెలిసింది. ఈ విషయంలో వారి ప్రేమికులే సాక్ష్యంగా ఉంటున్నారు" అని చెప్పారు. ఇటలీలో సోషల్ మీడియా మోసాన్ని చాలా సులభంగా ప్రోత్సహిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా ఉపయోగిస్తుండటంతో... ముందు టెక్స్ట్ సందేశం, తరువాత ఫేస్ బుక్, ఇప్పుడు వాట్స్ యాప్ ద్వారా ఇలా చేస్తోందన్నారు. 


Wednesday, November 26, 2014

'నాగార్జున' కొత్త 'బార్‌ అండ్‌ రెస్టారెంట్‌' పేరు "ఎన్‌' డిస్ట్రిక్ట్‌"?

 
అక్కినేని నాగార్జున ఓ వ్యాపారవేత్త. బంజారాహిల్స్‌లోని ఇప్పటి సుబ్బిరామిరెడ్డి పార్క్‌ హోటల్‌ సమీపంలో గతంలో నాగార్జున బార్‌ వుండేది. అందులో రకరకాల కార్యకలాపాలు జరగడంతో పోలీసులు కొద్దికాలం సీజ్‌ చేశారు. ఆ  తర్వాత నాగ్‌... ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ పేరుతో ఓ వ్యాపారాన్ని చేశాడు. చెరువును ఆక్రమించి కట్టాడని తెరాస ప్రభుత్వం ఆయనపై కేసు కూడా పెట్టింది. 
 
అయితే తాజాగా ఆయన మరోచోట 'ఎన్‌' డిస్ట్రిక్ట్‌ అనే పేరుతో జూబ్లీహిల్స్‌లో ఓ బార్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇటీవల కేఫ్‌లు చుట్టూ యూత్‌ ఎగబడుతున్నారు. ఇలా వాణిజ్య వ్యాపారాలు చేసే నాగార్జున కొత్తకొత్త వ్యాపారాలు చేస్తున్నాడనే టాక్‌ వుంది.
 
ఓవైపు సినిమాలు, రియల్‌ ఎస్టేట్‌, హోటల్‌ వ్యాపారాలు, బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షోలతో ప్రజల దగ్గరకు వెళుతున్నాడు. కాగా త్వరలో ప్రారంభమయ్యే ఎన్‌ డిస్ట్రిక్ట్‌.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లతో ఈసారి ఎంత క్రేజ్‌ చేస్తాడో చూడాలి.

"నడుము నొప్పి" తగ్గాలంటే ?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ముఖ్యంగా.. పొద్దస్తమానం కుర్చీల్లో కూర్చొనే వారు, మహిళలు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం తీరికలేని జీవితాన్ని గడపడమే. 
 
అలామీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే.. ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా ఈ కింది సూచనలు పాటిస్తే నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందట. మేడికొమ్మపాలు పట్టువేస్తే నడుము నొప్పి ఉండదు. 
 
నల్లమందు రసకర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శొంఠి గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 


Tuesday, November 25, 2014

"జీన్ ప్యాంటు" లాంటి "బాడీ పెయింట్"

 అమెరికాలో ఓ యువతి వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగంతో తొలి రోజే 10 లక్షల హిట్లు కొట్టింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో లియా జంగ్ అనే మోడల్ ప్యాంటేసుకోకుండా తిరిగేసింది. పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన బాడీ ఆర్ట్‌తో జీన్ ప్యాంటు రూపంలో శరీరానికి రంగులు పూసుకున్న లియా సాధారణ యువతిలా తిరిగింది.

ఆమె బాడీ పెయింట్ అచ్చం జీన్ ప్యాంటును పోలి ఉండడంతో ఎవరికీ అనుమానం రాకపోవడం విశేషం. దీంతో ఆమె నేరుగా ఓ బట్టల షాప్ లోకి వెళ్లి, తాను వేసుకున్న లాంటి మోడల్ 'జీన్' కావాలని అడగడంతో తేరిపార చూసిన షాప్ కీపర్ కింది ఫ్లోర్‌లో ఉంది మేడమ్ అనడం విశేషం.

ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది. నెట్‌ లో అప్ లోడ్ చేసిన తొలి రోజే దీనిని 10 లక్షల మంది చూడడం విశేషం.

"కాద‌న్న" చ‌ర‌ణ్ ! "ఔన‌న్న" బ‌న్నీ!!


రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేయాల‌ని బోయ‌పాటి శ్రీ‌ను ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నాడు. రెండు మూడు క‌థ‌లు రెడీ చేసుకొన్నాడు కూడా. చిరు, చ‌ర‌ణ్‌ల‌కూ వినిపించాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్య‌రూపం దాల్చ‌లేదు. దాంతో లెజెండ్ లాంటి హిట్ త‌ర‌వాత కూడా బోయ‌పాటి ఖాళీగా ఉండాల్సివ‌చ్చింది. 
ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఆ హీరోనే... అల్లు అర్జున్‌. ఔను... బ‌న్నీ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని బోయ‌పాటి శ్రీ‌ను కూడా ధృవీక‌రించాడు. వ‌చ్చే యేడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించ‌నుంది. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మార్చిలో పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. చ‌ర‌ణ్ నో చెప్పిన క‌థే బ‌న్నీ తో తీస్తున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో టాక్‌. మ‌రి చ‌ర‌ణ్‌, బ‌న్నీ తీసుకొన్న నిర్ణ‌యాల్లో ఏది క‌రెక్టో తెలియాలంటే మ‌రో యేడాదైనా ఆగాలి.
 

Monday, November 24, 2014

పక్కలో కుక్కలతో "నగ్నంగా" నిద్రించే నటి ?

హాలీవుడ్ తారలకు ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ చేసి వార్తల్లో ఉండాలని తహతహలాడుతుంటారు. తాజాగా హాలీవుడ్ నటి, గాయని అయిన 21 ఏళ్ల ఆరియానా గ్రాండి ఓ విషయాన్ని బయటపెట్టి వార్తల్లోకి ఎక్కింది. నిద్రించేటప్పుడు ఒంటిపై నూలుపోగు లేకుండా నిద్రపోతానని సెలవిచ్చింది. అంతేకాదు ఈ విషయం తన అమ్మమ్మ చెప్పిందనీ, ఆమె చెప్పిన మాట ప్రకారం ఇవాల్టికి కూడా వీలైనంతవరకూ చాలా తక్కువ దుస్తులను ధరించి నిద్రపోతానని చెప్పుకొచ్చిందా ముద్దుగుమ్మ. 

 
మరో విషయమేమంటే, తనకు మనుషులకంటే కుక్కలంటేనే ఇష్టమనీ, అందువల్ల తను ఇష్టంగా పెంచుకున్న నాలుగు కుక్కలను పక్కలో పడుకోబెట్టుకుని నగ్నంగా నిద్రిస్తానని అంటోందట. ఈ విషయాన్ని నగ్నంగా కుక్కలతో పడుకుంటానని చెప్పి వార్తల్లోకి ఎక్కేసింది.

"క‌లుస్తున్న" బాల‌య్య‌, ఎన్టీఆర్ ?


నంద‌మూరి అభిమానుల‌కు ఇంత‌కంటే శుభ‌వార్త ఏముంటుంది.?? అటు బాల‌య్య‌, ఇటు ఎన్టీఆర్ వాళ్ల‌కు రెండు క‌ళ్లు. వీరిద్ద‌రూ గ‌త కొంతకాలంగా ఎడ‌మెహం, పెడ‌మొహంగా ఉంటున్నారు. ఎట్ట‌కేల‌కు వీరిద్ద‌రు క‌ల‌వ‌బోతున్నారు. అదెలాగంటారా..??
 హుద్ హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి టాలీవుడ్ నడుంబిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30న విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కోసం టాలీవుడ్ అంతా కదలనుంది. ఈ మ్యాచ్ విజయవంతం కోసం.. టాప్ హీరోలు సైతం తమవంతు కృషిచేస్తున్నారు. ఇద్దరు సూపర్ స్టార్స్.. పవణ్ కళ్యాణ్-మహేష్ బాబులు కలసి ఓ స్కిట్ చేయబోతున్నారు. దీనిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు సమాచారం. తాజాగా, తారల మ్యాచ్ లో మరో విశేషం కూడా వచ్చి చేరింది. అదే బాబాయ్-అబ్బాయ్ కలసి ఓ స్కిట్ చేయబోతున్నారంట. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ లను ఓ సూపర్ స్కిట్ లో కనిపించనున్నట్లు సమాచారమ్. దీనిని.. బోయపాటి శ్రీను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. నందమూరి అభిమానులకు పండగే పండగ … !!

Saturday, November 22, 2014

"అఖిల్" కోసం "ఐటెమ్ సాంగ్" ?

అక్కినేని ఇంటి కొత్త హీరో అఖిల్ ఎంట్రీకి స‌రంజామా సిద్ధ‌మ‌వుతోంది. ఈసినిమాని ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా నిల‌బెట్టాల‌ని నాగార్జున భావిస్తున్నారు. అందుకే అఖిల్ ఎంట్రీ బాధ్య‌త వి.వి.వినాయ‌క్‌పై పెట్టారు. ఆయ‌న ఈ క‌థ‌కి అద‌న‌పు హంగులు అద్దుతున్నారు. వినాయ‌క్ సినిమా అంటే భారీ యాక్ష‌న్ హంగామాతో పాటు, ర‌స‌వ‌త్త‌ర‌మైన గీతాలూ ఉంటాయి. ఈసినిమాలోనూ అలాంటివి ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కోసం ఐటెమ్ గీతం ఉండాల్సిందే అని... చిత్ర‌బృందం తీర్మాణించింద‌ట‌. ఆ పాట‌లో ఓ అగ్ర క‌థానాయిక‌తో డాన్స్ చేయించాల‌ని వినాయ‌క్ భావిస్తున్నారు. తెలుగునాట టాప్ క‌థానాయిక‌గా వెలుగొందుతున్న తార చేత అఖిల్‌తో స్టెప్పులు వేయించాల‌ని టీమ్ భావిస్తోంది. అవ‌స‌ర‌మైతే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల‌ను దింపి - ఆ పాట‌కి మ‌రింత హైప్ తీసుకురావాల‌నే ప్లాన్‌లో ఉన్నార్ట‌. అనూప్ రూబెన్స్‌, దేవిశ్రీ ప్ర‌సాద్.. ఇద్ద‌రిలో ఒక‌ర్ని సంగీత ద‌ర్శ‌కుడిగా సెలెక్ట్ చేయాల‌ని భావిస్తున్నారు. దేవి అయితే త‌న‌కు కంఫ‌ర్ట్‌గా ఉంటుంద‌ని వినాయ‌క్ చెబుతున్నాడ‌ట‌. దేవికి ఐటెమ్ గీతాల స్పెష‌లిస్టు అనే ముద్ర ఉంది. దాంతో ఈ పాట మ‌రింత సూప‌ర్బ్‌గా వ‌చ్చే ఛాన్సుంద‌ని చిత్ర‌బృందం న‌మ్మ‌కం పెంచుకొంటోంది. మ‌రి ఈ ఐటెమ్ గీతంలో క‌నిపించే క‌థానాయిక‌లెవ‌రో మ‌రి.

"ఎసిడిటీ"ని తగ్గించే "ఏలక్కాయ"!

సాధారణంగా ఏలక్కాయను వంటల్లో సువాసన కోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయని ఆరోగ్యం నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుందట.

 
వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపులో ఒడుదొడుకులు అదుపులోకి వస్తాయి. అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
     
జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. అలాగే, తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది.

Friday, November 21, 2014

"సినిమాలకు గుడ్‌బై" చెప్పనున్నఇలియానా ?

ఇలియానా సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా అంటే... అవుననే బాలీవుడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. తన చెలికాడైన ఆండ్రూని త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వాడిగా వార్తలు వచ్చేశాయి. ఎంతగా వార్తలు వస్తున్నా... అదేమీ లేదని ఒకవైపు అంటూనే... పెళ్లి అనేది జీవితంలో మరచిపోలేని భాగమని త్వరలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడిస్తోంది ఇలియానా.
 
అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు కూడా ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో పెళ్లయిన తర్వాత నటిగా కొనసాగేవారు చాలా అరుదనీ, ఆ అవకాశం మళ్లీ వస్తే తప్పకుండా చేస్తానని మాత్రం చెబుతుందని తెలియవచ్చింది. 
 
ఇప్పటికి సినిమా రంగంలోకి వచ్చి పదేళ్ళు పూర్తయింది. ఇప్పటికే చాలామంది కొత్తతరం వచ్చారు. అయినా ఆమె హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె సన్నగా వుందనీ, డైటింగ్‌ చేస్తుందనీ, ఏవోవో కథనాలు వస్తున్నాయి. వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే తప్పనిసరిగా ఓ ఇంటిది అవ్వాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

బరువు తగ్గాలంటే.. యోగాలో "అగ్నిముద్ర"ను వేయండి!

బరువు తగ్గాలా... కోపాన్ని అదుపు చేసుకోవాలా.. అయితే యోగా చెబుతున్న అగ్ని ముద్రను ట్రై చేయండి. అగ్ని ముద్ర శరీరంలో 'అగ్ని' అంశం సంతులనం కోసం ఉంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మాత్రమే ఈ ముద్రను చెయ్యాలి. ఇది బరువు తగ్గడం కొరకు బాగా సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ యొక్క విధానాన్ని వేగవంతం చేస్తుంది.
 
ఇక జ్ఞాన్ ముద్ర ఏకాగ్రత కోసం ప్రాథమిక యోగ ముద్రగా ఉంది. ఉదయం పద్మాసనంలో కూర్చుని ఈ ముద్రను చేయాలి. ఈ ముద్ర ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది నిద్రలేమి నివారణతో పాటు కోపాన్ని అదుపులో ఉంచుతుంది. 


Thursday, November 20, 2014

బస్సు లేదా కారు ప్రయాణంలో "వాంతులవకుండా" ఉండాలంటే ?

బస్సు లేదా కారులో ప్రయాణాలు చేస్తుంటేనో లేదంటే తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుందామని వెళుతున్నప్పుడో చాలామంది వాంతులు చేసుకుంటూ కనబడుతుంటారు. కొందరిలో ఈ వాంతులు మరీ విపరీతంగా అవుతుంటాయి. దీంతో నీరసం పెరిగి ప్రయాణాలు చేయాలంటేనే అయిష్టత కలుగుతుంది. ఇలాంటి వారు ప్రయాణానికి ముందుగా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం మంచిది. దీంతోపాటు నిమ్మకాయను వెంట తీసుకువెళితే మరీ మంచిది. ప్రయాణం చేసే సమయంలో నిమ్మకాయ వాసన చూస్తూ ఉండండి. 
 
ప్రయాణానికి ముందుగా ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవద్దు. అలాగే కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. ఇలాంటివి తీసుకోవడం వ్లల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి. అలాగే ఛీజ్ మరియు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పాలు మరియు పాల పదార్థాలను కూడా ప్రయాణానికి... అంటే వాంతులు చేసుకునే సమస్య ఉన్నవారు తీసుకోకుండా ఉండటం మంచిది. 
 
అలాగే వాంతులవుతాయన్న ఆలోచనను పక్కనబెట్టి ఏదైనా పుస్తకాన్ని చదివేందుకు ప్రయత్నించండి. లేదా మీ తోటి ప్రయాణీకులతో మాట్లాడండి. దీంతో వాంతులవుతాయన్న ఆలోచన తొలగిపోయి మీ ప్రయాణం సుఖవంతంగా జరుగుతుంది. ప్రయాణాల్లో వాంతులతో సతమతమయ్యేవారు ప్రతి రోజు పరకడుపున ఓ చెంచా తేనెను సేవిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

"ఎన్టీఆర్" సినిమాలో "విలన్" గా శ్రీశాంత్ ?ఆమధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ప్లేయర్ శ్రీశాంత్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాచ్ ఫిక్సర్ టాలీవుడ్ వెండితెరపైకి రాబోతున్నట్లు సమాచారం. ఆ మధ్య ఇతగాడు హైదరాబాద్ రావడం , పూరి జగన్నాథ్ ముచ్చటగా కట్టించుకున్న కేవ్ లో అతన్ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ కి ఓ కారణం ఉన్నదనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే….ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా శ్రీశాంత్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో శ్రీశాంత్ విలన్ గా ఎంచుకున్నాడట పూరి. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీశాంత్ ఇక క్రికెట్ ఎలాగు ఆడే అవకాశం లేదు కాబట్టి శ్రీశాంత్ నటుడిగా స్థిరపడిపోయే అవకాశం ఉన్నదని అనుకోవచ్చు.

Wednesday, November 19, 2014

"చెరకు రసం"తో పెద్ద వ్యాధులు సైతం బలాదూర్!!!

చెరకురసం లేదా చెరకు జ్యూస్ చూడగానే వెంటనే తాగేయాలనిపిస్తుంది. చెరకురసానికి  నిమ్మరసం, కొన్ని ఐస్ ముక్కలు వేసి త్రాగితే ఆహా... ఎంత రుచిగా ఉంటుంది. గతంలో చెరకు లేదా చెరకు రసాన్ని పల్లెటూర్లలోనే చూస్తున్నాం. కానీ ప్రస్తుత కాలంలో పట్టణాలు, నగరాల్లో కూడా షుగర్ కేన్ స్టాల్స్ ఏర్పడ్డాయి. మనం అక్కడ చూస్తుంటాం. చెరకు నుండి రసాన్ని వేరు చేసి అమ్ముతుంటారు. మీకు తెలియాల్సిన ఓ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇందులో ఆరోగ్యానికి సహాయపడే గుణాలు చాలా ఉన్నాయి. ఈ సంక్రాంతి రోజుల్లో ప్రతి ఇంటా చెరకు నిల్వ ఉంటుంది. పొంగల్ సెలబ్రేషన్స్ లో చెరకు అతి ముఖ్యంగా ఉపయోగిస్తారు.  ఈ చెరకు రసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినిరల్స్, విటమిన్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. చెరకు రసం పిల్లలు, పెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చెరకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన జబ్బులను ఇది నివారిస్తుంది. అవేంటో చూద్దాం...

కామెర్లకు విరుగుడు: సుగర్ కేన్ జ్యూస్(చెరకు రసం) కామెర్లును సహజంగా నయం చేసే ఒక ఔషధం. రక్తంలోని బిల్లిరుబిన్ కారణంగా కామెర్లు ఏర్పడి చర్మం పొరలు పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ పనితీరు సరిగా లేకపోవడం మరియు పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు కారణం అవుతుంది. కాబట్టి దీని నుండి బయట పడటానికి ఒక గ్లాసు చెరకు రసంకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి.

ఇన్ఫెక్షన్(వ్యాధులు): అనేక రకాల వ్యాదులు ఉదా: డయోరియా, మూత్ర మార్గ అంటువ్యాధులు, కడుపు(జీర్ణ) లేదా గుండె సంబంధించిన వ్యాధులు, లైంగిక సంక్రమణ, వాపు ఇటవుంటి వ్యాధులకు చెరకు రసం బాగా నయం చేయవచ్చు.

కిడ్నీ(మూత్రపిండం)లో రాళ్ళు: చెరకు రసంతో ఇది చాలా ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనం. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు విచ్చినం చేయడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ ద్రవాలను మరియు చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవడానికి చెరకు రసం ఉపయోగపడుతుంది.

న్యూట్రిషియన్ బెనిఫిట్స్: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం.

జలుబు, జ్వరం మరియు గొంతు నొప్పి: మీరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం హానికరం అని భావిస్తే అది తప్పే. ఇటువంటప్పుడు ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
 
క్యాన్సర్ నివారిణి: ఇందులో ఆల్కలీన్ కలిగి ఉండటం వల్ల, చెరకు రసం ముఖ్యంగా ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల లేదా రొమ్మక్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. 8. రీహైడ్రేషన్: సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువగా నీరు త్రాగరు. దాంతో డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. కాబట్టి శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది. ఇంకా వేసవి కాలంలో చెరకు రసం త్రాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.
 
నిర్జలీకరణం: శరీరం నుంచి అధిక మోతాదులో నీరు నష్టపోవడాన్ని నిర్జలీకరణం అంటారు. మన శరీరం లో ఉన్న వ్యవస్థలు పని చేయడానికి నిర్ణీత మోతాదులో నీరు అవసరం. కనీసం 8 గ్లాసుల నీరు రోజుకు అవసరం ఈ అవసరం మనిషి రోజు చేసే పని,వయసును బట్టి మారుతూ వుంటుంది. కాబట్టి నీటికి బదులుగా చెరకు రసం తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు.

దంతక్షయానికి: పిల్లలు, పెద్దలు స్వీట్స్ , ఆహారం తీసుకొన్న తర్వాత చిగుళ్లలో ఉండిపోయి వాటి ద్వారా పళ్ళు సందుల్లో బ్యాక్టీరియా వ్యాపించి, ఈ బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలతో పళ్ళకు రంధ్రాలు పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి చెరకు రసం తీసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడి, దంత క్షయాన్ని పోగొడుతుంది.

బాడీ వెయిట్: చెరకు రసం తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధకత పెంచి, జీవక్రియలు క్రమంగా జరిగి శరీరపు బరువును క్రమబద్దంగా ఉంచుతుంది.


నాతో "పడుకోవాలన్న" దర్శకుడు ? సుర్విన్ చావ్లా !

నా జీవితంలో ఒకానొక ఫేజ్ లో ప్రతీ రోజు చాలా ఇండీసెంట్ ప్రపోజల్స్ ని ఎదుర్కొన్నాను. అదృష్టవశాత్తు అవేమీ ముంబైలో ఎదురుకాలేదు. అయితే సౌత్ లో మాత్రం టాప్ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరక్టర్ కు ఏజెంటని చెప్పుకునే ఓ వ్యక్తి మాత్రం అలాంటి ప్రపోజల్ పెట్టాడు. మా సార్ నీతో సినిమా జరుగుతున్నంత సేపూ రిలేషన్ పెట్టుకుంటారు,నువ్వు నీ క్యారెక్టర్ ని బాగా అర్దం చేసుకోవటానికి అది కుదురుతుంది.ఇష్టమైతే చెప్పు అంటూ ఆఫర్ ఇచ్చాడు. కానీ తిరస్కరించాను అంటోంది సుర్విన్ చావ్లా.

 హేట్ స్టోరీ 2 తో పాపులర్ అయిన ఆమె తెలుగులో రాజు-మహారాజు చిత్రం చేసింది. ఆమె మాట్లాడుతూ... ఎప్పుడైతే అలాంటి రిలేషన్ అంటూ మీడియేటర్ అలాంటి ప్రపోజల్ పెట్టాడో అప్పుడే అర్దమైంది.ఆ డైరక్టర్ నాతో పడుకోవాలని అడుగుతున్నాడని, వెంటనే నేను ఎవరితో ఉండాలో అక్కర్లేదో ఎవరూ డిసైడ్ చేయక్కర్లేదు.నువ్వు నోరు మూసుకో అన్నాను.అంటూ చెప్పుకొచ్చింది. సౌత్ డైరక్టర్ అంటూ ఆమె చేసిన ఈ ఆరోపణలు ఏ దర్శకుడు గురించి అనేది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రిలో రకరకాల గుసగుసలకు దారి తీసింది.Tuesday, November 18, 2014

"రక్తదానం" చేస్తే పొందే "గొప్పప్రయోజనాలు"!!!


 గుండె జబ్బులను నివారిస్తుంది:- రక్తం దానం చేయడం వల్ల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం దానం చేయడంవల్ల కార్డియో వ్యాస్కులార్ డిసీజెస్ నుండి మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తం ఐరన్ శాతాన్ని పెంచి గుండె జబ్బులను నివారిస్తుంది.

అధిక కాలరీలను కరిగిస్తుంది:- రక్తంను రెగ్యులర్ బేసిస్ లో దానం చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోగులుగుతారు?ఒక పాయిట్ రక్తదానం వల్ల 450ml పౌండ్లు తగ్గవచ్చని అంటున్నారు. అంటే 450ml రక్తం దానం చేయడం వల్ల మీరు 650 క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది:- రక్తం రెగ్యులర్ గా దానం చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. అందులోనూ, లివర్, లంగ్స్, కోలన్, స్టొమక్ మరియు థ్రోట్ క్యాన్సర్లనుండి మనల్ని రక్షిస్తుంది.

కొత్తరక్తం ఉత్పత్తికి సహాయపడుతుంది:- రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా కొత్త రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. రక్త దానం వల్ల కొత్త రక్త కణాల ఏర్పాటు వల్ల మరింత ఆరోగ్యంగా మరియు ఎఫెక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

మనస్సును స్థిరంగా ఉంచతుంది:- రెగ్యులర్ గా రక్తం దానం చేయడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది.అంటే మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను ఏర్పరుస్తుంది.

ఎక్కువ ఐరన్:- ఎవరి శరీరంలోనైనా అధిక ఐరన్ తో బాధపడుతున్నప్పుడు, అటువంటి వారు రెగ్యులర్ బేస్ లో రక్తం దానం చేయడం వల్ల గుండెను రక్షించుకోవచ్చు. రెగ్యులర్ గా రక్తం దానం చేయడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న ఐరన్ శాతం తగ్గుతుంది. దాంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

హెల్త్ చెకప్ బెనిఫిట్స్:- ఏదైన ప్రమాధకర వ్యాధులు వ్యాప్తి చెందినప్పుడు రక్తంను టెస్ట్ చేస్తారు మరియు  రక్తం దానం చేసే వ్యక్తికి ముందుగానే ఎటువంటి జబ్బుల బారినైనా  పడినాడా  లేదా ఇంతకు ముందే ఏవైనా టెస్ట్స్ చేయించాడా అన్న విషయాన్ని వైద్యులకు ముందే తెలియజేయాలి.

పెద్దవయస్సు వారికి:- చాలా మంది పెద్దవారు, ఆరోగ్యంగా ఉన్నవారు రక్తం రెగ్యులర్ గా ధానం చేయడం వల్ల మరింత బెటర్ గా ఫీలవుతారు. సంతోషంగా, ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:- రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా, శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మరియు ఎవరైనా అధిక రక్తపోటు(హై బిపి)తో బాధపడుతున్నట్లైతే వారిలో కూడా హైబిపి తగ్గిస్తుంది.

వ్యాధులను కనుగొనవచ్చు:- స్వల్పకాలిక, లేదా దీర్ఘకాలిక ఎటువంటి జబ్బులున్నా రక్తం దానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. రక్తం ధానం చేయడానికి ముందు మీ నుండి శాంపిల్ తీసి పరీక్షించిన తర్వాత, మీ రక్తం ఫర్ ఫెక్ట్ గా ఉన్నప్పుడే, మీ రక్తాన్ని గ్రహిస్తారు.


"డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు" 'జబర్థస్త్' పై కృష్ణభగవాన్?

 వర్ధమాన హాస్యనటులపై సీనియర్ కమెడియన్ కృష్ణభగవాన్ విరుచుకుపడ్డారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రస్తుతం అంతా చీప్ కమెడియన్స్ వస్తున్నారని కృష్ణ భగవాన్ ఫైర్ అయ్యారు. వీరంతా కామెడీ అనే పదం పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చీప్ కామెడీని నమ్ముకుని వస్తున్న ప్రస్తుత తరం నటులకి అసలు 'కామెడీ టైమింగ్' అంటే ఏమిటో తెలియదని కృష్ణభగవాన్ మండిపడ్డాడు. టీవీలో వచ్చే కామెడీ షోలలో కాస్త పేరు రాగానే, వీరికి సినిమాల్లో ఈజీగా అవకాశాలు వస్తున్నాయని... దీంతో, వీరంతా సూపర్ స్టార్లలా ఫీలయిపోయి సినిమా సెట్స్‌లో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

హాస్యనటులు సినిమాల్లో ఆడవేషాలు వేయడం కొత్త కాదని, అయితే టీవీ షోలలో కమెడియన్లు ఆడ వేషాలు వేసినప్పుడు చాలా వల్గర్‌గా చేస్తున్నారని ఆయన విమర్శించారు. 'జబర్థస్త్' టీవీ షోలో చేసే కమెడియన్స్‌ను ఉద్దేశించే కృష్ణ భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరి కృష్ణభగవాన్ డబుల్ మీనింగ్ కామెడీ సంగతేంటో?

Monday, November 17, 2014

రాజమౌళిని "టెన్షన్" పెడుతున్న ప్రభాస్ ?


బాహుబలి సినిమా కోసం గత రెండేళ్లుగా  ఎన్నో సినిమా అవకాశాలని వదులుకొని కేవలం బాహుబలి సినిమాకోసం పనిచేస్తున్న ప్రభాస్ అలవాటు రాజమౌళికి తలనొప్పిగా మారింది. ఏకాగ్రతకు, పట్టుదలకు చిరునామాగా ఉండే రాజమౌళి తాను దర్శకత్వం వహిస్తున్న బాహుబలి సినిమా విషయంలో అత్యంత గోప్యంగా ఉంటూ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేస్తున్నాడు. అలాగే ఎలాగైనా ఈ సినిమాకి సంబందించిన స్టిల్స్ బయటకి రాకుండా యూనిట్ సభ్యులందరిని కెమెరాలు , సెల్ ఫోన్స్ షూటింగ్ స్పాట్ లో వాడద్దు అంటూ కండిషన్స్ పెట్టాడు.

 ఇప్పటివరకు పని రాక్షసుడిగా మారిన రాజమౌళి మాటలు అందరూ తూచా తప్పకుండా పాటించారు. అయితే తాజాగా ప్రభాస్ కు అలవాటు పడిన ఫోటోగ్రఫీ హాబీ రాజమౌళికి చిరాకు పెడుతుందని టాక్. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ ఈమధ్య షూటింగ్ స్పాట్ కు తన కెమెరాతో వచ్చి షూటింగ్ స్పాట్ గ్యాప్ దొరికినప్పుడల్లా వరుస పెట్టి ఫోటోలు తీస్తూ ఉండడంతో ప్రభాస్ కు అలవాటు అయిన ఈ కొత్త హాబీ రాజమౌళికి తల నొప్పిగా మారి ఎక్కడ ఈ సినిమా షూటింగ్ ఫోటోలు లీక్ అయిపోతాయో అనే టెన్షన్ పడుతున్నాడని టాక్.

Saturday, November 15, 2014

హీరోయిన్‌‌ను "రేప్" చేసిన నిర్మాత ?


హీరోయిన్ ఛాన్స్ కోసం, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతలను, మహిళలను లోబరుచుకుని తమ కామ వాంఛ తీర్చుకునే కొందరు నిర్మాతలు, దర్శకులు వ్యవహారాలు తరచూ బయట పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత ఏకంగా తన సినిమాలో హీరోయిన్‌గా నటించే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కామాంధ నిర్మాతపై ధైర్యంగా పోలీసులను ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...
 ముంబై పోలీసుల కథనం ప్రకారం, రమేష్ సింగ్ అనే మరాఠీ సినిమా ప్రొడ్యూసర్ 33 సంవత్సరాల ఓ యువతికి తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. పూణెకు చెందిన సదరు మహిళ నార్త్ ముంబైలోని గురెగాన్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తోంది. ఇటీవల ప్రొడ్యూసర్ రమేష్ సింగ్ ఆమెకు ఫోన్ చేసి కలిసి లంచ్ చేద్దామని, అదే విధంగా సినిమా అగ్రిమెంటుకు సంబంధించిన అమౌంట్ సెటిల్ చేస్తానని ఆమెను పిలిపించాడు. ఆమె తన వద్దకు వచ్చాక ఫైనాన్సియర్ దహిసర్ ప్రాంతంలోని గెస్ట్ హౌస్‌లో ఉన్నాడని నమ్మించి అక్కడికి తీసుకెళ్ళాడు. తనను అక్కడికి తీసుకెళ్లాక సింగ్ రేప్ చేసాడని సదరు మహిళ కంప్లైంట్ చేసిందని ఓషివరా పోలీస్ స్టేషన్ పిఎస్‌ఐ విజయానంద్ తెలిపారు. ఆ దారుణం జరిగిన తర్వాత అపార్టు‌మెంటుకు చేరుకున్న సదరు మహిళ పూణెలోని తన పేరెంట్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పిందని, పేరెంట్స్ సలహా మేరకు ఫిర్యాదు చేసారని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్మాత రమేష్ సింగ్‌‍ను అరెస్ట్ చేసారు.ప్రొస్టేట్ కేన్సర్ రిస్క్ తగ్గాలంటే ?

 20 మంది మహిళలలతో పురుషుడు సెక్సులో పాల్గొంటే అతడికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 28% మేర తగ్గిపోతుందట. ఈ అధ్యయనం కెనడాకు సంబంధించిన పరిశోధకులు చేసి, పలువురు పురుషులను పరిశీలించిన అనంతరం వెల్లడించినట్లు కేన్సర్ ఎపిడమాలజీ జర్నల్ తెలిపింది. దీనికి కారణం అంతమంది మహిళలతో సెక్సులో పాల్గొనేవారు ఎక్కువసార్లు వీర్యాన్ని స్ఖలిస్తారు కనుక వీర్యంలో ప్రొస్టేట్ కేన్సర్ కారక ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుందని వారు తెలుసుకున్నారు.

అయితే కొన్ని దేశాల్లో ఇలా ఎక్కువమంది స్త్రీలతో సెక్స్ చేసే పరిస్థితి ఉండదనీ, అలాంటి దేశాల్లో మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారని చెపుతున్నారు.

అధ్యయనంలో భాగంగా సెక్స్ పరీక్షల్లో పాల్గొన్న పురుషుల్లో ఎక్కువమంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో ప్రొస్టేట్ కేన్సర్ అవకాశాలు తక్కువగా కనబడగా భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో కొంతమందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు తేలింది. ఐతే ఇది కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తుందని పరిశోధకుల మాటలను బట్టి తెలుస్తుంది.

Friday, November 14, 2014

"కన్నతల్లి జీవించి ఉండగానే గుడి కట్టిస్తున్న" లారెన్స్ !


 కన్నతల్లి అంటే ఎంతో ప్రేమ వుంటుంది. దాని విలువ వెలకట్టలేం.. ఆమెకు ఎంత చేసినా తక్కువే. ఈ మాటలు నృత్యదర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌... హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా మీడియాతో చెప్పే మాటలు. ప్రతి ప్రెస్‌మీట్‌ ముందు అమ్మను తలచుకుంటూనే వుంటాడు.

సినిమా ఆరంభంలో కూడా అమ్మ ఫొటోకు నమస్కరించి.. ఆ తర్వాత దేవుడి పటాలపై ముహూర్తపు షాట్‌ చిత్రిస్తానని చెప్పేవాడు. ప్రస్తుతం తన తల్లికి ఓ గుడి కట్టిస్తున్నట్లు చెన్నైలో పత్రికా ప్రకటన విడుదల చేశాడు. ఆమె బతికుండగానే గుడి కట్టడం ఆమెకు నేనిచ్చే చిరు కానుక అంటున్నాడు.

చెన్నై సమీపంలోని మేవలూర్‌కుప్పం గ్రామం లారెన్స్‌ తండ్రి స్వస్థలం. అక్కడే విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయించాడు. ఇందుకు రాజస్థాన్‌లో విగ్రహ పనులు అప్పగించాడు. వచ్చే ఏడాది తన పుట్టిరోజు నాటికి అంటే 2015.. అక్టోబర్‌ 29న నాటికి పూర్తిచేస్తానని చెబుతున్నాడు.

"గురక"కు చెక్ పెట్టాలంటే ?

గురకకు కారణం ముక్కు లేదా గొంతుకు అడ్డంకి, గొంతువాపు, ఊబకాయం లేదా నిద్రించే స్థానాలు సరిగ్గా లేనప్పుడు వస్తుంది. దీనిని దూరం చేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి. 

 
* ఫుల్‌గా గొంతుకాడికి తినేసి వెంటనే నిద్రకు ఉపక్రమించడం చేయకూడదు. రాత్రి సమయంలో భారీగా ఆహారం తీసుకోవడాన్ని మానుకోవాలి. 
 
* కాఫీ, టీలను మానేసి హెల్ద్ డ్రింక్స్ తీసుకోవాలి. జ్యూస్ లాంటి వాటిల్లో తేనెను కలిపి తీసుకోవడం ద్వారా గురకను దూరం చేసుకోవచ్చు.
 
* ఆలివ్ ఆయిల్ మృదువైన అంగిలి నొక్కిపెట్టి లేకుండా చేయుట వలన గురక తగ్గుతుంది. మద్యంను తీసుకోకపోవడం, పాలఉత్పత్తులు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా గురకను తగ్గించేయవచ్చు. 
 
* టీ గురక నివారించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది గొంతు రద్దీని తగ్గిస్తుంది. సీమ చామంతి టీ, గ్రీన్ టీ, పుదీనా టీ, సాధారణ బ్లాక్‌ టీలను ప్రయత్నించవచ్చు. ఇంకా గురక ఆపాలంటే.. నిమ్మ తేనెను జోడించవచ్చునని ఆరోగ్య నిపుణలు అంటున్నారు.

Thursday, November 13, 2014

"దొంగతనం" చేస్తూ దొరికిపోయిన "హీరోయిన్" ?


 సెలబ్రెటీ స్ధాయిలో ఉన్నవాళ్ళకు ఉండే గౌరవ మర్యాదలు వేరు.వాళ్ళూ దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూంటారు. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా మీడియా మూడో కన్ను తెరిచి, కెరీర్ ని మార్చి బూడిద చేసేందుకు ప్రయత్నిస్తూంటుంది. అయితే ఒక్కోసారి ఇతర దేశాల్లో మనని ఎవరు పట్టించుకుంటారులే అని చేసే పనులే వారిని పట్టిస్తూంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి సింగపూర్ లో చోటు చేసుకుంది. షాప్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగాళి హీరోయిన్ స్వస్దిక్ ముఖర్జీ.. ఓ ఫిల్మ్ ఫెస్టవల్ కి సింగపూర్ కి వెళ్లింది. తన బోయ్ ప్రెండ్,ఫిల్మ్ మేకర్ అయిన సుమన్ ముఖర్జీతో కలిసి షాపింగ్ కు వెళ్లింది. అయితే అక్కడ ఓ షాప్ లో దొంగతనం చేసిందట. ఈ విషయం షాపు నిర్వాకులు కనిపెట్టి పట్టుకున్నారని ఆరోపణ. US$225 విలువైన సామాను లేపేసిందని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆ షాప్ ఓనర్ అప్సర ఓస్వల్...ఫిల్మ్ ఫెస్టివల్ అధారిటీలకు సిసిటీవి ఫుటేజ్ తో సహా పంపి తెలియచేసారట. ఇక ఈ విషయాన్ని అరిందమ్ సిల్..కహానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఖరారు చేసారు. ఫెస్టివల్ అధారిటీ లో భాగమైన తాను ఈ ఫుటేజిని చూసానని చెప్పారు. అంతేకాక ఆ షాప్ ఓనర్ తన ప్రెండ్ అని తెలియచేసారు. అయితే ఈ విషయమై పోలీస్ కంప్లైట్ ఇవ్వలేదుట. తన బోయ్ ప్రెండ్ తో కలిసి సోమవారమే హోటల్ రూమ్ ని వెకేట్ చేసిందిట. మరి ఈ విషయమై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటున్నారు బాలీవుడ్ వాసులు.


ఫిష్ ఆయిల్ రోజూ తీసుకో! కొవ్వును విచ్ఛిన్నం చేసుకో !!

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఫిష్ ఆయిల్ లేదా ఫిష్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫిష్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. 
 
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, డెకాసహెక్సానిక్ ఆసిడ్స్, లినోలెనిక్ ఆసిడ్స్, శరీరంలో కొవ్వు నిల్వలను, నడుము చుట్టును ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది . ఫిష్ ఆయిల్ తీసుకోలేకపోతే, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న చేపలను తీసుకోవాలి.
 
* 6 గ్రాముల ఫిష్ ఆయిల్‌ను ప్రతి రోజూ తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టినట్లవుతుంది. 
* ప్రత్యామ్నాయంగా, ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన సాల్మన్ లేదా మెకరెల్ ఫిష్‌ను వారంలో రెండు సార్లు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


 

Wednesday, November 12, 2014

"పవనిజం"పై జబర్దస్త్ కామెడీ స్కిట్ !

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఆయన ఫ్యాన్స్ వారిని వదిలిపెట్టరనేదానికి ఇది మరో నిదర్శనం అని చెప్పవచ్చు. జబర్దస్త్ ప్రోగ్రాంలో జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో పవన్ మాట్లాడిన తీరును అనుకరిస్తూ ఓ కామెడీ స్కిట్ ను ప్రసారం చేయాలని ప్రోగ్రాం నిర్వాహకులు అనుకున్నారట.

దీనికి సంబంధించిన ప్రోమోలను వెబ్ సైట్లలో ప్రమోట్ కూడా చేశారట. ఐతే వాటిని చూసిన పవన్ ఫ్యాన్స్ మండిపడినట్లు సమాచారం. దాంతో జబర్దస్త్ ప్రోగ్రాం నిర్వాహకులు ఎందుకొచ్చిన గొడవని దాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టేసిన తెలుస్తోంది. పవన్ కళ్యాణా మజాకా...?

వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలంటే ?

వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా? గ్లోయింగ్ స్కిన్ కావాలా అయితే రోజూ ఓ గ్లాసు క్యారెట్, టమోటా జ్యూస్ తీసుకోండి. ఎందుకంటే ఈ క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్‌ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. యంగ్‌గా ఉంచుతుంది. 
 
అలాగే టమోటా జ్యూస్ కూడా చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. టమోటో జ్యూస్ మన శరీరానికి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్‌ను వేరు చేసే మూలకం పొటాషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు లైకోపిన్ అనే లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీక్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి కాంతినిస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. 

Tuesday, November 11, 2014

పనికిమాలిన సినిమా "హ్యాపీ న్యూ ఇయర్" ?


ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ తాజా సినిమా ‘హ్యాపీ న్యూఇయర్' బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, దీపిక, అభిసేక్ బచ్చన్, బోమన్ ఇరానీ మఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీవసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లో దాదాపు 237 కోట్లు వసూలుచేసి, 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తక్కువ కాలంలోనే రూ. 300 కోట్లు సాధించిన ఘనతకు అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే అమితాబ్ భార్య జయ బచ్చన్ మాత్రం షాకింగ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ చిత్రాన్ని పనికిమాలిన సినిమాగా పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో తాను చూసిన పనికిమాలిన సినిమా ఇదేననీ, కేవలం తన కొడుకు అభిషేక్‌ నటించినందునే ఆ సినిమాని తాను చూశాననీ ఆమె ఆ సినిమాను ఎండగట్టారు. ఇదివరకు సినిమా అంటే కాస్త కళాదృష్టి కూడా ఉండేదనీ, ఇప్పుడు దాన్ని కేవలం వ్యాపారంగానే భావిస్తుండటం వల్లే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని చురకలంటించారు. స్వయంగా జయ బచ్చన్ ఈ కామెంట్స్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.


ఏ రోజు మరణిస్తారో ? చెప్పేసే యాప్ !

పుట్టిన వానికి మరణం తప్పదు... మరణించిన వానికి పుట్టుక తప్పదు అని కృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ ఆ మరణం ఎప్పుడు వస్తుందోనని చాలామంది భయపడుతుంటారు. కొందరు మరణం తప్పదు కదా... అని అంటుంటారు. ఐతే తమతమ మరణం ఎప్పుడు సంభవిస్తుందోనన్న ఆలోచన చాలామందిలో మెదులుతుందనేది వాస్తవం. అలాంటి వారికోసం కొత్తగా ఓ యాప్ వచ్చేసింది. 
 
డెడ్ లైన్ అనే పేరుతోనే వచ్చేసిన ఈ యాప్ ను ఐఫోన్లో అప్ లోడ్ చేసుకుని, అందులో ఉన్న హెల్త్ కిట్ టూల్ నుంచి జోడించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని అది సదరు వ్యక్తి ఏ రోజు మరణిస్తారో చెప్పేస్తుంది. ఐతే అది దేన్ని ఆధారం చేసుకుని మరణ తేదీని చెపుతుందంటే... ఆరోగ్య పరిస్థితిని, దాన్ని ఆధారం చేసుకుని ఆయుఃప్రమాణం అంచనా వేసి ఫలానా అప్పుడు మరణం సంభవించే అవకాశం ఉందని చెప్పేస్తుందట. ఈ విషయాన్ని యాప్ రూపకర్తలు చెప్పారు. 
 
హెల్త్ కిట్ టూల్ లో మరణ తేదీని కనుగొనగోరే వ్యక్తి తను ఎంతసేపు పడుకుంటున్నాడు... ఎంతసేపు వ్యాయామం చేస్తున్నాడు..? ఇత్యాది వివరాలను అందులో జోడించాల్సి ఉంటుంది. వాటిని ఆధారం చేసుకుని ఈ యాప్ డెడ్ లైన్ చెప్పేస్తుంది. ఈ యూప్ రూపకర్త జస్ట్ ఎల్ఎల్ సీ సంస్థ దీనిపై మాట్లాడుతూ... ఇది ఇచ్చే సూచనలను బట్టి ఆయుర్దాయం పెంచుకోవచ్చన్నారు.

Monday, November 10, 2014

సీఎం, హోం మంత్రుల కూతుళ్లను "రేప్‌" చేస్తే..? ఈశ్వరప్ప


 బీజేపీ నేత, కర్ణాటక  ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప రేప్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగుల కోసమే టీవీ ఛానళ్లు రేప్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలను ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి, హోం మంత్రుల కూతుళ్లను రేప్ చేస్తే వారికి ఆ బాధ తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆ రాష్ట్రంలో దుమారం రేగింది.

ఈశ్వరప్ప మాటలు చౌకబారుగా ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. తమ పార్టీ నేత ఇలా మాట్లాడి ఉండకూడదు అంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. దీంతో, తన తప్పును గ్రహించిన ఈశ్వరప్ప... తనకు మహిళలంటే ఎంతో గౌరవమని... సీఎం, హోంమంత్రి కూతుళ్లు తనకు చెల్లెళ్లతో సమానమని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని మాట మార్చారు.

"చావుకు భయపడేది లేదంటున్న కమల్‌హసన్‌"

కమల్‌ హాసన్‌ నటించిన చిత్రం 'ఉత్తమవిలన్‌'. ఈ సినిమాను తన గురువు కె. బాలచందర్‌గారికి గురుదక్షిణగా ఇస్తున్నట్లు కమల్‌ ప్రకటించాడు. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

ఊర్వశి. పార్వతి మీనన్‌, ఆండ్రియా తదితరులు నటిస్తున్నారు. సినిమా
గురించి చెబతూ...నేనెప్పుడూ చావుగురించి భయపడను. ఎందుకంటే చావు జీవితంలో భాగం. వాక్యానికి ఎక్కడో చోట ఫుల్‌స్టాప్‌ వుంటుంది. జీవితంలో చావుకూడా అంతే ఉత్తమవిలన్‌ కథ కూడా ఇదే అంటూ తేల్చేశారు.

తక్కువ బడ్జెట్ లో "గేరు లేని కార్లు"

కార్లంటే గేర్లు ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పెరిగిపోతున్న ట్రాఫిక్ లో నగర రోడ్లపై గేర్ ఉన్న కార్లను నడపాలంటే కష్టమే. అందుకే కంపెనీలు ఆటోమేటిక్ కార్లపై దృష్టిపెట్టాయి. తక్కువ బడ్జెట్ లో కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లు ఏంటో ఓ సారి చూద్దాం.

1. మారుతీ సుజుకీ కొత్త అల్టో కె 10 : అల్టో కె 10లో మార్పులు చేర్పులు చేసింది మారుతీ. ఈ కొత్త కె 10 కారు వచ్చే నెల్లో మార్కెట్లోకి రానుంది. సెలీరియో తరహాలో ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉండటం ప్రత్యేకత. అంతేకాదు పాత అల్టో తో పోలిస్తే ఈ కొత్త కె-టెన్ 75 కిలోల బరువు తగ్గించుకొని లైట్ వెయిట్ తో డిజైన్ చేయబడింది. అంతేకాదు మంచి ఇంధన సామర్థ్యం కూడా ఇవ్వగలదని ప్రకటించింది. ఈ గేర్ లేని కారు లీటర్ కు 24 కి.మీ మైలేజీ ఇవ్వగలదు. ధర కూడా రూ.3-3.5 లక్షల లోపు ఉండవచ్చని భావిస్తున్నారు.

2. మారుతీ సుజుకీ సెలీరియో : AMT ఫీచర్ తో వచ్చిన తొలికారు సెలీరియో. దేశంలోనే మొదటిసారిగా మారుతీసుజుకీ ఈ కారును ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఈకారు మంచి రైడ్ ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇక మైలేజీ లీటర్ కు 23.1 కి.మీ ఇస్తోంది. ధర రూ. 4.49 లక్షలుగా ఉంది.

3. మారుతీ సుజుకీ రిట్జ్ : రిట్ట్ జలో ఆటోమేటిక్ వర్షన్ VXi వేరియంట్ లో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ , పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, ఏబీఎస్, ఈబీడీ, 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 5.76 ( ఎక్స్ షోరూం , ఢిల్లీ )

4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 : దేశంలో మారుతీ సుజుకీ తర్వాత ఎక్కువ కార్ల సేల్స్ జరిపేది హ్యుందాయ్. ఇప్పుడు ఈ కంపెనీ కూడా గ్రాండ్ ఐ 10లో 4గేర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను తీసుకువచ్చింది. మారుతీ తరహాలోనే హ్యుందాయ్ కూడా తన లేటెస్ట్ మోడల్స్ లో ఏఎంటీ ఫీచర్ ను తీసుకువస్తోంది. గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్ కారు ధర రూ.5.92 లక్షలు ( ఎక్స్ షోరూం, ఢిల్లీ )

5. హోండా బ్రియో : లుక్ లోనూ, డ్రైవింగ్ పరంగానూ బ్రియో ముచ్చటైన కారని ఆటోమొబైల్నిపుణులు చెబుతుంటారు. సిటీ తరహాలోనే బ్రియోలోనూ iVTEC ఇంజిన్ ఉంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల బ్రియో లీటర్ కు 16.5 కి.మీ మైలేజీ నిస్తుంది. బ్రియో ఆటోమేటిక్ కారు ధర రూ. 6.05 లక్షలు ( ఎక్స్ షోరూం, ఢిల్లీ )

6. నిస్సాన్ మైక్రా : నిస్సాన్ కూడా ఏఎంటీ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. మైక్రా సీవీటీ పవర్ లో 1.2 లీటర్, 75బీహెచ్ పీ, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, కీ లెస్ ఎంట్రీ స్టాట్, బ్లూటూత్ టెలిఫోన్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తదితర ఫీచర్స్ ఉన్నాయి.దీని ధర రూ.6.39 లక్షలు ( ఎక్స్ షోరూం, ఢిల్లీ )

7. టాటా జెస్ట్ : టాటా జెస్ట్ డీజిల్ కారులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. మారుతీ సుజుకీ సిలీరియో తరహాలో అవరసమైతే ఆటోమేటిక్ నుంచి మ్యానువల్ ట్రాన్స్ మిషన్ గానూ మార్చుకోవచ్చు. లీటర్ కు 23 కిమీ మైలేజీ ఇవ్వగల జెస్ట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కారు ధర రూ. 7.3 లక్షలు( ఎక్స్ షోరూం, ఢిల్లీ )


Saturday, November 8, 2014

జయమాలిని గురుంచి...


ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకుల గుండె ఝల్లుమనాల్సిందే..ఆమె హొయలొలికిస్తూ నృత్యం చేస్తే.. ప్రేక్షకుడి మది ఊహల్లో తేలియాడాల్సిందే.. ఇలా దశాబ్దానికి పైగా కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జయమాలిని. 90వ దశకం ప్రథమార్థంలో సినీరంగానికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో భర్తపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు ఆరువందలకి పైగా చిత్రాల్లో నటించిన ఈ ‘జగన్మోహిని’ ఈ మద్య సంతోషం అవార్డ్స్ లో కనిపించి జిగేల్ అనిపించి కొన్ని స్టెప్స్ స్టేజి ఫై వేసి మరొక్కసారి పాతజ్ఞాపకలికి తీసుకెళ్ళింది.
. జయమాలినిగారు నమస్కారం. పత్రికల్లో, టీవీల్లో ఎక్కడా కనిపించడం లేదు. తెలుగు ప్రేక్షకులను మరిచిపోయారా?
తెలుగు ప్రేక్షకులను ఎలా మరిచిపోగలను చెప్పండి (నవ్వుతూ). నా సినిమాలన్నీ అక్కడే కదా!
. మీ అసలు పేరు జయమాలినేనా?
కాదు. నా అసలు పేరు అలమేలు మంగ. మా అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. అందుకే అలమేలుమంగ అన్న పేరు పెట్టింది. అయితే ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో వి
ఠలాచార్య గారు నాకు ‘జయమాలిని’ అని నామకరణం చేశారు. బహుశా నాకు ‘జయం’ కలగాలనే ఆ పేరు పెట్టినట్లున్నా రాయన.
. మీ జన్మస్థలమేది? మీ కుటుంబ నేపథ్యం..?
మా అమ్మ శాంభవిగారిది కాంచీపురం నాయుడుగారి కుటుంబం. మా నాన్నగారు టీకే రామరాజన్‌ గారిది తంజావూరు. మాది సినిమా నేపథ్య కుటుంబమే. నాన్న ‘వినాయక ప్రొడక్షన్స్‌’లో భాగస్వామి. మేం ఎనిమిది మంది సంతానం. ఐదుగురం ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ఎనిమిదిమందిలో పెద్దావిడ జ్యోతిలక్ష్మి, అందరికంటే నేను చిన్నదాన్ని. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే.
. సినిమా రంగంలోకి ఎలా వచ్చారు?
మా మేనత్త టీఆర్‌ రాజకుమారి 1940వ దశకంలో తమిళంలో అగ్రనటి. ఆమె ‘చంద్రలేఖ’, ‘హరిదాసు’ వంటి సినిమాల్లో నటించారు. తొలి తమిళ సినీ డ్రీమ్‌గాళ్‌ ఆమె. మా అంకుల్‌ టీఆర్‌ రామన్న ప్రముఖ దర్శకుడు. ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. లత, రవిచంద్రన్‌ హీరో హీరోయిన్లుగా ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ పేరుతో తమిళ సినిమా తీస్తుండగా ఓ రోజు టీఏ రామన్‌ మా అమ్మవద్దకు వచ్చారు. అందులో హీరోయిన్‌ స్నేహితురాలిగా ఓ పాత్ర వుందని, నన్ను అందులో నటింపజేస్తానని అమ్మని అడిగారు. అప్పటికి నా వయసు పన్నెండేళ్లు. అదే నా తొలిచిత్రం. ఆ సినిమా రిలీజైన తరువాత వి
ఠలాచార్య నా ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడదాని అదృష్టం’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాలని అమ్మని అడిగారు. నేను చాలా పీలగా వుండడంతో పాటలో నటించేందుకు అమ్మ కొంత సందేహించింది. తర్జనభర్జనల తరువాత అమ్మ ఓకే చెప్పింది. అదే నా తొలి తెలుగు సినిమా.
. అంత చిన్న వయసులో వున్న మిమ్మల్ని ఐటమ్‌సాంగ్‌లో నటింపజేయాలని ఆయనకెందు కనిపించింది?
నేను భరతనాట్యం నేర్చుకుని వున్నాను. అప్పటికే అక్క జ్యోతిలక్ష్మి ఐటమ్‌సాంగ్స్‌లో నటిస్తోంది. ఆమెకు డ్యాన్స్‌ నేర్పేందుకు ఇంటికొచ్చిన గురువుల వద్దే నేను కూడా డ్యాన్స్‌ నేర్చుకున్నాను. చాలా చలాకీగా వుండేదాన్ని. ఆ సమయంలో మా ఇంటికొచ్చిన సీనియర్‌ దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ నన్ను చూసి ‘ఈ అమ్మాయిని పెట్టి కూడా నేను సినిమా తీస్తా’ అన్నారు. అన్నట్లుగానే ఆ తరువాత ఆయన సినిమాల్లో నేను నటించాను. అలా నా చలాకీతనం, అందం, నృత్యం.. ఇవన్నీ గమనించే వి
ఠ లాచార్య నాకు అవకాశం కల్పించినట్లున్నారు.
. భరతనాట్యం సినిమాలకే పరిమితమైందా?
నేను చాలా బాగా డ్యాన్స్‌ చేస్తానని అప్పట్లో అందరూ మెచ్చుకునేవారు. నా భరతనాట్య అరంగేట్రం టి.నగర్‌, జీఎన్‌ చెట్టి రోడ్డులో వున్న వాణీమహల్లోనే జరిగింది. నాటి ముఖ్యమంత్రి ఎంజీఆర్‌, ప్రముఖ నటులైన కాంతారావు, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మాతృమూర్తి తదితరులెంతోమంది వచ్చారు. ఒక్క పాట చూసేందుకు వచ్చిన ఎంజీఆర్‌.. కార్యక్రమం చివరి వరకూ వుండి నా నృత్యాలన్నింటినీ వీక్షించారు. ‘అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే వారిని బాగా చూసుకోవాలి కూడా’ అని ఎంజీఆర్‌ నా అరంగేట్రం సందర్భంగా సూచించారు. నేనెప్పుడూ ఆయన మాటల్ని పక్కనబెట్టలేదు. చివరి వరకూ మా అమ్మ నా వద్దనే వుంది. సినిమాలు చేసేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పట్టణాల్లో అనేక చోట్ల నేను నృత్యం చేశాను. నా ప్రోగ్రామ్‌ అంటే జనం విరగబడి వచ్చేవారు. అప్పటికి సినిమాల్లో పెద్దగా పేరు రాకపోయినా నా డ్యాన్స్‌ కోసం జనం బారులు తీరేవారు. మా అమ్మ పేరుతో పెట్టిన ‘శాంభవి ఆర్ట్స్‌’ సంస్థ నేతృత్వంలోనే ఈ డ్యాన్స్‌ పోగ్రామ్‌లు నడిచేవి.
. మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?
సుమారు 600 సినిమాల వరకూ నటించాను. అప్పట్లో ఇంత జ్ఞానం లేదు. దాంతో సినిమాల జాబితా కూడా దగ్గర పెట్టుకోలేకపోయాను. అన్నీ అమ్మ చూసుకునేది కదా, ఆమెకేమో ఈ పరిజ్ఞానం తెలియదు.
. ఏ భాషలో ఎక్కువ చేశారు?
తెలుగులోనే. తెలుగు పరిశ్రమే నన్ను బాగా ఆదరించింది. తెలుగు ప్రేక్షకుల కారణంగానే నేనీ స్థాయిలో వుండగలిగాను.
. వ్యాంప్‌ పాత్రలకే ఎందుకు పరిమితమయ్యారు?
అప్పటికే మా అక్క వ్యాంప్‌ పాత్రల్లో నటిస్తోంది. జ్యోతిలక్ష్మి చెల్లెలన్న భావనతో నాకు అలాంటి పాత్రల్నే నిర్మాతలు ఇచ్చారు. తెలుగులో ‘జగన్మోహిని’, ‘మదనమోహిని’, తమిళంలో ‘కరాటే కమల’ వంటి సినిమాల్లో మంచి ప్రాధాన్యమున్న పాత్రలు చేశాను. కానీ ఎందుకో ఆ తరువాత కూడా వ్యాంప్‌ పాత్రలే వచ్చాయి మరి. అక్కను చిన్నతనంలోనే మా మేనత్తగారికి దత్తత ఇవ్వడంతో కుటుంబ బాధ్యత అమ్మపై పడింది. దాంతో నేను ఆమెకు సపోర్టుగా వుండాల్సి వచ్చింది. అందుకే ఎలాంటి పాత్రలు వచ్చినా చేయక తప్పలేదు.
. అందంలో, నటనలో, ప్రతిభలో మిగిలిన హీరోయిన్ల కన్నా తక్కువ కాకపోయినా.. మీకు హీరోయిన్‌గా అవకాశాలు రాలేదని బాధపడలేదా?
చిన్నప్పుడు పెద్దగా అనిపించలేదు. ఊహ తెలియడం మొదలుపెట్టాక హీరోయిన్‌ కాలేకపోయానే అని మనసు బాధపడేది. దాసరి నారాయణరావు గారు లాంటివారు ‘ఈ పాత్రలు ఆ అమ్మాయికి తగినవి కావు’ అని చెప్పినప్పుడల్లా మరింత బాధేసేది. హీరోయిన్‌ అయ్యేందుకు ప్రయత్నించాను. కానీ అప్పటికే ఐటమ్‌సాంగ్స్‌లో పడిపోయాను. చివరి వరకూ అదే కొనసాగింది.
. ఎవరితో నటించడం కంఫర్టబుల్‌గా అనిపించేది?
నాకెవ్వరితోనూ కంఫర్ట్‌గా లేదు. అలాగని ఎవ్వరితోనూ ఇబ్బందీ లేదు. నేను ఇప్పుడే బాగా మాట్లాడుతున్నాను. సినిమాల్లో నటించేటప్పుడు ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. సెట్‌లో కామ్‌గా కూర్చొనేదాన్ని, షూటింగ్‌ అయిన వెంటనే ఇంటికెళ్లిపోయేదాన్ని. ఎన్‌టీఆర్‌ గారితో ఎక్కువ సినిమాలు చేశాను. అలాగే చిరంజీవి, శోభన్‌బాబు గారితో కూడా. వారంతా సెట్‌లో సరదాగా వుండేవారు. అక్కినేనితో తక్కువ సినిమాలే చేశాను. సెట్‌లో ఆయన బాగా అల్లరి చేసేవారు. కృష్ణగారు నాలాగే పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. నా పనేదో నేను చేసుకునేదాన్ని. అందువల్ల కంఫర్టబుల్‌ అన్నదాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు.
. సినీరంగంలో మీ స్నేహితులు?
చెప్పాను కదా, నేను మాట్లాడేది చాలా తక్కువని. అందుకే సినీపరిశ్రమలో నాకు స్నేహితులెవ్వరూ లేరు.
. మీ ఐటమ్‌సాంగ్‌ వల్లనే హిట్టయిన సినిమాలు చాలానే వున్నాయి. పారితోషికం కూడా ఆ స్థాయిలోనే వుండేదా?
ఎక్కడండీ, చాలా తక్కువే ఇచ్చేవారు. అప్పట్లో హీరోకే రూ.3 లక్షల పారితోషికం వుండేదేమో! ఇక హీరోయిన్‌కు దానికన్నా తక్కువే. ఐటమ్‌ సాంగ్‌కు తక్కువే వుండేది. ఎంత ఇస్తారో సరిగ్గా తెలియదు గానీ, రూ.20 వేలు వుంటుందని అనుకుంటున్నా. ఒకే సినిమా మూడు-నాలుగు భాషల్లో కూడాతీసేవారు. అప్పుడు మాత్రం భారీగా ఇచ్చేవారు. డబ్బు గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. అన్నీ అమ్మే చూసుకునేది. ‘యాక్షన్‌-పేకప్‌’ వరకే మన పని.
. కొన్నాళ్లు మీ అక్క జ్యోతిలక్ష్మికి మీరే పోటీ అయినట్లున్నారు?
లేదండీ. ఆమె నాకన్నా చాలా సీనియర్‌. ఆమె పదేళ్లకు పైగా సినిమాలు చేసిన తరువాత నేను అడుగుపెట్టాను. ఆమెతో నేనెక్కడ పోటీ పడగలను? అయితే నాకు హీరోయిన్‌ ఫేస్‌ వుందని అందరూ అనేవారు.
. ఎన్నేళ్లు సినీ పరిశ్రమలో ఉన్నారు?
పద్నాలుగేళ్లు ఉన్నాను. 11-12 ఏళ్లు మంచి పీక్‌ సీజన్‌. తరువాత ఓ మేరకు సినిమాలు చేశాను.
. పన్నెండేళ్లకే సినిమాల్లోకి అడుగు పెట్టిన మీరు… ఇరవయ్యారేళ్లకే పరిశ్రమకు బరువయ్యారా?
ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. నేను మొదట్లో చాలా సన్నగా ఉన్నానని చెప్పాను కదా! సినిమాల్లో నేను పెద్దదానిలా కనిపించడం కోసం అమ్మ ఏవేవో పదార్థాలు పెట్టేది. ప్రతిరోజూ పచ్చి కోడిగుడ్డు పగలగొట్టి నోట్లో పోసేది. దాంతో బాగా శరీరం పెరిగింది. అప్పట్లో ఇప్పటిలా శరీరం గురించి పెద్దగా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం కాదు. ఈనాటి జిమ్‌లు, శరీరం నాజూగ్గా ఉండేందుకు మందులు, ఫిట్‌నెస్‌ కోసం చిట్కాలు అప్పట్లో లేవు. సెట్‌లో కూడా ఏది పెడితే అది తినేవాళ్లం. ఇంట్లో మనసుకి నచ్చిందంతా లాగించేసేవాళ్లం. దాంతో శరీరం పెరిగింది.
. సినిమాలు తగ్గాయని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి కోసం సినిమాలు వదులుకున్నారా?
సినిమాలు తగ్గుతూ వచ్చిన తరువాతే పెళ్లికి దిగాను. అప్పటికే మా అన్నలు, అక్కల్లో ఒక్కొక్కరికి పెళ్లిళ్లు చేసింది అమ్మ. సినిమాలు చేస్తున్నప్పుడే మూడు నాలుగు సంబంధాలు వచ్చాయి. కానీ మధ్యలో సినిమాలు మానేస్తే కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందని అమ్మ వద్దనడంతో కొంతకాలం ఆగాను.
. సినిమావాళ్ల నుంచి ప్రపోజల్స్‌ రాలేదా?
మధ్యలో వచ్చిన పెళ్లి సంబంధాలు సినిమావాళ్ల నుంచే. పేర్లు వద్దులెండి. కానీ నా కుటుం బం కోసం ఆ సంబంధాలు వద్దనుకున్నాను.
. మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
పెద్దలు కుదిర్చిన పెళ్లే. మా అన్నయ్య స్నేహితుడే మావారు. ఆయన పేరు పార్తీబన్‌. మా ఇద్దరి నివాసాలు అప్పట్లో పక్కపక్కనే ఉండేవి. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేసినా నిజజీవితంలో నా నడవడిక, నా తీరుతెన్నులు చూసి మా అత్తగారే నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చారు. మా వారికి కూడా నా గురించి అంతా తెలుసు. నా అన్నేళ్ల సినిమా జీవితంలో నాపై ఒక్క రూమర్‌ కూడా లేదు. నా పనేదో నేను చేసుకుంటూ పోయానే తప్ప ఏనాడూ హద్దులు దాటలేదు. అల్లు రామలింగయ్యగారు ఎప్పుడూ చెబుతుండేవారు – ‘రెడీ యాక్షన్‌ అంటేనే జయమాలిని నవ్వుతుంది. పేకప్‌ చెప్పాక ఒక్క క్షణం కూడా సెట్‌లో ఉండదు’ అని. వృత్తిని వృత్తిగానే చూశాను. అంతే! నేను సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్‌ చేసినా నా క్రమశిక్షణ, వ్యక్తిత్వం బాగా తెలుసుగనుకే మా వారు నన్ను చేసుకున్నారు. మా పెళ్లి 1994 జూలై 19వ తేదీన తిరుమలలో జరిగింది.
. పెళ్లి తరువాత సినిమాలవైపు రాలేదెందుకని?
నేనే వద్దని అనుకున్నాను.
. ఎందుకు వద్దనుకున్నారు?
పెళ్లి ముచ్చట తీరేసరికి బాబు పుట్టాడు. అతని ఆలనాపాలనా చూసేసరికి సగం కాలం గడిచిపోయింది. ఆ తరువాత కుటుంబానికి అలవాటుపడిపోయాను.
. సినిమాల్లోకి రావద్దని మీవారు ఏమైనా కండీషన్‌ పెట్టారా?
అయ్యయ్యో! అలాంటివేమీలేదు. ఆయన ఎప్పుడూ సినిమాలు వద్దని చెప్పలేదు. పెళ్లికి ముందు దీని గురించి ప్రస్తావనే రాలేదు. తరువాత నా ఇష్టానికే వదిలేశారు.
. ఫ్యామిలీ లైఫ్‌ ఎలా ఉంది?
బ్రహ్మాండంగా ఉంది. మా పెళ్లయ్యేనాటికి మా వారు తమిళనాడు పోలీస్‌శాఖలో ఎస్సైగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మా ఆయన మనసు బంగారం. నన్ను అర్థం చేసుకున్న భాగస్వామి దొరకడం నా అదృష్టం. మాకు ఒక బాబు. . ఇంతకు మించి వివరాలు వద్దులెండి.
. మళ్లీ సినిమాల్లోగానీ, టీవీ సీరియళ్లలోగానీ నటించే ఉద్దేశం ఉందా?
చేయాలని మనసు కోరుకుంటోంది. మంచి క్యారెక్టర్‌ దొరికితే చేస్తా. అది కూడా బాబు కాలేజీ చదువు పూర్తయ్యాకే. అంతా భగవంతుడి దయ.
. జీవితంలో బాగా సంతోషకరమైన సంఘటన?
మా అబ్బాయి పుట్టడమే. అంతకన్నా సంతోషకరమేముంది?
. బాధాకరమైన సంఘటన?
మా అమ్మ చనిపోవడం.
. తీరని కోరిక ఏమైనా ఉందా?
ఎంజీఆర్‌తో నటించలేకపోయాను. ఎంజీఆర్‌ హీరోగా ‘అన్నా! నీ ఎన్‌ దైవం’ అనే సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అందులో నాకొక పాత్ర ఇచ్చారు. కానీ అంతలోనే ఆయన సీఎం కావడంతో ఆ సినిమా అలానే ఉండిపోయింది. నా భరతనాట్య అరంగేట్రం ఆయనతోనే జరిగినా.. ఆయనతో కలిసి సినిమాలో నటించలేకపోవడం మాత్రం కొరతే.
. మీరు జీవితచరిత్ర రాయాలనుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది?
అలాంటిదేమీ లేదు. ఇలాంటి ప్రచారాలు నేను కూడా చాలా విన్నాను. నేను అమెరికా వెళ్లిపోయానని, ఇంకెక్కడెక్కడో ఉంటున్నానని, నేను చెప్పినట్లు కూడా ఏవేవో వారే ఊహించి రాసేశారు. నేను చెన్నైలోనే ఉన్నాను.
. మీరు బయటికొచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి ఇప్పటికీ స్పందన ఉంటోందా?
ఎందుకు లేదు? జనాలు మరచిపోతే కదా స్పందన కరువవ్వడానికి! అప్పట్లో నేను, శ్రీదేవి, జయసుధ ఎప్పుడైనా బయటికెళ్లాలంటే బురఖా వేసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడంత లేదు. నేను మొదటి నుంచీ సినిమా ఫంక్షన్లకు వెళ్లడం కూడా తక్కువే. ఇప్పటికీ అంతే, బయటికి ఎక్కువగా వెళ్లను. ఇంట్లోనే మా మేనత్త కట్టించిన ఆలయం ఉంది. ఎప్పుడైనా అరుదుగా బయటి ఆలయాలకు వెళ్తాను. అప్పుడెవరైనా గుర్తు పట్టి పలుకరిస్తుంటారు, కొంతమంది ఫోటోలు కూడా తీసుకుంటుంటారు.

Friday, November 7, 2014

నిర్మాత‌లను హ‌డ‌లెట్టిస్తున్న బ్ర‌హ్మానందం ?


బ్ర‌హ్మానందం పేరు చెబితే నిర్మాత‌లు హ‌డ‌లిపోతున్నారు. ఆయ‌న సినిమాలో ఉంటేగానీ బండి న‌డ‌వ‌దు. కానీ... ఆయ‌న‌మాత్రం బ‌హు కాస్ట్లీ న‌టుడు. రోజుకి రూ.6 ల‌క్ష‌లు త‌గ్గ‌డు. ఆయ‌న పాత్ర‌ని ఒక‌ట్రెండు రోజుల్లో చుట్టేద్దామ‌నుకొంటే కుద‌ర్దు. రోజుకి రెండు మూడు స‌న్నివేశాల కంటే ఎక్కువ తీయ‌కూడ‌దు. అది ఆయ‌న పెట్టే మ‌రో రూలు. మొత్తానికి సినిమా అంతా బ్ర‌హ్మానంద‌మే క‌నిపించాలంటే నిర్మాత‌ల‌కు క‌ళ్లు బైర్లు క‌మ్మేయాల్సిందే. య‌మ‌లీల విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం య‌మలీల 2. ఇందులో బ్ర‌హ్మానందంది చిత్ర‌గుప్తుడు వేషం. య‌ముడు, చిత్ర‌గుప్తుడు మ‌ధ్య చాలా స‌న్నివేశాలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సినిమా మొత్తం వీళ్లే క‌నిపిస్తారు. క‌నీసం 25 రోజుల నుంచి 30 రోజులు పాటు కాల్షీట్లు స‌మ‌ర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం బ్ర‌హ్మానందం రూ.1 కోటి 30 ల‌క్ష‌ల వ‌ర‌కూ పారితోషికం అందుకొన్నాడ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. వామ్మో... అంత రేటా..?? మ‌న చిత్ర గుప్తుడు అంత కాస్ట్లీ మ‌రి.

Thursday, November 6, 2014

"రోజుకు రెండు గ్లాసు"లకు మించి "పాలు" తాగితే ప్రాణానికే ప్రమాదం?

 ప్రతి ఒక్కరూ పాలు ఆరోగ్యానికి మంచిదని అంటుంటే..  రోజుకు రెండు గ్లాసులకు మించి పాలు తాగితే ప్రాణానికే ప్రమాదం అనే దిగ్భ్రాంతికర సమాచారం వెల్లడైంది. ఈ విషయం స్విడన్ దేశానికి చెందిన ఉప్పసలా యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది.

ఆ యూనివర్శిటీ రోజు పాలు తాగడం వల్ల కలిగే పేలు, కీడులపై ఏళ్ల తరబడిగా పరిశోధనలు నిర్వహించింది. ఆ పరిశోధన ద్వారా పాలు ఎక్కువ తాగితే ప్రాణానికే ప్రమాదం అని తెలిసింది.

ఈ విషయమై ఉప్పసలా యూనివర్శిటీ అధ్యాపకులు కార్ల్ మైకెల్సన్ మాట్లాడుతూ... పాలను సేవించడం వల్ల వచ్చే మంచి, చెడులను గురించి గత 20 సంవత్సరాలుగా పరిశోధనలు చేశామన్నారు. వారి పరిశోధనకు 61 వేల మంది మహిళలు, 45 వేల మంది వద్ద ఈ పరిశోధనకు ఉపయోగించుకున్నట్టు తెలిపారు.

తమ పరిశోధనలో అనేక విషయాలు వెల్లడైనట్టు చెప్పారు. అయితే అత్యధికంగా పాలు తాగడం వల్ల ఎముకలకు జరిగే మేలు కొంతేనని, నష్టం ఎక్కువని తెలిసిందన్నారు. ప్రతి రోజూ రెండు గ్లాస్‌లకు మించి అంటే అర లీటర్ లేక అంతకు మించి పాలు తాగే వారికి పలు విధాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడడమే కాకుండా త్వరగా ప్రాణాలు కోల్పోతారనే చేదు సమాచారం తేలిందన్నారు.

తక్కువ పాలు తాగే వారి కంటే కూడా ఎక్కువ పాలు తాగే వారే అతి త్వరగా ప్రాణాలు కోల్పోతున్నట్టు వారి అధ్యయనం ద్వారా తేటతెల్లమైందన్నారు. పాలలో ఉండే ల్యాక్టోస్, క్లాక్ టోస్ అనే చక్కెర స్వభావం వలన పలు అనారోగ్య సమస్యలు ఏర్పడి, చివరికి ప్రాణాలనే హరిస్తుందని తెలిపారు.

కనుక ఇకపై పిల్లలు, పెద్దలు పాలు తాగే విషయం లో జాగ్రత్త పాటించాలి.  

Wednesday, November 5, 2014

బాంబు పేల్చిన స‌మంత ?

స‌మంత బాంబు పేల్చింది. సినిమాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెబుతుంద‌ట‌. అయితే ఇప్పుడే కాదు. ఇంకో రెండేళ్ళ తరువాత. ''నాకు 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం దానికే కట్టుబడి వున్నాను. గత రెండేళ్ళ నుండి ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. మరో రెండేళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటాను'' అని ఓ టీవి షో లో చెప్పింది సమ౦త. అలాగే సినిమాలు మానేసిన తరువాత ప్రొడక్షన్ పై దృష్టి సారిస్తానని చెప్పింది. ఈ విషయం తెలుసుకుని షాక్ తిన్న సమంత డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం పెళ్ళైన తరువాత కూడా సినిమాలలో నటించాలని అంటున్నారు. 

"ఎర్రమిర్చి"తో "నొప్పులను" దూరం చేసుకోండి!


 


 ఎర్రమిర్చిలోని ఘాటుకి, కారానికి కారణమైన క్యాప్సైసిన్ అనే పదార్థం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. కీళ్ళనొప్పులు, సోరియాసిస్, షింగిల్స్ వంటి రుగ్మతల్ని నయం చేసుకునేందుకు వాడే క్రీముల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.

క్యాప్సైసిన్ మొదట్లో పెయిన్ రెసెప్టెర్‌ల పనిచేసే శక్తిని పెంచడానికి, ఆ తర్వాత నొప్పిని పూర్తిగా నయం చేయడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంకా క్యాప్సైసిన్ పదార్థం క్యాన్సర్ కారక కారణాలను నిర్మూలిస్తుందని అధ్యయనాలు తేల్చాయి.

క్యాప్సైసిన్ మిర్చికి ఘాటునిస్తుంది. నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్ల తయారీని పెంచుతుంది. దీనిలో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా వుండటంతో మిర్చికి గాఢమైన ఎర్రరంగు వస్తుంది. రక్తంలో క్లాట్స్ రాకుండా యాంటి కో ఆగ్యులెంట్ పనిచేస్తుంది. మిర్చిని మితంగా వాడితే అల్సర్లు రావు. జీర్ణరసాల్ని క్రియాశీలంగా గావిస్తూ జీర్ణకోశం లోపలి భాగాల్ని కాపాడుతుంది. ప్రేవులలోని రోగకారక బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది.

Tuesday, November 4, 2014

"వేడి వేడి"గా టీ, కాఫీలు తాగితే ?


 కాఫీ, టీలు, వేడి పానీయాలు వేడిగా తాగటానికి కొందరు ఇష్టపడతారు. ఎంత వేడిగా తాగితే అంత బాగుంటుందంటారు. చలికాలంలోను, వర్షాకాలంలోను వేడి పానీయానికి డిమాండ్ మరింతగా ఉంటుంది. అయితే అంత వేడిగా తాగడం మంచిది కాదు. వేడిగా తీసుకునే ద్రవ పదార్థాలు నాలుకను కాల్చినట్లు చేయడమే కాదు.. అది లోపలికి దిగినంత మేర అన్నవాహిక మీద ప్రభావం చూపుతుంది.

టీ, కాఫీల వేడి అన్నవాహిక  పొరమీద ప్రభావం చూపుతుంది. తద్వారా కణాలు దెబ్బతినడం లేదా పెరగడం మొదలెట్టి క్యాన్యర్‌కి కారణమవుతాయి. గొంతు క్యాన్సర్‌కి వేడి వేడి టీ, కాఫీ తాగే అలవాటుకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుచేత వేడి వేడి ద్రవ పదార్థాలను చల్లారాక తీసుకోవడం లేదా మితమైన వేడిగా తీసుకోవడం బెటరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Monday, November 3, 2014

మనిషా ? పశువా ??


సభ్యసమాజం తలదించుకునే ఘటన విజయవాడలో జరిగింది. కన్నతండ్రే తన కుమార్తెపై అత్యాచారం జరిపాడు. కృష్ణా జిల్లా విజయవాడలోని వాంబే కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. అజిత్‌సింగ్‌నగర్‌లోని వాంబే కాలనీకి చెందిన 42 ఏళ్ల ఆటోడ్రైవర్ అప్పారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని 17ఏళ్ల కుమార్తె పదో తరగతి వరకు చదివి ఆపేసింది. స్థానికంగా ఉండే యువకుడితో ఆమె పరిచయం ఏర్పరచుకోగా.. విషయం తెలిసిన అప్పారావు ఆమెపై కన్నేశాడు. బుద్ధిచెప్పాల్సిన తండ్రే కీచకుడయ్యాడు.

బలం కోసమని ఐరన్ ట్యాబ్లెట్స్ అంటూ స్లీపింగ్ పిల్స్ భార్యకు, కుమార్తెకు ఇవ్వడం ప్రారంభించాడు. వారిద్దరూ మత్తులోకి జారుకున్నాక కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈమధ్యనే అనుమానం వచ్చిన భార్య అప్పారావును నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది... దీంతో తల్లీకూతుళ్లు నున్న గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. విచారణలో ఏడాదిగా ఈ దారుణం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. అప్పారావు కుమార్తెను వైద్యపరీక్షలు నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిపై 376 సెక్షన్ కింద కేసుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కీచకతండ్రిని అరెస్టు చేశారు.

మనోజ్‌కు చీవాట్లు పెట్టిన మోహన్ బాబు ? ఎందుకు ??


 మంచు మనోజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సన్నీలియోన్‌ గురించి నాన్నగారికి పెద్దగా తెలీదు. కానీ.. ఈ అమ్మాయికి అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అని అడిగారు. బాలీవుడ్‌లో ఫేమస్‌ అని చెప్పాం. మాస్‌ ఎగబడుతున్నారని అన్నాం. ఆయన షూటింగ్‌ టైమ్‌లో వచ్చారు. ఆమె పద్ధతిని మెచ్చుకున్నారు. కానీ రామ్‌గోపాల్‌వర్మ గారు.. నీకు ఆ అమ్మాయి గురించి తెలీదనుకుంటా? అన్న విధంగా చెప్పారు. బయటకు నన్ను పిలిచి.. నువ్వు చేసింది ఏమిట్రా అని చీవాట్లు పెట్టారు. బాలీవుడ్‌లో ఫేమస్‌ అని చెప్పాం. ఇలాంటివి రిపీట్‌ కానీయకు అని చెప్పారు.

Saturday, November 1, 2014

అమ్మాయి నోట్లో "202" దంతాలు?

ఏడేళ్ల అమ్మాయి నోట్లో అసాధారణంగా పెరిగిన 202 దంతాలను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తొలగించారు. ఆ బాలిక కుటుంబం గురుగావ్‌లో నివసిస్తోంది. కాగా, నోటిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆ బాలిక తండ్రి ఆమెని ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు.

ఎయిమ్స్ వైద్యుడు అజయ్‌రాయ్ చౌదరి ఆ అమ్మాయి నోటిని ఎక్స్ రే తీశారు. ఆమె నోట్లో అనేక పళ్లతో కూడిన గడ్డ కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎయిమ్స్‌లోని దంత వైద్య నిపుణుల బృందం శస్త్ర చికిత్స చేసి 202 పళ్లను తొలగించింది.

‘కొంత మందిలో ఇలా అసాధారణంగా పెరిగిన దంతాలను చూస్తుంటాం. కానీ ఏడేళ్ల పాప నోట్లో ఇంత పెద్ద సంఖ్యలో దంతాలను చూసి ఆశ్చర్యపోయాం' అని శస్త్ర చికిత్స చేసిన వైద్యులు మీడియాకు తెలిపారు. వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించడానికి ఇంచుమించు రెండు గంటల సమయం పట్టిందని చెప్పారు.

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో డెంటల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగం వారు ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం ద్రవాహారం, మెత్తని ఆహారం బాలికకు అందించాలని వైద్యులు సూచించారు. కొద్ది నెలల్లోనే బాలిక దృఢమైన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చని చెప్పారు.

కాగా, సర్జరీకి ముందు రోజు ఆ అమ్మాయి తన పుట్టిన రోజు వేడుకలను వైద్యులు, కుటుంబసభ్యులు సమక్షంలో జరుపుకుంది.

 ఇది ఇలా ఉండగా మూడు నెలల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ 17ఏళ్ల యువకుడి నోట్లోంచి 232 దంతాలను శస్త్ర చికిత్స చేసి తొలగించారు.