CSS Drop Down Menu

Wednesday, October 8, 2014

శరీరంలోని అధిక క్యాలరీలను కరిగించాలంటే ?


 మన శరీరంలోని అధిక క్యాలరీలను కరిగించేందుకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మీకు తెలుసా?  మనం రెగ్యులర్‌గా తీసుకొనే ఆహారాల్లో కొన్ని ఆహారాలు క్యాలరీలు కరిగించడానికి, బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. వేగంగా క్యాలరీలను కరిగించే ఆహారాలు ఏంటో చూద్దాం..

గ్రేఫ్ ఫ్రూట్ మెటబాలిజనం వేగవంతం చేయడంతో పాటు ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. ముఖ్యంగా గ్రేఫ్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి, గ్రేప్ ఫ్రూట్‌ను సలాడ్స్‌లో, స్మూతీస్, డ్రింక్స్‌లో చేర్చుకోవచ్చు.

 
అలాగే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది.

 మొక్కజొన్న క్యాలరీలను కరిగిస్తుంది. 

ఇంకా గ్రీన్ టీ, సాల్మన్ ఫిష్, స్పెసీ ఫుడ్స్, అవాకోడో, పరిమితంగా కాఫీ, పనస గింజలను వంటల్లో చేర్చుకోవడం వంటివి చేస్తే క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

 వీటిని తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే.. స్లిమ్‌గా ఫిట్‌గా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

0 comments:

Post a Comment