CSS Drop Down Menu

Friday, October 3, 2014

"అలసంద" లతో "ఆరోగ్యం" !





 అలసందను అలసందులు, బొబ్బర్లు అని పిలుస్తారు. ఇవి నవధాన్యాలలో ఒక రకం. ఈ అలసందలను తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునో చూద్దాం.. అలసందల్లో తక్కువ క్యాలరీలు, తక్కువ ఫ్యాట్ ఉండటంతో బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. 

అలసందల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజుకో కప్పు తీసుకోవడం ద్వారా ఆకలి వేయదు. పొట్ట నిండినట్లు ఉంటుంది. అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నార్మల్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. వైరస్ ఫీవర్, జలుబు, ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవు. అలాగే బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అలసందలు తగ్గిస్తాయి. తద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. 

జీర్ణక్రియను మెరుగుపరిచే అలసందల్లో అధిక ఫైబర్ కలిగివుండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హానిజరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

0 comments:

Post a Comment