CSS Drop Down Menu

Thursday, July 31, 2014

"ఓవర్ లోడ్"Tuesday, July 29, 2014

"పంచదార" కంటే "బెల్లమే" మంచిది !!!

బెల్లం (Jaggery)ఒక తియ్యటి ఆహార పదార్థం. దీనిని సాధారణంగా చెరకు నుండి తయారు చేస్తారు. సాదారణముగా చెరకు రసము నుంచి మొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు. ఇది సాదారణము గా ప్రతిఒక్కరు ఉపయోగించే రకము . తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లము తయారుచేస్తారు . బెల్లం తయారిలో వివిధ రకాలు ఉన్నాయి. చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, ఈతబెల్లం, కొబ్బరి బెల్లం ఇలా వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే ఇళ్ళలో వాడేరకం చెరకు బెల్లం. ఇది భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన పదార్థం. చెరకు బెల్లము గోల్డ్ బ్రౌన్‌ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది . ఈ బెల్లంను చెరకు రసాన్నిబాగా కాయడం ద్వారా తయారుచేస్తారు . భారతీయ ఇళ్ళలో వాడే రకము ఇది.   స్వీట్స్(తియ్యని పిండివంటలు)తయారీలో కొంత మంది పంచదార కంటే బెల్లంనే ఎక్కువగా ఉపయోగిస్తారు. తీపిపదార్థం అంటే బెల్లంతో తయారు చేసినవి మాత్రమే అనేవారు మనపెద్దలు. పంచదార వచ్చి బెల్లంతో చేసిన తీపి వంటలలకు ఉనికిని వెనక్కి నెట్టేసింది. ఒకప్పుడు బెల్లం మరమరాలు, బెల్లం కలిపిన ఉండలు, నువ్వులు బెల్లం కలిపిన బూంది, బెల్లం కలిపిన జీడీలు వంటి చిరుతిండ్లు పిల్లలకు ఎక్కువగా పెట్టేవారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో బెల్లంతో చేసిన అరిసెలు, బూరెలు, పూర్ణాలకే డిమాండ్ ఉన్న సంగతి తెలిసినదే. అందుకే వంటకాలలో బెల్లం వాడకం పెంచడం మంచిది. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఎందుకంటే బెల్లంలో ఐరన్(ఇనుము ) అధికంగా ఉంటుంది. ఖనిజాలు అధికమే. అంతే కాదు ఇది ఒక మంచి పోషక పదార్థం కూడా . దీనిలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్ లు పంచదారలో ఉండే వాటికన్నా మంచివి. అందుకే ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడుతారు. అందుకే దీన్నిమెడిసిన్ చక్కెర అంటారు.
 ప్రతి వంద  గ్రాముల బెల్లంలో 2.8 మినరల్ సాల్ట్ లు ఉంటాయి. అంటే ఒక కేజీకి 28గ్రాములన్నమాట. అదే పంచదారలో అయితే ఒక కేజికి 300మిల్లీ గ్రాములు కూడా ఉండదు. ప్రతి వందగ్రాముల బెల్లం నుండి 383కేలరీల శక్తిని 95గ్రా కార్బోహైడ్రేట్స్ ను, 80మిల్లీగ్రాముల కాల్షియంను, 40మిల్లీ గ్రాముల ఫాస్పరస్ ను 2.6గ్రాముల ఇనుమును పొందవచ్చు.
 బెల్లం వల్ల కీళ్ళ ఇబ్బందులు రావు. రక్తంలో చేరిన విషపూరిత పదార్థాలను తొలగించే శక్తి బెల్లానికి ఉంది. ఇంకా బెల్లంలోని మెగ్నీషియం నాడీ వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం అయితే కణాల్లోని ఆమ్లాలని నియంత్రిస్తుంది. కాబట్టి బెల్లం వాడకం పెంచడం మంచిది.
 తరచూ పొడిదగ్గు ఇబ్బంది పెడుతుంటే కనుక... గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి బాగా నానిన  తర్వాత రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 
చాలా మందిని అజీర్తీ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది అటువంటి వారు భోజనం చేశాక చిన్న  బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణ సమస్యలు ఉండవు. జీవక్రియను వేగవంతం చేస్తుంది.
 నెయ్యిలో బెల్లం ముక్క వేసి వేడి చేసి శరీరంలో నొప్పి ఉన్న చోట పట్టు వేస్తే ఆ నొప్పిని నివారిస్తుంది. 
నెయ్యి, బెల్లం.. సమపాళ్ళలో కలిపి తింటే 5-6 రోజుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.
 కాకరకాయల ఆకులు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, మిరియాలు నాలుగు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజుకి రెండు సార్లు వారం రోజుల పాటు     తీసుకుంటే లేదా గ్లాసు పాలల్లో పంచదారకి బదులుగా బెల్లం వేసి రోజు త్రాగిన నెలసరి (బహిష్టు )సమస్యలు ఉండవు.
 అసిడిటిని తగ్గించే అద్భుతమైన ఔషదం బెల్లం, కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషక నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని క్రమబద్దం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత ప్రతి సారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. 
ఇన్ని అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగి ఉంటడం వల్ల బెల్లంను ‘మెడిసినల్ షుగర్' గా వ్యవహరిస్తారు.


Sunday, July 27, 2014

ఎన్ని "సర్కిల్స్" ఉన్నాయి ?

ఈ క్రింది చిత్రంలో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో ? చెప్పగలరా ?? జాగ్రతగా గమనిస్తే అవి ఎన్నో మీకే తెలుస్తుంది . 


 తెలియకపోతే జవాబు ఈ క్రింద చూడండి 
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*

*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*

Friday, July 25, 2014

"మనుష్యుల మనస్తత్వాలు "


Wednesday, July 23, 2014

అప్పటికి ? ఇప్పటికి ?? తేడా !!!


Monday, July 21, 2014

"కుక్క , కోతుల" వ్యాయామం !


Friday, July 18, 2014

చెప్పుకోండి?చూద్దాం!


ఈ క్రింది బొమ్మను చూసారుగా! అదేమిటో అర్ధమైందా ? 


తెలియకపోతే  ఈ క్రింది జవాబును చూడండి !
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
 *
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
సింక్ 

Monday, July 14, 2014

"ఆన్ లైన్" లో వస్తువులు "తక్కువ ధరకు" కొనాలంటే ?

మీరు ఆన్ లైన్ లో వస్తువులు కొనాలంటే flipkart , amazon ,snapdeal వంటి వెబ్ సైట్ లు ఓపెన్ చేసి మీకు నచ్చిన వస్తువులు కొంటుంటారు. కానీ మీరు కొనే వస్తువు ధర కన్నా  ఇతర సైట్లలో  తక్కువ ధరకు  వస్తే మీరు బాధ పడుతుంటారు . కానీ మీరు కొనే ముందే ఏ సైట్లలో ఎంత ధర ఉందో ముందే తెలిస్తే మనీ ఎంతో సేవ్ అవుతుంది కదా !

అందుకే ఇప్పుడు నేను తెలియచేసే టిప్ మీకు ఖచ్చితంగా నచ్చితీరుతుంది   అది ఎలాగంటే మీ వెబ్ బ్రౌజరు లో ఈ క్రింది విధంగా చేయండి . 

1) ముందుగా మీరు Makkhichoose అనే addon మీ వెబ్ బ్రౌజరు లో install చేయండి.


2)  ఉదాహరణకు మీరు flipkart లో ఒక HP Notebook కొనాలనుకున్నారు. అప్పుడు కొనాలనుకునే దానిపై క్లిక్ చేస్తారు . అప్పుడు మీకు ఈ క్రింది విధంగా చూపిస్తుంది . 


3) అదే Makkhichoose addon మీ వెబ్ బ్రౌజరు లో install చేసిన తరువాత మీరు కొనే వస్తువు రేటు కన్నా ఇతర సైట్లలో తక్కువ రేటు గనుక ఉంటే అప్పుడు ఆ వస్తువు రేటు క్రింద రూపాయి సింబల్ వచ్చి ప్రక్కన  Lower price available on another site!అని వస్తుంది . ఈ క్రింది ఇమేజ్ గమనించండి . 4) అప్పుడు  ఎడమ వైపు పైన ఉన్న రూపాయి సింబల్ పై క్లిక్ చేస్తే మిగతా సైట్లలో ఉన్న  తక్కువ రేటు కనిపిస్తుంది .దానిని బట్టి మీకు నచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొనుక్కుని డబ్బు ఆదా  చేసుకోవచ్చు. 
 

Sunday, July 13, 2014

సినీ స్టార్స్ ఎంత వరకు చదువుకున్నారు?

చదువుల్లో రాణించలేక పోయిన వారే సినిమా రంగం వైపు అడుగులు వేస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందులో ఎంతో కొంత నిజం ఉండవచ్చేమో కానీ..సినిమా రంగంలో అగ్రతారలుగా వెలుగొందిన వారిలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారే. అయితే సినిమా రంగంపై ఆసక్తితో ఇటువైపు అడుగులు వేసారు.

కొందరైతే చదువుల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి టాప్ ప్లేస్ దక్కించుకున్నవారే. అయితే ఆయా రంగాల వైపు వెళ్లకుండా సినీరంగంలో అడుగు పెట్టి తమ సత్తా నిరూపించుకున్నారు. మంచి సంపాదన, పాపులారిటీ, ప్రత్యేక గుర్తింపు లాంటివి ఈ రంగంలో దక్కుతుండటం అందుకు కారణం కావచ్చు.

ఉన్నత చదువులు చదివినా...ఆయా రంగాల వైపు వెళ్లకుండా తమ అభిరుచికి తగిన విధంగా సినీరంగాన్ని ఎంచుకుని పాపులర్ అయిన స్టార్స్ వివరాలు.

చిరంజీవి:- మెగాస్టార్ గా....టాలీవుడ్ నెం.1 స్థానాన్నిసొంతం చేసుకున్న చిరంజీవి కామర్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు.

నాగార్జున:- అక్కినేని నాగార్జున మెకానికల్ ఇంజనీరింగ్ చేయడంతో పాటు, మిచిగాన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసారు.

బాలకృష్ణ:- నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో ఆర్ట్స్ విభాగంలో గ్రాజ్యువేషన్ సాధించారు

వెంకటేష్:- విక్టరీ వెంకటేష్ చెన్నై లయోలా కాలేజీలో గ్రాజ్యువేషన్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి ఎంబీఏ పూర్తి చేసారు

 మహేష్ బాబు :-కామర్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు.

జాన్ అబ్రహం:- ముంబైలోని స్కాటిష్ స్కూల్లో చదివిన జాన్ అబ్రహం, జైహింద్ కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ సాధించారు. మేనేజ్ మెంట్ సైన్సెస్ లో కూడా డిగ్రీ పట్టా పొందారు.

సోనమ్ కపూర్:- సోనమ్ కపూర్ స్కూల్ లైఫ్ సింగపూర్లో సాగింది. ఆ తర్వాత లండన్ లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు.

ఆయుష్మాన్ ఖురానా:- ఆయుష్మాన్ ఖురానా ఇంగ్లిష్ లిటరేచర్, మాస్ కమ్యూనికేషన్ పట్టా సాధించారు.

సోనాక్షి సిన్హా:- బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫ్యాషన్ డిజైనింగులో డిగ్రీ పూర్తి చేసింది.

అమితాబ్ బచ్చన్:- బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆర్ట్స్ మరియు సైన్స్ విభాగంలో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు.

ప్రీతి జింతా:- బాలీవుడ్ భామ ప్రీతి జింతా ఇంగ్లీష్ హానర్ డిగ్రీ తర్వాత...క్రిమినల్ సైకాలజీలో ప్రోస్టుగ్రాజ్యువేషన్ పూర్తి చేసింది.

రణదీప్ హుడా:- బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా మార్కెటింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు, ఆస్ట్రేలియాలో బిజినెస్ మేనేజ్ మెంట్, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్ మెంటులో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

సోహా అలీ ఖాన్:- సోహా అలీ ఖాన్ లండన్‌‍లో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ సాధించింది.

సోనూ సూద్:- నటుడు సోనుసూద్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాజ్యువేషన్ సాధించారు.

విద్యా బాలన్:- విద్యా బాలన్ సోషియాలజీలో మేజర్ డిగ్రీ సాధించింది.

మాధవన్:- మాధవన్ ఎలక్ట్రానిక్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు. మహారాష్ట్ర బెస్ట్ క్యాడెట్ టైటిల్ సొంతం చేసుకున్నారు.

అమీషా పటేల్:- హీరోయిర్ అమీషా పటేల్ అమెరికాలో చదివి ఎకనామిక్స్ విభాగంలో మేజర్ డిగ్రీ సాధించింది.

సిద్ధార్థ:- హీరో సిద్ధార్థ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్ విభాగంలో ఏంబీఏ పూర్తి చేసారు

నేహా శర్మ:- హీరోయిన్ నేహా శర్మ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాజ్యువేషన్ పూర్తి చేసింది.Saturday, July 12, 2014

"అతిగా" ఫేస్ వాష్ చేస్తే ? అనార్థాలెన్నో!!!
చాలా మంది మహిళలు ఎప్పుడు అందంగా, ఫ్రెష్ గా ఉండాలని సమయం సందర్భం లేకుండా మొహం కడిగేసుకుంటుంటారు. అటువంటి వంటి వారి ఎన్ని సార్లు ముఖం కడుగుతామ్ అంటే క్లీన్ గా ఉంటే తప్పేంటి అంటుంటారు? క్లీన్ గా ఉండటం తప్పు కాదు...కానీ దానికి కూడా ఒక పరిమితి అంటూ ఉంటుంది కదా!అలా ఎప్పుడు పడితే అప్పుడు ముఖం కడుక్కుంటే, శుభ్రంగా ఉండే మాట పక్కన పెట్టి, లేనిపోని సమస్యలు ఎదుర్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, ఏవిషయంలోనైనా అతి పనికిరాదని పెద్దలు ఊరికే అంటుంటారా. ఫేస్ వాష్ విషయంలో కూడా అంతే!మరి, ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేస్తే ఏమవుతుంది? అసలు ఎప్పుడు, ఎలా ఫేస్ వాష్ చేసుకుంటే, మంచిది ??ఈ విషయాల్నీ ఈ క్రింది విధంగా తెలుసుకోండి.

చీటికిమాటికి ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకునే దుమ్ము పోయిశుభ్రంగా ఉంటుంది. మనలో చాలా మంది ఇది నిజమే అనుకుంటారు. కానీ, అది పొరపాటు. ఎందుకంటే, ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మం ఉత్పత్తి చేసే ‘సెబమ్' అనే ద్రవం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం సంబంధిత వ్యాధులు సైతం తలెత్తే అవకాశాలు లేకపోలేదు. అంతే కాకుండా చర్మం మరింత పొడిబారిపోయి, గరుగ్గా మారిపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకూ బాగా అవసరం అనిపిస్తేనే ఫేస్ వాష్ చేసుకోవడం ఉత్తమం. అంటే రోజుకు 2 నుంచి 3 సార్లు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అది కూడా గాఢత తక్కువ ఉండే సబ్బులు లేదా లిక్విడ్ ఫేస్ వాష్ లతో మాత్రమే.

చర్మ తత్వంను బట్టి ఫేస్ వాష్: ఒక్కొక్కరికి చర్మం ఒక్కోలా ఉంటుంది. కొందరిది నార్మల్ గా ఉంటే, మరికొందరిడి డ్రైగా ఉంటుంది. ఇంకొందరిది ఆయిలీగా ఉంటుంది. ఇంతకీ మీ చర్మం ఎలాంటిదో మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి తెలుసుకోండి. మీరు తీసుకోవల్సిన జాగ్రత్తలు మీ చర్మం మీద ఆధారపడి ఉంటాయ. ఉదా మీకు నార్మల్ చర్మతత్వమైతే మీరు రోజులో 1 లేదా 2 సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. తాజాగా ఉండటంతో పాటు మీ చర్మంలో ఉండే తేమ అలాగే నిలిచి ఉంటుంది. అలాగే జిడ్డు చర్మ తత్వం ఉన్నవారు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ ని ఉపయోగిస్తే కాస్త ఎక్కువ సమయం ఫ్రెష్ గా కనిపించే అవకాశం ఉంటుంది.

ఎలాంటి ఫేస్ వాష్ ఎంపిక చేసుకోవాలి: మీ చర్మతత్వానికి తగిన ఫేస్ వాష్ లిక్విడ్ లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అయితే కొందరికి ఎలాంటి ఫేస్ వాష్ లిక్విడ్స్ అయినా సెట్ అవుతాయి. ఎలాంటి సమస్యలూ తలెత్తవు. కానీ, మరికొందరికి చర్మం అవసరారలు వేరే ఉండవచ్చు. అందుకే మన చర్మం అవసరాలకు అనుగుణంగా ఉన్న లిక్విడ్స్ నే పేష్ వాష్ గా ఎంపికచేసుకోవడం ఉత్తమం. అయితే వీలైనంత వరకూ గాఢత తక్కువ కలిగి ఉండే వాటిని ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

తేమని కాపాడుకోవాలి: చర్మంలోనిని తేమను కాపాడుకోవాలి. అప్పుడు ముఖం తాజాగా కనిపిస్తుంది. ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం కోల్పోతుంది. ఫలితంగా ముఖం బాడిపోయినట్లు కనిపిస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత తక్కువగా ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది.

బాదం నూనె: స్నానం చేయడానికి ముందు బాదం నూనెను ముఖానికి బాగా పట్టించాలి. అలాగంట పాటు వదిలేస్తే చర్మం పోషణకు అవసరం అయ్యే పోషకాలను , తేమను చర్మగ్రంధులు పీల్చుకుంటాయి. తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కుంటే ఎంత సున్నితంగా మారుతుందో మీరే గమనించవచ్చు.

ఫేస్ వాష్ కు ప్రత్యామ్నాయంగా : మార్కెట్లో అందుబాటులో ఉండే వైట్ వైవ్స్ తో ముఖం తుడుచుకుంటే చాలు. చర్మం శుభ్రమవడమే కాకుండా, తాజాదన్ని కూడా సంతరించుకునేలా చేస్తుంది. అలాగే ఫేస్ వాష్ చేసుకొనే ప్రతి సారీ సబ్బు లేదా లిక్విడ్ వాష్ ఉపయోగించుకుండా నీటితో కడుక్కోవడం కూడా కొంచెం మంచి పద్దతే. ఫలితంగా కెమికల్స్ ఎఫెక్ట్ తక్కువగా ఉండటం చేత చర్మ నిగనిగలాడుతుంటుంది.


Friday, July 11, 2014

"మ్యూజిక్" తో "ఆరోగ్యo"

శరీరం నలతగా ఉంటే ఒక మాత్ర, మనసు కలత గా ఉంటే ఒక మాత్ర ఇదీ ఆధునికుల వరుస. చివరికి శరీరం ఒక మందుల బీరువా అవుతోంది. నిజానికి ఇవేవీ లేకుండానే శరీరాన్నీ, మనసునూ ఆరోగ్యంగా ఉంచే మార్గాలు కూడా ఉన్నాయి. వాటిలో సంగీతం వినడం అత్యంత ప్రధానమైనది. సంగీతం ఆరోగ్యాన్నీ, గొప్ప జీవచైతన్యాన్నీ ప్రసాదిస్తుంది. అందుకే సమయం లేదంటూ దాటేయకుండా రోజూ కాసేపు సంగీతం వినడానికి వెచ్చించమంటున్నారు నిపుణులు.

జీవన ప్రవాహంలో ప్రతి హృదయం ఎంతో కొంత అలజడికి లోనవుతూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సమస్యల గురించి విశ్లేషణలకు దిగితే అన్నీ అయోమయపు సమాధానాలే వస్తాయి. అసలే అలజడి మనసు. ఆ స్థితిలో వచ్చే విశ్లేషణలు సాలోచనగా ఎలా ఉంటాయి? అందుకు మనసును ముందుగా అలజడి కి అతీతంగా ఒక భావాతీత స్థితికి చేర్చాలి. అప్పుడే మనసు కాస్త కుదుటపడుతుంది. కుదురైన ఆలోచనలు చేస్తుంది. మనసును ఆ భావాతీత స్థితికి చేర్చడానికి సంగీతాన్ని వినడానికి మించిన మార్గం లేదు. ధ్యానం వల్ల కూడా ఈ స్థితి సాధ్యం కావచ్చు. కానీ, ధ్యానానికి కొంత సాధన కావాలి. అలాంటి సాధన కానీ, మరో ప్రయత్నం కానీ లేకుండానే మనసు ఉన్నఫళాన ధ్యాన స్థితికి చేరడం అన్నది సంగీతం వల్లే సాధ్యమవుతుంది. అది పాడటం కావచ్చు. వినడం కావచ్చు. పాడే వారూ, వినే వారూ ఏకకాలంలో ఒక ధ్యానస్థితికి చేరడం అన్నది సంగీతంతో సాధ్యమవుతుంది.

కొంత మంది సంగీత నిపుణులు మ్యూజిక్ థెరపీని రూపొందించారు. మెదడులోని రసాయనాలను సమతుల్యంగా ఉంచడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. రసాయన ప్రక్రియ సమతుల్యంగా మారే కొద్దీ ప్రతికూల భావాలు అతి వేగంగా తగ్గుముఖం పడతాయి. అప్పుడు సచేతనమైన మెదడు ప్రభావం శరీరంపై పడుతుంది. అది శారీరక ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది. నిజానికి శరీరానికీ మనసుకూ మధ్య పెద్ద అంతరం ఏమీ లేదు. అందుకే శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు మనసులో నైరాశ్యం, ఉదాసీనత, ఒక కల్లోలం చోటుచేసుకుంటాయి. కోపం వచ్చినప్పుడు గుండె వేగం పెరగడం, కళ్లు ఎర్రబారడం అందరికీ అనుభవమే. పరిశీలిస్తే ప్రతి శారీరక అవస్థ వెనుక ఒక మానసిక కారణం, ప్రతి మానసిక అవస్థ వెనుక ఒక శారీరక కారణం మనకు కనిపిస్తాయి. ఈ వాస్తవాలే మ్యూజిక్ థెరపీకి మూలస్థంభాలయ్యాయి. ఈ సూత్రీకరణ ఆధారంగానే భావోద్వేగాలకు సంబంధించిన సంగీతం, శారీరక రుగ్మతలను నయం చేసే దిశగా అడుగులు వేసింది.

మ్యూజిక్ థెరపీలో రాగానిదే ప్రథమ స్థానం. అయితే ఏ సాహిత్యమూ లేని వాధ్య సంగీతం మనసుకు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అంతే తప్ప మనసుకు ఏ దిశా నిర్దేశమూ చేయదు. పాటలో సాహిత్యం ఉంటుంది కాబట్టి అందులో సానుకూల భావాలు ఉంటే అవి ఆ భావాల ద్వారా, తాత్విక విశ్లేషణల ద్వారా మనసుకు ఒక మార్గం చూపిస్తుంది. అందుకే వాధ్య సంగీతం కన్నా పాటలనే శ్రోతలు ఎక్కువగా ఇష్టపడతారు. వ్యక్తి మానసికంగా కుంగిపోయినప్పుడు అతడు తన సహజ చైతన్యాన్ని కోల్పోతాడు. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి తరుచూ రోగగ్రస్తుడవుతూ ఉంటాడు. ఇక్కడ చేయవలసిందేమిటి? అత డు కోల్పోయిన చైతన్యాన్ని తిరిగి అందించడమే. సరిగ్గా ఆ బాధ్యతనే నిర్వహిస్తుంది మ్యూజిక్ థెరపీ. ఏకకాలంలో శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది. ఎలా ఆరోగ్యవంతులుగా చేస్తుందంటే..

ఒత్తిడితో ఉన్న కండరాలను విశ్రాంతి పరుస్తుంది: మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఒత్తిడి ప్రెజర్ అనేది మ్యూజిక్ థెరఫీ తగ్గిస్తుంది. దాంతో ఫిట్ గా ఉండవచ్చు. డెస్క్ జాబ్స్ చేసే వారు, ఎక్కువ సమయంలో ఒకే భంగిమలో కూర్చొని ఉండటం వల్ల వెన్నెముక, మెడ, భుజాల కండరాలు బాధకు గురిఅవుతాయి. ఈ కండరాలు రిలాక్స్ అవ్వాలంటే మ్యూజిక్ బాగా సహాయపడుతుంది.


డిప్రెషన్ తగ్గిస్తుంది: కొన్ని అధ్యయనాల ప్రకారం, డిప్రెషన్ లో ఉన్నవారికి మెదడులు కణాలు చురుకుగా పనిచేయాలంటే మ్యూజిక్ థెరఫీ గ్రేట్ గా సహాయపడుతుంది.

నిద్రలేమిని తగ్గిస్తుంది: ఒత్తిడితో ఉన్న మైండ్ తో నిద్ర సరిగా పట్టకున్నా ఉన్నట్లైతే, నిద్రించే ముందు మీకు నచ్చిన సంగీతం వినడం ద్వారా బాగా నిద్రపడుతుంది. మనస్సు ప్రశాంతపడుతుందిగుండె ఆరోగ్యానికి మంచిది: మెడిసినల్ ప్రొఫిషినల్స్ అభిప్రాయం ప్రకారం రిథమిక్ బీట్ హార్ట్ బీట్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు మీరు స్ట్రెస్ ఫుల్ గా ఉన్నప్పుడు, బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది, దాంతో గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, ఒత్తిడి లేకుండా జీవించడానికి మ్యూజిక్ గ్రేట్ గా సహాయపడుతుంది.

 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మ్యూజిక్ థెరఫీతో మరో ప్రయోజనం. మ్యూజిక్ వల్ల శరీరంలో ఇండైరెక్ట్ గా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. శరీరంలో ఒత్తిడిలేకుండా మరియు ఎసిడిటీ లేకుండా అడ్రిలిన్ ను శరీరంలో విడుదల చేస్తుంది.అయితే నిరంతరం మనసును శాంతింప చేసే రాగాలకో పాటలకో పరిమితమైనా ప్రమాదమే. ఎప్పుడూ అలాంటి పాటలకే పరిమితమైతే క్రమంగా అతడు అచేతనంగా మారి, దేని మీదా ఆసక్తి లేకుండా పోయి, చివరికి ఒక జీవచ్ఛవంలా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఉత్తేజాన్నీ, పౌరుషాన్నీ నింపే పాటలను కూడా వింటూ ఉండాలి. ఉదయాన్నే సంగీతం వినడం గొప్ప థెరపీ. నిద్రలేవగానే సంగీతం వినడం వల్ల ఒక మంచి మూడ్ క్రియేట్ అవుతుంది. అది రోజంతా కొనసాగుతుంది. దైనందిన జీవితంలో అనుక్షణం చైతన్య వంతంగా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది.

Thursday, July 10, 2014

"పైల్స్" సమస్య - చికిత్స

ఒకే చోట కదలకుండా కనీసం పది నిముషాలైనా కూర్చోకుండా, కుర్చీలో అటు ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్తా చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే ‘పైల్స్‌'. ఈ సమస్యను బయటకు చెప్ప కోలేక చాలా మంది లోలోన మధనపడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. పైల్స్ (హెమరాయిడ్స్‌)లను సాధారణంగా అర్శమొలలు అంటారు. పైల్‌ అంటే గడ్డ అని హెమరాయిడ్‌ అంటే రక్త స్రావం కావడం అని అర్థం. మొలలు చూడటానికి పిలకలుగా కనబడినా, రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి. ఈ సమస్యను నివారించడానికిఆయుర్వేదం గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆయుర్వేదం హిందు మత సాంప్రదాయ ఔషధ వ్యవస్థగా , ఆయుర్వేదం పురాతకాలం నుంచి భారత ఉపఖండంలో స్థానికంగా ఉంది. ఆయుర్వేద ఔధ్యంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక ప్రయోజనాలు అందుస్తున్నాయని ప్రజల్లో నమ్మకం పెరగడంతో ఇతర ట్రీట్మెంట్స్ కు ప్రత్యామ్నాయంగా బాగా ప్రజాదరణ పొందింది. పైల్ లేదా హెమరాయిడ్స్ అనే సమస్య ఈ మద్యకాలంలో చాలా ఎక్కువగా చాలా మంది బాధిస్తున్నది . ఇక పైల్స్ కు ఆయుర్వేద చికిత్సలో చాలా వరకూ హోం రెమడీస్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . పైల్స్ కు ప్రధాన కారణం జీర్ణవ్యవస్థ. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక, బయటకు విసర్జింపబడక, ఫిషర్స్ గా మారుతుంది. ఆ కారణం వల్లే ఆయుర్వేదం ప్రకారం, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని చెబుతున్నారు. ఆయుర్వేదంతో పాటు, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే పైల్స్ ను నివారించడం చాలా సులభం అవుతుంది.

కారణం : తీవ్రమానసిక ఒత్తిళ్లు. మల విసర్జన సరిగా జరగక మలబద్దకం ఏర్పడటం. ఎక్కువసేపు కుర్చీలోనే కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తించడం. తక్కువగా నీరు తాగడం. మద్యం అతిగా సేవించడం. ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుల్లు అతిగా తినడం. మాంసాహారం తరుచూ తినడం వల్ల పైల్స్‌ సమస్య వస్తుంది.
 లక్షణాలు : మల విసర్జన సాఫీగా జరగక తీవ్ర నొప్పి, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.

పైల్స్ కు ఆయుర్వేదంలో చికిత్స: పైల్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్స్ టర్నల్ గాను లేదా ఇంటర్నల్ గా ఉండవచ్చు . ఇది డ్రైగాను లేదా బ్లీడింగ్ కూడా ఉండవచ్చు. అంతర్గత పైల్స్ తో పోల్చితే, బాహ్యంగా కనిపించే పైల్స్ తక్కువ బ్లీడింగ్ కలిగి ఉంటుంది .ఈ రెండు సందర్భాల్లోనూ జీర్ణవ్యవస్థతో సమస్య ఉంటుంది . 
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి: ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు గొప్పగా సహాయపడుతాయి. ఆయుర్వేద చికిత్స మొదలు పెట్టగానే అందులో ముందుగా చేయాల్సిన పని ఫైబర్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం . ఫైబర్ ఫుడ్స్ అంటే తాజా పండ్లు, వెజిటేబుల్స్, చిరుధాన్యాలు.పండ్లు జ్యూసులను నివారించి , పండ్లను అలాగే తినడం వల్ల పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతుంది. 

కిచెన్ మెడిసిన్ : పైల్స్ లక్షణాలున్నప్పుడు ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

 1. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవాలి. 

2. అల్లం, తేనె, స్వీట్ లైమ్ మరియు పుదీనాను నీళ్ళలో మిక్స్ చేసి తీసుకోవాలి.

 3. అరటీస్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాస్ వాటర్ లో వేసి తీసుకోవాలి. 

4. ఉల్లిపాయ రసం మరియు పంచదార నీటిలో వేసి మిక్స్ చేసి త్రాగాలి.

5. వేపఆకులతో తయారుచేసిన డికాషన్ లో తేనె మిక్స్ చేసి, అరకప్పు మజ్జిగలో మిక్స్ చేసి తీసుకోవాలి.

 6. తులసి ఆకులను నానబెట్టిన నీటిని తీసుకోవాలి.

 బహిర్గత పైల్స్ కు : బహిర్గత పైల్స్ కు ఆయుర్వేదంలో ఇంటర్నల్ గా తీసుకొనే హోం రెమడీస్ తో పాటు, బహిర్గతంగా కొన్ని ఆయిట్మెంట్స్ ను కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. 

1. నువ్వుల నూనెను ఎక్సటర్నల్ గా అప్లై చేయవచ్చు

 2. అలాగే బేకింగ్ సోడా వాపున్న ప్రదేశంలో అప్లై చేయాలి. 

వీటితో పాటు... నీల్ళు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల కూడా పైల్స్ ను నివారించవచ్చు . ఇది శరీరంకు ఎక్కువ ప్రయోజనం మరియు జీర్ణవ్యవస్థను మెయింటైన్ చేయడానికిక సహాయపడుతుంది.

 కారం తగ్గించాలి: కారంగా ఉన్న ఆహారాలను సాధ్యమైనంత వరకూ తినడం తగ్గించాలి లేదా మానేయాలి .

 వేడినీటితో కడుక్కోవడం: వేడినీటితో కడుక్కోవడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

 వ్యాయామం: వీటన్నింటితో పాటు రెగ్యులర్ వ్యాయామం వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు . వ్యాయామం వల్ల చురుకైన జీవనశైలి హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ తో పైల్స్ బారిన పడుట చాలా తక్కువగా ఉంటుంది.

Wednesday, July 9, 2014

"రుద్రాక్షల" యొక్క ఉపయోగాలు !!!మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది. పురాణ కథ: "రుద్రాక్ష" అనే పదం రుద్ర + అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు (కన్నీటి బొట్లు) అని అర్ధం.

రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో పోరాడి, మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్థం. రుద్రాక్షలను శివ రూపాలుగా భావించి పూజించడం ... ధరించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా శివారాధకులలో కొందరు రుద్రాక్షలను మాలగా ధరించగా, మరికొందరు కంఠం వరకు మాత్రమే ధరిస్తుంటారు. ఇంకొందరు ముంజేతికి ... భుజాలకి ధరిస్తుంటారు.

రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

రుద్రాక్షలలో వివిధ ముఖాలున్నవి మనకు లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు ఉన్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మాత్రమే ప్రస్తుతం లభ్యవుతున్నాయి. వీటిని మానవులు ధరిస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. వాటి వివరాలు, ఉపయోగాలు మీకోసం ...ఏకముఖి రుద్రాక్ష: (ఒక ముఖము కలిగినది): అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా, శివుని ప్రతిరూపంగా నమ్ముతారు. ఇది దరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ది, సంపద చేకూరతాయి. సర్వతోముఖ అభివృద్ధి. అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.

ద్విముఖి (రెండు ముఖములు కలిగినది) దీనిని శివపార్వతి రూపంగా-అర్ధనారీస్వర తత్వానికి సంకేతంగా నమ్ముతారు. దీనిని ధరించడం వల్ల కుండలినీ శక్తి పెరుగుతుంది. సౌభాగ్య ప్రదాయని, సర్వపాపహారిణి. ఈ రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది. దుష్ట ఆలోచనలు అదుపుచేస్తుంది. వైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది.

త్రిముఖి (మూడు ముఖములు కలిగినది) దీనిని త్రిమూర్తి స్వరూపంగా, అగ్నికి సంకేతంగా నమ్ముతారు. దీనిని ధరిస్తే ఆరోగ్యానికి, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది. సకల సౌభాగ్య దాయని. తరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం

 చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది) నాలుగు వేదాల స్వరూపం. బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయం అవుతాయి. విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది. ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయని. మానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది. జ్ఞాపకశక్తి ని, తెలివితేటలను పెంపొందిస్తుంది. నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది.

పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది) పంచభూత స్వరూపం. గుండె జబులున్న వారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది. కోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుంది. రక్తపోటు, చక్కెర వ్యాధి, పంటి నొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.

షట్ముఖి (ఆరు ముఖములు కలది) కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.కుడి చేతికి కట్టుకుంటే లోబిపి తగ్గుతుంది. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందుతారు.

 సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది) కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది.

అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది) విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. ప్రమాదాల నుండి, ఆపదల నుండి రక్షణ కల్పిస్తుంది.

నవముఖి (తొమ్మిది ముఖాలు కలది) నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది.

దశముఖి (పది ముఖాలు కలిగినది): దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. నరాలకు సంబంధించిన వ్యాధులకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది.

 ఏకాదశముఖి: 11ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది.

ద్వాదశముఖి: 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది. రక్త, హృదయ సంబంధిత వ్యాధులకు మంచిది. ధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది

 త్రయోదశముఖి: కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది. అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది.

చతుర్ధశముఖి 14ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను. శని సంబంధిత సమస్యలకు మంచిది.


Monday, July 7, 2014

"జామకాయ" తినండి ! ఆరోగ్యంతో జీవించండి !!

మనం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవటానికి ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం. ఐతే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు ఖచ్చితంగా తెలియదు. మనకు నచ్చిన పండునో, లేక పలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో, ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా తింటుంటాం. ఇక ముందు అలా చేయ వలసిన పనిలేదు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని కాపడటానికి ఎంతో ఉపయోగపడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన రీసెర్చ్ లో తెలిసింది.


  ఈ సీజన్లో ఎక్కడ చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి కాబట్టి. విరివిగా, చౌకగా దొరికే ఈ జామకాయలు విలువలేనివని అనుకోకూడదు. విలువైన పండ్లలో వుండే న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం దొరుకుతూ ఉంటాయి. అంతే కాకుండా వీటిని ఇండ్లలో కూడా పెంచుకునే చెట్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నది. జామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఈ పండ్ల ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయి. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు వీటిని తింటూ ఉంటారు. వీటితో జామ్‌ లు ఐస్‌క్రీమ్స్ సలాడ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. జామపళ్ళలో ‘సి' విటమిన్ పుష్కలంగా వుంటుంది.

 అపరిమిత పోషకాల నిలయం జామ. అనారోగ్యాన్ని దరిచేరనీయని జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కనుకనే దోరగా, దోరగా ఉన్న జామకాయను చూసిన వెంటనే తినేయాలనుకొనే వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరికి పచ్చి కాయలు నచ్చితే, మరి కొందరికి పండుపైనే మనసు. ఏదేమైనా పిల్లలనుండి పెద్దలవరకూ ఇష్టపడేది జామకాయనే.విటమిన్‌ సి ఎక్కుగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు. కమలాకన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఉంటుంది. నిమ్మ, నారింజలలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది. ఈ కాయ పండుతున్నకొద్దీ ‘సి' విటమిన్ శాతం అధికమవుతుంది. కేవలం విటమిన్‌ సి మాత్రమే కాదు. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో నిండుగా ఉంది. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల ప్రస్తుతం అందరికీ ఇది ప్రీతిపాత్రమై కూచుంది. ముఖ్యంగా దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. చివరకు ప్రపంచంలో పళ్లు అనేవి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోండి అంటూ మధుమేహ రోగులకు చెబుతూ ఉండే వైద్యులు సైతం చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో చేర్చి చెబుతుంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు జామ పపర్ ఏమటో.. ఇక జామకాయలోని ఆ పవర్ఫుల్ ఆరోగ్య గుణాలేంటో తెలుసుకుందాం...

 మధుమేహగ్రస్తులకు: చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో ఉంచబడింది. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం మరి.

 బరువు తగ్గడానికి: అన్నిటికన్నా ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునేవారికి జామ ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ఎందుకంటే, జామకాయను తింటే ఇట్టే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తినలేరు. పోషకాలు ఎలాగూ ఉన్నాయి కనుక నీరసం రాదు. అందుకే ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే " పెక్టిన్" జామలొ లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలొ కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు.

క్యాన్సర్ నివారిణి: శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది.

 దంత క్షయం: జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. చిగుళ్ల వాపులను తగ్గించుకోవచ్చును. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది. దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.

 ఎసిడిటి: ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశనం పొందేలా చేస్తుంది.

 కీళ్ల నొప్పులు: కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకోవాలి. కండరాలు గట్టిపడేలా చేస్తుంది. ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది.

 జలుబు, దగ్గు, జ్వరం: ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాక్షన్‌ వాడితే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి.

 కంటి ఆరోగ్యానికి: జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రిషియన్ ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

 సంతానోత్పత్తికి: జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది.

 థైరాయిడ్: జామకాయలో ఐయోడిన్ లేదు. అయితే ఇందులో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 రుతుస్రావం: రుతుస్రావ సమస్యలను దూరం చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపర్చడంలో, స్కర్వీవ్యాధిని దూరం చేయడంలో, జలుబుకు విరుగుడుగా జామ సమర్థవంతంగాపనిచేస్తుంది.

 చర్మ సంరక్షణ: చర్మ సంరక్షణకు సైతం జామ తనవంతు కృషి చేసుందని వైద్య నిపుణుల చెబుతుంటారు. మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి లేపనం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జామపండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, అందంగా, ముఖ ఛాయ పెరుగుతుందని బ్యూటీషియన్లు చెబుతుంటారు. ముసలితనాన్ని(Early Aging)అరికట్టడంలో సహాయపడుతుంది.

 కాలిన గాయాలకు: కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

 మెదడుకు: ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మొదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.

మలబద్దకం: బాగా మిగలపండిన జామపండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మ రసం చిలకరించుకొని తింటే మలబద్ధకం దూరమవుతుంది.
Saturday, July 5, 2014

"ప్రమాదాలలో మరణించిన ప్రముఖులు"

గత కొన్ని దశాబ్దాల్లో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది ప్రముఖ నేతలు విషాదకర రీతిలో మరణించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు హత్యకు గురైతే...సంజయ్ గాంధీ, రాజేశ్ పైలెట్, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి వాళ్లు వైమానిక ప్రమాదాల్లో మరణించారు. ఇలా విషాదభరితంగా మరణించిన కొంతమంది నాయకుల వివరాలు ఇలా వున్నాయి.


Thursday, July 3, 2014

మీరే కాదు ? మేము "నవ్వగలం"Wednesday, July 2, 2014

"పెదాల"తో "బొమ్మలు"