CSS Drop Down Menu

Monday, June 9, 2014

"స్లిమ్" గా మారేందుకు సులభ మార్గాలు!!!

సన్నగా నాజూకుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ వుంటుంది. దాని కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటుంది. అయితే మనం తినే ఆహార పదార్థాలలో చిన్న చిన్న మార్పుల ద్వారా సన్నగా ట్రిమ్గా తయారవ్వచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి తీసుకునే డిన్నరు వరకూ ఆహారంలో కొవ్వు తగ్గించుకుంటే సన్నబడడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది... అవేమిటంటే...

 జీవన విధానంలో మార్పు ఫాస్ట్ ఫుడ్ అభివృద్ది చెందిన తర్వాత పిజ్జాలు, బర్గర్లపై మోజు ఎక్కువైపోయింది. దీనికి తోడు ప్రతి సెంటర్లోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు దర్శనమిస్తున్నాయి. అందమైన ప్యాకింగులలో నోరూరిస్తుంటే వాటిని తినకుండా వుండలేకపోతున్నారు యువతరం. ఫాస్ట్ ఫుడ్ అప్పటికప్పుడు కడపునింపినా వాటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. 

ఆహారంలో మార్పులు: రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో నూనె, నెయ్యి వాడకం తగ్గించాలి. ఇవి రెండూ లేకుండా చేసిన ఆహారం అయితే మరీ మంచిది. అంటే ఉడికించిన కూరగాయలు, నూనె తక్కువగా వేసి చేసిన ఆకు కూరలు అయితే తేలికగా జీర్ణం కావడంతో పాటు పోషకవిలువలు పుష్కలంగా లభిస్తాయి.

వ్యాయామం: వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, తోటపని ఇవన్నీ ఆడవారు చేయగలిగే వ్యాయామాలు. వీటిల్లో వాకింగ్ కోసమే బయటకు వెళ్లాలి. మిగతా మూడు ఇంట్లో వుండి చేసుకునే ఎక్సర్ సైజులు. మూడింటిని చేయలేకపోయినా ఏదో ఒకటి చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ప్రకటనలు చూసి మోసపోవద్దు: టీవిలలో పేపర్లలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు. కంటికి పైన రంగుల్లో ఆకర్షనీయమైన ప్యాక్ లలో కనువిందు చేసే ఆహారపదార్థాలు నోరూరించినా వాటిల్లో పోషక విలువలు ఏమాత్రం లేకపోగా ఆరోగ్యానికి హానిచేసే కొవ్వు అధికంగా వుంటుంది. చూసిన ప్రతిదానిని తినాలనుకోవడం మానుకోవాలి.

టీవిలకు దూరంగా వుండండి: అన్నం తినేటప్పుడు టీవి చూడడం చాలా మందికి అలవాటు. అసలు అన్న తినేటప్పుడు పుస్తకాలు చదవడం, పేపరు చదవడం లాంటివి మానుకోవాలి. తినే సమయంలో ఇలాంటి పనులు చేస్తుంటే ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారు.

నీరు తగినంత: రోజు మొత్తం మీద కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు తాగడం అవసరం. వేసవికాలంలో కొంచెం ఎక్కువగా తాగాలి. వేసవిలో చల్లని నీటిని శరీరం త్వరగా గ్రహిస్తుంది.

తాజా: కూరగాయలు, పళ్లు ఫ్రిజ్ లో నిల్వ వుంచిన కూరగాయలకన్నా తాజా కూరగాయలు మంచివి. రోజు మొత్తం మీద ఐదు రకాల కూరగాయలు, పళ్లు తీసుకుంటే కొవ్వు అనేది మీ దరిచేరదు. వైద్యుడి అవసరం రాదు.

డ్రస్సులు: మనం వేసుకునే డ్రస్సులు కూడా ఊబకాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. లావుగా వున్న వారు మరీ బిగుతుగా ఉండే దుస్తులకన్నా కొద్దిగా వదులుగా వుండేవాటిని ధరిస్తే లావుగా కనపడరు. వీరికి చిన్న చిన్న డిజైన్లు బాగా నప్పుతాయి.

ఆహారాన్ని విభజించండి: రోజు మొత్తం మీద తీసుకునే ఆహారాన్ని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ గా విభజించుకోవాలి. ఆహారాన్ని కొద్ది కొద్దిగా నాలుగైదుసార్లు తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా జాగ్రత్త పడచ్చు.

అధిక క్యాలరీలు అనర్ధం: ప్యాకెట్లులో లభించే ఆహారపదార్థాలలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పోషకవిలువలు ఎక్కువ క్యాలరీలు తక్కువ వున్న వాటినే ఎంచుకోవాలి. కొనుగోలు చేసే పదార్థాలలో ఎన్ని క్యాలరీలు వున్నాయో చూసుకొని మరీ కొనడం మంచిది.

రంగుని చూసి మోసపోవద్ద: వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆహార పదార్థాలను ఆకర్షనీయమైన రంగులు, ప్యాకెట్లలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు ఉత్పత్తిదారులు. వీటి హంగు రంగు చూసి మోసపోవద్దని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.

నవ్వు మంచిదే: నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. కానీ నవ్వు చాలా రకాలుగా మంచిదని నిపుణుల అభిప్రాయం. రోజు మొత్తం మీద కొన్ని నిమిషాల పాటు నవ్వగలిగితే దానికి మించిన వ్యాయామం మరొకటి వుండదు. రోజుకి 15నిమిషాల పాటు హాయిగా నవ్వుతుంటే సంవత్సరంలోపు రెండు కిలోల బరువు తగ్గవచ్చు.















0 comments:

Post a Comment