CSS Drop Down Menu

Wednesday, June 4, 2014

" షకీలా" జీవితంలో చేదు నిజాలు...!!!


                                           షకీలా ఆత్మకథ
 'నేను ఆత్మకథ పుస్తకం ఎందుకు రాయాలి? నా జీవితం నుంచి ఎవరైనా నేర్చుకొనేది ఏదైనా ఉందా? నేనేమీ మదర్ థెరిస్సాను కాను. నేను పూర్తిగా ఒక కృత్రిమమైన జీవితాన్ని గడిపాను. నేను నటించిన చిత్రాలు కూడా కృత్రిమమైనవే. అలాంటప్పుడు నేను ఆత్మకథనుఎందుకురాయాలి?మొదట్లో నాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. అందుకే ఎవరైనావచ్చిఆత్మకథ రాయమంటే నేను ఒప్పుకొనే దాన్ని కాదు. నిరాకరించాను. కానీ ఆ తర్వాత నా మనసు మార్చుకున్నాను.

 రాయడానికికారణంనేనుఅందరిలాంటిఆడపిల్లనే.సామాన్యంగాబతకాలనుకున్నాను.
 ప్రేమించాలనుకున్నాను. ఇతరుల చేత ప్రేమించబడాలనుకున్నాను. ఇవేమీ సాధ్యం కాలేదు. నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఎవరికీ తెలియదు. నా పేరుశృంగారరసానికిప్రతీకగాఎందుకుమారిందో ఎవరికీ తెలియదు. షకీలాలుఎలాపుడతారో,ఎలారూపుదిద్దుకుంటారోఅందరికీ తెలియాలనే ఇప్పుడీ ఆత్మకథ రాశాను.

నా సినిమాలో అది తప్ప....
 నా సినిమా నా శరీరాన్ని శృంగారభరితంగాచూపట్టడంతప్పఇంకేమీచేయదు.
 నాలోని స్త్రీని, నాలోని నటిని ఎవరూ చూడరు. మలయాళీ కుర్రకారు శృంగార
 కలలకు నేను ప్రతిరూపమని ఒక సారి ఓజర్నలిస్టునాతోఅన్నాడు.ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి అన్నం పెట్టాల్సిందే.అదితప్పవేరేఏదీసంతోసాన్నివ్వదు.

రెమ్యూనరేషన్ ఒక దశలో-
 సినిమా హీరోయిన్ల కన్నా నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనేదాన్ని. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరిగేదాన్ని. పగలనకా రాత్రనకా సినిమా షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని. కొన్ని సార్లు రోజుకు రెండు, మూడు గంటల నిద్ర కూడా దొరికేది కాదు.

చాలా మంది దృష్టిలో...
 చాలాసార్లుబెడ్‌రూంసన్నివేశాల్లోనటిస్తూనేవళ్లుతెలియకుండానిద్రపోయేదాన్ని.
 అలాంటి సన్నివేశాలను చూసి ప్రేక్షకులు నేను భావ ప్రాప్తిపొందుతున్నానని
 భావించేవారు. చాలా మంది దృష్టిలో నేను కామోద్దీపన కలిగించేఒకశరీరాన్ని మాత్రమే. నాలో ఉన్న నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు.

అమ్మే అలా చేసింది...
 మాఅమ్మకుసంబంధించినాకుఎటువంటిమంచిమెమరీస్లేవు.ఆమెనన్నుఎప్పుడూ ప్రేమగాచూడలేదు.ఆప్యాయంగాపలకరించలేదు.నాజీవితాన్నినాశనంచేసింది మా అమ్మే. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది. శాపనార్థాలు పెట్టేది.

16 వ ఏటే...
 ఇలా నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూనన్నుతిట్టేఅమ్మఒకరోజునన్ను పొగిడింది. ఆ తర్వాత- నన్ను ఒక వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెడతాడని
 చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడనీ
 అతనితో 'మంచి'గా ఉంటే- మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలుతీరిపోతాయనీ
 చెప్పింది. అతను చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది.

ప్రారంభం మాత్రమే నేను షాక్ తిన్నా.
 మా అమ్మ మాటల వెనకున్న అర్థమేమిటో నాకు బోధపడింది.  కానీ నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అమ్మ చెప్పినట్లే ఒక వ్యక్తి వచ్చి హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ రూమ్‌లో ధనవంతుడని మా అమ్మ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతనిని చూసి నేను బాధతో, భయంతో గడ్డకట్టుకుపోయా.ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే.

ఆ తర్వాత...
 ఆ తర్వాత అలాంటి ధనవంతులనేకమంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది.
 నాకుబాధకలిగేది.అప్పుడప్పుడుకొంతతృప్తికూడాకలిగేది.నేనునాకన్యాత్వాన్ని
 ఎప్పుడు కోల్పోయానో నాకే తెలియదు.

జాలేస్తుంది...
 ఆల్కహాల్తీసుకొనేటప్పుడుపురుషులకన్నామహిళలకంపెనీనేనేనుఎక్కువగా కోరుకుంటాను. తాగిన తర్వాత పురుషులుతమకామాన్నివెల్లడిస్తారు.వారితో కలిసితాగుతున్నానంటేవారికోరికలుతీర్చటానికినేనుసిద్ధంగాఉన్నాననుకుంటారు. అలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది. వారి జీవితంలో భావ దారిద్య్రం ఎక్కువ. వారికి జీవితంలో సెక్స్ తప్ప వేరే భావన ఏదీ లేదా అనిపిస్తుంది.

ఎలా కలుగుతాయి..?
 సినిమాలోబెడ్‌రూంసీనుల్లోనటించేటప్పుడుశృంగారభావనలుకలుగుతాయా
 అనే ప్రశ్నను చాలా మంది అడుగుతూ ఉంటారు. షూటింగ్ జరిగేటప్పుడు మొత్తం యూనిట్ అంతా ఉంటుంది. అందరూ చూస్తున్నప్పుడుసెక్స్ ప్రేరణలు ఎలా కలుగుతాయి?నటిస్తున్నపుడు కోరికలుండవు మహిళలకు సంబంధించినంత వరకూ శృంగారమనేది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక అనుబంధం లేకపోతే సెక్స్‌ను ఆనందించలేరు. నేనుచిత్రాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. నటిస్తున్నప్పుడు నాకెప్పుడూ సెక్స్ కోరికలు కలగలేదు.

అక్క వల్లే దివాలా...
 మా పెద్దక్క నూర్జహాన్ నేను దివాళా తీయటానికి ప్రధాన కారణం.ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్రరంగంలోఎక్కువపారితోషికంతీసుకొన్ననటీమణిని నేనే. అయినా నా సంపాదనంతా మా అక్క దొంగిలించింది.మోస పోయాను.
 మా అక్కే నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది. నేనుతననిపూర్తిగానమ్మాను.
 నా చిన్నప్పటి నుంచి తను నాతోనే ఉంది.ఎప్పుడూతనుఅలాప్రవర్తిస్తుందని
 నేను ఊహించలేదు. ఒక దశలో నేను ఈ సినిమాలతో విసిగిపోయాను. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరగటం- కంటి మీద కునుకు
 లేకుండా షూటింగ్‌లు చేయటం నాకు విసుగనిపించాయి. నేను ఒక బ్రేక్
 తీసుకుందామనుకున్నా. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదా మనుకుంటున్నానని మా అమ్మతోను, నూర్జహాన్‌తోను చెప్పాను. వాళ్లిద్దరూ షాక్ తిన్నారు. బ్రేక్ తీసుకుంటానంటే నేనేదో పెద్దనేరంచేస్తున్నట్లు చూశారు. నూర్జహాన్ అలాంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చచెప్పటం
 మొదలుపెట్టింది.వారుకేవలంనాడబ్బునేప్రేమించారని,నాభవిష్యత్తుమీదవారికి
 ఎటువంటి ఆలోచన లేదని తేలింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను సంపాదించిన డబ్బంతా ఇచ్చేయమన్నా.డబ్బంతాఇంటికేఖర్చుపెట్టేసానంది నూర్జహాన్. నాకు షాక్ తగిలినంత పనైంది.
0 comments:

Post a Comment