CSS Drop Down Menu

Monday, June 30, 2014

ఒకే కొండపై "వేయి" కి పైగా "దేవాలయాలు" !

కొండల పైన దేవాలయాలు సాధారణంగా నిర్మిస్తారు. అయితే, ఒకే ఒక విశాలమైన కొండపై వేయి కి మించిన దేవాలయాలు వుంటే ఎలా ? కాని ఇది వాస్తవం . మరి ఇది ఎక్కడ వుంది ? గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో పాలితానా అనే ఊరిలో శత్రున్జయ కొండపై అపురూపమైన ఈ లెక్కకు మించిన దేవాలయాలు చూడవచ్చు. ఈ ఊరి అసలు పేరు పాలితానా కాగా దానిని కూడా మరచిన ప్రజలు దీనిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఇది జైనులకు అతి పవిత్రమైన ప్రదేశం. భగవంతుడి కొరకు నిర్మించిన ఈ దేవాలయ నగరంలో రాత్రి వేళ దేవాలయ అర్చకులు తప్ప ఇతరులు ఎవరూ ఇక్కడ నిద్రించరు. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ తీర్ధ యాత్ర చేస్తే గాని మోక్షం లభించదని జైనులు భావిస్తారు. సుమారు 1800 అడుగుల ఎత్తులో కల ఈ కొండ ఎక్కడానికి 3745 మెట్లు కలవు.

క్లుప్త చరిత్ర :- పాలితానా ప్రదేశాన్ని కొన్ని రాజ వంశాలు పాలించేవి. స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం ఈ పట్టణాన్ని గుజరాత్ రాష్ట్రంలో కలిపింది.

అద్భుత దేవాలయాలు :- పవిత్రమైన ఈ శత్రున్జయ పర్వతంపై జైనులకు సంబంధించి సుమారు 800 కు పైగా దేవాలయాలు కలవు. ధర్మబద్ధంగా తమ మత నిబంధనలు ఆచరించే ప్రతి జైనుడు జీవితంలో ఒక్కసారైనా దీనిని దర్శించాలని కోరుకుంటాడు.

పవిత్రత :- ఎందుకు వీటికి అంత పవిత్రత ? జైన మతం లోని 23 తీర్ధన్కరులూ ఈ పర్వతాన్ని దర్శించారు. మొట్ట మొదటి తీర్ధన్కరుడైన రిశిభ తీర్ధంకరుడు తన మొదటి ప్రవచనాన్ని ఇక్కడే ప్రసంగించారు. ఈ కారణంగా జైనులలో శ్వేతాంబర తెగ వారికి ఈ ప్రదేశం అతి ప్రధానమైనది.

శత్రున్జయ అంటే ? జైనులు తమ దేవాలయాలను దరాసర లు అని పిలుస్తారు. వేయి దేవాలయాలు కల ఈ శత్రున్జయ కొండకు ఇంకా 108 ఇతర పేర్లు కూడా కలవు. శత్రున్జయ అంటే శత్రువుల పై విజయం సాధించిన వాడు అని అర్ధం చెపుతారు.

పురాతనత :- సుమారు 11 వ శతాబ్దం లో ప్రారంభమైన ఈ దేవాలయాల నిర్మాణం 900 సంవత్సరాల పాటు కొనసాగినదని చెపుతారు. తర్వాతి కాలంలో టర్కీ ముస్లిము ల చే ఆక్రమిన్చబడి, 16 వ శతాబ్దంలో పునరుద్ధరించబడ్డాయి.

పుండరీక గిరి :- జైనుల మొదటి తీర్ధన్కరుడైన రిషభ జైనుడు తన మొదటి ప్రసంగాన్ని ఇక్కడే చేసాడు. అతడి మనుమడు ఈ ప్రదేశంలో మోక్షం పొందాడు. అందుకని ఈ ప్రదేశాన్ని పుండరీక గిరి అని పిలుస్తారు.

అన్య మతాలు :- పవిత్రమైన ఈ శత్రున్జయ పర్వతానికి జైనులే కాక, ఇతర మతస్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి దేవాలయాలను దర్శించి వెళతారు. ఇక్కడి కొండ ఎక్కే ముందు దిగువన గల ఒక సమాధిని దర్శించి పర్వతారోహణ చేస్తారు.

మోక్షము :- జైనుల 23 వ తీర్ధంకరుడు ఇక్కడ నివసింఛిన కారణంగా ఈ క్షేత్రం జైన శ్వేతాంబర తెగ వారికి అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్క సారైనా ఈ క్షేత్రాని దర్శించి మోక్షం పొందాలని భావిస్తారు.

ఎపుడు చేరాలి ? ఒక పెద్ద సమూహం గా నిర్మించబడిన ఈ దేవాలయాలను మూడు మార్గాలలో చేరవచ్చు. సంవత్సరంలో ఎపుడైనా సరే ఇక్కడి వాతావరణం అనుకూలిస్తుంది.

ధర్మ నిబంధనలు :-  ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళేటపుడు కొన్ని జైన మత నిబంధనలు పాటించాలి. గాలి లోని క్రిములు నోటిలోకి పోకుండా మరల మనం ఊపిరి వదలి నపుడు అవి బయటకు వచ్చి ఆ ప్రదేశాన్ని పాడు చేయకుండా ఉండాలనే జైన మత నిబంధన మేరకు నోటికి ఒక పట్టీ కట్టుకొని వెళ్ళాలి. అక్కడకు వెళ్లి వచ్చ్చే వరకూ కఠిన మైన ఉపవాస దీక్ష చేయాలి. వృద్ధులు పిల్లలు పైకి వెళ్ళాలంటే, నడవలేక పోయినచొ, వారి వారి బరువును బట్టి పల్లకీ లకు ధరచెల్లించి ఈ క్షేత్రానికి చేరి దర్శనం చేసికొనవచ్చు.

ఆచరించ వలసిన పనులు :-  ఈ పుణ్య క్షేత్రం దర్శనం ఒకే రోజులో పూర్తి చేయాలి. ఎందుకంటే, అక్కడ రాత్రి వేళ అర్చకులు తప్ప ఇతరులు నిద్రించారాడు. అదే విధంగా, దేవాలయాలను దర్శించిన తర్వాతనే, ఆహార పానీయాలు సేవిన్చాలి. ఆహారం తీసుకోనాలంటే, అక్కడ ఒక ప్రత్యేక ప్రదేశం కలదు.

 పునరుద్ధరణ:- డబ్బుగల ధనవంతులు, ఇక్కడి నిర్మాణాలకు పునరుద్ధరణ చేయవచ్చు. పూర్వం అనేక మంది వ్యాపారస్తులు వారి ఇష్టానుసారం భక్తి పూర్వకంగా ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా నిర్మించారు. అందుకే నేటికి ఇవి వేయి కి పైగా అయ్యాయి. ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాలు, ఆదినాధ, కుమారపాల, సంప్రతి రాజా, విమల షా, సహస్రక్కూత, అష్టపద, మరియు చౌముఖ మొదలైనవి. వీటిలో చాలా దేవాలయాలు 16 వ శతాబ్దంలో పునరుద్ధరించబడినవే.

ఎలా చేరాలి ? ఈ కొండ ఎత్తు సుమారు మూడున్నర కి. మీ. లు వుంటుంది. అంటే సుమారు రెండు నుండి మూడు గంటల ప్రయాణం. భావనగర్ పట్టణానికి నైరుతి దిశలో సుమారు 50 కి. మీ. ల దూరంలో ఈ పాలితాన ప్రదేశం కలదు. ఈ పట్టణానికి ఒక చిన్న రైలు స్టేషన్ కూడా కలదు. ఇది సూన్గేడ్ మరియు భావనగర్ లను కలపుతుంది. భావనగర్ నుండి పాలితానా కి ప్రతి గంటకు ఒక బస్ నడుస్తుంది.





0 comments:

Post a Comment