CSS Drop Down Menu

Tuesday, June 3, 2014

" అందమైన కురులుకోసం "



 నిగనిగలాడే వెంట్రుకల కోసం... గుడ్డు లేదా పెరుగును వేప ఆకుల పే‌స్ట్‌లో
 కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
 ఈ ప్యాక్ కేశాలకు కండిషనర్‌లా పనిచేస్తుంది.

 హెన్నా తెల్లవెంట్రుకలను బ్రౌన్‌ గా మారుస్తుంది. అయితే హెన్నాను ఎక్కువ
 రోజులు వాడకూడదు. దీనిలో ఉండే రసాయనాలు జుట్టులో ఉండే నూనెను
 తొలగిస్తాయి. దాంతో జుట్టు మృదుత్వం కోల్పోతుంది.
 నాణ్యమైన కలర్‌ని నిపుణుల సలహామేరకు వాడటం మంచిది.

 కప్పు ముల్తానామట్టి, ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, గుడ్డు బాగా కలిపి జుట్టుకు పట్టించాలి.అరగంటతర్వాతకండిషనర్‌షాంపూతోతలస్నానంచేయాలి. నిస్తేజంగా మారిన జుట్టు మృదువుగా మారుతుంది.

 అరకప్పు ఉసిరిపొడి, 2 టేబుల్‌స్పూన్ల ఆముదం, గుడ్డు కలిపి జుట్టుప్యాక్‌లా వేయాలి. మాడుకు కూడా రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వెంట్రుకలు చిట్లకుండా, మృదువుగా అవుతాయి.

ఒక స్పూన్‌ కర్పూరం పొడిని కొబ్బరినూనెలో కలుపుకొని ప్రతిరోజు తలకి మసాజ్‌ చేసుకోవాలి.

మల్లెతీగ వేర్లని, నిమ్మరసంతో కలిపి గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.

తలస్నానానికి వీలైనంత వరకు కుంకుడు, శీకాయ, హెర్బల్‌ షాంపూలనే వాడాలి.

జుట్టుకుతరచూనూనెతోమసాజ్‌చేయడంచాలాఅవసరం.వారానికిరెండు-మూడు సార్లు మస్టర్డ్‌ ఆయిల్‌ కానీ, కొబ్బరినూనె కానీ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.

 కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తలకు పట్టిస్తే మంచిది.

 తాజా కొత్తిమీర ఆకుల రసం రాయడం వల్ల జుట్టుకి నిగారింపు వస్తుంది.

 ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆనీటిని కుదుళ్ళలోకి  ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.

 కరివేపాకును రోజూ ఆహారంలో అంటే, పప్పుచారులోనూ, తాలింపులోనూ, పచ్చడిగానూ, కారప్పొడిగానూ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకుని పచ్చిగానే రుబ్బి తీసుకుంటే ( తింటే ) పూర్తి ఫలితం ఉంటుంది. కరివేపాకును ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

 మెల్లిగా చేతివేళ్ల కొనలతో తలంతా మసాజ్‌ చేస్తే బ్లడ్‌ సర్క్యులేషన్‌ పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.


0 comments:

Post a Comment