CSS Drop Down Menu

Saturday, June 21, 2014

"కొబ్బరి" ఆరోగ్యానికే కాదు ! అందానికి కూడా!!

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు. అయితే పని ఒత్తిడి, అలసట, సమయాభావం వంటి కారణాలతో తగిన పోషణ తీసుకోలేకపోతుంటారు. తరచూ సౌందర్యశాలకు వెళ్లి మెరుగులు దిద్దుకోవాలంటే కష్టమైన విషయమే. అలాంటప్పుడు ఇంట్లోనే ఉంటూ అందుబాటులో ఉండే కొబ్బరి పాలతో మేని మెరుపునకు ప్రయత్నించవచ్చు. కొబ్బరి ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. దాని నుంచి తీసిన పాలు ఔషధ గుణాల మిళితం వాటిని ఆహాంరంలోనే కాదు...ఆరోగ్యాన్ని అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకూ వాడితే..ప్రకాశవంతమైన చర్మం, ఆరోగ్యవంతమైన శరీరం మీ సొంతమవుతుంది.
 వేసవికాలంలో దాహార్తిని తీర్చే కొబ్బరి బొండాలు సౌందర్య పోషణలోనూ బాగా పనిచేస్తాయి. చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం కొబ్బరిబొండాం నీళ్లలో మెండుగా ఉంది. ఈ నీళ్లతో పాటు కొబ్బరి పాలను కూడా సౌందర్య పోషణలో వాడొచ్చు.కొబ్బరి బోండాలలో ఎనర్జీ కలిగిన గుణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొబ్బరి నీళ్లలో పొటాషియం, మినరల్స్‌ ఉన్నాయి. ఇవి అలసటను దూరం చేసి మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి. ఎనర్జీ కలిగిన ఈ కొబ్బరి బోండాం వంద గ్రాముల నీటిలో 312 మిల్లీ గ్రాముల పొటాషియం, 30 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉన్నాయి. ఇవి ధాతు ఉప్పును వెంటనే ఎముకలకు, కండరాలకు అందించడం ద్వారా కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే ఉత్సాహం ఏర్పడుతుంది. 




 కొబ్బరి పాలలోని ఆశ్చర్యకరమైన బ్యూటీ ప్రయోజనాలు తెల్లవారుజామున పరగడుపున కొబ్బరి బోండాం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలంటే రోజూ ఓ కొబ్బరి బొండాంను తీసుకోవడం మంచిది. అలాగే కామెర్లకు కూడా కొబ్బరి నీళ్లు చెక్‌ పెడతాయి. కొబ్బరిబొండాంలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ. డయాబెటిస్‌ను నియంత్రించే శక్తి ఎక్కువ. ఇంకా కేన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. వైరస్‌తో పోరాడే శక్తి కొబ్బరి నీళ్లకుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న కొబ్బరి బోండాంను వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిందే.
 1. వేసవికాలంలో ప్రతిరోజు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల భానుడి ప్రతాపానికి నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
 2. అరకప్పు కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్‌ తేనె కలిపి ఒక బకెట్‌ గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతం అవుతుంది.
 3. వేసవిలో చెమటతోపాటు చర్మంపై పేరుకుపోయే మురికివల్ల మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. దీనినుంచి బయటపడాలంటే కొబ్బరిపాలలో రెండు చుక్కుల నిమ్మరసం కలిపి పదినిమిషాల తరువాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దాలి. కాసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము పోయి చర్మం తాజాగా ఉంటుంది.
 4.చిక్కటి కొబ్బరిపాలలో కొన్ని తేనె చుక్కలు, రెండు టేబుల్‌ స్పూన్‌ బియ్యపురవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్‌ రాస్తే మృదువైన పాదాలు సొంతమవుతాయి.




0 comments:

Post a Comment