CSS Drop Down Menu

Saturday, June 14, 2014

బామ్మా ? మజాకా ??

‘మనుషులందరూ వాకింగ్ చేయాలి...ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అంటూ డాక్టర్లు సలహాలిస్తున్నప్పటికీ మనలో ఎవరు కూడా వారానికోసారి గట్టిగా నాలుగు అడుగులు వేయడం లేదు. ఒకవేళ వేసినా మహా అంటే ఓ మూడు కిలోమీటర్లే. ఇక పోలీస్, మిలిటరీ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్ధులు కూడా ఐదు కిలోమీటర్ల రన్నింగ్ చేయగానే కుప్పకూలిపోతారు. లేదా ఆస్పత్రి బెడ్‌పై చికిత్స కోసం వాలిపోతుంటారు. అలాంటిది, 91 ఏళ్ల వయసులో కూడా అమెరికాకు చెందిన ఓ బామ్మ ఏకంగా...ఏకదాటిగా 42కిలోమీటర్లు పరిగెత్తేసింది. మొత్తం 7 గంటల 7నిమిషాల 42 సెకండ్లలో ఈ దూరాన్ని అధిగమించింది. దీంతో ఇంత లాంగ్ మారథాన్ ను పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో నిలిచింది. 



ఆమె పేరు హారియట్ థాంప్సన్. తన స్నేహితురాలు లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు చేపట్టిన పరుగులో ఆ బామ్మ పాల్గొంది. 21 కిలోమీటర్ల వరకు బాగానే పరిగెత్తాను గానీ, తర్వాత చాలా కష్టంగా అనిపించిందని, చుట్టుపక్కల మోగిస్తున్న బ్యాండ్ల మీదనే దృష్టి పెట్టి.. మొత్తం దూరాన్ని ఎలాగోలా పూర్తి చేసేసానంటూ ఆయాసంతో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా మొత్తం 90 వేల డాలర్లు సేకరించి సొసైటీకి ఇచ్చింది.  ఇంతకు ముందు 92 ఏళ్ల వయసులో గ్లేడీస్ బరిల్ అనే అమెరికన్ మహిళ 9 గంటల 53 నిమిషాల పాటు పరుగు తీసింది.


0 comments:

Post a Comment