CSS Drop Down Menu

Wednesday, June 11, 2014

ఈ ఫుడ్స్ రాత్రుల్లో తింటే ఏమవుతుంది ?

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. అంతే కాదు చాలా మంది నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. ఉదయం నిద్రలేవగాని కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, యాసిడి రిఫ్లెక్షన్, విరేచనాలు ఇలాంటివి మరికొన్ని జీర్ణక్రియ సమస్యలు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. 

కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఇవి కడుపును అసౌకర్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా రాత్రిళ్ళు తీసుకొనే కొన్ని ఆహారాలు నిద్రలేకుండా చేస్తాయి. ఉదాహరణకు ఉదయం నిద్రలేవగానే యాసిడ్ రిఫ్లెక్షన్ గురైతే, రాత్రిళ్లో కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాలకు దూరంగా ఉండాలి. అదే విధంగా అజీర్తి సమస్యలు గమనించినట్లైతే, రాత్రిళ్లో హార్డ్ గా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదా: పచ్చి ఉల్లిపాయలు, చిదిమిన బంగాళదుంపలు వంటి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలు రాత్రిళ్ళో తినడం మానేయాలి. 

కాబట్టి మీరు రాత్రుల్లో ప్రశాంతమైన నిద్ర పొందాలన్నా ఆరోగ్యరంగా నిద్రలేవన్నా కొన్ని ఆహారాలు రాత్రుల్లో తినడం మానుకోవడంతో పాటు, రాత్రివేళ భోజనం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకో బోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది. కాబట్టి ఇటు మంచి నిద్ర కోసం.. అటు ఆరోగ్యానికి... నిద్రించే ముందు తీసుకోకూడని కొన్ని ఆహారాలు మీకోసం...

ఫ్రైడ్ ఫుడ్: ఫ్రైడ్ ఫుడ్స్ రాత్రిళ్లో తినకూడదు. వీటిని హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి. జీర్ణం అవ్వడానికి కూడా కష్టం అవుతుంది. దాంతో నిద్రలేకుండా చేస్తుంది.

మెకరోని పాస్తా: ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన పాస్తా పిండితో కూడినటువంటి ఆహారం. ఒక రకమైనటువంటి నిశితమైన ధాన్యంతో తయారు చేయబడిన పాస్తా తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకొని, నిద్రకు అంతరాయం  కలిగిస్తుంది. కాబట్టి నిద్రించే ముందు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

కార్బోనేటెడ్ డ్రింక్స్: కాఫీ, టీ, కోలా డ్రింక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆన్నాశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. ఫలితంగా నిద్రలేమి. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.

కెఫిన్: కెఫిన్ ఉపయోగించడం మన ప్రస్తుత దినచర్యలో ఒక భాగమై పోయింది. నిద్రలేవగాని కాఫీ త్రాగందే పని మొదలవుదు. అయితే నిద్రలేమితో బాధపడేవారు ఈ కెఫిన్ ఆహారాలు(కాఫీ, టీ, చాక్లెట్స్, మరియు ఎనర్జీ డ్రింక్స్)కు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా కెఫిన్ వాడబడిఉంటుంది.

ఐస్ క్రీమ్: గ్రీసీ ఫుడ్స్, అంటే క్రీమ్(ఐస్ క్రీమ్స్), ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్, రాత్రి సమయంలో తినడం మానేయాలి. వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల మిమ్మల్ని అలసటకు గురిచేయడమే కాకుండా మరుసటి రోజు ఉదయానికి బద్దకస్తులుగా మార్చుతుంది. కడుపులో వీటివల్ల వికారం ఏర్పడి, విరేచనాలకు దారితీస్తుంది. బరువు పెరగడానికి దారితీసి ఆ ఫ్యాట్ ఫుడ్ ను నిద్రకు ముందు తీసుకోకపోవడం చాలా మంచిది.

చాక్లెట్స్ : చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది.

బ్రెడ్: ఫాస్ట్ ఫుడ్స్/బర్గర్: ఈ రకమైన ఆహారాలు సందేహం లేకుండా నిద్రలేమికి గురిచేస్తాయి. ఇవి కొవ్వులను మాత్రం కలిగి ఉండటమే కాక, ఎక్కువగా కారంగా ఉంటాయి. దాంతో కడుపులో మంట, గ్యాస్ కు కారణం నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ కు చెక్ పెట్టి సుఖనిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి.

స్పైసీ ఫుడ్స్: స్పైసీఫుడ్స్ అతి కారంగా ఉన్న ఆహారాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, కారంగా ఉన్న సాస్ ఫుడ్స్, కారంగా ఉన్న పెప్పర్ ఫుడ్ తినడం వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఈ నిరుపయోగకరమైన ఆహారాలను రాత్రి నిద్రించే ముందు తినకపోవడం వల్ల మీకు మంచి నిద్ర పట్టవచ్చు. కావట్టి ఎక్కువ కారం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.

టమోటో సాస్: టమోటో సాస్ యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది మరియు జీర్ణక్రియను నిధానం చేస్తుంది . పిజ్జా చీజ్ తో నింపి ఉంటుంది మరియు టమోటో సాస్ కూడా. కాబట్టి రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్.సిడిటి ఉన్నవారు టమోటోలను పూర్తిగా మానేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. సాధారణంగా టమోటో జ్యూసీగా ఉండి ఎసిడిటికి కారణం అవుతుంది. దాంతో ఛాతీలో మంట పుడుతుంది. నిద్రలేమికి కారణం అవుతుంది

వెల్లుల్లి: వెల్లుల్లిలో సల్ఫర్ నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల దీనిలో వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఇలాంటి ఘాటైన మసాల దినుసులు, వెల్లుల్లి రాత్రి సమయంలో తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి రక్తంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ నిదానంగా జరిగి తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకొని గాస్ట్రిక్ కు దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో వెల్లుల్లికి దూరంగా ఉండటమే మంచిది

మాంసాహారం: రాత్రి సమయంలో మాంసాహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. అయితే పూర్తిగా నిలిపివేయడం కంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ను తగిన మోతదాలో తీసుకోవడం మంచిది. అది కూడా లేట్ నైట్ కాకుండా త్వరగా తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం తీసుకొన్న తర్వాత వేడి నీళ్ళు లేదా వేడి పాలను త్రాగి నిద్రించడం వల్ల అటు జీర్ణశక్తికి ఇటు మీ గాఢ నిద్రకు ఎటువంటి భంగం కలగదు.

ఫ్రూట్ సలాడ్: మనక ఆశ్చర్యం కలగవచ్చు . అయితే ఫ్రూట్స్ లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది డ్యూరియాటిక్ కు కారణం అవుతుంది. దాంతో మీరు రాత్రుల్లో ఎప్పుడు పడితే అప్పుడు మూత్ర విసర్జనుకు లేయాల్సి వస్తుంది . కాబట్టి ఇటువంటి ఫ్రూట్ సలాడ్స్ ను రాత్రుల్లో తీసుకోవడం మానేయండి. కొంతం మందికి పండ్లు యాసిడ్ రిఫ్లెక్షన్ కు దారితీస్తాయి.

పాలు: ఆహారాలు అంటే అధిక కొవ్వున్న పాలు, పెరుగు, వెన్న మరియు జున్ను వంటివి రాత్రి సమయంలో జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. అంతే కాదు వీటిని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో గుండెలో మంటగా అనిపిస్తుంది. నిద్రసరిగా పట్టకుండా చేస్తుంది.

మద్యం: శరీరంలో ఉండే నీరును తగ్గిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కు గురిచేస్తుంది. అంతే కాదు ఇది శరీరంలో ఉండే సెరోటిన్(serotonin)స్థాయిని తగ్గించి నిద్రలేమికి గురిచేస్తుంది.

స్టీక్: ఫ్యాట్ ఎక్కువగా ఉన్నలేదా హై కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా జ్యూసీ స్టీక్స్ ఎసిడిటికి దారితీస్తుంది. మరియు జీర్ణక్రియ కూడా చాలా నిధానం అవుతుంది. ఫలితంగా మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇంకా ఉదయం స్టొమక్ ప్రాబ్లెమ్స్ కు దారితీస్తుంది.

బ్రొకోలీ: గ్రీన్ వెజిటేబుల్ సూపర్ ఫుడ్ గా భావిస్తారు. అయితే కూడా ఈ ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకోకూడదు. నిద్రించే ముందు ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కష్టం అవుతుంది. నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి, రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయండి.

డేకేఫ్ కాఫీ: నిద్రను కెఫిన్ పాడు చేయవచ్చు మరియుఎక్కువ సమయం నిద్రమేల్కొనేలా చేస్తుంది. సున్నితస్తులో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

నూడిల్స్: నూడిల్స్ లో అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి బరువును సులభంగా పెంచుతాయి . దాంతో జీర్ణక్రియకు కష్టం అవుతుంది. కాబట్టి రాత్రుల్తో నూడిల్స్ తినడం మానుకోండి. అలాగే స్పైసీ గ్రేవీ మంచూరియన్ వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండండి. లేదంటే ఇవి హార్ట్ బర్న్ కు కారణం అవుతాయి.

సెలరీ: సెలరీ గురించి ఆశ్చర్యం కలగవచ్చు. ఇది నేచురల్ డ్యూరియాటిక్ పదార్థం. ఇది రాత్రుల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు దారి తీస్తుంది. దాంతో నిద్రలేమి, ఉదయం అసౌకర్యం. కాబట్టి రాత్రుల్లో ఈ ఆహారానికి చెక్ పెట్టండి.

ప్యాకేజ్డ్ ఫుడ్స్: ముందుగా తయారు చేసి నిల్వచేసిన ఆహారాలు లేదా ప్యాక్ చేసిన ఆహారాలు చాలా సున్నితంగా ఉంటాయి. అటువంటి వాటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల అధిక ఫ్యాట్ పొంది, హార్ట్ బర్న్ కారణం అయ్యి, నిద్రలేమికి దారితీస్తుంది.

హై షుగర్ ఫుడ్స్/స్వీట్స్: పంచదార ఎనర్జీని పెంచుతుంది, అదే సమయంలో నిద్రలో అసమతుల్యతలు ఏర్పడుతాయి. కాబట్టి షుగర్ ఫుడ్స్ కేక్స్, చాక్లెట్స్, మరియు డిజర్ట్స్ వంటి నిద్రలేమికి కారణం అయ్యే వీటికి దూరంగా ఉండటం వల్ల నిద్రబాగా పడుతుంది.

కేక్స్: అతి పెద్ద బెల్లీ ఫ్యాట్ ఉన్నా కూడా మీకు అసౌకర్యంగా ఉంటుంది. దాంతో నిద్రపోవడానికి కష్టం అవుతుంది. నిద్ర సమయంలో జీర్ణవ్యవస్థ నిదానంగా జీవక్రియలు జరిగి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నిద్రపోవడానికి ముందు ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉంటు మితంగా తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇటువంటివి తినాలకున్నప్పుడు నిద్రించే నాలుగు గంటల మందు తినడం శ్రేయస్కరం

గ్రీన్ పీస్ /గ్యాస్ ఆధారిత ఆహారాలు: మనిషికి ముఖ్యంగా అసౌకర్యం కలిగించేవి గ్యాస్ట్రిక్ మరియు గుండెలో మంట. ఈ సమస్యలకు కారణమయ్యే ఆహారాలు అంటే గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహారాలు బీన్స్, బ్రొకోలీ, పచ్చిబఠానీ వంటివాటికి దూరంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది.

లిక్విడ్స్/ద్రవాలు: ఎక్కువగా నీరు తీసుకోవడం మంచిదే, అయితే రాత్రిసమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు నీటిని మితంగా త్రాగాలి. లేదంటే కడుపునిండుగా ఉన్నట్లు అనిపించి మాటమాటికీ బాత్ రూమ్ ను వినియోగించే పరిస్థితి ఏర్పడవచ్చు.


























0 comments:

Post a Comment