CSS Drop Down Menu

Monday, June 30, 2014

ఒకే కొండపై "వేయి" కి పైగా "దేవాలయాలు" !

కొండల పైన దేవాలయాలు సాధారణంగా నిర్మిస్తారు. అయితే, ఒకే ఒక విశాలమైన కొండపై వేయి కి మించిన దేవాలయాలు వుంటే ఎలా ? కాని ఇది వాస్తవం . మరి ఇది ఎక్కడ వుంది ? గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో పాలితానా అనే ఊరిలో శత్రున్జయ కొండపై అపురూపమైన ఈ లెక్కకు మించిన దేవాలయాలు చూడవచ్చు. ఈ ఊరి అసలు పేరు పాలితానా కాగా దానిని కూడా మరచిన ప్రజలు దీనిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఇది జైనులకు అతి పవిత్రమైన ప్రదేశం. భగవంతుడి కొరకు నిర్మించిన ఈ దేవాలయ నగరంలో రాత్రి వేళ దేవాలయ అర్చకులు తప్ప ఇతరులు ఎవరూ ఇక్కడ నిద్రించరు. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ తీర్ధ యాత్ర చేస్తే గాని మోక్షం లభించదని జైనులు భావిస్తారు. సుమారు 1800 అడుగుల ఎత్తులో కల ఈ కొండ ఎక్కడానికి 3745 మెట్లు కలవు.

క్లుప్త చరిత్ర :- పాలితానా ప్రదేశాన్ని కొన్ని రాజ వంశాలు పాలించేవి. స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం ఈ పట్టణాన్ని గుజరాత్ రాష్ట్రంలో కలిపింది.

అద్భుత దేవాలయాలు :- పవిత్రమైన ఈ శత్రున్జయ పర్వతంపై జైనులకు సంబంధించి సుమారు 800 కు పైగా దేవాలయాలు కలవు. ధర్మబద్ధంగా తమ మత నిబంధనలు ఆచరించే ప్రతి జైనుడు జీవితంలో ఒక్కసారైనా దీనిని దర్శించాలని కోరుకుంటాడు.

పవిత్రత :- ఎందుకు వీటికి అంత పవిత్రత ? జైన మతం లోని 23 తీర్ధన్కరులూ ఈ పర్వతాన్ని దర్శించారు. మొట్ట మొదటి తీర్ధన్కరుడైన రిశిభ తీర్ధంకరుడు తన మొదటి ప్రవచనాన్ని ఇక్కడే ప్రసంగించారు. ఈ కారణంగా జైనులలో శ్వేతాంబర తెగ వారికి ఈ ప్రదేశం అతి ప్రధానమైనది.

శత్రున్జయ అంటే ? జైనులు తమ దేవాలయాలను దరాసర లు అని పిలుస్తారు. వేయి దేవాలయాలు కల ఈ శత్రున్జయ కొండకు ఇంకా 108 ఇతర పేర్లు కూడా కలవు. శత్రున్జయ అంటే శత్రువుల పై విజయం సాధించిన వాడు అని అర్ధం చెపుతారు.

పురాతనత :- సుమారు 11 వ శతాబ్దం లో ప్రారంభమైన ఈ దేవాలయాల నిర్మాణం 900 సంవత్సరాల పాటు కొనసాగినదని చెపుతారు. తర్వాతి కాలంలో టర్కీ ముస్లిము ల చే ఆక్రమిన్చబడి, 16 వ శతాబ్దంలో పునరుద్ధరించబడ్డాయి.

పుండరీక గిరి :- జైనుల మొదటి తీర్ధన్కరుడైన రిషభ జైనుడు తన మొదటి ప్రసంగాన్ని ఇక్కడే చేసాడు. అతడి మనుమడు ఈ ప్రదేశంలో మోక్షం పొందాడు. అందుకని ఈ ప్రదేశాన్ని పుండరీక గిరి అని పిలుస్తారు.

అన్య మతాలు :- పవిత్రమైన ఈ శత్రున్జయ పర్వతానికి జైనులే కాక, ఇతర మతస్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి దేవాలయాలను దర్శించి వెళతారు. ఇక్కడి కొండ ఎక్కే ముందు దిగువన గల ఒక సమాధిని దర్శించి పర్వతారోహణ చేస్తారు.

మోక్షము :- జైనుల 23 వ తీర్ధంకరుడు ఇక్కడ నివసింఛిన కారణంగా ఈ క్షేత్రం జైన శ్వేతాంబర తెగ వారికి అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్క సారైనా ఈ క్షేత్రాని దర్శించి మోక్షం పొందాలని భావిస్తారు.

ఎపుడు చేరాలి ? ఒక పెద్ద సమూహం గా నిర్మించబడిన ఈ దేవాలయాలను మూడు మార్గాలలో చేరవచ్చు. సంవత్సరంలో ఎపుడైనా సరే ఇక్కడి వాతావరణం అనుకూలిస్తుంది.

ధర్మ నిబంధనలు :-  ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళేటపుడు కొన్ని జైన మత నిబంధనలు పాటించాలి. గాలి లోని క్రిములు నోటిలోకి పోకుండా మరల మనం ఊపిరి వదలి నపుడు అవి బయటకు వచ్చి ఆ ప్రదేశాన్ని పాడు చేయకుండా ఉండాలనే జైన మత నిబంధన మేరకు నోటికి ఒక పట్టీ కట్టుకొని వెళ్ళాలి. అక్కడకు వెళ్లి వచ్చ్చే వరకూ కఠిన మైన ఉపవాస దీక్ష చేయాలి. వృద్ధులు పిల్లలు పైకి వెళ్ళాలంటే, నడవలేక పోయినచొ, వారి వారి బరువును బట్టి పల్లకీ లకు ధరచెల్లించి ఈ క్షేత్రానికి చేరి దర్శనం చేసికొనవచ్చు.

ఆచరించ వలసిన పనులు :-  ఈ పుణ్య క్షేత్రం దర్శనం ఒకే రోజులో పూర్తి చేయాలి. ఎందుకంటే, అక్కడ రాత్రి వేళ అర్చకులు తప్ప ఇతరులు నిద్రించారాడు. అదే విధంగా, దేవాలయాలను దర్శించిన తర్వాతనే, ఆహార పానీయాలు సేవిన్చాలి. ఆహారం తీసుకోనాలంటే, అక్కడ ఒక ప్రత్యేక ప్రదేశం కలదు.

 పునరుద్ధరణ:- డబ్బుగల ధనవంతులు, ఇక్కడి నిర్మాణాలకు పునరుద్ధరణ చేయవచ్చు. పూర్వం అనేక మంది వ్యాపారస్తులు వారి ఇష్టానుసారం భక్తి పూర్వకంగా ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా నిర్మించారు. అందుకే నేటికి ఇవి వేయి కి పైగా అయ్యాయి. ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాలు, ఆదినాధ, కుమారపాల, సంప్రతి రాజా, విమల షా, సహస్రక్కూత, అష్టపద, మరియు చౌముఖ మొదలైనవి. వీటిలో చాలా దేవాలయాలు 16 వ శతాబ్దంలో పునరుద్ధరించబడినవే.

ఎలా చేరాలి ? ఈ కొండ ఎత్తు సుమారు మూడున్నర కి. మీ. లు వుంటుంది. అంటే సుమారు రెండు నుండి మూడు గంటల ప్రయాణం. భావనగర్ పట్టణానికి నైరుతి దిశలో సుమారు 50 కి. మీ. ల దూరంలో ఈ పాలితాన ప్రదేశం కలదు. ఈ పట్టణానికి ఒక చిన్న రైలు స్టేషన్ కూడా కలదు. ఇది సూన్గేడ్ మరియు భావనగర్ లను కలపుతుంది. భావనగర్ నుండి పాలితానా కి ప్రతి గంటకు ఒక బస్ నడుస్తుంది.

Saturday, June 21, 2014

"కొబ్బరి" ఆరోగ్యానికే కాదు ! అందానికి కూడా!!

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు. అయితే పని ఒత్తిడి, అలసట, సమయాభావం వంటి కారణాలతో తగిన పోషణ తీసుకోలేకపోతుంటారు. తరచూ సౌందర్యశాలకు వెళ్లి మెరుగులు దిద్దుకోవాలంటే కష్టమైన విషయమే. అలాంటప్పుడు ఇంట్లోనే ఉంటూ అందుబాటులో ఉండే కొబ్బరి పాలతో మేని మెరుపునకు ప్రయత్నించవచ్చు. కొబ్బరి ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. దాని నుంచి తీసిన పాలు ఔషధ గుణాల మిళితం వాటిని ఆహాంరంలోనే కాదు...ఆరోగ్యాన్ని అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకూ వాడితే..ప్రకాశవంతమైన చర్మం, ఆరోగ్యవంతమైన శరీరం మీ సొంతమవుతుంది.
 వేసవికాలంలో దాహార్తిని తీర్చే కొబ్బరి బొండాలు సౌందర్య పోషణలోనూ బాగా పనిచేస్తాయి. చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం కొబ్బరిబొండాం నీళ్లలో మెండుగా ఉంది. ఈ నీళ్లతో పాటు కొబ్బరి పాలను కూడా సౌందర్య పోషణలో వాడొచ్చు.కొబ్బరి బోండాలలో ఎనర్జీ కలిగిన గుణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొబ్బరి నీళ్లలో పొటాషియం, మినరల్స్‌ ఉన్నాయి. ఇవి అలసటను దూరం చేసి మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి. ఎనర్జీ కలిగిన ఈ కొబ్బరి బోండాం వంద గ్రాముల నీటిలో 312 మిల్లీ గ్రాముల పొటాషియం, 30 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉన్నాయి. ఇవి ధాతు ఉప్పును వెంటనే ఎముకలకు, కండరాలకు అందించడం ద్వారా కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే ఉత్సాహం ఏర్పడుతుంది. 
 కొబ్బరి పాలలోని ఆశ్చర్యకరమైన బ్యూటీ ప్రయోజనాలు తెల్లవారుజామున పరగడుపున కొబ్బరి బోండాం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలంటే రోజూ ఓ కొబ్బరి బొండాంను తీసుకోవడం మంచిది. అలాగే కామెర్లకు కూడా కొబ్బరి నీళ్లు చెక్‌ పెడతాయి. కొబ్బరిబొండాంలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ. డయాబెటిస్‌ను నియంత్రించే శక్తి ఎక్కువ. ఇంకా కేన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. వైరస్‌తో పోరాడే శక్తి కొబ్బరి నీళ్లకుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న కొబ్బరి బోండాంను వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిందే.
 1. వేసవికాలంలో ప్రతిరోజు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల భానుడి ప్రతాపానికి నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
 2. అరకప్పు కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్‌ తేనె కలిపి ఒక బకెట్‌ గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతం అవుతుంది.
 3. వేసవిలో చెమటతోపాటు చర్మంపై పేరుకుపోయే మురికివల్ల మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. దీనినుంచి బయటపడాలంటే కొబ్బరిపాలలో రెండు చుక్కుల నిమ్మరసం కలిపి పదినిమిషాల తరువాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దాలి. కాసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము పోయి చర్మం తాజాగా ఉంటుంది.
 4.చిక్కటి కొబ్బరిపాలలో కొన్ని తేనె చుక్కలు, రెండు టేబుల్‌ స్పూన్‌ బియ్యపురవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్‌ రాస్తే మృదువైన పాదాలు సొంతమవుతాయి.
Friday, June 20, 2014

"తీపి" తినడం "తగ్గించాలంటే" ఎలా?కొన్ని సార్లు మనస్సు బాగోలేప్పుడు లేదా విసుగు చెందినప్పుడు ఏదైనా షుగర్ ట్రీట్ మీద మనస్సు వెళుతుంది. ముఖ్యంగా షుగర్ మరియు షుగర్ తో తయారుచేసిన స్వీట్ ఒక ఎనర్జీ బూస్టర్ గా ఉంటుంది. స్వీట్స్ మీద కోరికలు ఎప్పుడైన, ఎక్కడైన పుట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో స్వీట్స్ ఏదోఒకటి తినాలనే కోరికను అనుచుకోలేక ఫ్రిజ్ లో చాక్లెట్స్ లేదా ఐస్ క్రీమల కోసం వెతుకుతుంటాం.
 షుగర్ తోతయారుచేసిన వంటలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలకు, శరీరంలో కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. షుగర్ ఒక కార్బోహైడ్రేట్ ఇది శరీరంలో విచ్చిన్నంకాబడి మన శరీరానికి కావల్సిన ఎనర్జీని రిలీజ్ చేసే సెరోటిన్ హార్మోనులను విడుదల చేస్తుంది. మన శరీరంలో స్వీట్స్ తినాలనే కోరిక కలిగినప్పడు, అది మీశరీరంలో షుగర్ లెవల్స్ తగ్గితున్నట్లు సంకేతం మరియు వాటిని రీలోడ్ చేయాలి . కానీ, పంచదారతో తయారుచేసిన చిరుతిండ్లు మరింత తీసుకొన్నప్పుడు, మరికొంత తినడానికి కోరిక పెంచుతుంది . అదే మీ మిమ్మల్ని మీ ఆకలి సంతృప్తి పరచే సామర్థ్యం కలిగి ఉంది మరియు మీ శరీరానికి అవసరమైయ్యే శక్తిని అందిస్తుంది.
 దాంతో మీరు ఇంకా మరింత చక్కెర అల్పాహారం తీసుకోవడం కోసం మరియు ఆకలి అనుభూతికి గురిచేయవచ్చు . ఎప్పుడైతే ఈ ఆహారం రక్తప్రవాహంలో ప్రవేశించినప్పుడు బ్లడ్ షుగర్ పెరగడానికి కారణం అవుతుంది. ఇలా క్రమంగా జరగడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. అది రక్తం నుండి రక్తకణాల్లోనికి చేరుతుంది . దురదృష్టవశాత్తు ఇన్సులిన్ స్థాయి మీలోని రక్తకణాలు మరింత సున్నితంగా మారి మధుమేహం మరియు గుండె జబ్బు దారితీస్తుంది .
 కానీ మీ స్వీట్ వ్యసనాన్ని ఎలా అపగలరు? చాలామంది న్యూట్రిషియన్స్ అభిప్రాయం ప్రకారం స్వీట్ మీద కోరికలను నియంత్రించడానికి ఒక ఉత్తమ వ్యూహం తక్కువగా తినాలని సూచిస్తున్నారు. అయితే, షుగుర్ స్టఫ్ ను పూర్తిగా నివారించడం లేదా రెగ్యులర్ గా మీరు తీసుకొనే షుగర్ స్టఫ్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక్కడ కొన్ని చిట్కాలున్నాయి. ఇవి మీ తీపి రుచుల కోరికలను నియంత్రించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి .
ఒక చిన్న బిట్ తినాలి మీకు తీపి తినాలనే కోరిక కలిగినప్పుడు కుక్కీస్ కానీ లేదా చాక్లెట్స్ కానీ చాలా తక్కువగా తినాలి. మీరు నార్మల్ బ్లడ్ షుగర్ లెవల్స్ కలిగి ఉండాలని కోరుకుంటే రోజు మొత్తంలో స్నాక్స్ తినడాన్ని నియంత్రించండి . పెద్దమొత్తంలో ఏదైనా తినడం కంటే, ఒక చిన్న బిట్ తినడానికి ప్రయత్నించండి . చిన్న క్యాండీస్ ను నోట్లో వేసుకోవడం వల్ల తీపి రుచుల కోరికలను నియంత్రించవచ్చు.

లోగ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంపిక చేసుకోండి: మీ చక్కెర కోరికలను నియంత్రించడానికి మరొక సూచన , GI ( గ్లైసెమిక్ సూచిక ) ఆహారాలు తీసుకవడం . ఇవి రోజంతా నెమ్మదిగా శక్తి విడుదల చేయడానికి సహాయపడుతుంది మరియు మీరు మద్యలో ఏదైనా తినాలనే భావన కలగదు . మీ చక్కెర కోరికలను నియంత్రించడానికి , కాయలు మరియు గోధుమ బియ్యం , స్టార్చ్ కూరగాయలు , లెగ్యుమ్స్ మరియు వోట్స్ వంటి మంచి GI ఆహారాలు కొన్ని తినాలి .

వెనిలా సేన్టేడ్ ఉత్పత్తులు: మీకు ఇప్పటికీ షుగర్ స్టఫ్ మీద కుతూహలం ఉంటే, వెనిలా సేన్టేడ్ ఉత్పత్లును స్ప్రే చేయడం లేదా టాపింగ్ గా ఉపయోగించడానికి ప్రయత్నించండి. షుగర్ కోరికలను నియంత్రించడానికి మరొక ఆసక్తికరమైన చిట్కా హెయిర్ ఫ్రెషనర్ లేదా వెనీలా సెంటెడ్ క్యాండిల్ వెలిగించడం. వెనీలా వాసన చాలా ఘాటువాసన కలిగి ఉండి  షుగర్ కర్వింగ్స్ ను తగ్గిస్తుంది లేదా నియంత్రిస్తుంది.

కోరికలను తగ్గించుకోండి: షుగర్ కర్వింగ్స్ ను నియంత్రిండానికి లేదా బీట్ చేయడానికి ఎటువంటి టెంప్టేషన్స్ అయినా, నియంత్రిండానికి ప్రయత్నించండి. ఉదాహరణకు మీరు పనిచేస్తున్నప్పుడు కాఫీ తీసుకోవలనే కోరిక అధికమైనప్పుడు అటుగా వెళ్ళకపోవడం కానీ లేదా ఆ దారిలో వెళుతున్నప్పుడు ఆ కాఫీ షాపు పక్కన చూడకుండా వెళ్ళడం ఉత్తమ మార్గం.

బబుల్ గమ్స్ నమలండి: మీరు వెలితిగా లేదా షుగర్ కర్వింగ్స్ కు పూర్తిగా లొంగలేనప్పుడు, ఒక చిన్న బబుల్ గమ్ ను నమలండి, చూయింగ్ గమ్ మీ ఆహారాల మీద కోరికను తగ్గిస్తుంది.

Thursday, June 19, 2014

"మధుమేహగ్రస్తులు తీసుకోవలసిన ఆహారాలు"


డయాబెటిస్‌ వ్యాధికాదు డిజైస్టివ్‌ డిజార్డర్‌. దీన్ని ఇలాగే వదిలేస్తే శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. ప్రపంచ వ్యాప్తంగా  మిలియన్ల మంది డయాబెటిస్‌ వ్యాధితో బాదపడుతున్నారు. మనిషిని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నీ ఒకెత్తయితే, డయాబిటీస్ ఒకటీ ఒకెత్తుగా మారిన ప్రస్తుత కాలంలో ఆహార నియంత్రణే ఈ వ్యాధి నివారణకు మార్గంగా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కెలోరీలు తక్కువగా ఉండే ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసుకోవాల్సిందిగా కూడా ముందుజాగ్రత్తలను సూచిస్తున్నారు.

అటువంటి జాబితా మీరు ప్లాన్ చేసుకోవాంటే మీకోసం కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా ఇక్కడ లిస్ట్ తయారుచేయబడింది. ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల నోటి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొన్ని రకాలైనటువంటి కూరగాయలు మరియు పండ్లలో ఉండేటటువంటి ప్రోటీనులు మరియు విటమినులు మీ శరీర మరియు మానసిక స్థితిని బలపరుస్తాయి.  ఇవి మీ మధుమేహగ్రస్థులకు శక్తిని మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరు
స్తాయి. మరి అవేంటో ఒక సారి చూద్దాం.

బీన్స్: బీన్స్ లో హై క్యాలరీలు, కిడ్నీబీన్స్, పింటో, నేవీ, బ్లాక్ మరియు ఇతర రకాల బీన్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటిలో న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్స్ కడుపు ఫుల్ గా ఉండేలా చేసి,ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది.

డార్క్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్: ఆకు కూరలు, కొల్లార్డ్ గ్రీన్, మస్టర్డ్ గ్రీన్స్, కాలే మరియు ఇతర డార్క్ గ్రీన్ లీఫ్ వెజ్జీస్ అధిక న్యూట్రీషయన్స్ కలిగి, తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. మరియు అతి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి.

సిట్రస్స్ పండ్లు: ఆరెంజ్, గ్రేఫ్ ఫ్రూట్స్ మరియు ఇతర సిట్రస్ పండ్లలో అధిక శాతంలో విటమిన్ సి ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా, నేరుగా అలాగే పండ్లను తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. లోక్యాలరీలను కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మీరు పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది.

స్వీట్ పొటాటో: విటమిన్ ఎ మరియు ఫైబర్, లోగ్లైసిమ్ ఇండెక్స్ పుష్కలంగా ఉంటుంది. స్వీట్ పొటాటో మీ బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచదు. రెగ్యులర్ పొటాటోకు స్వీట్ పొటాటోకు వ్యత్యాసం ఉన్నది.
బెర్రీస్ : బెర్రీస్ లో అన్ని రకాల బెర్రీస్ ఆరోగ్యానికి మేలు చేసేవే, అయితే వాటిలో స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీస్ మరియు ఇతర బెర్రీస్ లో యాంటీయాక్సిడెంట్స్, విటమిన్స్ మరియు ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. అయితే వీటి తాజాగా తీసుకొని సలాడ్స్, స్మూతీస్ లేదా సెరల్స్ రూపంలో తీసుకోవాలి.

టమోటో: ఈ లోక్యాలరీ సూపర్ ఫుడ్స్ ను నేరుగా అలాగే పచ్చివి లేదా ఉడికించివి తీసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి, ఉడికించి, లేదా ఆవిరి పట్టించి, లేదా సైడ్ డిష్ లా సలాడ్స్, సూప్స్, క్యాసరోల్స్ లేదా ఇతర డిష్ లలో తీసుకోవచ్చు.

చేపలు: సీఫుడ్స్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . సాల్మన్, ఆల్బకోర్ తునా, మెకరెలా, హలీబట్ మరియు హెరింగ్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుష్కలంగా ఉండా ఇవి గుండె ఆరోగ్యానికి మరియు డయాబెటిక్స్ రాకుండా సహాయపడుతుంది.

తృణధాన్యాలు: బార్లీ, ఓట్ మీల్, బ్రౌన్ బ్రెడ్ మరియు ఇతర తృణధాన్యాలలో ఫైబర్ ఫుష్కలంగా ఉంది. వీటిలో మెగ్నీషియం మరియు క్రోమియం ఫొల్లెట్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

నట్స్: డైట్ పరంగా ఇందలో హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, అయితే ప్రత్యుత అధ్యయనాలు, పరిశోధనలు వీటిలో ‘మంచి ఫ్యాట్స్' (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ )ఉన్నట్లు కనుగొన్నారు. ఇది హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది మరియు ఇతర ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే నట్స్ లో క్యాలరీలు అధికంగా ఉన్నాయి, అందుకే ఎక్కువగా బాదం మరియు వాల్ నట్స్ వంటివి తీసుకోకూడదు.

ఫ్యాట్ ఫ్రీ మిల్క్ మరియు పెరుగు: ఈ డైరీ ఫుడ్స్ క్యాల్షియం మాత్రం అంధివ్వడం మాత్రమే కాదు, విటమిన్ డి కూడా అంధిస్తుంది. మరియు ఇది ఆకలిని నియంత్రిస్తుంది.
Wednesday, June 18, 2014

"బియ్యం"తో "అందం"

భారతీయులు ఎక్కువగా వారి రోజువారీ భోజనంలో రైస్ కోరుకుంటారు. ప్రత్యేకించి తూర్పున మరియు దక్షిణాన నివసించే ప్రజలు, బియ్యం వారి ప్రధాన ఆహారంగా ఏర్పరచుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బియ్యం కూడా సౌందర్య సంరక్షణ కోసం ఒక అద్భుతమైన పదార్ధంగా ఉపయోగపడుతుంది. ఈ రైస్ అతని / ఆమె చర్మం కాంతివంతంగా చేయటంలో సహాయపడుతుంది మరియు ఆ కాంతి చాలాకాలం ఉంచుతుంది. ప్రతి మహిళ ప్రకాశవంతమైన, సిల్కీ మరియు మృదువైన ఛాయను పొందాలనే కోరిక కలిగి ఉంటుంది. ఆసియా దేశాలలో నివస్తున్న మహిళలు ప్రకాశవంతమైన, మృదువైన మరియు ప్రకాశవంతమైన ఛాయతో ఉంటారు. వారి చర్మం కాంతివంతంగా ఉండటానికి గల కారణాలలో ఒకటి వారి ఆహారపు అలవాటు. మీరు కూడా అందమైన చర్మం కలిగిఉండాలి అనుకుంటే, మీ అందం విస్తరించేందుకు రైస్ వంటకం తినటం ప్రారంభించండి. మీ చర్మం ప్రకాశవంతంగా తయారుకావటానికి మార్గాలు ముడి బియ్యం సరిగ్గా రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోండి మరియు వాటిని ఒక కంటైనర్ లో ఉంచండి. బియ్యంలో ఉన్న మురికి మరియు అవసరం లేని రేణువులను కడగండి. శుభ్రంగా కడిగిన బియ్యంలో శుభ్రమైన నీటిని పోయండి మరియు ఒక మూతతో ఆ పాత్రను మూసిఉంచండి. పాత్రలోని బియ్యం అడుగున చేరేవరకు ఇరవై నిముషాల వరకు అలానే ఉంచండి. పాత్రలో పైన తేరుకున్న పాలరంగులో ఉన్న నీటిని తీసి వేరేపాత్రలో పోయండి. ఈ బియ్యం కడుగు నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ముఖం మీద నీరు ఆరేవరకు అలానే ఉంచండి. ఒకసారి ఆరింది అనుకుంటే, మరల దానిమీదనే మరల కడుగు నీటిని పోసుకోండి. బియ్యం కడుగు నీటిలో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు మీ చర్మం రంధ్రాల ద్వారా శోషించబడి మీ చర్మం ఎండినట్లుగా ఉంటుంది. మీరు ముఖాన్ని కడిగిన తరువాత మీ చేతితో ముఖాన్ని తాకినట్లయితే, చాలా సున్నితంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రకాశవంతంగా మరియు ప్రకాశించే రంగు ఛాయతో మేక్-అప్ వేసుకోవొచ్చు. ప్రజలు ఉపయోగించే బియ్యం ఒకే రకమైనవి కాకపోవొచ్చు. మీ చర్మం అందంగా తయారవటానికి ఏ రకమైన బియ్యానైనా ఉపయోగించవొచ్చు.  మీ ముఖం నిస్తేజంగా మారింది అంటే, మీ చర్మం కాంతివంతంగా తయారుచేసుకోవటానికి సమయం ఆసన్నమైందన్న మాట. మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవటానికి రైస్ ను ఉపయోగించవొచ్చు. మీ చర్మం కాంతివంతంగా మారటానికి హాని కలిగించే ఎటువంటి సౌందర్య సాధనాలను ఉపయోగించనవసరం లేదు. మీరు సులభంగా దొరికే రైస్ మీద ఆధారపడవొచ్చు. మీరు బియ్యం కడుగు నీటిలో దూదిని ముంచి, దానిని ఉపయోగించండి మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందండి.

 లాభాలు:- ఈ విధంగా చేయటం వలన మీ చర్మం గట్టిపడుతుంది. మీ చర్మం చాలా మృదువుగా అవుతుంది. మీ చర్మ రంధ్రాలు దగ్గరగా ముడుచుకుంటాయి. మీ చర్మం కాంతివంతంగా తయారవటానికి ఖర్చులేని మార్గం. మీ చర్మచాయ కాంతివంతంగా అవుతుంది. ఇది మీ చర్మానికి తేజస్సును కలిగించే ఒక మూలకం. ఇది ఒక సహజ ఆర్గానిక్ క్లీన్సెర్ లాగా పనిచేస్తుంది. చేతులతో ఈ క్లీన్సెర్ ను ముఖంపై వర్తింపచేసుకున్నందువలన వారి చేతులు కూడా కోమలంగా, నునుపుగా తయారవుతాయి. మీరు నిస్తేజమైన మరియు పొడిబారిన చర్మం కలిగి ఉంటే, ఈ బియ్యం క్లీన్సెర్ను మీరు అద్భుతమైన రంగు ఛాయను తిరిగి పొందడంలో సహాయం చేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ రైస్, ఉపయోగించటం వలన కలిగే చర్మకాంతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నమ్మలేక పోతున్నారా? అయితే మీరు కూడా వాడి చూడండి .

Tuesday, June 17, 2014

"నేరుడు పండు"తో నిండైన ఆరోగ్యం!


సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం. నేరేడుపండు ఆరోగ్యానికి మంచిది. ఔషధగుణాలు కల్గిన చెట్టు అది. ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్‌ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్‌ 15, ఐరన్‌ 1.2, విటమిన్‌ సి 18మి.గ్రా. ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. నేరేడులో ఉన్న ఆమ్ల గుణంవల్ల దీన్ని జామ్‌లు, వెనిగర్‌, సాండీస్‌, ఆల్కహాల్‌, తక్కువశాతం ఉండే వైన్‌ల తయారీలో వాడుతుంటారు.

నేరేడు పండ్లు ఆరోగ్యానికి బహు విధాలుగా ఉపయోగాపడుతాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రధాయిని అని పిలుస్తుంటారు. ఈ ఆరోగ్య ఫలప్రధాయినిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? చూద్దామా !!

 డయాబెటిక్ కు మంచిది: నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.

గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది : నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55mg ల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.

దంత సమస్యలను నివారిస్తుంది: నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది.

శరీరంను డీహైడ్రేష్ నుండి రక్షిస్తుంది: వేసవిలో వేడి వాతవరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. అలాగే దప్పికను కంట్రోల్ చేస్తుంది.

చర్మ సంరక్షణ: స్కిన్ రాషెష్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది. నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలను నివారించబడుతాయి.

వృద్దాప్యము త్వరగా రాకుండా చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్దాప్యము ఆలస్యం చేస్తుంది. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది . అలాంటి అనారోగ్యలనుండి కాపాడుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: నేరుడు పండు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంటుగా పనిచేయడమే కాక, రోగనిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతాయి. వీటిలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి, శరీరం యొక్క రోగ్యనిధోక శక్తిని పెంచతుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుంటాయి. ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి.

ఎముకలను బలంగా ఉంచుతుంది: నేరేడు పండ్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి, శరీరంలో ఎముకలు బలంగా ఉండేదుకు సహాయపడుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది: ఆస్తమా, బ్రొకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. క్రోనిక్ దగ్గును నివారిస్తుంది. దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి.

హీమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది: అన్నామలై యూనివర్సిటి అధ్యయనం ప్రకారం ఈ నేరుడు పండ్లు శరీరంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుందని నిర్ధారించారు . ఇందులో ఉండే విటమిన్ సి, మరియు ఐరన్ ఈ రెండు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆరోగ్యంగా ఉండటానికి బాధ్యత కలిగిన న్యూట్రీషియన్స్

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది: నేచురల్ గా బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేసే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

గౌట్ పెయిన్: నేరుడు పండ్లలో ఉండే విటమిన్ సి గౌట్ పెయిన్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

మెమరీ పవర్: ఒక టేబుల్ స్పూన్ జామున్ జ్యూస్ లో, తేనె, ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది.

డయోరియా: నేరుడు ఆకులు: నేరుడు ఆకులను ఆయుర్వేధ చికిత్సల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిలోనే వైద్యపరమైన గుణాల వల్ల ఇది డయోరియా మరియు అల్సర్ వంటి జబ్బులను నివారిస్తారు

గాయాలను మాన్పుతాయి: పూర్వకాలంలో చీముతో నిండిన గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను వాడేవారు. ఈ ఆకులకు యాంటిబ్యాక్టీరియల్‌, నయం చేసే గుణాఉంటాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్‌ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది. ఇలాంటప్పుడు నాలుగైదు నేరేడు పళ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడినీ తగ్గిస్తుంది. నేరుడు పండ్లలో బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పౌడర్ వేసి తీసుకుంటే ఎసిడిటి తగ్గిస్తుంది.

కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది: కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

హెమరాయిడ్స్ : నేరుడు పండ్లను క్రమం తప్పకుండా రెండు మూడు నెలలో తీసుకుంటే హెమరాయిడ్స్ వల్ల రక్తస్రావంను నివారిస్తుంది.

బెడ్ వెట్టింగ్: చిన్న పిల్లలు రాత్రుల్లో బెడ్ వెట్టింగ్ చేస్తుంటే అర టేబుల్ స్పూన్ నేరుడు గింజల పౌడర్ ను నీళ్ళలో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు ఇవ్వడం వల్ల రెండు మూడు వారాల్లో ఈ అలవాటును మానుకుంటారు.

మూత్ర సంబంధ సమస్యలకు : మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతు న్నారు. అవి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చూస్తాయంటున్నారు.

Monday, June 16, 2014

"లైంగిక సామర్థ్యం"ను పెంచే ఆహారాలు!!! ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్' వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.
 నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.
 సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్' నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును. లిబిడో సమస్యలను అధిగమించడానికి పురాతన కాలం నుండి అశ్వగంధని మనకు ప్రసాధించింది. సెక్స్ డ్రైవ్ ను పెంచే ఇండియన్ ఆహారాలు, నేచురల్ లిబిడో బూస్టర్స్ గా సహాయపడుతాయి. అవే మీ సంతోకర జీవితానికి, కొన్ని మసాలాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ లిబిడో సమస్యలను నివారించుకోండి...
యాలకులు: ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.

సెలరీ(Celery): ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ఆడ్రోస్టెనోన్ ను విడుదల చేయడం వల్ల ఇది అంత ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఈ సుగంధ వాసన, భాగస్వామిని ఇట్టే ఆకర్షిస్తుంది.

అరటి పండు: అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.

 గుడ్లు: గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

 వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది

అశ్వగంధ: సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.

Ginseng(ఒక విధమైన మూలిక): ఈ జిన్సెంగ్ మూలిక యొక్క వేరును లిబిడో సమస్యలను నివారించడంలో విస్తృతంగా ఉపయోగించారు. దీన్ని ఇంకా లోయర్ బ్లడ్ ప్రెజర్ మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఉపయోగిస్తారు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

ఫిగ్: ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.

స్ట్రాబెర్రీ: కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ కు అద్భుతంగా సహాయపడుతాయి.

ఆస్పరాగస్:  దీన్ని ఆహారంగా పురాతన కాలం నుండే తీసుకుంటున్నారు. ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండారాలకు బూస్ట్ వంటిది. తగినంత శక్తిని అందిస్తుంది.

అవొకాడో: ఇది బట్టర్ ఫ్రూట్. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో అధికంగా జింక్ మరియు ఐరన్ మరియు కావల్సినన్ని విటమిన్లు ఉండి శారీరక ఆరోగ్యానికి మరియు లైంగికజీవితానికి బాగా సహాయపడుతాయి.

రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.


Saturday, June 14, 2014

బామ్మా ? మజాకా ??

‘మనుషులందరూ వాకింగ్ చేయాలి...ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అంటూ డాక్టర్లు సలహాలిస్తున్నప్పటికీ మనలో ఎవరు కూడా వారానికోసారి గట్టిగా నాలుగు అడుగులు వేయడం లేదు. ఒకవేళ వేసినా మహా అంటే ఓ మూడు కిలోమీటర్లే. ఇక పోలీస్, మిలిటరీ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్ధులు కూడా ఐదు కిలోమీటర్ల రన్నింగ్ చేయగానే కుప్పకూలిపోతారు. లేదా ఆస్పత్రి బెడ్‌పై చికిత్స కోసం వాలిపోతుంటారు. అలాంటిది, 91 ఏళ్ల వయసులో కూడా అమెరికాకు చెందిన ఓ బామ్మ ఏకంగా...ఏకదాటిగా 42కిలోమీటర్లు పరిగెత్తేసింది. మొత్తం 7 గంటల 7నిమిషాల 42 సెకండ్లలో ఈ దూరాన్ని అధిగమించింది. దీంతో ఇంత లాంగ్ మారథాన్ ను పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో నిలిచింది. ఆమె పేరు హారియట్ థాంప్సన్. తన స్నేహితురాలు లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు చేపట్టిన పరుగులో ఆ బామ్మ పాల్గొంది. 21 కిలోమీటర్ల వరకు బాగానే పరిగెత్తాను గానీ, తర్వాత చాలా కష్టంగా అనిపించిందని, చుట్టుపక్కల మోగిస్తున్న బ్యాండ్ల మీదనే దృష్టి పెట్టి.. మొత్తం దూరాన్ని ఎలాగోలా పూర్తి చేసేసానంటూ ఆయాసంతో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా మొత్తం 90 వేల డాలర్లు సేకరించి సొసైటీకి ఇచ్చింది.  ఇంతకు ముందు 92 ఏళ్ల వయసులో గ్లేడీస్ బరిల్ అనే అమెరికన్ మహిళ 9 గంటల 53 నిమిషాల పాటు పరుగు తీసింది.


Friday, June 13, 2014

"శృంగారం" వల్ల "లావు" తగ్గవచ్చా?


శృంగారం వల్ల లావుగా వున్నవాళ్లు బరువు తగ్గవచ్చా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని హెల్త్ సర్వేలు. రొమాన్స్ వల్ల బరువు తగ్గడం సాధ్యమేనా? అని జరిపిన అధ్యయనాల్లో ఈ 'నగ్న'సత్యం వెలుగుచూసింది. ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయి? అవి లావు తగ్గడానికి ఏమేరకు సహకరిస్తాయని పరిశీలిస్తున్నప్పుడు పరిశోధకుల దృష్టి ఈ సెక్స్‌పై కూడా పడింది. ముద్దు పెట్టుకునే సమయంలో నిమిషానికి సగటున 2 నుంచి 5 కేలరీలు ఖర్చవుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్వాస ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ స్థాయిలో కేలరీలు ఖర్చవుతాయి అని సర్వే అభిప్రాయపడింది. అయితే, ఎక్కువ మోతాదులో వున్న లావు తగ్గడానికి ఈ మాత్రం కేలరీలు ఖర్చయితే సరిపోదని నిపుణులు చెపుతున్నారు .
అయితే, అసలు ముద్దుతో పోల్చుకుంటే.. ముద్దుకన్నా సెక్స్‌తోనే అధికమొత్తంలో కేలరీలు ఖర్చవుతాయని ఇంకొన్ని సర్వేలు చెబుతున్నాయి. శృంగారంలో పాల్గొన్న మహిళల్లో నిమిషానికి 3.1 కేలరీలు ఖర్చవగా, పురుషుల్లో 4.2 కేలరీలు ఖర్చవుతాయని ఓ సర్వే పేర్కొంది. ఈ లెక్క ప్రకారం ఎంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే కేలరీలు ఖర్చు అవడానికి అంత ఎక్కువ అవకాశం వుంది. శరీరంలో కేలరీలు ఎంత ఎక్కువగా ఖర్చయితే లావు తగ్గడానికి అంత ఆస్కారం వుంటుందని సదరు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

Thursday, June 12, 2014

"గుండెపోటు నివారణకు వ్యాక్సిన్"

గుండెపోటు నివారణకు కూడా వ్యాక్సిన్ వచ్చేసింది. పోలియో, ధనుర్వాతం, హెపటైటిస్ బి లాంటి రాకుండా చిన్నారులు, పెద్దలకు వ్యాక్సిన్లు ఇవ్వడమనేది ఇప్పటివరకు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా గుండెపోటును నిరోధించే వాక్సిన్‌ను స్వీడన్ శాస్త్రజ్ఞులు తయారుచేశారు. త్వరలో దీన్ని భారతదేశంలో ప్రయోగాత్మకంగా పరీక్షించబోతున్నారు. ఈమేరకు భారతీయ వైద్య సంస్థలతో తుదిచర్చలు జరుపుతున్నట్టు స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భారతీయ సైంటిస్ట్ బి సంజీవి తెలిపారు. అవి ఫలిస్తే త్వరలోనే భారత్‌లో ఈ వాక్సిన్‌ను పరీక్షించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సాధారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గట్టిపడి, కుచించుకుపోయినప్పుడు హృదయానికి రక్తసరఫరా తగ్గి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి, గట్టిపడి ఫలకాలుగా మారడం వల్ల ఏర్పడే ఈ స్థితిని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అలా పేరుకుపోయిన కొవ్వుపై దాడి చేస్తుంది. ఇది రక్తనాళాల లైనింగ్‌ను దెబ్బతీసి, వాపు రావడానికి కారణమవుతుంది. తద్వారా క్లాట్‌లు ఏర్పడి హార్ట్ ఎటాక్ వస్తుంది. స్వీడన్ శాస్త్రజ్ఞులు తయారు చేసిన వాక్సిన్.. రోగనిరోధక వ్యవస్థలో ఈ కొవ్వును గుర్తించే గ్రాహకాలను పనిచేయకుండా నిరోధిస్తుంది. తద్వారా గుండెపోటు వచ్చే ముప్పు 70% దాకా తగ్గుతుంది.

Wednesday, June 11, 2014

ఈ ఫుడ్స్ రాత్రుల్లో తింటే ఏమవుతుంది ?

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. అంతే కాదు చాలా మంది నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. ఉదయం నిద్రలేవగాని కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, యాసిడి రిఫ్లెక్షన్, విరేచనాలు ఇలాంటివి మరికొన్ని జీర్ణక్రియ సమస్యలు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. 

కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఇవి కడుపును అసౌకర్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా రాత్రిళ్ళు తీసుకొనే కొన్ని ఆహారాలు నిద్రలేకుండా చేస్తాయి. ఉదాహరణకు ఉదయం నిద్రలేవగానే యాసిడ్ రిఫ్లెక్షన్ గురైతే, రాత్రిళ్లో కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాలకు దూరంగా ఉండాలి. అదే విధంగా అజీర్తి సమస్యలు గమనించినట్లైతే, రాత్రిళ్లో హార్డ్ గా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదా: పచ్చి ఉల్లిపాయలు, చిదిమిన బంగాళదుంపలు వంటి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలు రాత్రిళ్ళో తినడం మానేయాలి. 

కాబట్టి మీరు రాత్రుల్లో ప్రశాంతమైన నిద్ర పొందాలన్నా ఆరోగ్యరంగా నిద్రలేవన్నా కొన్ని ఆహారాలు రాత్రుల్లో తినడం మానుకోవడంతో పాటు, రాత్రివేళ భోజనం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకో బోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది. కాబట్టి ఇటు మంచి నిద్ర కోసం.. అటు ఆరోగ్యానికి... నిద్రించే ముందు తీసుకోకూడని కొన్ని ఆహారాలు మీకోసం...

ఫ్రైడ్ ఫుడ్: ఫ్రైడ్ ఫుడ్స్ రాత్రిళ్లో తినకూడదు. వీటిని హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి. జీర్ణం అవ్వడానికి కూడా కష్టం అవుతుంది. దాంతో నిద్రలేకుండా చేస్తుంది.

మెకరోని పాస్తా: ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన పాస్తా పిండితో కూడినటువంటి ఆహారం. ఒక రకమైనటువంటి నిశితమైన ధాన్యంతో తయారు చేయబడిన పాస్తా తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకొని, నిద్రకు అంతరాయం  కలిగిస్తుంది. కాబట్టి నిద్రించే ముందు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

కార్బోనేటెడ్ డ్రింక్స్: కాఫీ, టీ, కోలా డ్రింక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆన్నాశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. ఫలితంగా నిద్రలేమి. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.

కెఫిన్: కెఫిన్ ఉపయోగించడం మన ప్రస్తుత దినచర్యలో ఒక భాగమై పోయింది. నిద్రలేవగాని కాఫీ త్రాగందే పని మొదలవుదు. అయితే నిద్రలేమితో బాధపడేవారు ఈ కెఫిన్ ఆహారాలు(కాఫీ, టీ, చాక్లెట్స్, మరియు ఎనర్జీ డ్రింక్స్)కు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా కెఫిన్ వాడబడిఉంటుంది.

ఐస్ క్రీమ్: గ్రీసీ ఫుడ్స్, అంటే క్రీమ్(ఐస్ క్రీమ్స్), ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్, రాత్రి సమయంలో తినడం మానేయాలి. వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల మిమ్మల్ని అలసటకు గురిచేయడమే కాకుండా మరుసటి రోజు ఉదయానికి బద్దకస్తులుగా మార్చుతుంది. కడుపులో వీటివల్ల వికారం ఏర్పడి, విరేచనాలకు దారితీస్తుంది. బరువు పెరగడానికి దారితీసి ఆ ఫ్యాట్ ఫుడ్ ను నిద్రకు ముందు తీసుకోకపోవడం చాలా మంచిది.

చాక్లెట్స్ : చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది.

బ్రెడ్: ఫాస్ట్ ఫుడ్స్/బర్గర్: ఈ రకమైన ఆహారాలు సందేహం లేకుండా నిద్రలేమికి గురిచేస్తాయి. ఇవి కొవ్వులను మాత్రం కలిగి ఉండటమే కాక, ఎక్కువగా కారంగా ఉంటాయి. దాంతో కడుపులో మంట, గ్యాస్ కు కారణం నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ కు చెక్ పెట్టి సుఖనిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి.

స్పైసీ ఫుడ్స్: స్పైసీఫుడ్స్ అతి కారంగా ఉన్న ఆహారాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, కారంగా ఉన్న సాస్ ఫుడ్స్, కారంగా ఉన్న పెప్పర్ ఫుడ్ తినడం వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఈ నిరుపయోగకరమైన ఆహారాలను రాత్రి నిద్రించే ముందు తినకపోవడం వల్ల మీకు మంచి నిద్ర పట్టవచ్చు. కావట్టి ఎక్కువ కారం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.

టమోటో సాస్: టమోటో సాస్ యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది మరియు జీర్ణక్రియను నిధానం చేస్తుంది . పిజ్జా చీజ్ తో నింపి ఉంటుంది మరియు టమోటో సాస్ కూడా. కాబట్టి రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్.సిడిటి ఉన్నవారు టమోటోలను పూర్తిగా మానేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. సాధారణంగా టమోటో జ్యూసీగా ఉండి ఎసిడిటికి కారణం అవుతుంది. దాంతో ఛాతీలో మంట పుడుతుంది. నిద్రలేమికి కారణం అవుతుంది

వెల్లుల్లి: వెల్లుల్లిలో సల్ఫర్ నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల దీనిలో వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఇలాంటి ఘాటైన మసాల దినుసులు, వెల్లుల్లి రాత్రి సమయంలో తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి రక్తంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ నిదానంగా జరిగి తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకొని గాస్ట్రిక్ కు దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో వెల్లుల్లికి దూరంగా ఉండటమే మంచిది

మాంసాహారం: రాత్రి సమయంలో మాంసాహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. అయితే పూర్తిగా నిలిపివేయడం కంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ను తగిన మోతదాలో తీసుకోవడం మంచిది. అది కూడా లేట్ నైట్ కాకుండా త్వరగా తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం తీసుకొన్న తర్వాత వేడి నీళ్ళు లేదా వేడి పాలను త్రాగి నిద్రించడం వల్ల అటు జీర్ణశక్తికి ఇటు మీ గాఢ నిద్రకు ఎటువంటి భంగం కలగదు.

ఫ్రూట్ సలాడ్: మనక ఆశ్చర్యం కలగవచ్చు . అయితే ఫ్రూట్స్ లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది డ్యూరియాటిక్ కు కారణం అవుతుంది. దాంతో మీరు రాత్రుల్లో ఎప్పుడు పడితే అప్పుడు మూత్ర విసర్జనుకు లేయాల్సి వస్తుంది . కాబట్టి ఇటువంటి ఫ్రూట్ సలాడ్స్ ను రాత్రుల్లో తీసుకోవడం మానేయండి. కొంతం మందికి పండ్లు యాసిడ్ రిఫ్లెక్షన్ కు దారితీస్తాయి.

పాలు: ఆహారాలు అంటే అధిక కొవ్వున్న పాలు, పెరుగు, వెన్న మరియు జున్ను వంటివి రాత్రి సమయంలో జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. అంతే కాదు వీటిని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో గుండెలో మంటగా అనిపిస్తుంది. నిద్రసరిగా పట్టకుండా చేస్తుంది.

మద్యం: శరీరంలో ఉండే నీరును తగ్గిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కు గురిచేస్తుంది. అంతే కాదు ఇది శరీరంలో ఉండే సెరోటిన్(serotonin)స్థాయిని తగ్గించి నిద్రలేమికి గురిచేస్తుంది.

స్టీక్: ఫ్యాట్ ఎక్కువగా ఉన్నలేదా హై కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా జ్యూసీ స్టీక్స్ ఎసిడిటికి దారితీస్తుంది. మరియు జీర్ణక్రియ కూడా చాలా నిధానం అవుతుంది. ఫలితంగా మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇంకా ఉదయం స్టొమక్ ప్రాబ్లెమ్స్ కు దారితీస్తుంది.

బ్రొకోలీ: గ్రీన్ వెజిటేబుల్ సూపర్ ఫుడ్ గా భావిస్తారు. అయితే కూడా ఈ ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకోకూడదు. నిద్రించే ముందు ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కష్టం అవుతుంది. నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి, రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయండి.

డేకేఫ్ కాఫీ: నిద్రను కెఫిన్ పాడు చేయవచ్చు మరియుఎక్కువ సమయం నిద్రమేల్కొనేలా చేస్తుంది. సున్నితస్తులో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

నూడిల్స్: నూడిల్స్ లో అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి బరువును సులభంగా పెంచుతాయి . దాంతో జీర్ణక్రియకు కష్టం అవుతుంది. కాబట్టి రాత్రుల్తో నూడిల్స్ తినడం మానుకోండి. అలాగే స్పైసీ గ్రేవీ మంచూరియన్ వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండండి. లేదంటే ఇవి హార్ట్ బర్న్ కు కారణం అవుతాయి.

సెలరీ: సెలరీ గురించి ఆశ్చర్యం కలగవచ్చు. ఇది నేచురల్ డ్యూరియాటిక్ పదార్థం. ఇది రాత్రుల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు దారి తీస్తుంది. దాంతో నిద్రలేమి, ఉదయం అసౌకర్యం. కాబట్టి రాత్రుల్లో ఈ ఆహారానికి చెక్ పెట్టండి.

ప్యాకేజ్డ్ ఫుడ్స్: ముందుగా తయారు చేసి నిల్వచేసిన ఆహారాలు లేదా ప్యాక్ చేసిన ఆహారాలు చాలా సున్నితంగా ఉంటాయి. అటువంటి వాటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల అధిక ఫ్యాట్ పొంది, హార్ట్ బర్న్ కారణం అయ్యి, నిద్రలేమికి దారితీస్తుంది.

హై షుగర్ ఫుడ్స్/స్వీట్స్: పంచదార ఎనర్జీని పెంచుతుంది, అదే సమయంలో నిద్రలో అసమతుల్యతలు ఏర్పడుతాయి. కాబట్టి షుగర్ ఫుడ్స్ కేక్స్, చాక్లెట్స్, మరియు డిజర్ట్స్ వంటి నిద్రలేమికి కారణం అయ్యే వీటికి దూరంగా ఉండటం వల్ల నిద్రబాగా పడుతుంది.

కేక్స్: అతి పెద్ద బెల్లీ ఫ్యాట్ ఉన్నా కూడా మీకు అసౌకర్యంగా ఉంటుంది. దాంతో నిద్రపోవడానికి కష్టం అవుతుంది. నిద్ర సమయంలో జీర్ణవ్యవస్థ నిదానంగా జీవక్రియలు జరిగి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నిద్రపోవడానికి ముందు ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉంటు మితంగా తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇటువంటివి తినాలకున్నప్పుడు నిద్రించే నాలుగు గంటల మందు తినడం శ్రేయస్కరం

గ్రీన్ పీస్ /గ్యాస్ ఆధారిత ఆహారాలు: మనిషికి ముఖ్యంగా అసౌకర్యం కలిగించేవి గ్యాస్ట్రిక్ మరియు గుండెలో మంట. ఈ సమస్యలకు కారణమయ్యే ఆహారాలు అంటే గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహారాలు బీన్స్, బ్రొకోలీ, పచ్చిబఠానీ వంటివాటికి దూరంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది.

లిక్విడ్స్/ద్రవాలు: ఎక్కువగా నీరు తీసుకోవడం మంచిదే, అయితే రాత్రిసమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు నీటిని మితంగా త్రాగాలి. లేదంటే కడుపునిండుగా ఉన్నట్లు అనిపించి మాటమాటికీ బాత్ రూమ్ ను వినియోగించే పరిస్థితి ఏర్పడవచ్చు.


Tuesday, June 10, 2014

Monday, June 9, 2014

"స్లిమ్" గా మారేందుకు సులభ మార్గాలు!!!

సన్నగా నాజూకుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ వుంటుంది. దాని కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటుంది. అయితే మనం తినే ఆహార పదార్థాలలో చిన్న చిన్న మార్పుల ద్వారా సన్నగా ట్రిమ్గా తయారవ్వచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి తీసుకునే డిన్నరు వరకూ ఆహారంలో కొవ్వు తగ్గించుకుంటే సన్నబడడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది... అవేమిటంటే...

 జీవన విధానంలో మార్పు ఫాస్ట్ ఫుడ్ అభివృద్ది చెందిన తర్వాత పిజ్జాలు, బర్గర్లపై మోజు ఎక్కువైపోయింది. దీనికి తోడు ప్రతి సెంటర్లోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు దర్శనమిస్తున్నాయి. అందమైన ప్యాకింగులలో నోరూరిస్తుంటే వాటిని తినకుండా వుండలేకపోతున్నారు యువతరం. ఫాస్ట్ ఫుడ్ అప్పటికప్పుడు కడపునింపినా వాటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. 

ఆహారంలో మార్పులు: రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో నూనె, నెయ్యి వాడకం తగ్గించాలి. ఇవి రెండూ లేకుండా చేసిన ఆహారం అయితే మరీ మంచిది. అంటే ఉడికించిన కూరగాయలు, నూనె తక్కువగా వేసి చేసిన ఆకు కూరలు అయితే తేలికగా జీర్ణం కావడంతో పాటు పోషకవిలువలు పుష్కలంగా లభిస్తాయి.

వ్యాయామం: వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, తోటపని ఇవన్నీ ఆడవారు చేయగలిగే వ్యాయామాలు. వీటిల్లో వాకింగ్ కోసమే బయటకు వెళ్లాలి. మిగతా మూడు ఇంట్లో వుండి చేసుకునే ఎక్సర్ సైజులు. మూడింటిని చేయలేకపోయినా ఏదో ఒకటి చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ప్రకటనలు చూసి మోసపోవద్దు: టీవిలలో పేపర్లలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు. కంటికి పైన రంగుల్లో ఆకర్షనీయమైన ప్యాక్ లలో కనువిందు చేసే ఆహారపదార్థాలు నోరూరించినా వాటిల్లో పోషక విలువలు ఏమాత్రం లేకపోగా ఆరోగ్యానికి హానిచేసే కొవ్వు అధికంగా వుంటుంది. చూసిన ప్రతిదానిని తినాలనుకోవడం మానుకోవాలి.

టీవిలకు దూరంగా వుండండి: అన్నం తినేటప్పుడు టీవి చూడడం చాలా మందికి అలవాటు. అసలు అన్న తినేటప్పుడు పుస్తకాలు చదవడం, పేపరు చదవడం లాంటివి మానుకోవాలి. తినే సమయంలో ఇలాంటి పనులు చేస్తుంటే ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారు.

నీరు తగినంత: రోజు మొత్తం మీద కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు తాగడం అవసరం. వేసవికాలంలో కొంచెం ఎక్కువగా తాగాలి. వేసవిలో చల్లని నీటిని శరీరం త్వరగా గ్రహిస్తుంది.

తాజా: కూరగాయలు, పళ్లు ఫ్రిజ్ లో నిల్వ వుంచిన కూరగాయలకన్నా తాజా కూరగాయలు మంచివి. రోజు మొత్తం మీద ఐదు రకాల కూరగాయలు, పళ్లు తీసుకుంటే కొవ్వు అనేది మీ దరిచేరదు. వైద్యుడి అవసరం రాదు.

డ్రస్సులు: మనం వేసుకునే డ్రస్సులు కూడా ఊబకాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. లావుగా వున్న వారు మరీ బిగుతుగా ఉండే దుస్తులకన్నా కొద్దిగా వదులుగా వుండేవాటిని ధరిస్తే లావుగా కనపడరు. వీరికి చిన్న చిన్న డిజైన్లు బాగా నప్పుతాయి.

ఆహారాన్ని విభజించండి: రోజు మొత్తం మీద తీసుకునే ఆహారాన్ని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ గా విభజించుకోవాలి. ఆహారాన్ని కొద్ది కొద్దిగా నాలుగైదుసార్లు తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా జాగ్రత్త పడచ్చు.

అధిక క్యాలరీలు అనర్ధం: ప్యాకెట్లులో లభించే ఆహారపదార్థాలలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పోషకవిలువలు ఎక్కువ క్యాలరీలు తక్కువ వున్న వాటినే ఎంచుకోవాలి. కొనుగోలు చేసే పదార్థాలలో ఎన్ని క్యాలరీలు వున్నాయో చూసుకొని మరీ కొనడం మంచిది.

రంగుని చూసి మోసపోవద్ద: వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆహార పదార్థాలను ఆకర్షనీయమైన రంగులు, ప్యాకెట్లలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు ఉత్పత్తిదారులు. వీటి హంగు రంగు చూసి మోసపోవద్దని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.

నవ్వు మంచిదే: నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. కానీ నవ్వు చాలా రకాలుగా మంచిదని నిపుణుల అభిప్రాయం. రోజు మొత్తం మీద కొన్ని నిమిషాల పాటు నవ్వగలిగితే దానికి మించిన వ్యాయామం మరొకటి వుండదు. రోజుకి 15నిమిషాల పాటు హాయిగా నవ్వుతుంటే సంవత్సరంలోపు రెండు కిలోల బరువు తగ్గవచ్చు.Sunday, June 8, 2014

"తమిళ" హీరోల "రెమ్యూనరేషన్"

మన పొరుగున ఉన్న తమిళ సినీ పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమతో పోటా పోటీగా ముందుకు సాగుతోంది. తమిళ సినిమా మార్కెట్ తెలుగుతో కర్నాటక, కేరళల్లోనూ విస్తరించింది. అదే విధంగా యూకె, మలేషియా లాంటి దేశాల్లోనూ తమిళ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. రజనీకాంత్, విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలకు సొంత రాష్ట్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో మంచి డిమాండ్. అందుకే వీరికి డిమాండ్ బాగా ఉంది. డిమాండ్‌కు తగిన విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్ లాంటి స్టార్ల రెమ్యూనరేషన్ వింటే మన కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

రజనీకాంత్: రజనీకాంత్ నటించే సినిమాలకు తమిళనాడుతో పాటు తెలుగు, హిందీలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇందుకుగాను ఆయన రూ. 30 కోట్ల వరకు తీసుకుంటారట. కేవలం తమిళం సినిమా అయితే రూ. 20 నుండి 25 కోట్లు తీసుకుంటారట.

కమల్ హాసన్: యూనివర్సల్ హీరోగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ సినిమాకు రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక డైరెక్షన్, రచయిత లాంటి బాధ్యతలు కూడా చేపడితే ఎక్స్ ట్రా చార్జ్ చేస్తాడట.

విజయ్: తమిళనాడులో రజనీ, కమల్ తర్వాత ఫాంలో ఉన్న స్టార్ హీరో విజయ్. ఈ హీరో ఒక్కో సినిమాకు రూ. 18 నుండి 20 కోట్లు తీసుకుంటారట.

సూర్య: ఇక తమిళ హీరో సూర్య నటించిన సినిమాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఒక్కో సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుంటారట. దీంతో పాటు తెలుగు రైట్స్ అదనం. తెలుగు రైట్స్ ద్వారా మరో 5 కోట్లు ఆయనకు అదనంగా వస్తాయని అంచనా.

అజిత్ కుమార్: బాక్సాఫీసు కింగ్‌గా మారిన అజిత్...ఒక్కో సినిమాకు రూ. 18 కోట్ల నుండి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారని అంచనా.

విక్రమ్: హీరో విక్రమ్ ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల వరకు తీసుకుంటాడు. ఆయన సినిమాలు తెలుగులోనూ బాగా ఆడతాయి.

కార్తి: తమిళ హీరో కార్తికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ హీరో ఒక్కో సినిమాకు రూ. 8 నుండి 10 కోట్ల వరకు తీసుకుంటాడట.

ధనుష్: తమిళ హీరో ధనుష్ ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.

శింబు: మరో తమిళ హీరో శింబు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.

ఆర్య: తమిళ హీరో ఆర్య ఒక్కో సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటున్నాడని టాక్.

విశాల్: హీరో విశాల్ ఒక్కో సినిమాకు రూ. 4 నుండి 5 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం.

జీవా: రంగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.

Saturday, June 7, 2014

"బరువు" తగ్గించే "చిరుతిళ్ళు"


‘రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో పని లేద'నే మాట మీరు వినే వుంటారు.
 అదే మాట ఇప్పుడు పప్పులు, పాప్ కార్న్, క్రస్ట్ బ్రెడ్ లాంటి చిరుతిళ్ళ గురించి కూడా అంటున్నారు. తెలుసుకోవడానికి ఆశ్చర్యంగానూ, నమ్మడానికి కష్టంగానూ వున్నా చిరుతిళ్ళతో కూడా బరువు తగ్గ వచ్చనేది అన్ని రకాలుగా నిజం. మీరు బరువు తగ్గే ఆహార ప్రణాళిక పాటిస్తుండి విరామాల్లో తినే వాటిని తగ్గించడం కష్టంగా భావిస్తుంటే మీ కోసం ఇక్కడ ఒక అనుకూలమైన పరిష్కార మార్గం వుంది. బరువు తగ్గడం అంటే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం, నియమిత వ్యాయామం, ఎక్కువగా నీళ్ళు తాగడం. అయినప్పటికీ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానలేని వారు చాలా మందే వున్నారు - వాళ్ళు నూనెతో చేసిన చిరుతిళ్ళూ మానలేరు, రోజుకు మూడు పూటలా భోజనాలూ మానలేరు. మీరు కూడా భోజనం గురించి రాజీ పడకుండా బరువు తగ్గాలనుకుంటే, ఇదిగో మీకు ఒక శుభ వార్త. ఈ వ్యాసం మీ ఆహార ప్రణాలికను కఠిన తరం చేసుకోకుండా బరువు తగ్గడానికి పనికి వచ్చే తక్కువ కాలరీల చిరుతిళ్ళ గురించిన సిఫార్సులు అందిస్తోంది.
 ఆరోగ్యకరమైన తక్కువ కాలరీల చిరుతిళ్ళు


పాప్ కార్న్: మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు నిలవ ఉంచుకోదగ్గ చిరుతిండి పాప్ కార్న్. ఐతే, మీరు నిల్వ ఉంచిన వాటిలో సినిమా హాళ్ళు, సూపర్ మార్కెట్ల లోలాగా వెన్న, చక్కర, ఉప్పు లాంటివి లేకుండా చూసుకోండి. పాప్ కార్న్ తేలిగ్గా వుండి పీచు పదార్ధం కలిగి వుంటుంది. ఒక కప్పు పాప్ కార్న్ లో కేవలం 31 కాలరీలే వుంటాయి, కేవలం అర గ్రాము కొవ్వు పదార్ధం వుంటుంది. గాలి ద్వారా తయారు చేసే పాప్ కార్న్ లో కొవ్వు వుండదు. వెన్న, తీపి, ఉప్పటి పాప్ కార్న్ లకు మాత్రం దూరంగా వుండండి.కరకరలాడే బ్రెడ్ లు: ఫాస్ట్ ఫుడ్లను ఇష్టపడే వారిని బరువు పెరగకుండా కాపాడే మరో చిరుతిండి కరకరలాడే బ్రెడ్. ఇది ప్రధానంగా తృణధాన్యాలతో తయారౌతుంది - అనేక రుచులు, రకాలలో దొరుకుతుంది. మీరు బరువు తగ్గే ఆహార ప్రణాళిక పాటిస్తుంటే ఇది మంచి పోషకాలిచ్చే చిరుతిండి. కరకరలాడే బ్రెడ్ ఒక ముక్క32కాలరీలను ఇస్తుంది, 0.2 గ్రాముల కొవ్వును కలిగి వుంటుంది, శరీరానికి మేలు చేసి బరువు తగ్గడంలో ఉపకరించే ఈ చిరుతిండిలో ధాన్యం, పీచు పదార్ధం వుంటాయి.ఆలివ్ లు: కాలరీలు అధికంగా వుండే ఇతర చిరుతిళ్ళకు అనుబంధాలుగా పని చేసే ఆలివ్ లు రుచిగా వుంటాయి. విటమిన్లు, యాంటి-ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండే ఆలివ్ లలో ఒస్టియోపోరాసిస్, కాన్సర్, కీళ్ళ నెప్పులు లాంటి వ్యాధులతో పోరాడే సామర్ధ్యం వుంటుంది. ఆలివ్ లను నిమ్మరసంలో ముంచి, మూలికలు, సుగంధ ద్రవ్యాలతో వేయించి, లేదా సహజ రూపంలోనో తినవచ్చు. ఒక ఔన్సు పచ్చ ఆలివ్ లలో 41 కాలరీల శక్తి, 5 గ్రాముల కన్నా తక్కువ కొవ్వు వుండగా, ఒక ఔన్సు నల్లటి ఆలివ్ లలో 47కాలరీలు, 3.8 గ్రాముల కొవ్వు వుంటాయి.కూరగాయలు & డిప్ లు: మీ పోషకాహార నిపుణుడు ఇప్పటికే ఒక వంద సార్లు చెప్పినా, మరోసారి చెప్తున్నాం. ఆరోగ్యకరమైన తక్కువ కాలరీల చిరుతిళ్ళ గురించి మాట్లాడే టప్పుడు మీరు కూరగాయలను విస్మరించలేరు. కారెట్లు, తోటకూర, దోసకాయ లాంటి కూరగాయలు వాడడం కావలసిన అధిక బరువు తగ్గించుకోవడానికి సులభమైన మార్గం. హమ్మస్ లాంటి డిప్ లతో మీరు ఇలాంటి కూరగాయలు తినవచ్చు. అవోకాడో, ఆరిచోక్ డిప్ లు కూడా మీ ఆహార పట్టిక లో చేర్చుకోదగ్గ చిరుతిళ్ళు. ఈ డిప్ లలో కాలరీలు, కొవ్వు తక్కువగా వుంటాయి.పళ్ళు: ఒక పళ్ళెం నిండా పళ్ళతో కూడిన ఆహారంతో బరువు తగ్గించుకోవడం కన్నా ఆనందాన్నిచ్చేది ఏదీ లేదు. ఒక గుప్పెడు ద్రాక్షలు, కాసిన స్ట్రా బెర్రీలు ఆకలి మంటలను సరైన భోజన సమయం దాకా ఎలా ఆపగలవో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ద్రాక్ష, స్ట్రా బెర్రీ కాకుండా పుచ్చకాయ, యాపిల్, బెర్రీలు, బత్తాయి, అత్తి పళ్ళు లాంటివి కూడా మీకు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.పెరుగు: కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుండే పెరుగు తినడం కూడా ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమే. పెరుగులో ఇతర పోషక విలువలు కూడా వుంటాయి. ఇందులో పుష్కలంగా కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం వుంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంతటాయి. మీరు బెర్రీలు, గ్రనోలా లాంటి వాటితో కూడా మీగడ వాడవచ్చు.పీనట్ బట్టర్: పీనట్ బటర్ కాయధాన్యాల కుటుంబానికి చెందినది కాబట్టి గింజల గుణాలు కలిగి వుంటుంది - చక్కటి చిరుతిండి కూడా. రెండు టీ స్పూన్ల పీనట్ బట్టర్ తరువాతి భోజన౦ దాకా మీ ఆకలిని ఆపుతుంది. దీన్ని పళ్ళు, కరకరలాడేవి, లేదా మెత్తగా వుండే వాటితో ఉపయోగించి కావలసినంత బరువు తగ్గవచ్చు.బాదం పప్పు, ఇతర గింజ ధాన్యాలు: బాదం పప్పు, ఇతర గింజల్లో ఏక అసంతృప్త కొవ్వు పదార్ధాలు వుంటాయి కనుక అవి మీ శరీరానికి చాలా మంచివి - మీ ధమనులను శుభ్ర పరుస్తాయి. గింజలు తరువాతి భోజనం వరకు మీకు కడుపు నిండుగా అనిపిస్తుంది. వాటిలో విటమిన్ ఇ, పీచు పదార్ధం, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. గింజల్లో వుండే విటమిన్ ఇ యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి కాన్సర్, ఉబ్బసం, ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో మీ రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది.ఓట్ మీల్: ఒక కప్పు ఓట్ మీల్ ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్ మీల్ లోని పీచు... ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు మీరు ఉత్సాహాంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. కొత్త ఆలోచనలు వచ్చేలా ఉత్తేజపరుస్తుంది. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. అన్నిటికంటే గొప్ప ప్రయోజనం అంటే దానిని క్షణాలలో తయారు చేయవచ్చు. పనిలోకి తొందరగా వెళ్ళే వారు మైక్రోవేవ్ లో ఓట్ మీల్ తయారు చేసి రెడీగా తినేయవచ్చు.డార్క్ చాక్లెట్స్: మీకు చాక్లెట్స్ తినే అలవాటుంటే మరీ మంచిది. చాక్లెట్స్ లో అంత అద్భుతమైన గుణాలున్నాయి. వయస్సును తెలియనియ్యకుండా చేసే లక్షణం చాక్లెట్స్ లో అధికంగా ఉన్నాయి. అనేక అధ్యయనాల ప్రకారం, చాక్లెట్స్ లో ఉపయోగించి కోకో, చాక్లెట్ మిల్క్ చర్మ కణజాలాలు సురక్షింతంగా ఉంచుతాయి. మరియు కణాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దాంతో చర్మంలో గరుకుదనం పోయి, చర్మం సున్నితంగా తయారువుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ఆహారనియమాలను పాటించి వయస్సు మీద పడకుండా.. యవ్వనంగా కనబడేందుకు ప్రయత్నం చేయండి..!గ్రనోలా బార్స్ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కింద అధిక పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే రెండింతల కొవ్వు కరిగిపోతుంది  .సూప్: సూప్ తాగండి 7 కేజీల బరువు తగ్గిపోతారు. ప్రస్తుతం మనలో సూప్ తాగే అలవాటు చాల పెరిగింది. ప్రతి ఒక్కరు సూప్ తాగడానికి అలవాటు పడుతున్నారు. ప్రతి రోజు బోజం చేసే ముందు సూప్ తాగితే సంవత్సరంలో మీరు పెరిగే బరువులో 7 కేజీలు తగ్గిపోతారు.


Friday, June 6, 2014

"ఏసి" అతిగా వాడితే ?

 ఒకప్పుడు ఎయిర్ కండీషనర్ అంటే విలాసం. సంపన్నులకు మాత్రమే సాధ్యమైన ఆహ్లాదం. ఇప్పుడు అది ఓ అవసరం. ఇల్లు.. ఆఫీసులు, షాపింగ్‌మాల్స్, ప్రయాణించే బస్సులు, ఏటీఎం సెంటర్లు.. ఇలా అడుగుపెట్టిన ప్రతి చోటా అదే. సంపన్నులతో పాటు ఇప్పుడు సగటు మధ్య తరగతి జీవి, దిగువ తరగతి వారిని ఏసీ ‘చల్లగా' చేరుకుంటోంది. అయితే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ప్రమాదకరమంటున్నారు వైద్యులు ఎండబారిన పడకుండా జాగ్రత్త పడడం ఎంత అవసరమో... ఏసీతో కలిగే నష్టాలపై అవగాహన పెంచుకోవడం అంతే అవసరమని పేర్కొంటున్నారు. 

ఆధునిక పరిస్థితులు మనిషిని రోజు రోజుకు సుకుమారంగా మారుస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులకు తట్టుకోవడం కష్టంగా మారుతోంది. వాతావరణ మార్పుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి మనిషి విభిన్న రకాల ఉత్పత్తులను సృష్టించుకుంటూ.. ప్రకృతిని ఢీకొడుతున్నాడు. అదే కోవలోనే ఆవిర్భవించిన ఎయిర్ కండీషనర్ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. విపరీతమైన శారీరక, మానసిక శ్రమ మనల్ని నిస్సత్తువకు గురిచేయకుండా ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం నివారిస్తుంది. చెమట పోయడం వంటి చికాకులకు చెక్ పెడుతుంది. అదే సమయంలో దీని వల్ల నష్టాలు లేకపోలేదు.

 ఏసి అతిగా వాడటం వల్ల  కలిగే నష్టాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.. 

1. ఏసీపై పేరుకుపోయే దుమ్ము ధూళి కారణంగా ఫంగస్ వ్యాపించి ఎలర్జీలు రావచ్చు. 

2. కాంటాక్ట్‌లెన్స్ వినియోగిస్తున్నవారికి, కంటి వ్యాధులున్న వారికి, ఆస్తమా రోగులకు ఏసీ కారణంగా సమస్య పెరిగే అవకాశం ఉంది.

 3. అధిక సమయం ఏసీలో ఉండడం వల్ల ఆకస్మిక జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, శ్యాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. 

4. చర్మంపై దుష్ర్పభావం చూపించవచ్చు. 

తీసుకోవల్సిన జాగ్రత్తలు

1. ఏసీ అమరిక నిర్వహణ సరైన విధంగా ఉండాలి 

2. ఇంట్లోని ఏసీని మరే సీజన్‌లోనూ వాడకుండా వేసవిలో మాత్రమే వినియోగించడం చాలా మందికి అలవాటు. ఇలాంటి వారు వినియోగానికి ముందు ఒకసారి టెక్నీషియన్‌కు చూపించడం మంచిది. 

3. గది ఉష్ణోగ్రత మరీ చల్లగా కాకుండా 22 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. గాలిలో సగటు తేమ శాతం 60 నుంచి 70 శాతానికి మధ్య ఉండాలి 

4. వాతావరణంలో అకస్మాత్తుగా ఏర్పడే హెచ్చుతగ్గులు దేహంపై దుష్ర్పబావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఒక అన్‌క్రషబుల్ జాకెట్‌ను దగ్గర ఉంచుకోవాలి. తీవ్రమైన ఎండ నుంచి అత్యంత చల్లని ఎయిర్ కండీషన్డ్ రూంలోకి వెళ్లే ముందు ఇది ధరిస్తే.. అకస్మాత్తుగా వచ్చే వాతావరణ మార్పులను తట్టుకోవచ్చు. 

5. టెంపరేచర్ 20 నుంచి 40 డిగ్రీలకు మారిన సమయంలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సన్‌స్క్రీన్ లోషన్ వినియోగించడం మంచిది. 

6. ఎక్కువగా ఏసీలో ఉండే వారు దాహం వేయడం లేదని అనుకోకుండా కొబ్బరి నీళ్లు, మంచి నీరు తీసుకుంటూ ఉండాలి. 

అతిగా వాడితే అనర్థమే... వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడటం చల్లదనమే కానీ..దానిని అతిగా ఉపయోగించడం అనర్థాలకు దారితీస్తుంది. ఏసీని ఉపయోగించడమే కాదు..దానిని రెగ్యూలర్‌గా సర్వీసింగ్ చేయించాలి. లేదంటే దానిలో ఫంగస్ పేరుకుపోరు శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నారు. బ్రాండెడ్ కాకుండా వాడితే అనేక దుష్పరిణామాలు. కొన్ని ఏసీలు వాతావరణంలోని మలినాలను వేరుచేసి స్వచ్ఛమైన గాలి అందించే విధంగా మార్కెట్‌లోకి వచ్చారు. అలాంటివే మేలు. శ్వాసకోస వాధులు ఉన్నవారైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెద్దవారైనా...చిన్న పిల్లలైనా జాగ్రత్తలు తప్పనిసరి. ఏసీ ఆటో ఆఫ్‌లో ఉండి గది ఉష్ణోగ్రతను సమాన స్థారులో ఉంచేదిగా ఉండాలి. ఈ విధానం చాలా మంచిది.Thursday, June 5, 2014

"ఉద్యోగస్తులు" ఎదుర్కొనే "అనారోగ్య సమస్యలు"


ప్రస్తుత జీవన శైలి చాలా కష్టంగా మారుతున్నది. ఉరుకుల పరుగుల జీవితంతో చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనిచేసే ఉద్యోగస్తులు సరైన ఆహారం, విశ్రాంతి, నిద్ర, లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. ప్రస్తుత కార్పొరేట్ రంగంలో బిజీబిజీ జీవితాలు, టార్గెట్లు, డే అండ్ నైట్ షిఫ్టులు వల్ల వెన్నునొప్పి మొదలకొని, మానసిక, భౌతిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒత్తిడి వరకూ అనేక రకాలైన జబ్బుల బారిన పడాల్సి వస్తోంది. మరియు ప్రస్తుత రోజుల్లో పనిచేసే ఉద్యోగస్తువులు ఇటువంటి ఆరోగ్యసమస్యలను లెక్క చేయకుండా వారి అలవాట్లు, అభిరుచుల, ప్రాశ్చ్యాత్య పోకడలతో అనారోగ్యాలకు స్వాగతం పలుకుతున్నారు.
 ఉదాహరణకు, చాలా మంది పనిచేసే ఉద్యోగస్తులు హెల్తీ డైట్ ను పాటించరు.
 దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను అంటే ఉన్నట్లుండి బరువు పెరగడం, అనీమియా, హార్మోనుల అసమతుల్యత, దాంతో మహిళల్లో రుతుక్రమ సమస్యలు ఇటువంటి మరికొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగస్తులకు మరో చెడు అలవాటు సరైన వ్యాయమం లేక పోవడం వల్ల కూడా అనేకఅనారోగ్య సమస్యలు(బాడీపెయిన్స్, రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, అలసట, తలనొప్పి )కు దారితీస్తోంది.
 ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చునే పనిచేయడం వల్ల అనారోగ్యలక్షణాలు మరిన్ని పెరుగుతాయి. ఎక్కువసమయం కూర్చోవడం వల్ల మెడనొప్పి, వెన్నునొప్పి, కళ్ళ మసకలు బారడం, బాన పొట్ట వంటి లక్షణాలు ఎదుర్కోక తప్పదు.
 ప్రస్తుత జనరేషన్ లో వందకి తొంబైశాతం కంప్యూటర్లు లేదా ల్యాప్ టాప్ లకు అడిక్ట్ అయిపోయుంటారు. క్రమం తప్పకుండా వీటి ముందు కూర్చోవడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతో అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇక చాలా మందికి నైట్ షిప్టులు, లేదా లేట్ నైట్ వర్క్ వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. నిద్రలేమి వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్య౦పాలు చేస్తుంది. మరి పనిచేసే వారికి సాధారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఒక సారి పరిశీలించండి.

ఉద్యోగస్తులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు-నివారణ!
 మెడనొప్పి:
 కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల మెడ నొప్పి ఎక్కువగా బాధిస్తుంది. అందువల్ల మద్య మద్యలో చిన్న విరామాలు తీసుకోవడం వల్ల కండరాలకు కొంత సడలింపు జరిగి రక్తప్రసరణ జరుగుతుంది.

కళ్ళు మండుట:
 కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చొని ఎక్కువ సమయం స్క్రీన్ వైపు తదేకంగా చూడటం వల్ల కళ్ళు మంటకు దారితీసి, కళ్ళు ఎర్రగా మారుతాయి. కాబట్టి ప్రతి గంటకొకసారి దృష్టిని పక్కకు మరల్చడం చాలా అవసరం. లేదా ఒక రెండు నిముషాలు బ్రేక్ తీసుకోండి. సీట్లోనే వెనకు కూర్చొని కళ్ళను రెండు నిముషాల పాటు మూసుకొని విశ్రాంతి కల్పించండి.

అకలిలేకపోవడం:
 ఉదయం సమయంలేదనో లేదా మీటింగ్స్ వల్లనో మీరు సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఇది ఒక అలవాటుగా మారి, తర్వాత ఆరోగ్య సమస్యలు, అజీర్ణం తలెత్తుతుంది.

అజీర్ణం:
 ఒక్కసారిగా ఎక్కువ ఆహారాన్ని తీసుకొన్నప్పుడు తప్పనిసరిగా చిన్న నడక చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకొనే పెద్దమొత్తం ఆహారం మిమ్మల్ని మీ సీట్లో నుండి కదలనివ్వదు. అలాగే కూర్చొంటే అజీర్ణంకు దారితీస్తుంది.

బెల్లీ ఫ్యాట్:
 ఆఫీసుల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనపు బరువు పెరుగుతారు. ఆఫీసుల్లో చాలా మంది ఫ్రైడ్ స్నాక్స్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువుకు దారితీస్తుంది. మరి బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే లోక్యాలరీ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి.

తలనొప్పి:
 పని ఒత్తిడి వల్ల వచ్చే సాధారణ అనారోగ్య సమస్య తలనొప్పి. కొంతమందైతే ఏకంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడాల్సి వస్తుంది. ఇది ఒత్తిడి వల్ల ఎక్కువ అవుతుంది.

ఒత్తిడి:
 పనిచేసే వారిలో చాలా ఎక్కువగా సహజంగా కనిపించే ఆరోగ్య సమస్య స్ట్రెస్(ఒత్తిడి). ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి. ఒత్తిడి వల్ల ఫిజికల్ గాను, మెంటల్ గాను సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

నిద్రలేమి:
 లేట్ నైట్ వరకూ పనిచేయడం లేదా సరిగా విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల నిద్రలేమి సమస్య ఎదురౌతుంది. పని ముఖ్యమే, కానీ శరీరానికి మరియు మైండ్ కు నిద్రకూడా అంతకంటే ముఖ్యం అని తెలుసుకోవాలి.

బ్యాక్ పెయిన్:
 వెన్నునొప్పి పనిచేసే ఉద్యోగస్తులు అధికంగా బాధించే ఆరోగ్య సమస్యలో ఒకటి. కాబట్టి మీరు కూర్చొనే, భంగిమ, కీబోర్డ్ పొజిషన్ సరిగా చూసుకోవాలి.

వ్యాయం లేకపోవడం:
 చాలా మంది పనిచేసే ఉద్యోగస్తులు ఉదయం లేవడానికి చాలా బద్దకిస్తారు. ఆ బద్దకాన్ని పక్కన పెట్టి రోజుకు అరగంట వ్యాయామం చేయడం చాలా అవసరం. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని మీకు తెలిసుండకపోవచ్చు. అంతే కాదు , వ్యాయామం వల్ల శరీరం మొత్త౦ రక్తప్రసరణ వల్ల గుండె మరియు మైండ్ ఆరోగ్యంగా ఉంటుంది. మరియు ఒత్తిడి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

వెన్నెముక నొప్పి:
 స్పాండిలైటిస్, పనికి వెళ్లేటప్పుడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాహనాలు నడపడం వల్ల వెన్నెముక నొప్పి ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురౌతుంది.

బాడీ పెయిన్:
 రోజంతా పనిచేయడం వల్ల విపరీతంగా ఒళ్ళు నొప్పులు వస్తాయి. పనిచేసే వారు ఎదుర్కొనే చాలా సాధరణ సమస్య ఇది. కాబట్టి ప్రతి రోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చాలా అవసరం.


Wednesday, June 4, 2014

" షకీలా" జీవితంలో చేదు నిజాలు...!!!


                                           షకీలా ఆత్మకథ
 'నేను ఆత్మకథ పుస్తకం ఎందుకు రాయాలి? నా జీవితం నుంచి ఎవరైనా నేర్చుకొనేది ఏదైనా ఉందా? నేనేమీ మదర్ థెరిస్సాను కాను. నేను పూర్తిగా ఒక కృత్రిమమైన జీవితాన్ని గడిపాను. నేను నటించిన చిత్రాలు కూడా కృత్రిమమైనవే. అలాంటప్పుడు నేను ఆత్మకథనుఎందుకురాయాలి?మొదట్లో నాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. అందుకే ఎవరైనావచ్చిఆత్మకథ రాయమంటే నేను ఒప్పుకొనే దాన్ని కాదు. నిరాకరించాను. కానీ ఆ తర్వాత నా మనసు మార్చుకున్నాను.

 రాయడానికికారణంనేనుఅందరిలాంటిఆడపిల్లనే.సామాన్యంగాబతకాలనుకున్నాను.
 ప్రేమించాలనుకున్నాను. ఇతరుల చేత ప్రేమించబడాలనుకున్నాను. ఇవేమీ సాధ్యం కాలేదు. నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఎవరికీ తెలియదు. నా పేరుశృంగారరసానికిప్రతీకగాఎందుకుమారిందో ఎవరికీ తెలియదు. షకీలాలుఎలాపుడతారో,ఎలారూపుదిద్దుకుంటారోఅందరికీ తెలియాలనే ఇప్పుడీ ఆత్మకథ రాశాను.

నా సినిమాలో అది తప్ప....
 నా సినిమా నా శరీరాన్ని శృంగారభరితంగాచూపట్టడంతప్పఇంకేమీచేయదు.
 నాలోని స్త్రీని, నాలోని నటిని ఎవరూ చూడరు. మలయాళీ కుర్రకారు శృంగార
 కలలకు నేను ప్రతిరూపమని ఒక సారి ఓజర్నలిస్టునాతోఅన్నాడు.ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి అన్నం పెట్టాల్సిందే.అదితప్పవేరేఏదీసంతోసాన్నివ్వదు.

రెమ్యూనరేషన్ ఒక దశలో-
 సినిమా హీరోయిన్ల కన్నా నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనేదాన్ని. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరిగేదాన్ని. పగలనకా రాత్రనకా సినిమా షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని. కొన్ని సార్లు రోజుకు రెండు, మూడు గంటల నిద్ర కూడా దొరికేది కాదు.

చాలా మంది దృష్టిలో...
 చాలాసార్లుబెడ్‌రూంసన్నివేశాల్లోనటిస్తూనేవళ్లుతెలియకుండానిద్రపోయేదాన్ని.
 అలాంటి సన్నివేశాలను చూసి ప్రేక్షకులు నేను భావ ప్రాప్తిపొందుతున్నానని
 భావించేవారు. చాలా మంది దృష్టిలో నేను కామోద్దీపన కలిగించేఒకశరీరాన్ని మాత్రమే. నాలో ఉన్న నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు.

అమ్మే అలా చేసింది...
 మాఅమ్మకుసంబంధించినాకుఎటువంటిమంచిమెమరీస్లేవు.ఆమెనన్నుఎప్పుడూ ప్రేమగాచూడలేదు.ఆప్యాయంగాపలకరించలేదు.నాజీవితాన్నినాశనంచేసింది మా అమ్మే. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది. శాపనార్థాలు పెట్టేది.

16 వ ఏటే...
 ఇలా నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూనన్నుతిట్టేఅమ్మఒకరోజునన్ను పొగిడింది. ఆ తర్వాత- నన్ను ఒక వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెడతాడని
 చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడనీ
 అతనితో 'మంచి'గా ఉంటే- మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలుతీరిపోతాయనీ
 చెప్పింది. అతను చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది.

ప్రారంభం మాత్రమే నేను షాక్ తిన్నా.
 మా అమ్మ మాటల వెనకున్న అర్థమేమిటో నాకు బోధపడింది.  కానీ నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అమ్మ చెప్పినట్లే ఒక వ్యక్తి వచ్చి హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ రూమ్‌లో ధనవంతుడని మా అమ్మ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతనిని చూసి నేను బాధతో, భయంతో గడ్డకట్టుకుపోయా.ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే.

ఆ తర్వాత...
 ఆ తర్వాత అలాంటి ధనవంతులనేకమంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది.
 నాకుబాధకలిగేది.అప్పుడప్పుడుకొంతతృప్తికూడాకలిగేది.నేనునాకన్యాత్వాన్ని
 ఎప్పుడు కోల్పోయానో నాకే తెలియదు.

జాలేస్తుంది...
 ఆల్కహాల్తీసుకొనేటప్పుడుపురుషులకన్నామహిళలకంపెనీనేనేనుఎక్కువగా కోరుకుంటాను. తాగిన తర్వాత పురుషులుతమకామాన్నివెల్లడిస్తారు.వారితో కలిసితాగుతున్నానంటేవారికోరికలుతీర్చటానికినేనుసిద్ధంగాఉన్నాననుకుంటారు. అలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది. వారి జీవితంలో భావ దారిద్య్రం ఎక్కువ. వారికి జీవితంలో సెక్స్ తప్ప వేరే భావన ఏదీ లేదా అనిపిస్తుంది.

ఎలా కలుగుతాయి..?
 సినిమాలోబెడ్‌రూంసీనుల్లోనటించేటప్పుడుశృంగారభావనలుకలుగుతాయా
 అనే ప్రశ్నను చాలా మంది అడుగుతూ ఉంటారు. షూటింగ్ జరిగేటప్పుడు మొత్తం యూనిట్ అంతా ఉంటుంది. అందరూ చూస్తున్నప్పుడుసెక్స్ ప్రేరణలు ఎలా కలుగుతాయి?నటిస్తున్నపుడు కోరికలుండవు మహిళలకు సంబంధించినంత వరకూ శృంగారమనేది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక అనుబంధం లేకపోతే సెక్స్‌ను ఆనందించలేరు. నేనుచిత్రాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. నటిస్తున్నప్పుడు నాకెప్పుడూ సెక్స్ కోరికలు కలగలేదు.

అక్క వల్లే దివాలా...
 మా పెద్దక్క నూర్జహాన్ నేను దివాళా తీయటానికి ప్రధాన కారణం.ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్రరంగంలోఎక్కువపారితోషికంతీసుకొన్ననటీమణిని నేనే. అయినా నా సంపాదనంతా మా అక్క దొంగిలించింది.మోస పోయాను.
 మా అక్కే నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది. నేనుతననిపూర్తిగానమ్మాను.
 నా చిన్నప్పటి నుంచి తను నాతోనే ఉంది.ఎప్పుడూతనుఅలాప్రవర్తిస్తుందని
 నేను ఊహించలేదు. ఒక దశలో నేను ఈ సినిమాలతో విసిగిపోయాను. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరగటం- కంటి మీద కునుకు
 లేకుండా షూటింగ్‌లు చేయటం నాకు విసుగనిపించాయి. నేను ఒక బ్రేక్
 తీసుకుందామనుకున్నా. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదా మనుకుంటున్నానని మా అమ్మతోను, నూర్జహాన్‌తోను చెప్పాను. వాళ్లిద్దరూ షాక్ తిన్నారు. బ్రేక్ తీసుకుంటానంటే నేనేదో పెద్దనేరంచేస్తున్నట్లు చూశారు. నూర్జహాన్ అలాంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చచెప్పటం
 మొదలుపెట్టింది.వారుకేవలంనాడబ్బునేప్రేమించారని,నాభవిష్యత్తుమీదవారికి
 ఎటువంటి ఆలోచన లేదని తేలింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను సంపాదించిన డబ్బంతా ఇచ్చేయమన్నా.డబ్బంతాఇంటికేఖర్చుపెట్టేసానంది నూర్జహాన్. నాకు షాక్ తగిలినంత పనైంది.
Tuesday, June 3, 2014

" అందమైన కురులుకోసం " నిగనిగలాడే వెంట్రుకల కోసం... గుడ్డు లేదా పెరుగును వేప ఆకుల పే‌స్ట్‌లో
 కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
 ఈ ప్యాక్ కేశాలకు కండిషనర్‌లా పనిచేస్తుంది.

 హెన్నా తెల్లవెంట్రుకలను బ్రౌన్‌ గా మారుస్తుంది. అయితే హెన్నాను ఎక్కువ
 రోజులు వాడకూడదు. దీనిలో ఉండే రసాయనాలు జుట్టులో ఉండే నూనెను
 తొలగిస్తాయి. దాంతో జుట్టు మృదుత్వం కోల్పోతుంది.
 నాణ్యమైన కలర్‌ని నిపుణుల సలహామేరకు వాడటం మంచిది.

 కప్పు ముల్తానామట్టి, ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, గుడ్డు బాగా కలిపి జుట్టుకు పట్టించాలి.అరగంటతర్వాతకండిషనర్‌షాంపూతోతలస్నానంచేయాలి. నిస్తేజంగా మారిన జుట్టు మృదువుగా మారుతుంది.

 అరకప్పు ఉసిరిపొడి, 2 టేబుల్‌స్పూన్ల ఆముదం, గుడ్డు కలిపి జుట్టుప్యాక్‌లా వేయాలి. మాడుకు కూడా రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వెంట్రుకలు చిట్లకుండా, మృదువుగా అవుతాయి.

ఒక స్పూన్‌ కర్పూరం పొడిని కొబ్బరినూనెలో కలుపుకొని ప్రతిరోజు తలకి మసాజ్‌ చేసుకోవాలి.

మల్లెతీగ వేర్లని, నిమ్మరసంతో కలిపి గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.

తలస్నానానికి వీలైనంత వరకు కుంకుడు, శీకాయ, హెర్బల్‌ షాంపూలనే వాడాలి.

జుట్టుకుతరచూనూనెతోమసాజ్‌చేయడంచాలాఅవసరం.వారానికిరెండు-మూడు సార్లు మస్టర్డ్‌ ఆయిల్‌ కానీ, కొబ్బరినూనె కానీ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.

 కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తలకు పట్టిస్తే మంచిది.

 తాజా కొత్తిమీర ఆకుల రసం రాయడం వల్ల జుట్టుకి నిగారింపు వస్తుంది.

 ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆనీటిని కుదుళ్ళలోకి  ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.

 కరివేపాకును రోజూ ఆహారంలో అంటే, పప్పుచారులోనూ, తాలింపులోనూ, పచ్చడిగానూ, కారప్పొడిగానూ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకుని పచ్చిగానే రుబ్బి తీసుకుంటే ( తింటే ) పూర్తి ఫలితం ఉంటుంది. కరివేపాకును ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

 మెల్లిగా చేతివేళ్ల కొనలతో తలంతా మసాజ్‌ చేస్తే బ్లడ్‌ సర్క్యులేషన్‌ పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.