CSS Drop Down Menu

Friday, May 30, 2014

"బరువు తగ్గించే బ్రేక్ ఫాస్టులు"


            మీరుబరువుతగ్గించుకొనేప్లాన్లోఉన్నారా?బరువుతగ్గించుకోవడానికిప్లాన్ ఏంటి?మీకు తెలియకపోతే, చింతించాల్సిన అవసరం లేదు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే, ముందుగా ఆహారపు అలవాట్లలో మార్పులుచేసుకోవాలి. డైట్ ప్లాన్ చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. మీరు ఖచ్చితంగాకొన్నికిలోల బరువు తగ్గించుకోవాలని నిజంగా మీరు కోరుకుంటున్నట్లైతే మీరు తీసుకొనే
 డైట్ మీద ప్రత్యేక శ్రద్ద చాలా అవసరం. ముందుగా దినచర్యను ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మీరు ప్రారంభించాలి. లంచ్ మితంగా తీసుకోవాలి అలాగే డిన్నర్ కూడా చాలా సింప్లీ మీల్స్ ను ఎంపిక చేసుకోవాలి. బరువు తగ్గించే క్రమంలో మీరు ఉదయం తీసుకొనే అల్పాహారం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందువల్ల మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకొనేఆహారంలోఅన్నిరకాలవిటమిన్స్, మినిరల్స్,ఫైబర్,కార్బోహైడ్రేట్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అన్నీ ఉండేట్లు చూసుకోవాలి. అదే విధంగామీరు తీసుకొనే ఈ హెల్దిఆహారాలుకూడా మీరు బరువు పెరగకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. మరి మనఇండియన్ కుషన్స్ లో మీరు హెల్ది వెయిట్ లాస్ బ్రేక్ ఫాస్ట్ నుతెలుసుకోవడం కష్టం అనిపిస్తే, ఇక్కడ మీకో శుభవార్త...
 మీరు ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి మరియు రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రెండు ఒకే సారి జరగానికి కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ అల్పాహారాలు మీరు బరువు తగ్గడానికి చాలా సహాయపడుతాయి. అదే విధంగా ఈ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ పూర్తి పోషకాలు కలిగి ఉంటాయి. మరియు రుచికరంగా ఉంటాయి మరి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్స్ క్రిందచూడండి.


కిచిడి:- మీ దినచర్యను ఆరోగ్యకరమైన కిచిడితో ప్రారంభించవచ్చు. ఇది ఒక బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఐడియా. దాల్ కిచిడి లేదా బార్లీ కిచిడిని చాలా తక్కువ మసాల దినుసులు, కారం తక్కువగా చేసుకుంటే, అది మీకు మరింతఎక్కువ పోషకాలను అందిస్తుంది. కిచిడి పొట్టనింపే బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. అంతే కాదు,ఇది ఖచ్చితంగా మిమ్మల్ని బరువు పెరగనివ్వదు.



పోహా(అటుకులతో తయారుచేసే అల్పాహారాలు):- పోహా  బ్రేక్ ఫాస్ట్ కు ఒక ఫర్ ఫెక్ట్ ఆప్షన్. ఇది మీ పొట్టలో తేలికగా ఉంచుతుంది. చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉండే పోహా కళ్ళఆరోగ్యానికి చాలా మంచిది.



దాలియా :- దాలియా లేదా గోధుమ రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు వెయిట్ లాస్ ప్లాన్ లో ఉన్నప్పుడు గోధుమ రవ్వఉప్మాచాలామేలుచేస్తుంది. ఇది ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ తో నిండి ఉంటుంది. అంతే కాదు చాలా తక్కువ క్యాలరీలు కలిగిన గోధుమరవ్వతో చాలా సులభంగా మరియుత్వరగా అల్పాహారాన్ని తయారుచేయవచ్చు.



 మల్టిగ్రెయిన్ దోస :- మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నట్లైతే దోసను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా అడై దోస ఎంపిక చేసుకోవాలి. దోసెకు చాలా తక్కువగా నూనెను ఉపయోగించాలి. లేదా నాన్ స్టిక్ పాన్ తో దోసెను తయారుచేసి తీసుకోవచ్చు. ఇది హెల్ది బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్.



ఎగ్ సాండ్విచ్ - గోధుమతో తయారుచేసిన బ్రెడ్ మరియు సాల్ట్ పెప్పర్ వేసిన పోచ్చ్డ్ ఎగ్ ఫ్రై, ఒక హెల్ది బ్రేక్ ఫాస్ట్ ఐటమ్. గుడ్డులో అధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉండి శక్తిని అందివ్వడంతో పాటు బరువును ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి.



స్టీమ్డ్ ఇడ్లీ :- బరువు తగ్గడానికి ఆవిరిలో ఉడికించిన పదార్థాలన్నీకూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి, మీరు హెల్తీగా ఉంటూనే బరువు తగ్గించుకోవాలంటే గోధుమ రవ్వ లేదా రాగి ఇడ్లీలను హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా ఎంపిక చేసుకోండి.



  ఓట్స్ :- హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కు ఓట్స్ కు హెల్తీ ఫ్రూట్స్ మరియు పాలు మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఉప్మా లేదా దోస రూపంలో తీసుకోవచ్చు.








1 comment:

  1. మంచి సలహా ఇచ్చారు...ఏ విధమయిన టిఫిన్ ఉదయం తీసుకోవాలీ అని చాలాసార్లు కన్ఫ్యూషన్ ఉంటుంది..తేలిక గా తయారు చేసుకునే విధంగా అందించారు...థాంక్స్...

    ReplyDelete